సాక్షి వ్యాసములు | స్వభాష | పానుగంటి | Sakshi Vyasamulu | Rajan PTSK

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • మానవ స్వభావం మీద, సంఘంలోని అనేక ఆచారాల మీద పానుగంటి లక్ష్మీనరసింహారావు వారు నవ్వుతూ పెట్టిన వాతలే ఈ సాక్షి వ్యాసాలు. ఈ వ్యాసాలు మొదటిసారిగా 1913లో సువర్ణలేఖ అనే పత్రికలో ఓ సంవత్సరం పాటూ ప్రచురించబడ్డాయి. ఆ తరువాత కాలంలో అంటే 1920 నుండి సుమారు రెండేళ్ళ పాటూ ప్రతీవారం ఒక వ్యాసం చొప్పున ఆంధ్రపత్రికలో ఈ సాక్షి వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఆ తరువాత కూడా 1927లోను, 1933లోను మరికొన్ని వ్యాసాలు ఆంధ్రపత్రికలోనే ప్రచురితమయ్యాయి. మొత్తం మీద పానుగంటివారు రచించిన సాక్షి వ్యాసాల సంఖ్య 140కి పైమాటే. ఈ సాక్షి వ్యాసాలను చదవడం కోసం అప్పట్లో పాఠకులు ఉర్రూతలూగిపోయేవారట. సాక్షి వ్యాసాలు చదివితే మనకు భాష మీద పట్టు చిక్కుతుంది. ఆనాటి సమాజం తీరుతెన్నుల మీద అవగాహన ఏర్పడుతుంది. మెత్తగా, చమత్కారభరితంగా మాట్లాడుతూనే చురకలు ఎలా వెయ్యాలో తెలుస్తుంది. అటువంటి వ్యాసాలలో ఒకటైన స్వభాష అనే వ్యాసాన్ని ఈరోజు చెప్పుకుందాం. ఆ వ్యాసాన్ని యధాతథంగా చదువుతాను. వందేళ్ళ క్రితంనాటి భాష కనుక, అప్పటి తెలుగును అర్థం చేసుకోవడానికి కాస్తంత ఇబ్బంది ఉండవచ్చు. కానీ అదీ మనభాషే కదా. మనభాష ఏనాటి రూపాన్నైనా మనం చదవగలగాలి, అర్థం చేసుకోగలగాలి. అప్పుడే ఆనాటి రచనల్లోని అందాలను ఆస్వాదించగలం. విజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలం. ఈ సాక్షి వ్యాసాలను పానుగంటివారు చిత్రమైన రీతిలో రచించారు. సాక్షి అన్నది ఒక వ్యక్తి పేరుగా, అతని ఆధ్వర్యంలో సాక్షి అనే సంఘం స్థాపించబడినట్లుగా, ఆ సంఘంలో జంఘాలశాస్త్రి, వాణీదాసు, కాలాచార్యుడు, బొఱ్ఱయ్యసెట్టి అనేవాళ్ళు సభ్యులుగా ఉన్నట్లుగా కల్పన చేశారు. వారిలో జంఘాలశాస్త్రి వాక్చాతుర్యం కలవాడు. చాలా ఆవేశపరుడు. ఏ విషయం గురించైనా లోతుగా, వ్యగ్యంగా మాట్లాడగల దిట్ట. సాక్షి ఇచ్చిన శిక్షణలో ఈ జంఘాలశాస్త్రి మరింతగా రాటుదేలాడు. సాక్షి వ్యాసాల నిండా తన ఉపన్యాసాలతో ఉదరగొట్టే మనిషి మన జంఘాలశాస్త్రే. ఇక తెలుగువారిలో తక్కువైపోయిన స్వభాషాభిమానం గురించి పానుగంటి వారు విసిరిన చమక్కే ఈరోజు మనం చెప్పుకోబోయే స్వభాష అనే ఈ వ్యాసం. పాఠశాల బాలకులు ఏర్పాటు చేసుకున్న ఓ సభకు తెలుగువాడైన ఓ ప్రఖ్యాత న్యాయవాదిని అధ్యక్షుడిగా ఉండమని ఆహ్వానిస్తారు. అతగాడు ఆ సభకు వచ్చి, తాను తెలుగులో మాట్లాడలేనని చెప్పి ఇంగ్నీషులో ఒక పావుగంట సేపు మాట్లాడి.. ఇంకెవరైనా మాట్లాడుతారా అని అడుగుతాడు. అప్పుడా సభికులలో ఉన్న జంఘాలశాస్త్రి పైకి లేస్తాడు. సభాధ్యక్షుడు తెలుగువాడై ఉండి తెలుగు మాట్లాడటం నామోషీగా భావించడం జంఘాలశాస్త్రికి చెప్పలేనంత కోపం తెప్పిస్తుంది. దానితో ఆ సభాద్యక్షుడికి సభాముఖంగానే తన మాటలతో వాతలు పెడతాడు. మన తెలుగువారికి ఉన్న పరభాషా వ్యామోహాన్ని నిరసిస్తూ పానుగంటివారు పెట్టిన చురక ఇది. ఇంగ్లీషు చదువుకోవడం ఏమాత్రం తప్పుకాదనీ, కానీ మన మాతృభాషైన తెలుగును పట్టించుకోకపోవడమే తప్పనీ అంటారు పానుగంటివారు. ఇక ఆ వ్యాసంలోనికి ప్రవేశిద్దాం.

Комментарии • 42

  • @ramakrishnagadepalli8677
    @ramakrishnagadepalli8677 Месяц назад +20

    మాకు 10 వ తరగతిలో పానుగంటి వారి స్వభాష చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి 💐🙏

  • @raviredmia6
    @raviredmia6 Месяц назад +15

    Relevant even now, after almost a century. ఒక శతాబ్దం పూర్వము వ్రాసినప్పటానికి నీ ఇది ఇప్పటికీ ఔచిత్యము.

  • @bhadrayyamagatam1972
    @bhadrayyamagatam1972 Месяц назад +9

    అయ్యా!శాస్త్రి గారు మీ లో parakaaya ప్రవేశం చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ ప్రసంగం నాకుమాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. ధన్యవాదాలు. ఇటువంటి సాహిత్య ప్రక్రియ లు కొనసాగించాలని మా కోరిక

  • @hymavathiappala8303
    @hymavathiappala8303 Месяц назад +1

    ఈ వ్యాసా ల కొరకు చాలా రోజులు గా ఎదిరి చూస్తున్నాను, సంతోషం, అలాగే పూర్తి గా ఈ వ్యాసాలను చదవండి

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 Месяц назад +3

    దీర్ఘాయుష్మాన్ భవ ! తెలుగు సుస్థిరప్రాప్తి వృద్ధి రస్తు ! 10 వ తరగతి మా తెలుగు అధ్యాపకులు కీ.శే .సూర్యనారాయణ శాస్త్రి గారు చెప్పిన శైలి అసమాన్యం .ఈ పాఠ్యాంశం మాకు బోధనలో చేర్చిన తెలుగు అకాడమీకి అభినందనలు. నా వయస్సు 66 సం ".

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 Месяц назад +2

    ఆహా,, అద్భుతః. మనో వాంఛితం- సంతృప్త భరితం😊

  • @msrao8073
    @msrao8073 23 дня назад

    చాలా బావుంది శ్రీ పానుగంటి గారి వ్యాసం, మీ పఠనం - శ్రీ శ్రీ గారు పానుగంటి వారి పై చెప్పిన పద్యాన్ని మీరు ఉటం కిస్తారు అనుకున్నా..
    లక్ష్మీ నరసింహా రావు పానుగంటి;
    వారి సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి;
    ఏలనంటే ఆయన పేను వంటి భావానికి ఏనుగంటి రూపం ఇవ్వడం నేను గంటి" శ్రీ శ్రీ. బ్రిటిష్ రచయిత
    Addison రాసిన Spectator కి తెలుగు రూపం పా. గం.వారి సాక్షి.
    ఆ విషయమును ఆయనే చెప్పుకున్నారు.
    మీకు కృతజ్ఞతలు మరియు అభినందనలు

  • @gattinarendra9768
    @gattinarendra9768 Месяц назад +3

    చాలా బాగా చెప్పారు
    మరిన్ని వ్యాసాలు కూడా వివరించండి

  • @kotiswararao1469
    @kotiswararao1469 Месяц назад

    11:30 ని,, నుండి 🙏🙏👋👋👋👋🙌🙌🙌

  • @lakshmikanagala9142
    @lakshmikanagala9142 Месяц назад +1

    Marku PUC lo lesson idi. Nakuchala istam. 🙏

  • @padmalathatsrv9688
    @padmalathatsrv9688 Месяц назад +1

    Very Very beautiful, our telugu is excellent language, so beautiful to hear and talk.

  • @kedareeswarilatha9414
    @kedareeswarilatha9414 Месяц назад +1

    Panugantivaari vaakkulu mee maatallo chaala bagunnai Swami.ippudu bhasha raani mammalnandarini melkolipela vundi.dhanyavaadamulu

  • @KM-ku5wn
    @KM-ku5wn Месяц назад +1

    👏👏👏👏👏👏👏👏👏👏🙏

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 Месяц назад +1

    పానుగంటి లక్ష్మి నరసింహా రావు పంతులు గారి సాక్షి సంపుటాలు , అందులో జంఘాల శాస్ట్రీ ఉపన్యాసములు, అత్యంత రామణీయము. ఆయన సంఘము లోని ఎన్నో దురాచారాలకు వాత పెట్టారు. తప్పక ఎందరో నేటి కాలానికి గూడా అన్వయించుకోవలసిన గ్రంధములు సాక్షి సంపుటాలు. ధన్యవాదములు.

  • @mastermaster5442
    @mastermaster5442 Месяц назад +2

    Excellent 👍🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 Месяц назад +2

    చురకలు… 👌👍👏🙌🤝

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 Месяц назад +1

    ఆహా... 🥰👏🏻👏🏻👏🏻👏🏻

  • @hymavathiappala8303
    @hymavathiappala8303 Месяц назад +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 Месяц назад +2

    🙏🙏

  • @narendranathreddyMalireddy
    @narendranathreddyMalireddy Месяц назад +4

    ప్రాణాలు లేచి వచ్చి నట్లు ఉంది ఈ వ్యాసం వింటుంటే!
    కాకపోతే ఆంగ్లభాష కూడా అవసరమే ఉదర పోషణకు

  • @shayangudipalli
    @shayangudipalli Месяц назад +2

    Maaku paatyaamsham ga vundindi svabhasha.

  • @Varma.b
    @Varma.b Месяц назад +1

    మాకు 10th లో తెలుగు లో పాఠం వుంది. నాన్కూపరేషన్ ఉద్యమం గురించి కూడా వుంది

  • @RajaRajeswari955
    @RajaRajeswari955 Месяц назад +1

    Chala baagundi, where can i get this book, pl let me know

  • @d.nagamani9711
    @d.nagamani9711 Месяц назад +1

    Mahammad gaari sameta gurunchi cheppagalaru....

  • @unique8831
    @unique8831 Месяц назад +1

    Maa 10 th class lo undi 2nd lesson.I am 2020 batch

  • @gamergirls546
    @gamergirls546 Месяц назад +1

    ❤❤❤❤

  • @AnjaneyaReddy-fk5kp
    @AnjaneyaReddy-fk5kp Месяц назад +1

    🇮🇳🙏👍

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 Месяц назад

    Where we can get in book form

  • @pbnmurthy3402
    @pbnmurthy3402 Месяц назад +4

    అయ్యా,
    మన అమ్మ భాష అయిన, తెలుగు లోనే వ్యాఖ్యలు చేసుకుంటే, బాగుంటుందేమో, ఆలోచన చేయగలరు.

  • @srinivasaraochikkala6197
    @srinivasaraochikkala6197 Месяц назад +1

    తెలుగు రచయితలలో పంచ సింహాలు అంటే ఎవరెవరు?

  • @LalithapeetamVizag
    @LalithapeetamVizag 23 дня назад

    దేశ భాషలందు తెలుగు లెస్స

  • @ThemallikaG
    @ThemallikaG Месяц назад

    బహుశా తెలుగు లో మాట్లాడితే తప్పులు అందరికీ తెలుస్తాయి, ఇంగ్లీషు లో అయితే తప్పులు ఎవ్వరికీ తెలియవని చచ్చు తెలివితేటలు ప్రదశించించాడేమో ఆ పెద్ద మనిషి అనిపించుకోవడుతున్న వ్యక్తి

  • @sandersdev
    @sandersdev Месяц назад

    Please mention in headlines that these videos got nothing to do with current Sakshi newspaper. Otherwise lot of people might just avoid it, won't view. These days people's attention span getting short, unless some detail given prominently right at the first look, it might not get the views it deserves, as the subject here belongs to 2 or 3 generations earlier.

  • @GuarCutivationAP
    @GuarCutivationAP Месяц назад +1

    1988 lo meemu chadivaam

  • @Varma.b
    @Varma.b Месяц назад +1

    కిచ కిచ లాడ లేని కోతి చూచినారా?

  • @yanamandravijayalakshmitha1639
    @yanamandravijayalakshmitha1639 Месяц назад

    Telugu rashtralao ammalantha vinali.

  • @dharma-vihari
    @dharma-vihari Месяц назад +1

    తెలుగు దేశమున బుట్టి,
    తెలుగువాడిగా పెరిగి,
    తెలుగు తప్ప అన్ని భాషలలో మాట్లాడే,
    పొరుగింటి పుల్లకూర గాళ్ళు,
    అమ్మ వద్దు, అత్త ముద్దు అనుకునే వాళ్ళు,
    సంభోగ సమయం లో కూడా, ఆంగ్లం మాట్లాడటమే ఆధునికం అనుకునే వాళ్ళూ,
    మాతృభాష లో,
    భావవ్యక్తీకరణ కు ఇష్టపడని వాళ్ళూ,
    'అమ్మ' ను ఆవమానించే వాళ్లే అన్నది నా అభిప్రాయం.
    మాతృభాషలో మాట్లాడటానికి ఇష్టపడని వాళ్ళ పై, పానుగంటి లక్ష్మినారసింహారావు గారు, వ్రాసిన, వ్యాసం ఇది.
    తప్పకుండా వినండి.
    ఆంగ్లం అనర్గళంగా మాట్లాడటం,
    ఆ భాష పై సాధికారతను సూచిస్తుంది.
    అంతే కానీ, ఆ వ్యక్తి యొక్క తెలివితేటలను, అవగాహనా శక్తి ని,
    విశ్లేషణా శక్తిని,
    జ్ఞాపక శక్తిని,
    వృత్తి పట్ల జ్ఞానాన్ని,
    పని సామర్ధ్యాన్ని,
    పాలనా సామర్ధ్యాన్ని,
    సూచించదు.
    అలా సూచించే కొలబద్ద కాదు.
    భాష ఏదైనా,
    ఆ భాషా పరిజ్ఞానం,
    ఆ వ్యక్తి తెలివిని, సామర్ధ్యాన్ని, సూచించదు.
    *-- ధర్మ విహారి గాంధీ*