Abhinava Tharavo Video Song | Shivaranjani Movie Title Song | Jayasudha | Evergreen Super Hit Song

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2020
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • РазвлеченияРазвлечения

Комментарии • 448

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад +54

    పాట ఎంత బాగా రాసిన. ...ఆ పాట సరిగా పాడకపోతే ఆ పాట బాగుండదు. ..కానీ ఈ పాట ని రాసిన వారికంటే. ...పాడిన బాలు గారి వలన ఈ పాట ఇంత మధురంగా ఉంది. ...ఇప్పటికీ ఎప్పటికీ కూడా. .....గుర్తు గా మిగిలి ఉంటుంది. పాటలంటే ఇష్టపడే వారికి ఈ పాట బాగ నచ్చుతుంది.

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 3 месяца назад +4

      కమ్మని సంగీతం ❤

    • @vgurappa9388
      @vgurappa9388 2 месяца назад +2

      ఈ పాట చాలా బాగుంది మా చిన్నప్పుడు చదువుకున్న రోజులు సూలులొ పాటలు పాడించెవారు మ మాస్టర్. చిన నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి

    • @devakarunabondu4850
      @devakarunabondu4850 2 месяца назад +1

      ​@@Sweet-sweet-soniya p

    • @MadhavaSree
      @MadhavaSree Месяц назад

      A😅😅

    • @Swarasagarsingh
      @Swarasagarsingh Месяц назад +1

      Na chinnappati pata chala istam naku mavaru kuda singer swarasagar Singh garu chalabaga padataru ee pata Vsp

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 3 месяца назад +5

    మొదట కొంత మంది హీరోలను చూడలేని రోజుల్లో పాటల రచయిత లు.గాయకులే వాళ్లను నిలబెట్టాయి.ఆ హీరోలు ఇప్పుడు మరచిపోయారు.

  • @kummarasreeramulu7682
    @kummarasreeramulu7682 Год назад +9

    ఇక ఇలాంటి పాటలు మన జీవితంలో మరువలేము 🌹👃👌

  • @SharathBabu3410
    @SharathBabu3410 2 года назад +5

    అభినవ తారవో... నా... అభిమాన తారవో
    అభినవ తారవో అభినయ రసమయ కాంతిధారవో
    అభినయ రసమయ కంతిధారవో
    మంజుల మధుకర శింజాల సుమసరశింజినీ శివరంజని శివరంజనీఅది దరహాసమా మరి మధురమాసమా
    అది దరహాసమా మరి మధురమాసమా
    ఆ మరునికి దొరికిన అవకాశమా
    అవి చెరణమ్ములా శశికిరణమ్ములా
    నా తరుణభావన హరినమ్ములా ||అభినవ తారవో||
    ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
    ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
    ఆ నెన్నడుము ఆడినచాలు
    ఆ నెన్నడుము ఆడినచాలు రవళించును పదకవితా ప్రభందాలు ||అభినవ తారవో||
    నీ శ్రుంగార లలిత భంగిమలో పొంగిపోదురే రుషులైన
    నీ కరుణరసానిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైన
    వీరమా... నీ కుపిత నేత్ర సంచారమే
    హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే
    నవరస పోషణ చణవనీ నటనాంకింత జీవనివనీ నిన్ను కొలిచి వున్నవాడ మిన్నులందుకున్నవాడ

    నె ఆరాధకుడను అస్వాదకుడను అనురక్తడను.నీ ప్రియభక్తడను ||అభినవ తారవో

  • @veenakshikorra625
    @veenakshikorra625 Год назад +20

    నిండు చీర కట్టుతో ఎంత అద్భుతంగా నాట్యం చేశారో🥰🙏.
    ఈ కాలం డాన్సులు కుటుంబ సభ్యులతో కలిసి చూడలేము😱.

  • @seshasaideevi5526
    @seshasaideevi5526 3 года назад +106

    "మంజుల మధుకర శింజాల సుమశర శింజినీ"
    సినారె గారి విశ్వరూపం...
    బాలు గారి అమృత గానం

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 Год назад +1

      Line chala bagundi

    • @harikiranpaneti86
      @harikiranpaneti86 2 месяца назад +1

      Meaning please

    • @seshasaideevi5526
      @seshasaideevi5526 2 месяца назад +1

      ​@@harikiranpaneti86మంజుల = మనోహరమైన, అందమైన
      మధుకరము=తుమ్మెద
      శింజ= వింటినారి మ్రోత
      సుమశరము= పూల బాణము
      శింజిని= వింటినారి, స్త్రీ
      నా ఉద్దేశ్యం లో నాయికను ఇలా వర్ణిస్తున్నాడు గాయకుడు
      "అందమైన తుమ్మెద లాగా, పూల బాణానికి (ఇది మన్మధుని చేతిలో ఉంటుంది అని మనకు తెలుసు కదా) ఉన్న వింటినారి లాగా (నాజూకుగా, అందంగా) ఉంది ఆమె అని వర్ణిస్తున్నాడు

  • @girirao8208
    @girirao8208 Год назад +23

    అభినవ తారవో నా అభిమాన తారవో... ఎంతో అద్భుత సాహిత్యం. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించే పాట.

  • @manamadhavalle7566
    @manamadhavalle7566 3 года назад +78

    ఒక అద్భుత సాహిత్యానికి ఒక అమర గానం తొడయితే అది అమరామృతం కాక ఇంకేమిటి.I love U balu .Sp balu...

    • @KRISHNA-qo2mt
      @KRISHNA-qo2mt Месяц назад

      మీరు చెప్పినట్లు వాటి అన్నిటితోపాటుగా శివరంజనీ అన్నప్పుడు జయసుధగారి ముఖకవళికలు చూడండి అసలు సూపర్

  • @janardanadev3845
    @janardanadev3845 3 года назад +102

    Abhinava Thaaravo
    అభినవ తారవో... నా... అభిమాన తారవో..
    అభినవ తారవో.. అభినయ రసమయ కాంతిధారవో
    అభినయ రసమయ కాంతిధారవో
    మంజుల మధుకర శింజాల సుమశర శింజినీ
    శివరంజనీ.. శివరంజనీ..
    అది దరహాసమా మరి మధుమాసమా
    అది దరహాసమా మరి మధుమాసమా
    ఆ మరునికి దొరికిన అవకాశమా
    అవి చరణమ్ములా శశికిరణమ్ములా
    నా తరుణభావన హరిణమ్ములా.. ||అభినవ తారవో||
    ఆ నయనాలు విరిసిన చాలు అమవస నిశిలో చంద్రోదయాలు
    ఆ నయనాలు విరిసిన చాలు అమవస నిశిలో చంద్రోదయాలు
    ఆ నెన్నడుము ఆడినచాలు
    ఆ నెన్నడుము ఆడినచాలు రవళించును పదకవితా ప్రబంధాలు అభినవ తారవో||
    శివరంజనీ... శివరంజనీ..
    నీ శృంగార లలిత భంగిమలో పొంగిపోదురే రుషులైన
    నీ కరుణరసావిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైన
    వీరమా... నీ కుపిత నేత్ర సంచారమే
    హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే
    నవరస పోషణ చణవనీ నటనాంకింత జీవనివనీ నిన్ను కొలిచి వున్నవాడ మిన్నులందుకున్నవాడ
    ఆ.ఆ.ఆ.
    నే ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తుడను.నీ ప్రియభక్తుడను ||అభినవ తారవో||

  • @lakshmankumartalluri1307
    @lakshmankumartalluri1307 Год назад +6

    సి.నారాయణరెడ్డిగారు.రమేష్ నాయుడు గారు. దాసరి నారాయణరావు గారు బాలు గారు వీరందరు భౌతికంగా లేకపోయినా మనందరి మనస్సులో జీవించి వుంటారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mokshitch1422
    @mokshitch1422 4 месяца назад +6

    ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం లేదు,తెలుగు కవులు పాటలు అద్బుతం గా రాసేవారు,ఇప్పుడు తెలుగు మీడియం తగ్గిపోయి మంచి కవులు మాయమయి పోయారు

  • @abhiramshortvideos1622
    @abhiramshortvideos1622 3 года назад +71

    శ్వచమైన తెలుగు పాట...ఇలాంటి సాహిత్యం ఈ రోజుల్లో అస్సలు లేదు.....ఎన్ని సార్లు విన్నా వినాలనే ఉంటుంది

    • @wisdom2885
      @wisdom2885 2 года назад +4

      మీ అభిరుచి కి అభినందనలు

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 3 месяца назад

      అవును

  • @siralakshmi5966
    @siralakshmi5966 2 года назад +14

    అత్యద్భుతమైన పాట....ఆహా...బాలూగారి వాయిస్.....❤️❤️❤️❤️❤️

  • @kamalakumariravinuthala6795
    @kamalakumariravinuthala6795 3 года назад +13

    జయప్రద, జయసుధ అంటే చాలా ఇష్టం నాకు

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 3 года назад

      అలాగ న దెగ్గర చాలా మంది ఉన్నారు.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 года назад

      వారు మహనటులండీ బాగా వివరించారు ధన్యవాదాలు

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 3 года назад +69

    ఇది కదా మన సినారె గారి సాహిత్యం అంటే !!!!!!

  • @Neelakanta563
    @Neelakanta563 3 года назад +15

    జోహార్ జోహార్ బాలూ గారు
    గాన గంధర్వుడు
    సరస్వతి పుత్రుడు
    తెలుగు భాష కు వన్నె తెచ్చిన తెలుగు తల్లి ముద్దు బిడ్డ
    బాలు గారి గురించి ఎన్ని చెప్పినా ఎంత చేప్పినా ఈ జీవితం సరిపోదు
    మహానుభావుడు , కారణజన్మడు, పాటల దేవుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasunamb8777
    @prasunamb8777 Год назад +4

    సూపర్ song jaYasudha నాట్యం అధ్బుతం శివరంజని అంటూ చక్కగా పాడారు బాలు గారు

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +21

    అభినవ తార
    అభిమాన దేవత
    జయసుధ గారి
    అభినయ కుసుమాలను
    మరువగలమా...
    మరిచిపోగలమా...
    Beautiful song
    Old is Gold 🎶🎶🎶🎵🎶🎶🎶

  • @GLaxmi-eq1in
    @GLaxmi-eq1in Год назад +4

    మహానటి జయసుధ అంటే చాలామందికి ఇష్టం ఆమె నటన అంటే చాలామందికి ఇష్టం అంత నటన ఆమె బ్యాచ్ లో చేసే వారే లేరు
    మహానటి సావిత్రి
    మహానటి వాణిశ్రీ
    మహానటి జయసుధ
    వీరు ముగ్గురు ముగ్గురే
    వీరి నటన గురించి మాట మాట్లాడదామంటే మాటలు లేవు
    ఈ సహజ నటి మనుల గురించి
    మాట్లాడదామంటే మాటలు సరిపోవు

  • @thirupathireddydharma6828
    @thirupathireddydharma6828 3 года назад +135

    బాలూగారు లేనప్పటి నుండి ఆ మహాగాయకుడి పాట వినాలంటే గుండె బరువెక్కిపొతోంది

  • @nagabhushanam4774
    @nagabhushanam4774 2 года назад +17

    జయసుధ గారు 💞 సూపర్ యాక్టింగ్ 👏👏💐

  • @chandgum
    @chandgum Год назад +9

    Beautiful natural actress my favorite jayasudha garu!!

  • @manoharbabu6124
    @manoharbabu6124 2 года назад +7

    ఎన్నటికీ చెక్కు చెదరని మధుర కళాత్మకమైన పాట.. బాలూ..ఈ ఒక్క పాట చాలు...నీ ప్రతిభ చాటడానికి....

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 9 месяцев назад

      One is enough. But there are thousands such by SP gari!!!

  • @kuwaitq7842
    @kuwaitq7842 3 года назад +61

    అప్పటి సంగీతానికి ఇప్పటి సంగీతానికి చాలా చాలా వ్యత్యాసం ఉంది.... గుండె ను హత్తుకునే సంగీతం.... Wow

    • @umabitr8157
      @umabitr8157 3 года назад +3

      Correct

    • @bhaskarraju8430
      @bhaskarraju8430 3 года назад +3

      మీకు మా ధన్యవాదాలు, బి భాస్కర్ రాజు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 года назад +4

      అవునండి‌‌ అప్పటి సంగీతం విటే మనసు‌ పలకరిస్తుంది ‌ఇప్పడు ‌ సంగీతం వింటే ఒల్లు‌‌‌ కంపరం పుడుతుందడి‌ అది‌‌ వ్యత్యాసం

    • @rammohangodthi
      @rammohangodthi Год назад

      💯✅

    • @Raajasri-od3hy
      @Raajasri-od3hy Год назад

      Anthena paatalo padaalu kuda from Telangana state

  • @satyanarayanabandaru5045
    @satyanarayanabandaru5045 Год назад +3

    స్వర్గీయ హరిప్రసాద్, SR & BGNR College, Inter, Commerce లో నా క్లాస్ మేట్. చాలా మంచి వ్యక్తి. అప్పట్లో నేను దాసరి నారాయణరావు గారితో మాట్లాడాను అని అంటే నవ్వు కొనేవాళ్ళం. అరె నేను సినిమాలో హీరోగా నటిస్తాను రా అని అనేవాడు. ఒకసారి చంద్రమోహన్ ఖమ్మం మా కాలేజ్ కు వస్తె ఆయనతో మాట్లాడుతూ నాకు పరిచయం చేశాడు. హరిప్రసాద్ కి శివనారాయణ మరియు శామ్యూల్ జాన్ చాలా close friends.
    Hariprasad ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూన్నాను

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 года назад +3

    Sister jayasudhaku manchi Peru techina move ✋✋✋✋✋✋

  • @user-zf4je1vh1y
    @user-zf4je1vh1y Год назад +2

    ఈ పాట లో అమృతం కరిగించి పోశారు.. లేకపోతే ఇంత మధురమా?????

  • @ItsMyLife_Venu
    @ItsMyLife_Venu 2 года назад +11

    Superb performance by Jayasudha Ji 👏👏👌

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +41

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @bharathgandluru2736
    @bharathgandluru2736 2 года назад +21

    I have listed around 50 times. Sri Jayasudha is such a great actress.. admired by her face expressions..

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 2 года назад +1

    అందానికి మరింత అందంగా ఫటఫట జయ లక్ష్మీ గారు....ఉన్నారూ.... 😥😥😥

  • @srinivasvijayjavvaji2769
    @srinivasvijayjavvaji2769 4 месяца назад +1

    చాలా అద్భుతమైన పాటలలో ఈ పాటకు కూడా స్ధానం ఉన్నది.

  • @shabashrbhai7858
    @shabashrbhai7858 3 года назад +18

    *Childhood memory song..*
    *Anyone watched/watching in 2021 ?*

  • @Sweet-sweet-soniya
    @Sweet-sweet-soniya 3 месяца назад +2

    అద్బుతమైన పాటలు, ఎన్నిసార్లు విన్న తనివితిరదు, పదాలు ఓక అద్బుతం,స్వరం మరింత అద్బుతం ❤❤❤❤❤❤

  • @srinivasuluvallamreddy4448
    @srinivasuluvallamreddy4448 2 года назад +19

    Unforgettable performance from Jayasudha. She is simply great.

  • @kumarnukapeyyi-ud9ep
    @kumarnukapeyyi-ud9ep Год назад +3

    My paverate jayasuda song is nice

  • @kavyavidya1397
    @kavyavidya1397 10 месяцев назад +2

    Jayasudha❤❤❤❤❤

  • @prasadart5898
    @prasadart5898 5 месяцев назад +1

    ఎంత చక్కటి పదాల పొందిక గాత్ర సంగీతాల కలియికతో ఈ పాట ఎక్కడికో వెళ్ళింది మనకు వినడం ఆస్వాదించడం వస్తే ఆనందాల లహరే🎉

  • @donthalaravikumar1858
    @donthalaravikumar1858 7 месяцев назад

    ఈ పాట ఎన్ని సంవత్సరాలైనా ప్రజల మదిలో మెదిలే అద్భుతమైన పాట ఇది

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 3 года назад +240

    ఈ పాటలో మన అలనాటి అభిమాన తారలు అంతా ఉన్నారు. జయంతి గారు, షావుకారు జానకి గారు, సావిత్రి గారు, జయసుధ గారు, ఫటాఫట్ జయలక్ష్మి గారు, ప్రభ గారు.. అభినవ తారలు, మా అభిమాన తారలు

  • @anilkumarchokkavarapu
    @anilkumarchokkavarapu 3 года назад +25

    మంచి పాట కి ఎప్పుడు ఆదరణ ఉంటది

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 3 года назад +38

    నా అభిమాన పాట ...... కానీ బాలు గారి జ్ఞాపకంతో కన్నీటి తో నాకళ్ళు నిండినవి..... Very very bautifull lyrics from Dr C. N. REDDY

    • @SudhaRani-im3ow
      @SudhaRani-im3ow 3 года назад +1

      Q

    • @hemanth7119
      @hemanth7119 Год назад

      బాసిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @Sweet-sweet-soniya
      @Sweet-sweet-soniya 2 месяца назад

      👌👌🙏🙏🙏

  • @anilkumarchokkavarapu
    @anilkumarchokkavarapu 3 года назад +14

    ఈ సినిమా లో హీరో ది ఖమ్మం

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 года назад +2

    ఇటువంటి పాటలు s. P. బాలు గారు ఇంకా మెరుగులద్ది ఆహ్లాదంగా పాడి వినిపిచగల సమర్థులు. 🙏

  • @raghavendraaluvala4883
    @raghavendraaluvala4883 Год назад +7

    That memories never repeated.Great generation that we had.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад +3

    బాలుగారు పాడటంవలనే ఈ పాట ఇంత గొప్పగా ఉంది.

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 3 года назад +36

    ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్నా బోరు కొట్టదు👌❤️👍

  • @sarvanichejerla7086
    @sarvanichejerla7086 2 года назад +3

    Sivaranjani .....
    Sivaranjani....
    Aa style of song ..👌👌👌
    C.narayanreddy Garu 🙏🏻🙏🏻🙏🏻
    SPB garu 👌👌🙏🏻🙏🏻🙏🏻
    Pratipaataki nyayam chestaru .
    Great singer..👌👌👌
    RIP Balu garu 🙏🏻🙏🏻
    CNR garu🙏🏻🙏🏻

  • @shanmukharao1285
    @shanmukharao1285 3 года назад +7

    సూపర్ సాంగ్ అనడం లో ఎలాంటి తప్పు లేదు 💯 రైట్ 👍👍

  • @Rocky-sr8id
    @Rocky-sr8id 3 года назад +4

    Aanaati maha nateemanulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 jayasudha Garu Chala Chala lucky vaalla pakkana koorchovadam..

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 года назад +1

      నిజంగా నండి అలాంటి నటులు‌ ఇంక. మరల. రారండీ బాగా వివరించారు ధన్యవాదాలు

  • @sukanyaaravalli7233
    @sukanyaaravalli7233 Год назад +2

    I like jayasuda

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 года назад +2

    This is the one of the renowned venture from the great Dasarigaru with new hero pairing with experienced Jayasudhsgsfu

  • @divasinfo6369
    @divasinfo6369 Год назад +4

    Listening this great song on 4th Jun...Remembering SPB ... Happy Birthday sir🎉😊

  • @lakshmireddyskht8653
    @lakshmireddyskht8653 2 года назад +6

    విన్నకొద్దీ...వింపుగానే... ❤❤❤

  • @naarizone9719
    @naarizone9719 2 года назад +14

    for a natural beauty, and natural actress like JayaSudha Garu .... this song and lyrics by CNR garu is a real real and real natural tenderhearted appreciation... i love both of them for their talent.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +47

    జనరంజికమైన పాట‌ బాలు అన్న జీవం పోశాడు ఈపాటికు బాలుగారు కాకుండా ఇంకెవ్వరు పాడిన. ఇంత. పాపులర్ అయ్యోదికాదు ఈపాట‌ సృష్టీకర్తలందరికీ దండాలైయ్య 🙏🙏🙏🌹🌹🌹🌹🦚🦚👌👍

  • @rammohangodthi
    @rammohangodthi Год назад +4

    Really we miss great creative director Dasari 🌷

  • @AmirthathuLi
    @AmirthathuLi 2 года назад +4

    One of the best song...both in tamizh and Telugu. Will ever remain one of my top favourite

  • @chavalisekhar4
    @chavalisekhar4 3 года назад +5

    డా సి, నారాయణ రెడ్డి రచన, రమేష్ నాయుడు సంగీతం, సూపర్

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 2 года назад +6

    వందేకృష్ణం జగద్గురుం🙏, గీతా జయంతి శుభాకాంక్షలు 💐జై జై గీతా భాగవత్ గీత🙏

  • @lavanyavenugopal5173
    @lavanyavenugopal5173 2 года назад +7

    మనసుకి హత్తు కుపోయే పాటలు

  • @ankaiahgummadidala1371
    @ankaiahgummadidala1371 Год назад +3

    This is by far my most favourite song. Thanks for uploading.

  • @btr2704
    @btr2704 2 года назад +15

    Beautiful lyrics, simple instruments for music and a divine voice - great combination. Must have heard the song more than 200 times in the last 35 years

  • @SKUMARGATTU
    @SKUMARGATTU Месяц назад

    Great creation of Dr.CNaare, Ramesh Naidu, SP Balu and Daasari. Nelakokkasaraina vinavalsinde. Its in my top 50 Telugu songs list. Ee pata vinna prathi sari ee nalugurni gurthuchesukunnatle. Mahanubhavulu.

  • @khrao7786
    @khrao7786 3 года назад +10

    Is someone still listening to this song in 2021...quite melodious song 👏👏👌

  • @srinathiyengar7101
    @srinathiyengar7101 2 года назад +3

    No one can match our great sp sir.iam one of the luckiest person to hear this type of super song of sp sir

  • @santhukumar3701
    @santhukumar3701 3 года назад +24

    Hero Hariprasad చిన్నపుడు మా ఊరు Yellandu.. Khammam dist మా ఇంటి ముందు వుండేవారు

    • @srinivasnodagala1722
      @srinivasnodagala1722 3 года назад +1

      Mari ippudu ekkada unnaru

    • @bapujidevadas7328
      @bapujidevadas7328 2 года назад +1

      @@srinivasnodagala1722 hari prasad chanipoyi 5 years avutundi, badluck.

    • @srinivasnodagala1722
      @srinivasnodagala1722 2 года назад +1

      @@bapujidevadas7328 Om shanti.... Thanks mithrama

    • @janardhandsp91
      @janardhandsp91 2 года назад

      Ohhhh

    • @santhukumar3701
      @santhukumar3701 2 года назад

      @@srinivasnodagala1722 ఎవరు..
      నేను ఖమ్మం... govt headmaster..
      హరిప్రసాద్ గారు స్వర్గస్తులైన విషయం విదితమే

  • @lakshminarayananputarjunan9749
    @lakshminarayananputarjunan9749 3 года назад +15

    First time I am hearing this song in Telugu. Beautiful. Iheard Tamil version of this song many times. My favorite song from my childhood. Tamil version also sung by SPB sir.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 года назад +6

    శివరంజని. ...సినిమా బావుంటుంది. ...డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు రాసిన పదాల కు మరియు బాలుగారు పాడటం వలన ఈ పాట ఇంత గొప్పగా ఉంది. ....కానీ సినిమా లో ఈ పాటకు తగినంత అక్కడ నటనగాని నటీనటులు గానీ సరిగా కుదరలేదు ఈ పాట అంత అద్భుతంగా ఉంటుంది. ..ఇది నా అభిప్రాయం.

  • @sudheendrar8087
    @sudheendrar8087 3 года назад +29

    Jaya Sudha best dancing no words to express greatness of film song 🙏🔥🔥🔥❤️❤️❤️👍🏾 touching performance

  • @butchiraju5257
    @butchiraju5257 Месяц назад

    ఈ పాట నా మనసు లో నీ పై ఉన్న అమితా మైన ప్రేమ కు దర్పణఓ మై డియర్ మాధవి.

  • @venkateshwaraenterprices3328
    @venkateshwaraenterprices3328 3 года назад +14

    Dasri's master piece. JAYASUDHA 'S mind blowing performance

  • @skguntur
    @skguntur 3 года назад +4

    Waiting for another Nati like you, Jaya sudha.

  • @vjjayprakash9600
    @vjjayprakash9600 2 года назад +2

    I love Js acting

  • @applevlogs2426
    @applevlogs2426 3 года назад +16

    Beautiful song and old is gold ❤️

  • @bheemaiahdiviti6439
    @bheemaiahdiviti6439 6 месяцев назад +1

    Jayasudha great herohin

  • @rajudevara5530
    @rajudevara5530 3 года назад +27

    జయహో సి నా రే...

  • @kvsraju4578
    @kvsraju4578 Год назад +1

    నాకు చాలా చాలా చాలా ఇష్టమైన పాట

  • @deepabalu1028
    @deepabalu1028 Год назад +3

    No one can sing this better. What a voice SPB sir

  • @kothacheruvuroadlimahbubna7126
    @kothacheruvuroadlimahbubna7126 Год назад +3

    సూపర్ పాట..🙏🙏

  • @sudheendrar8087
    @sudheendrar8087 3 года назад +7

    Jaya Sudha best acting in Shivaranjani movie song Super best Film 👍🏾

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 года назад +12

    దాసరి నారాయణరావు
    గారికి ధన్యవాదాలు

  • @ss74blr
    @ss74blr Год назад +3

    What an amazing singing by SPB! Super!

  • @sridharsidhu3636
    @sridharsidhu3636 2 года назад

    నాకు హీరో ఫేస్ అతని expressions చూస్తే ఫుల్ నవ్వొస్తోంది..

  • @kovelagoud
    @kovelagoud 3 месяца назад

    హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే
    నవరస పోషణ చణవనీ నటనాంకింత జీవనివనీ నిన్ను కొలిచి వున్నవాడ మిన్నులందుకున్నవాడ

    నే ఆరాధకుడను అస్వాదకుడను అనురక్తుడను..నీ ప్రియభక్తుడను
    అభినవ తారవో||

  • @nadigottulokesh3138
    @nadigottulokesh3138 Год назад +2

    JayasudhAki padmasri award endukuivvaledu Telugu indasricheppali

  • @s.v.ramanas.v.ramana5720
    @s.v.ramanas.v.ramana5720 2 года назад +1

    నా కు నచ్చిన పాట

  • @manjula4444
    @manjula4444 2 года назад +2

    Jayasuda songs super hit

  • @coolguypravara
    @coolguypravara 3 года назад +3

    వేదికపైన ఉన్నవారిలో ఫటాఫట్ జయలక్ష్మి, సావిత్రమ్మ ఇద్దరూ వెంట వెంటనే మరణించారు… 1980లో మరియు 1981లో

  • @mallidiveeraraghavareddy4556
    @mallidiveeraraghavareddy4556 3 года назад +4

    అద్భుతమైన పాట

  • @vanisri8180
    @vanisri8180 3 года назад +37

    Nizamandi Manchi Pata pampincheru, Maroka Sari, Baluni, Taluchukuni Eadupu Vasthundi ANDI,😧😧😧😧😧😧😧 Na Chinnappudu Radiolo Chithralaharilo Vintu ENTHOO Murispoyanu Bhavam Sarigga Teliyadu But Ee Pata Naku Prannam, Anduki Naku , Balu Bangaram Antee Prannam,Miss You Lot Balu Bangaram 😨😨😨😨🙏🙏🙏🙏😧😧😧😧😧😧😧

  • @unknow8754
    @unknow8754 3 года назад

    ఈ సినిమా కొత్తగా రిలీజైనప్పుడు బెంగళూరు కపాలి థియేటర్ లో చూశాను.

  • @rambabuannika2654
    @rambabuannika2654 3 года назад +2

    అడ్డతీగల లోని పింజరకొండ జలపాతం నేపథ్యం super, song super.

  • @tatapudisatyanarayana1075
    @tatapudisatyanarayana1075 2 года назад +1

    Super Sir

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 года назад +1

    Abinava. Thaaravo. shivaranjani. super. hit
    song. super hit. ciniema.

  • @manikantamanikanta2546
    @manikantamanikanta2546 3 года назад +34

    Song location pinjari konda east godavari AP

  • @nareshbabusk5094
    @nareshbabusk5094 2 года назад

    Balu gari songs ki kaneesam fifty national awards ivvachu.Anthati madura gayakudu.miss u Balu garu

  • @butchiraju5257
    @butchiraju5257 5 месяцев назад

    One of the memorable song which I never forget so far my dear.

  • @nanicherakani4068
    @nanicherakani4068 2 года назад

    దాసరి గారికి నా పాదాభివందనం

  • @srinivashsurisetti7763
    @srinivashsurisetti7763 3 года назад +3

    Super song