Sri. LV Gangadhara Sastry's Emotional words about SP Balasubrahmanyam garu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2020
  • Sri. LV Gangadhara Sastry's Emotional words about S P Balasubrahmanyam garu
    #spb
    #ganagadharasastry
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 711

  • @kollurajasree2931
    @kollurajasree2931 3 года назад +7

    గంగాధర శాస్త్రి గారు ధన్యవాదములు
    మీలాగే బాలు గారి అభిమానులుగా మాకు ఎంతో బాధగా వుంది... మనసు కలచివేస్తుంది.. తెలుగుభాష పై ఆయనకు ఎంత మక్కువో ఆయన ప్రోగ్రామ్స్ చూస్తుంటే తెలుస్తుంది.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధన... 👏👏 బాలుగారు గురించి అన్నీ నిజాలే హృద్యంగా చెప్పారు..

  • @lakshmip7791
    @lakshmip7791 3 года назад +17

    మా మనసులోని భావాలను మీ నోటివెంట విన్నాము గంగాధర శాస్త్రి గారు. మీకు మా ధన్యవాదాలు.
    బాలూ గారి గురించి చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. విన్నంతసేపు
    మా కళ్లలో నీళ్లు తిరుగుతునే వున్నవి.
    మా తరపున మీరు బాలూ గారికి
    శ్రద్ధాంజలి ఘటించినట్లు మాకు అనిపిoచినది.మాకు మీరు కూడా చాలా యిష్టమైనవారు గంగాధర శా స్త్రి గారు. మీరు కూడా తెలుగు భాష
    చాలా చక్కగా స్వచ్చంగా మాట్లాడుతారు.బాలూ గారు లేని లోటును
    మీరు భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాము శాస్త్రి గారు.

  • @ananda6878
    @ananda6878 3 года назад +38

    శాస్త్రి గారు మీ శ్రద్దాంజలి బాలుగారి గొప్పతనంతో పాటు మీ ప్రజ్ఞాపాటవాలను కూడ తెలుసుకొనే అవకాశం మాకు కలిగింది. ధన్యవాదాలు.

    • @babyp297
      @babyp297 3 года назад

      Balu gari gurinchi meeru entha goppaga chepparandi vari chani poina rojunundi ippativaraku vari previous episodes chudatam mooga roshana migilchi vellipoinaru ganagandharvudu devalokamlo aundharu padinchukuntu aaunandamlovuntu manaki vishadam no no manamukuda vari patali vintu mana vadde vunnarani aaunandhinchdamu Baby paladugu

  • @manorama3458
    @manorama3458 3 года назад +27

    మల్లె తీగ వాడి పోయింది
    తీగ తెగిన వీణ మూగపోయింది
    ఆయన మన ఇంటికి ఏనాడూ రాని బంధువు, ఆయన ఏనాడూ మాతో మాట్లాడని ప్రాణ స్నేహితుడు, ఒకప్పుడు ఎంతో ఆహ్లాదాన్ని అందించిన ఆయన పాటలు వింటుంటే ఈనాడు కన్నీటి ధారలు కురిపిస్తున్నాయి. అద్భుతంగా ఆయనకు నివాళి అర్పించారు మీకు వేల నమస్కారము.

    • @brahmanandareddy4352
      @brahmanandareddy4352 3 года назад

      Balu gaaru laanti mahaa gaayakudini tama svaardam kosam baliteesukunnaaru. Saastrigaaru meerannadi nooru saatam pachinijaalu.

    • @sugurumanjula5891
      @sugurumanjula5891 Год назад

      That is gangadara shahri garu. Adhubhutham. Gurujii chala baga cheparu. నెను me విరా అభిమానిని.anduka.meku balugari programming gest ga pilichanu. మీరు ravadam ma adhurushtam. Gurujii mi bless యెపుడు maku makutumbaniki undali mi ashirvachanam... Maku sree krishudu echinatu feel avuthanu. Mimalini chustha ma madhavudini chusinatu ani pisthundi.... Jai sree krishna

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 Год назад

      Jathasya maranam dhruvam, janma saphalyam sadhincharu. Dhanyajivi. Telugu prajala hrudayallo chirannivi ga untaru.

  • @prabhavathitunkimetla2925
    @prabhavathitunkimetla2925 3 года назад +27

    Sir మీ స్వచ్చమైన అభిమానం ప్రేమ బాలు గారి ఆత్మకు శాంతి కలిగించు గాక. చాలా గొప్ప నిజమైన నివాళి అర్పించారు sir.

  • @ramanab4274
    @ramanab4274 3 года назад +57

    బాల సుబ్రహ్మణ్యం గారి గురించి ఇంత బాగా ఎవరూ చెప్పలేదు. మీకు శతకోటి వంద నాలు.వింటుటే కళ్ళవెంట నీళ్ళ వచ్చింది.

  • @b.a.narayana1090
    @b.a.narayana1090 3 года назад +29

    చాలా గొప్ప నివాళి శ్రీబాలూగారికి అందిస్తూ వారిదైన ప్రత్యేకశైలిలో వాస్తవాన్ని కుండబద్దలగొట్టి చెప్పారు. మిత్రులు శ్రీగంగాధరశాస్త్రి గారికి శతధా నమస్కారములు 🙏🙏🙏🙏

  • @narlashyamprasad3885
    @narlashyamprasad3885 3 года назад +42

    ఎంత చక్కగా మాట్లాడారు. బాలుగారి గురించి బాగా విశ్లేషించి, వాతలు పెట్టాల్సిన చోట భావగర్భితంగా చురక అంటించారు గ్రేట్ తమ్ముడు - శ్యామ్ ప్రసాద్ శర్మ

  • @arunakumari4812
    @arunakumari4812 3 года назад +8

    చాలా అద్భుతం గా నివాళి అర్పించారు.
    బాధగా తల్లడిల్లుతున్న అభిమానుల హృదయాలకు హత్తుకునేలా నిజాలను
    నిగ్గు తెలుస్తూ స్పష్టంగా మీ అభిప్రాయాలను వ్యక్త పరచి మాకు సేద తీర్చారు. 🙏

  • @bvramadevi7376
    @bvramadevi7376 3 года назад +93

    శ్రీ గంగాధర శాస్త్రి గారు🙏 మీరు ఎస్పీ బాల సుబ్రమణ్యం గారి కి ఇచ్చిన నివాళి మేము మాటలలో చెప్పలేము, మీ మాటలు విన్నంత సేపు మీ తో పాటు మేము కూడా నివాళి అర్పించిన అనుభూతిని పొందాము🙏S P బాల సుబ్రమణ్యం గారి కి🙏🙏🙏🙏🙏🙏

    • @ramanandamgoteti5604
      @ramanandamgoteti5604 3 года назад +2

      SP gurinchi entha cheppina takkuve

    • @talaganaseethapathi5593
      @talaganaseethapathi5593 3 года назад +1

      శ్రీ గంగాధరశాస్త్రిగారుభువినుండి దివికేగిన గానగంధర్వడు మనమధ్యలేరని జీర్ణించుకో
      లేకపోతున్నాము మీ వాక్కు బ్రహ్మవాక్కులై దివినుండి భువికి బాలగానగంధర్వునిగా సంగీతసరస్వతి పుత్రునిగా S.P.బాలసుబ్ర మణ్యముగారికి పునః జన్మని ప్రసాదించా లని సర్వేశ్వరుని ప్రార్థిస్తూన్నాను S. P. బాలసుబ్రహ్మణ్యం గారికి భావ పూర్వక అశృశ్రద్ధాంజలి 🌹🙏🌹

  • @blnarayana2755
    @blnarayana2755 3 года назад +27

    గంగాధర్ గారు ,నిజంగా బాలు గారి గురించి అద్భుతంగా చెప్పారు , కళ్ళ లోంచి నీళ్ళు తెప్పించారు, మీకు ధన్యవాదాలు- భాగవతుల లక్ష్మీ నారాయణ ,విజయవాడ

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam 3 года назад

      నమస్కారం గురువుగారు మా పుట్టిల్లు విజయవాడ

  • @prasadkoukuntla8022
    @prasadkoukuntla8022 3 года назад +7

    Very well said sir! మీ శ్రద్ధాంజలి బాలు గారిపై మనందరికి ఉన్న ప్రేమ, గౌరవానికి మాటల రూపాన్ని ఇచ్చింది! 🙏

  • @saradatalluri8707
    @saradatalluri8707 3 года назад +5

    చాలా బాగా చెప్పారు బాలు గారికి గురించి .. ఆయన లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము... మీరు చెప్తున్నంత సేపు మాకు కన్నీళ్లు ఆగటం లేదు 🙏

  • @sreedharasameerkumarilapav8505
    @sreedharasameerkumarilapav8505 3 года назад +44

    నిజమైన నివాళి ఇచ్చారు గురువు గారు.
    మీ మాటల్లో మంచి ఆర్ద్రత కనిపిస్తుంది.
    మీ హృదయం మాట్లాడినట్లు తెలుస్తోంది.
    బహుదూరపు మీరు మొదట అన్నపుడు, బాలు గారు ఒక్క సారి మీ ముఖం లో కనపడ్డారు.
    ఆ ముగింపు మాటలు.. ప్రేమతో హత్య... మీరు వెళ్లి పోయారు మా పరిస్థితి ఏమిటి అన్నపుడు, కళ్ల లో నీళ్ళు కారిపోయినాయి.
    ధన్య వాదములు గురువు గారు.🙏🙏🙏🙏🙏.

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 3 года назад +53

    శాస్ట్రీ గారు మీరు బాలసుబ్రమణ్యమ్ గారి గురించి మాట్లాడుతుంటే మా కాళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి చాలా చక్కగా చెప్పారు తెలుగు సినిమా ఇండస్ట్రీస్ కు చక్కగా గడ్డిపెట్టారు

  • @mahaboobreddy175
    @mahaboobreddy175 3 года назад +43

    నిజమైన నివాళి అర్పించారు 🙏
    సుదీర్ఘ నివాళులు అర్పించారు ఆ మహానుభావుడు గురించి ఎంత చెప్పినా తక్కువే 🙏

    • @parasuramprasadbabu6367
      @parasuramprasadbabu6367 3 года назад +1

      😭😭😭

    • @rajeshwarimangipudi9562
      @rajeshwarimangipudi9562 3 года назад

      Your voice makes me believe that he still Lives I in your voice

    • @sridevig.s7132
      @sridevig.s7132 3 года назад

      In so many interviews our Spb sir the great legend told he wants his next birth in Karnataka. Very proud of him.

    • @vanisri8180
      @vanisri8180 3 года назад +1

      Baga Chepperu Balu Sir Ni Marachi polekapothunna Sir

  • @t.chakrapanithotachannel.9279
    @t.chakrapanithotachannel.9279 3 года назад +10

    శ్రీ గంగాధర్ శాస్త్రి గారు చాలా బాగాచెప్పారు మన ఆంధ్ర సినీ ఇండస్ట్రీ పెద్ద మనుషులకు. గడ్డి బాగాపెట్టారు మీకు ధన్యవాదములు. బాలుగారి అభిమాని.

  • @vinodkumarkotha7422
    @vinodkumarkotha7422 3 года назад +29

    బాల సుబ్రహ్మణ్యం గారి గురించి చాలా బాగా చెప్పారు ఇలాంటి గొప్ప వ్యక్తి ఉన్న కాలంలో మనం పుట్టడం అదృష్టం

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 3 года назад +46

    గాన గంధర్వుడు గురించి గీత గంగాధరుని ఆత్మనివేదన...🌅🌺🙏🌺🌄

  • @drgashokkumar4898
    @drgashokkumar4898 3 года назад +7

    Most fitting tribute to one and only Balu గారు!🌹🙏🙏🙏.. గంగాధర శాస్త్రి గారూ, మా అభిమానుల హృదయా oతరా లను ఎరిగి మీరు మా మాటగా చెపుతున్నట్లు వుంది!.... it's a costiest negligence... అరిగించుకో లేక పోతున్నాం 😌😌😌
    ఓం శాంతి🌹🌹🌹🎵🎶🎵🎶🎵🎶🙏🙏🙏

  • @veenarani6737
    @veenarani6737 3 года назад +1

    🙏గురువుగారికి పాదాభివందనం. మీరు బాలుగారి గురించి చెప్పినవన్నీ అక్షర సత్యాలు. కోట్లాది గుండేల్లో వున్న భావాలనే మీరు మంచి మాటల్లో వ్యక్తం చేశారు. మీరు మాట్లాడుతుంటే మా మనసుతో మేము మాట్లాడినట్లే వుంది బాలు గారి గురించి. అంత గొప్ప మహానుభావుడిని ఈ కరోనా కారణం గా కొంతమంది స్వార్ధం కోసం ఆయన మొహమాటపడి ప్రమాదం తెచ్చుకోవడం మనం కోల్పోవడం చాలా దురదృష్టం. తెలుగు వాళ్ళకి తగిన గౌరవం లభించకపోవడం ఇంకా బాధాకరం. ఆయన ఎప్పటికి కోట్లాది మంది గుండెల్లో కొలువై జీవించే వుంటారు. 🙏

  • @janardhangeeta1456
    @janardhangeeta1456 3 года назад +6

    హృదంతారాలాలలో పొంగిన వేదన ఆవేదన గంగలా పొంగినది గంగాధర గళం లో మ్రోగింది సాటి గాయకునికి వియోగం .కాలం గొప్పది తన ధర్మం తాను చేస్తుది. మీ మాట మీ భాధ హృదయ భాధ అమోఘమైన సందేశం.ఘణ కులం గాయక కులం అని గర్వాంగా చెప్పిన మీ అభిమానం అమోఘం. గంగాధరుడు gangadhara శాస్ట్రీ.thanq సర్ మీ నివాళి

  • @saradap4051
    @saradap4051 3 года назад +54

    సీనియర్లు సరే కనీసం జూనియర్ హీరోలు వెళ్ల వలసిన్డి.పరువు అయిన మిగిలేది.ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ని చూస్తే అసహ్యం వేస్తుంది

    • @sreedevisrinivas3338
      @sreedevisrinivas3338 3 года назад +3

      Avunu e vedhavalu krutagnulu andi.

    • @beerejayaram1153
      @beerejayaram1153 3 года назад +1

      అవును

    • @bhavanimurty40
      @bhavanimurty40 3 года назад +3

      Mareeeee seniors ni vadelesty, chiranjeevi, Nagarjuna, pratee heroo ki padeteeney kada anta hero's ayyi, ₹ kootlu peru. Sampaadinchina vedhavalu atanni chudadaaniki vellaledu. vallaledu . Gangaaa dhar Sadtry gaaru cheppinadeee 100% correct. Raaaaanu taggey ka vastanu ani cheppa valsindi.

    • @krishnadavakhana8987
      @krishnadavakhana8987 3 года назад

      @@sreedevisrinivas3338 Q

  • @satyanarayanabandaru5045
    @satyanarayanabandaru5045 Год назад +1

    గంగాధర శాస్త్రి గారు మీరు మా బాలు గారి గురించి చాలా చక్కగా వివరించారు. ఇంతవరకు మీరు బాలు గారి గురించి చెప్పిన ప్రతి మాట వింటుంటే నా కళ్లనుండి కన్నీరు ధారావాహికంగా కారుస్తున్నాను. మహానుభావా మీకు శతకోటి వందనాలు

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 3 года назад +41

    🙏 శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు లేరు అన్న పదమే మేము
    ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితి 🙏

  • @bujjimultitalentarts5440
    @bujjimultitalentarts5440 3 года назад +1

    ఆ మహానుభావులు యొక్క ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. కానీ ఆలా అనడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మా మధ్యలో ఉన్నారు.ఆయన ఆత్మ కూడా మా మధ్యలో ఉంది. ఆయన లాంటి వారు మళ్ళీ రారు.తెలుగు ప్రజానీకానికి, అన్ని భాషల ప్రజలకి తీరని లోటు.... ఆయన పాటలు విని నేను సింగర్ అయ్యాను... ఆయన పాట నాకు బ్రతుకునించింది... స్టేజ్ ఇచ్చింది.... మరువలేను ఆ గొప్ప వ్యక్తిని...... ఆ పాటల శక్తిని..... Spb sir i love u......

  • @vijaykumaricg4056
    @vijaykumaricg4056 3 года назад +5

    బాలసుబ్రహ్మణ్యంగారి గురించి అధ్బుతంగా అమృతం ఆంతా తియగా మాట్లాడినా కన్నయ్య మికు నా సాష్టాంగ నమస్కారములు.ధస్యవాదములు.
    Govindha bless you kannaya..

  • @sharmavrganapavarapu7803
    @sharmavrganapavarapu7803 3 года назад +4

    గంగాధర శాస్త్రి గారు నమస్కారం. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. ధన్యవాదములు. పరమ అద్భుతంగా వుంది. 🙏🙏🙏

  • @chandanavaidya7717
    @chandanavaidya7717 3 года назад +42

    బాలు గారికి నిజమైన నివాళి ఇదే గురువు గారు😔🙏🙏 ఆయన గురించి ఇప్పటి వరకు ఇంత గొప్పగా ఎవ్వరూ వ్యాఖ్యానించలేదు. మీకు శిరసాభివందనం 🙏

    • @pk.thesaviour7223
      @pk.thesaviour7223 3 года назад +1

      చక్కగా చెప్పారు ...

    • @harivelamala3247
      @harivelamala3247 3 года назад +1

      బాలు గారికి నిజమైన నివాళిగొప్పగా అర్పించిన గొప్ప వ్యక్తి మీరు.

  • @lachinorganics3191
    @lachinorganics3191 3 года назад +5

    Dear Gangadhara Shastri gaaru hats off to your comments Iam from Karnataka Bangalore born & brought up here Iam very fluent in telugu also listen to all telugu songs. Here In Karnataka SPB Is God for us everyone is fan of him he had sung abt. 16000 songs in Kannada a road is named after SPB in Banglore after his demise everyday I'm weeping till today

  • @ravindrapuchalapalli160
    @ravindrapuchalapalli160 3 года назад +5

    శాస్త్రిగారు బాలు గారి గురించి మీ విశ్లేషణ మరియు వాచకం, భాష కు మా శతకోటి వందనాలు

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 3 года назад +4

    నభూతో నభవిష్యతి... తెలుగువారికే కాకుండా భారతీయులందరికీ గంధర్వులిచ్చిన అపురూపమైన గానరత్నం....ఆ మహానుభావుడి గాత్రం విననివారులేరన్నది నిర్వివాదాంశం.. మనస్సులను హత్తుకొని మహర్లోకాలకు తీసుకెళ్ళగల సమ్మోహనగానంతో మనందరికీ ప్రీతిపాత్రుడయ్యారు...దివ్యాత్మతో దివిసీమల దరికిచేరి ధన్యుడయ్యాడు,మనకు ఆత్మబంధువయ్యాడు, సద్గతి పొందాడు......శోకతప్తహృదయంతో.....
    ఓం శాంతిః! శాంతిః!! శాంతిః!!!
    🌅🪔🙏🪔🌄

  • @ramgopalreddykeesari8471
    @ramgopalreddykeesari8471 3 года назад +1

    ఎంతో తధామ్యత కనిపించింది మీరు మాట్లాడుతుంటే. ఇంత అనర్గళంగా మీరు మాడ్లాడటం, భావావేశం, అనుబంధం, ఆకర్షణగా చెప్పడం చాలా బాగుంది. మీరు ఒక వ్యక్తి గురించి మాట్లాడటం అంటే ఎంతో ఉన్నతమైన వారు అయి ఉండాలి. ఇలా గొప్ప వారిని గొప్పగా చెప్పడం దానికి దానికి అంకితమై అనడం ఎంతో పూర్వజన్మ సుకృతం. సరిగా చెప్పడం ఎవరికీ చేతకాదు అందరూ దానికి ఎక్కువ చేసో తక్కువ చేసో చెబుతారు. కానీ మీరు యుక్తంగా చెప్పారు.

  • @bhanuprasadita227
    @bhanuprasadita227 3 года назад +4

    చాలా గొప్పగా వివరించారు ...మన బాలు గారి గురించి..నిజంగా కొన్ని నెలలు బయటికి వెళ్లకుండా ఆగి ఉంటే బాలు గారు మన మధ్యే ఉండేవారేమో... నిజంగా ఎంత దురదృష్టవంతులమో కదా ...ఇలాంటి కారణజన్ముడు గొప్ప గాయకుడు మళ్లీ పుట్టడు.... బాధాతప్త హృదయాలతో ...🙏🙏🙏🙏🙏

  • @ViswaSree
    @ViswaSree 3 года назад +5

    మీ హృదయ స్పందన అత్యద్భుతంగా ఉంది...

  • @janardhangeeta1456
    @janardhangeeta1456 3 года назад +15

    ఏమి వాదన ఏమి వేదన ఏమి ఆవేదన మీ మాటలో పూర్ణమైన భాధ అమోఘం.మీ ఘన నివాలికి బాలుకి ఆత్మ సంతోషం లో మునుగుతుంది.

  • @sunilpj6388
    @sunilpj6388 5 месяцев назад

    థాంక్ యూ గంగాధర్ గారూ.
    నేను రాసిన చిన్న రైటప్.
    బాలూ (గారూ)...
    ఏమి చెప్పాలి మీగురించి,
    నేను పుడతానని తెలిసి ఒక సంవత్సరం ముందునుండే మీరు పాడటం ప్రారంభించారు.
    మీ పాటలు వింటుండగానే నాకు ఊహ తెలిసింది.
    మీ పాటల ఉద్యానవనం లో ఆడుకుంటూ పెరిగాను. ఇప్పటికీ వింటూనే వున్నాను
    మీరొక జలపాతం.....పాటల జలపాతం.
    ఒక హిల్ స్టేషన్....ఒక రిఫ్రెష్ బటన్
    మీరో పచ్చని మైదానం అందులో కేరింతలు కొడుతూ మేమంతా ఆడుకుంటూ వుంటాo.
    మీరొక గాన సముద్రం...అందులో మేము మునకలు వేస్తుంటాము
    మీ పేరు వింటే నే ఓ ఉదయం రీఛార్జ్ అయిపోతుంది.
    ఇక పాట వింటే మనసు ఫౌంటెన్నై ఎగిసి పడుతుంది.
    మీరు, రాజా గారు ఒక కాలం లొనే పుట్టడం .....మేముకుడా ఆ కాలం లొనే ఉండడం ఎంత అద్భుతమైన యాక్సిడెంటో కదా...
    54 సం గా పాడుతున్నా ఇప్పటికీ మీ గానం స్వరాభిషేకాలు చేస్తూనే ఉన్నాయి.
    మిమ్మల్ని వింటూనే అలా జీవితం గడిపేయాలి.
    మాకోసమన్నా మీరు ఆరోగ్యo గా పాడుతూ ఉండాలి....
    74 వసంతాలు గడిచాక కూడా ఇంకా మాధుర్యం తగ్గని మీ గొంతు ఇక ఎప్పటికీ అలానే ఉండిపోవలని మా అందరి కోరిక....
    ఇంకా బోలెడు పుట్టినరోజులు మీరు చేసుకోవాలని అభిమానంగా....
    సునీల్ పి జె 4.6.2020

  • @susarlarkr
    @susarlarkr 3 года назад +6

    What a tribute!
    I haven't missed single word.
    Truly Truly great respectful submission Sastry garu.
    Recalled all angles of his contribution.
    I have no words...
    Dr. Susarla Ramakrishna Rao.🙏🏼

  • @maheshkuruva4467
    @maheshkuruva4467 3 года назад +24

    అందరూ తెలుగులోనే కామెంట్ చేసినందుకు కృతజ్ఞతలు..
    తెలుగు భాష ను గౌరవించడమే ఎస్ పి బి లాంటి వారికి అసలైన నివాళి..

  • @nagavardhanisongs8275
    @nagavardhanisongs8275 3 года назад +7

    ఎంత బాగా చెప్పారు🙏🙏నిజంగా బాలు గారి గురించి మీరు చెప్పినంత బాగా ఎవరు చెప్పలేరు🙏🙏😥😥😥😢

  • @sasikalamulpuru3315
    @sasikalamulpuru3315 3 года назад +32

    మీరు మాట్లాడుతుంటే మా హృదయం ద్రవించిపోతోంది

    • @blnarayana2755
      @blnarayana2755 3 года назад +2

      గంగాధర్ గారు, ఈరోజు పేస్ బుక్ లో చూసాను, బాలు గారికి గౌరవ సూచకం గా ఒక వీధికి వారి పేరు పెట్టారు, అది వారికి ఇచే గౌరవం, మన వాళ్లు ఉన్నారు, ఆయన ని వాడుకొవటానికి, అందుకే వచే జన్మ బాలు గారి కి ఉంటె తెలుగు గాయకుడిగా పుట్ట వద్దు

  • @chakradharmallula4728
    @chakradharmallula4728 2 года назад +5

    Wow!!! No one except God himself can describe like this about SP Balu gaaru 🙏🏼🙏🏼🙏🏼
    SPB gaaru and Telugu language will be so proud of you Guruvu gaaru 🙏🏼🙏🏼🙏🏼

  • @satyanarayanabandaru5045
    @satyanarayanabandaru5045 Год назад +1

    గంగాధర శాస్త్రిగారు మన బాలు గారి గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. బాలు గారి మీద మీకు ఉన్న ప్రేమ అభిమానానికి కృతజ్ఞతలు. మన బాలు గారి గురించి మీరు చెప్పాలిసినంత మొత్తం చెప్పేశారు. నాకు ఎంత సంతోషం వేసిందంటే మీలాంటి మహా పండితులు, గాయకులు, స్వరం మీద బాష మీద పట్టు ఉన్నటువంటి మహానుభావులు కూడా బాలు గారి అభిమానులు అయినందుకు. ధన్యవాదాలు మహానుభావా 😢

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se Год назад +3

    గంగాధరశాస్తిగారూ! బాలూ గారు సంగీత విద్యా ధర్పణము..మీమాటలు కు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @emes11
    @emes11 3 года назад +11

    భలేగా ఎండగట్టారు.. అందరిని 👍

  • @emes11
    @emes11 3 года назад +4

    గంగాధర్ గారు.. ఎంత బాగా బాలు గూర్చి వర్ణించి.. నిజమైన ఘన నివాళి itcharu.. ధన్యుస్మి.. long live గంగాధర్ ji

  • @MuraliKrishna-Jandhyala
    @MuraliKrishna-Jandhyala 3 года назад +1

    చక్కగా స్పందించారు. మీరు స్పృశించకపోయినా రామకధ చిత్రంలో రామాయణం గానం అద్భుతము. రామకధా శ్రీ రామకధా..

  • @kondapisujatha8360
    @kondapisujatha8360 3 года назад +7

    బుజ్జి తండ్రి బాల గణపతి గురించి చెప్పటానికే భగవంతుడు మిమ్మల్ని పుట్టించాడు 🙏👏👏👏

  • @vijayalakshmikrishna6265
    @vijayalakshmikrishna6265 3 года назад +5

    ఆ మహానుభావులు తిరిగినఆదేవాలయం చూడాలని తీరని కోరిక.

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 3 года назад +16

    మా సరస్వతి స్వర పరచిన గాయక యంత్రం బాలు 🙏

  • @vijayalakshmikrishna6265
    @vijayalakshmikrishna6265 3 года назад +18

    మీరు పడే బాధేమేముఅనుభవిస్తున్నాము
    రోజు రోజుకీ బాధపెరుగుతుంది.

  • @ashokvivek3825
    @ashokvivek3825 3 года назад +2

    చాలా సుదీర్ఘమైన ప్రవచనం చాలా లోతైనది భావుకత నిండిన ప్రవచనం
    టెక్నికల్ గా మీరు చెప్పినవన్నీ కరెక్టే
    మాధుర్య విషయంలో ఘంటసాలకున్న ప్రత్యేకతను అలా వుంచితే..
    టేక్నికల్గా మీరు చెప్పిందంతా సత్యమే

  • @sumithrakoraboina459
    @sumithrakoraboina459 3 года назад +5

    బాలు గారి గురించి మీరు మాట్లాడిన మాటలన్నీ అక్షర సత్యాలు శాస్త్రి గారూ..ఆయన గురించి మీరు చేసిన వ్యాఖ్యానం ఎంతో హృద్యంగా బాధతో మాటలు కూడా బయటికి రావడం లేదు..మీరన్నట్లు ఆయనకు మరణం లేదు ..ఎందుకంటే నిరంతరం పాట రూపం లో మన మధ్యనే వుంటారు గా..

  • @seenabellekal1639
    @seenabellekal1639 3 года назад +12

    ఆ దివ్య పురుషుని గురించి ఎంతో మహత్తరంగ చెప్పారు.

  • @kumard3622
    @kumard3622 3 года назад +15

    Sir
    Hats off to your speech on SPBalu.Today I attended 10 th day at Tamarapakkam.Excepting
    Vijayalaxmi singer. nobody came.From Telugu not a single Telugu singer or heroes or directors.
    These Rascals are truly commercial
    And opportunists.SPB should not born in AP again..Telugu Heroes, Music directors ,directors Amar Rahe

  • @talaganaseethapathi5593
    @talaganaseethapathi5593 3 года назад +1

    గానగంధర్వుడు గురించి గీతగంధర్వుని ఆత్మనివేదనతో భావపూర్వక శ్రద్ధాంజలి అద్భుతం. సరస్వతి పుత్రడు, స్పెషల్ పెర్స -నాలిటీ పెర్సిన్ గానగాంధర్వడుమన మధ్యలో లేరన్నవిషయాన్నిజీర్ణించుకో లేకపోతున్నాను. S. P. గారి పవిత్ర ఆత్మకి శివపార్వతి పరమేశ్వరులు మోక్షము ప్రసాదిస్తూ బాలగానగంధర్వునిగా పునః జీవనం ప్రసాదించాలని సర్వేశ్వరుని ప్రార్దిస్తున్నానుS. P.బాలసుబ్రమణ్యం గారికి భావ పూర్వక శ్రద్ధాంజలి Rip 🌹🙏🌹

  • @narendersakinala8580
    @narendersakinala8580 3 года назад +3

    నిజమైన అశ్రునివాళి... మీరు మీ విశ్వరూపం.. మీరు మీ vision... గ్రేట్.. మీ పై ఇప్పుడు అభిమానం పెరిగింది.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 года назад +4

    అద్భుతం. SPB మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్న మాకు కొంత సాంత్వన లభించింది.

  • @pk.thesaviour7223
    @pk.thesaviour7223 3 года назад +5

    *బాలు ..... ప్రతి రోజు మీ పాట వినకుండా ఉండలేక పోతున్నాను... మీ వీడియోలు చూడకుండా ఉండలేక పోతున్నాను....... ఇపుడే వస్తానని చెప్పి మమ్మల్నీ మోసం చేసి వెళ్ళి పోతారా... ప్రతి రోజూ కన్నీళ్లు ఆగడంలేదు... బాలు...😭😭😭😭😭*

  • @munipalle21
    @munipalle21 3 года назад +6

    మీరుమరొక సరస్వతి అనుగ్రహం ఉన్నవాక్సుద్ధి కలిగిన మహానుభావులు. మీ లాగా మేము మాట్లాడలేము. కానీ మా మనసులో ఉన్న భావాలను మీరు ఆర్ద్రత తోచెపుతుంటే మా కళ్లల్లో నీళ్లు. బాలుగారు మనందరి హృదయాల్లో ఉన్నారు, ఉంటారు.

  • @saradap4051
    @saradap4051 3 года назад +5

    అక్షర సత్యం బాగా చెప్పారు.తెలుగు సినిమా వాళ్లు యెంటో ఇప్పుడు బాగా అర్థం అయ్యింది

  • @RaviKumar-ui2kc
    @RaviKumar-ui2kc 2 года назад +1

    Excellent sir
    Really we never believe
    That SPB Sir is no more 🙏🙏🙏🙏🙏🙏

  • @murthyjosyabhatla4030
    @murthyjosyabhatla4030 3 года назад +29

    నమస్కారం శాస్త్రి గారు!
    బాలుడి వైశిష్ట్యం గురించి ఇంతకంటే బాగా ఎవ్వరు చెప్పలేరు!
    ధన్యవాదములు 🙏

  • @satyashreetata5239
    @satyashreetata5239 3 года назад +3

    Sir... entha chakkaga chepparu.. anni words na manusu lonchi vachinatlu unnayi..ippatiki gundelu pindestunnatlu, gonthulu archukupothunnatlu undi...aa lotu ela theeruthundi..evaru poodchaleru....😭😭😭😭😭

  • @nareshchary5231
    @nareshchary5231 3 года назад +6

    30:00 నిమిషాల దగ్గర మీరు మాట్లాడిన మాటలు అక్షర సత్యం గురువు గారు
    మీ మాటలకు నా కళ్ళలో నీళ్లు వచ్చాయి గురువు గారు 😢💐

  • @mbsprasad7651
    @mbsprasad7651 3 года назад +8

    శ్రీ శాస్త్రి గారు,
    మీరు చెప్పింది అక్షర సత్యాలు

  • @prasadarao6090
    @prasadarao6090 3 года назад +2

    Gangadhar garu బాలుగారి గురించి ఎంత గొప్ప గా చెప్పారు sir .మరి మరి మీ VIDEO చూడాలి అనిపించుకొన్నది THANK YOU SIR

  • @sre658
    @sre658 3 года назад +13

    ఈ రోజుకి ఈ విషయాన్నీ జీర్ణించుకోలేక పోతున్నాము

  • @VasundharasCookingChannel
    @VasundharasCookingChannel 3 года назад +17

    బాలుగారి లాంటి సింగర్, వ్యాఖ్యాత ఇంకెవరు లేరు. Telugu భాష గొప్పతనాన్ని ఈతరానికి చాటినవాడు

  • @orimpatisarada2573
    @orimpatisarada2573 3 года назад +6

    మీకు చాలా ధన్యవాదాలు సర్

  • @srirangamvenkatajogipantul1984
    @srirangamvenkatajogipantul1984 3 года назад +4

    అద్భుతంగా వివరించా‌రు
    అద్భుత నివాళి

  • @chinthamareddyviswanathata1317
    @chinthamareddyviswanathata1317 3 года назад +20

    నిజంగా ఆయాని హిస్పిటలో ఉన్నాడని తెలియగానే మొదలుగా ఆ భగవంతుణ్ణి కోరుకున్నది ఒక్కటే మీ బదులుగా నన్ను తీసులెల్లమని కోరుకున్న ఆయన నా మొర అలకించినంట్లే ఆలకించి మరి ఇలా చేసాడు.

  • @phaniraj7633
    @phaniraj7633 3 года назад +5

    Our soul get satisfied when we hear SPB's songs, Lingashtakam, Vishwanatha Ashtakatakam. Bilvashtam, Samba Shiva, Daridry'all Sahana Sthothram Shiv, Vishnu, All Devotional & non devotional

  • @orimpatisarada2573
    @orimpatisarada2573 3 года назад +7

    నిజంగా హత్యే.జీర్ణించుకోలేక పోతున్నా

  • @putturuvenkatasubrahmanyam9328
    @putturuvenkatasubrahmanyam9328 3 года назад +7

    శ్రీ LV గంగాధర శాస్త్రిగారు SPBS గారిని గురించి చెప్పిన మాటలు పరమ సత్యాలు .ఎందుకంటే ,
    యద్యదా చరతి శ్రేష్టః
    తత్త దేవేతరోజనః
    సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే - కాబట్టి.
    ఘంటసాల గారిని ఆదర్శంగా తీసుకుని ,
    వారి బాటలో పయనించి , గురువును మించిన శిష్యునిగా కీర్తినార్జించిన SPBS గారు చిరస్మరణీయులే కాదు. మనకు మార్గదర్శకుఠలు కూడ .సెలవు.
    నమస్కారం.
    మీ పుత్తూరు వెంకట సుబ్రహ్మణ్యం
    చలనచిత్ర గీతరచయిత .

  • @pinnintitirumalarao9680
    @pinnintitirumalarao9680 3 года назад +2

    అధ్బుతం సార్, గొప్ప శ్రధ్ధాంజలి

  • @gundumallanageswararao7173
    @gundumallanageswararao7173 3 года назад +4

    బాలు గారికి మీరు శ్రద్ధాంజలి ఘటించిన తీరు అమోఘం గురువు గారు మీకు నా హృదయ పూర్వక నమస్సులు 🙏🙏🙏

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 года назад +20

    మీరు ప్రస్తావించిన కృతఘ్నులను తలచుకుంటే విపరీత మైన జుగుప్స, కోపం కలుగు తున్నాయి.

  • @balumidde3340
    @balumidde3340 3 года назад +1

    Meeku Padabhi vandanalu sir
    Chala chakkaga chepparu👏👏👏balu sir miss u👏👏👏💐💐💐💐💐

  • @kalyanram4889
    @kalyanram4889 3 года назад +2

    బాలసుబ్రహ్మణ్యం
    1) తెలుగు భాష మీద నాకు విపరీతమైన ప్రేమ,ఇష్టం కలిగేలా చేసిన గాత్రం మీది.
    2) స్వరబద్ధంగా అక్షరాన్ని పలుకుతుంటే వచ్చే ఆనందాన్ని నాకు పరిచయం చేసిన గాత్రం మీది.

  • @vanisri8180
    @vanisri8180 3 года назад +3

    Sir , Heart Touching Baaga Chepperu ,Me Lanti Mahanubhavulu Vunnaru Ganukani Aa Devuduni Taluchukuni Enni Matalu Vuntunnam ,Balu Garini Marachi polekapothunna Sir Na Aardhyudu Balu

  • @srinikancha
    @srinikancha 3 года назад +12

    Gangadhar Garu, your words kept BaluGaru in front of eyes. You sounded like his voice. I sincerely request you to write a book on BaluGaru. Also urge you to continue his chores left aside, example Paadutha Teeyaga.

  • @southernminingservices7548
    @southernminingservices7548 3 года назад +9

    శ్రీ గంగాధర శాస్త్రి గారు మన గాన గంధర్వుడు బాలు గారికి నివాళులు అర్పిస్తూ చాలా అద్భుతంగా వారి జీవితం గురించి, పాట గురించిన విషయాలు వెలుగులోకి తెస్తు దక్షిణాది రాష్ట్రాల్లో భాషలకు సంబంధించిన గొప్ప సినిమా పాటలు పాడి అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గాన గంధర్వ గాయకుడు భగవంతుడు ప్రత్యేకంగా ప్రాణం పోసిన ఈ లోకానికి పంపారు. 5 దశాబ్దాలుగా 50 వేల పైచిలుకు పాటలు పాడుతూ చివరగా గంధర్వ లోకము చేరుకున్నారు. వారికి బాధాతప్త హృదయంతొ శోకతప్త నివాళులు అర్పిస్తూ "భారత రత్న" బిరుదు ప్రదానం చేసి గౌరవించు కోవాలని ప్రార్థన.

  • @kw5suri
    @kw5suri 3 года назад

    మీరు చెప్పింది అక్షర సత్యం. పాడుతా తీయగా లో పాడే పాటల కన్నా బాలు గారు తరువాత చెప్పే విశాషాలు వినాలని ఉండేది. ఆయన ఒక కారణ జన్ముడు. భారత రత్న కి నూరు శాతం అర్హులు 🙏

  • @ursramesh9684
    @ursramesh9684 3 года назад +18

    ఇంక మిగిలింది ఆవేదన.. మనో వేదన 😭

  • @clickndfeel8265
    @clickndfeel8265 3 года назад +1

    అవును sir.. మీరు చెప్పిన ప్రతి వాక్యము అందరినీ ఆలోచింపచేసింది. బాలు గారు లేని భారతీయుని జీవితం లో ఆవేదనే మిగిలింది.మన బాలు గారు తను నమ్ముకున్న వృత్తి నీ..దేవుని పూజ లాగా చేసి జీవితాంతం ధ్యానం చేస్తూ వున్న మహర్షి. వారి జీవితం ఒక గ్రంధాలయం.. అందులో మీలాంటి మహానుభావులు పుస్తకాలయితే వాటిని చదువుకోవాలనుకుంటున్నాం మేము.
    బాలుగారు పాట కోసమే పుట్టారు పాటగానే మారిపోయారు. వారు కారణజన్ములే ఎప్పటికి 🙏🙏🙏🙏

  • @satyaraagasatya129
    @satyaraagasatya129 3 года назад +39

    గంగాధర శాస్త్రి గారికి ధన్యవాదాలు. అయ్యా! భూమండలం మీద ఉన్న బాలు గారి అభిమానులూ, సంగీతప్రియులూ..అందరూ కలిసి ఒకేసారి,ఒకేవిధంగా, అంతులేని దుఃఖంతో, ఆవేదనతో కన్నీటి పర్యంతమై వీడ్కోలు పలికినట్లనిపించింది..అదే బాధ. అదే ఆక్రోశం. కోట్ల మంది గుండె చప్పుడు మీ ప్రతీ మాటలోనూ ధ్వనించింది.మీరు మీడియా కు దూరంగా ఉండటంతో ఇన్నాళ్లూ మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మేము కూడా అర్థం చేసుకోలేదు. నిజానికి మరో ఘంటసాల గా మీరంటే కూడా మాకు చాలా అభిమానం.మీ గుండె తడిని మొదటి సారిగా చూసి చలించిపోతున్నాము.ఆ గంధర్వు లిద్దరినీ మీ స్వరంలో పలికించి మంత్రముగ్ధుల్ని చేసారు.. బాలు గారి విషయంలో జరిగిన ప్రతీ సంఘటనా మా హృదయాలలో చాలా ఆవేదన గా మిగిలిపోయాయి. మీ ద్వారా అవే ఇలా వ్యక్తమయ్యాయి...చాలా అద్భుతమైన విశ్లేషణ ద్వారా ఓవైపు ఆవేదన చెందుతూనే అందరి వలన జరిగిన పొరపాట్లను,నిజాలనూ ప్రస్తావించిన విధం గుండెల్లో వేదన రగిలించింది..ఆయన పట్ల తెలుగు చిత్రపరిశ్రమా,తెలుగురాష్ట్రాల ప్రజలూ,ప్రభుత్వాలూ స్పందించిన తీరు చరిత్ర లో నిలిచిపోతుంది...బాలు గారి ఆత్మకు శాంతి లభించి ఉత్తమ గతులు పొంది ముందే చేరుకున్న అనేక మంది గాయక, సంగీత, దర్శక,నిర్మాతలూ..మిత్రులతో కలసి నిరంతర గానలహరిలో మునిగి తేలుతూ హాయిగా ఉందురు గాక!! మీకు శతకోటి కృతజ్ఞతలు తెలుపుతూ.. దేవర వారి నమస్సులు..😢😢😢🙏🙏🙏

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 3 года назад +3

    Great tribute heartful tribute meerucheppindi antha absolutely true we lost two legends in our film music industry one ghantasala one late SPB whole india paying tributes to our SPB he is andarivadu all owned him

  • @srinivasvuyyuru5818
    @srinivasvuyyuru5818 3 года назад +1

    The best tribute that has ever been paid to Sri SPB..sir..Thank you Gangadhara Shastry garu..

  • @karapaveerabhadrayyasastry1761
    @karapaveerabhadrayyasastry1761 3 года назад +4

    మీరు చెప్పిన మాటలు నా మనసులో మాత్రమే కాదు, సాహిత్యం మరియు సంగీతం గురించి తెలిసిన వారు, ఎప్పటికీ మరిచిపోలేనివి.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад +5

    కర్ణుడు దుర్యోధనుని వలన మొహమాటాలు అర్థం లేని ప్రేమ ల వలన బలైపోయిన విధంగా బాలూ గారు బలైపోయారు😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @manthauma6518
    @manthauma6518 3 года назад +1

    Sir chala baga చెప్పారు sir, maa మనస్సులలో కూడా ఇవే భావాలు sir, memu అనుకుంటున్నట్లుగా మీరు మాట్లాడారు sir, thanq sir.

  • @indirasudigala3958
    @indirasudigala3958 3 года назад +1

    Great , spoke excellently,entha matladina thakkuve,matalu saripovu🙏

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula1285 3 года назад +2

    entabaga matadero... andarikee baga cheevatlu vesaru. adbhutamga chepperu.dhanyavadalu.

  • @galisubbarao2067
    @galisubbarao2067 3 года назад +1

    Nice to watch a detailed video showing your feelings to SPB. We all miss him no doubt. U too possess a great voice and after SPB , we need to take care of people like u and upon hearing ur voice, we feel like a Balm being applied to our wound. Take care. All the best wishes sir🙏🙏

  • @jyothipallem3127
    @jyothipallem3127 3 года назад +14

    కాలచక్రం వెనక్కి వెళితే ఎంత బాగుండేదో

  • @vasusri9323
    @vasusri9323 3 года назад +2

    Chala Baaga chepparu GuruvuGaru 🙏🙏🙏

  • @rajisamudrala2949
    @rajisamudrala2949 3 года назад +1

    The best ever tribute to the beautiful soul balugaru..... No words to express guruvugaru.....

  • @kalamadhurimaeventsmusic9337
    @kalamadhurimaeventsmusic9337 3 года назад +1

    నమస్కారమండి శాస్త్రి గారు మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట మనసుకు హత్తుకునేలా ఉంది, బాలు గారి జీవితంలో రెండవ అధ్యాయం ఈటీవీ రామోజీ రావు గారు మాత్రమే బాలుగారు పాడినటువంటి ప్రతి ఒక్క పాటకు ప్రాణం పోశారు అలాగే రామోజీ రావు గారికి ప్రణమిల్లి పాద నమస్కారం చేశారు,ఆయన ఒక మహా వృక్షంఅండి ఆ మహా వృక్షం కూడా పాద నమస్కారం చేసిందంటే ఇంతకంటే ఆయన గురించి చెప్పాల్సింది ఏమీ లేదని నా అభిప్రాయం శాస్త్రి గారు🙏.

  • @VasanthKumar-nd9gy
    @VasanthKumar-nd9gy 3 года назад +2

    శ్రీ బాలు గురించి ఇంత గొప్పగా విశ్లేషణ బహుశా లేదేమో... ఎంత భావోద్వేగ వ్యక్తీకరణ, బాధ మీలో చూసానో... మీ మీద గౌరవం రెట్టింపయింది శాస్త్రిగారూ... మనం ఆయన్ను పోగొట్టుకుని చాలా కోల్పోయాము.... ఆయన హత్య కావించబడ్డాడనే మీ ఆవేదనతో నేనూ ఏకీభవిస్తాను. మంత్రముగ్ధున్నయి మీ బాధ,భావం వెంటే ఈ 46.11 నిముషాలు పరుగెట్టాను సర్... మీకు కృతజ్ఞతాభివందనాలు...
    వసంత్ శ్రీవత్సస