తెలుగువారి దౌర్భాగ్యం తన భాషను వదిలి పరాయి భాష మీద మక్కువ పెంచుకునేదే కాకుండా మన భాషను తిట్టుకునేలా చేయటం ఇది ఏమి దౌర్భాగ్యమో తెలియదు మీలాంటి వాళ్లు తెలుగు గురించి కృషి చేస్తున్నారు చాలా అభినందనీయం.
1.భక్త కన్నప్ప చిత్రంలో మా రేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు అనే పాటలో మా రేడు అంటే మా రాజు అని అర్ధం మారేడు అంటే బిల్వ పత్రం అని ఇది యమకాలంకరం 2.సీతాకోకచిలుక చిత్రంలో చుక్కా నవ్వవే, నావకు చుక్కానవ్వవే ఇందులో మొదటి పాదంలో చుక్క అంటే నక్షత్రం లేదా తార ఇక రెండో పాదంలో చుక్కానవ్వవే అంటే చుక్కాని+అవ్వవే అంటే జీవితం అనే పడవకి తెడ్డు/చుక్కాని లాగా ఉండు అని అర్థం
మా ఱేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు ఈ వాక్యము లో మా ఱేడు ( రాజు-ప్రకృతి, ఱేడు-వికృతి ) అనగా మా రాజు వి లేదా మా ప్రభువు వి అని అర్ధం. రెండవ సారి వచ్చిన మారేడు అనగా వృక్ష జాతి కి సంబంధించిన పేరు. కాబట్టి ఇది యమకాలంకారమే.
చాలా చక్కగా వివరించారు... ఇలాంటి అలంకారాలు.. ప్రాసలు.. వీనులవిందుగా రాయడంలో మన తెలుగు కవులకు సాటి లేరు అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కానేకాదు... సప్తపది చిత్రంలో కూడా రేపల్లెయ యద జల్లున పొంగిన రవళి అనే పాట ఇలాంటి అలంకారాలతోనే ఉంటుంది...
1. బాహుబలి సినిమా పాట శివుని ఆనలో ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుందీ ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది ఎవ్వరూ కనంది ఎక్కడా వినంది శివుని ఆన అయిందేమో గంగ దరికి లింగమే కదిలొస్తానంది 2. గంగోత్రి సినిమా గంగా పాటలో గంగా... నిజంగా... నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా 3. లక్ష్మి సినిమాలో తారా తళుకుతారా 4. అర్జున్ సినిమాలో మధుర మధుర తర మీనాక్షి.......... ......వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా (ఒక అర్థం చిలక; పక్షి అని, మరో అర్థం చిలికించటం అని; చిలకరించు, ఇంకో అర్థం ఒక ప్రదేశంలో ఉండేదని, ఒక తీపి పదార్ధ విశేషము, ప్రసరించు, చిలకటం అని. ) 5. మా అన్నయ్య సినిమాలో మైనా ఏమైనావే మన్మథ మాసం 6. కబడ్డీ కబడ్డీ సినిమాలో కోకిల కోకిల కోకిల కిల కిల గల గల పాడగా
శ్రీ రామదాసు సినిమా లో ని ఒక పాట లో " ఏల రావు, ఏల రావు, నన్నేల ఏల రావు" అంటాడు. మొదటి రెండు ప్రశ్నలు, మూడవది "నన్ను ఏలడానికి ఎందుకు రావు" అని అర్థం వస్తుంది
Dear Sir, Jai Sri Ram ! Your explanation is Impressive. This is Interesting. This is Inspiring. Thank you very much for your great services. Wish You All The Best. Batenge Toh Katenge ! Ek Hain Toh Safe Hain ! Bharat Mata Ki Jai ! Jai Hind !
సప్తపది చిత్రంలో "వ్రేపల్లియ యెదఝల్లున పొంగిన రవళి.." ఈ పాటలో మొదటి చరణంలో కాళింది మడుగున కాళీయుని పడగలా.. ఆబాల గొపాల మా బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులతో ఆ బాల గోపాలము = ఆ గోప బాలుర సమూహము ఆ బాల గోపాలుని = ఆ చిన్ని కృష్ణుడిని, అచ్చెరువున = ఆ + చెరువున = ఆ నీటి మడుగున అచ్చెరువున విచ్చిన= ఆశ్చర్యముతో విచ్చుకున్న , రెండవ చరణంలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి ఆ రాధ= ఆ యొక్క "రాధ" ఆరాధనా గీతి = ఆరాధనా గీతము యమకాలంకారము
మీ ఛానల్ భలే ఉంది అండి...మీ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం గా ఉంది...మీ ఛానల్ లో ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి 🙏🙏🙏🙏🙏...మీకు మా నమస్కారములు 🙏🙏🙏🙏
కల వరించి కలవరించి కల వరించి కలవరించి ఇది కురుక్షేత్రం చిత్రం లోని మ్రోగింది కళ్యాణ వీణ పాట లోనిది. ఒకే అక్షర సమూహాన్ని రెండు రకాల ప్రయోగాల తో మంచి అర్థాన్ని స్పురింప చేశారు సినారె గారు
ఇలాంటివి ఉన్నాాయని తెలుసుగానీ వీటిని ఏమంటారో? పేరు తెలియరాలేదు, ఇప్పుడు మీ వల్ల తెలుసుకున్నాను, 🤗 ఇక్కడ మీరు చెప్పినవి మాత్రమే కాకుండ, ఇక్కడి వ్యాఖ్య విభాగంలో వ్యాఖ్యాతలు రాసినవి కూడా అన్నీ ఒక పుస్తకం లో రాసిపెట్టుకుని పిల్లలకు మన తెలుగు నుడి విశిష్టత తెలియజేస్తాను 🤗 నాకే తెలుగు భాష మీద నోరు ఊరిపోతోంది, ఉవ్విళూరుతోంది 🤤 మన తెలుగు భాష కు జేజేలు, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలుగువాడిగా పుట్టాను, తెలుగు భాష నా ఊపిరిగా నిలబెట్టుకున్నాను, మరిన్ని వీడియోలు కోసం ఎదురు చూస్తూ ఇట్లు మీ తెలుగు అభిమాని 🤗
@@monstergaminggg4998 నేను ఎప్పటి నుండో వింటున్నా, ఈ మధ్య శోభనాచల, పాటల విహారం ఛానెల్స్లో అన్ని రకాల లలిత గీతాలు, జానపద గీతాలు, కర్ణాటక సంగీతం అన్నీ వింటున్నాం, మరియు ప్రోటో తెలుగు పదాలు నేర్చుకుంటున్నాం, నెనరులు ( ధన్యవాదాలు ) 🙏🤗
సప్తపధి సినిమాలో "రెపల్లి న ఎద ఝాల్లున పొంగిన రవళి అనే పాటలో... కాలింది మడుగునా... కాళీయుని పండగల అనే చరణం లో కూడా... అచ్చెరువున, అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ అనే లైన్లో కూడా ఈ అలంకారమే వాడారు. మొదటి అచ్చెరువు అర్ధం " ఆశ్చర్యం " ఐతే, రెండో అచ్చెరువు ku అర్ధం " ఆ చెరువు " అని.. మనతెలుగు ఎంత గొప్పదో..
This is an excellent video. More of such content that shows the beauty of telugu language and the talent of our lyricists or writers please! Thanks for explaining it in a simple way so everyone can understand
అన్నమయ్య చిత్రం లో పద్మావతి దేవి వచ్చి ఏమిటలా పడిపోయావు ఆకలిగా ఉందా అని అడిగిన సంఘటనలో అన్నమయ్య ఇలా అంటాడు ఆకలి ఆ కలియుగా ప్రత్యక్ష దైవమైన పద్మావతి మనోనదున్ని దర్శించుకోవాలని ఆకలి. ఇందులో మొదటి ఆకలి అంటే తృష్ణ(hungry). రెండవ ఆ కలి అంటే ఆ కలియుగ యుగా దైవం ఐనా శ్రీ వేంకేశ్వరస్వామి అని. చివరి దర్శించుకోవాలని ఆకలి అంటే దర్శించుకోవాలని కోరిక. ఇది ఏ అలంగారం?
The entire dialogue scene is awesome write up. అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు .. జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరము లేదు నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కర లేదు .. సామి... ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం
చిత్రం : రుద్రవీణ పాట : తరలిరాద తనే వసంతం యమకం : ఏ కళకైనా..... ఏ కలకైనా.... జీవితరంగం వేదిక కాదా చిత్రం : సీతారామయ్య గారి మనవరాలు పాట : పూసింది పూసింది పున్నాగ యమకం : పట్టుకుంది నాపదమే నీ పదమే పారాణిగ తప్పులుంటే క్షమించమని ప్రార్ధన 🙏
Kurukshethram movie lo mrogindhi kalyana veena song lo… kala varinchi ,kalavarinchi ani vasthundhi. Modhati kalavarinchi ante kala kani ani ardham, rendava kala varinchi ante aa kala thanani varinchi ante dream fulfill ayyi ani ardham
అర్జున్ సినిమా లోనిది: ప్రతి వాక్యం లో చిలక కి అర్థం వేరు.. వరముల చిలకా స్వరముల చిలకా కరమున చిలక కలదానా హిమగిరి చిలకా శివగిరి చిలకా మమతలు చిలుకా దిగి రావా
ఎందరో పండితులు రకరకాల ప్రయత్నాలు చేసినా .. మీ శైలి నేటి తరానికి సౌలభ్యం..ఆసక్తి దాయకంగా ఉంది. మీ మంచి ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్ష🎉❤❤
తెలుగు భాష చాలా అద్భుతమైన భాష... తెలుగు కవులు చాలా తెలివైన వారు 🙏🙏🇮🇳🇮🇳
తెలుగువారి దౌర్భాగ్యం తన భాషను వదిలి పరాయి భాష మీద మక్కువ పెంచుకునేదే కాకుండా మన భాషను తిట్టుకునేలా చేయటం ఇది ఏమి దౌర్భాగ్యమో తెలియదు
మీలాంటి వాళ్లు తెలుగు గురించి కృషి చేస్తున్నారు చాలా అభినందనీయం.
మన భాష గురించి చేసే వీడియోలు చాలా అరుదు గా ఉంటాయి.......మీకు ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుంది!! ఇలాగే కొనసాగించండి ❤
చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నావ్ సోదరా !! నీకు అభినందనలు
1.భక్త కన్నప్ప చిత్రంలో మా రేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు అనే పాటలో మా రేడు అంటే మా రాజు అని అర్ధం మారేడు అంటే బిల్వ పత్రం అని ఇది యమకాలంకరం
2.సీతాకోకచిలుక చిత్రంలో చుక్కా నవ్వవే, నావకు చుక్కానవ్వవే ఇందులో మొదటి పాదంలో చుక్క అంటే నక్షత్రం లేదా తార ఇక రెండో పాదంలో చుక్కానవ్వవే అంటే చుక్కాని+అవ్వవే అంటే జీవితం అనే పడవకి తెడ్డు/చుక్కాని లాగా ఉండు అని అర్థం
👏👌👍🤗🙏
Super sir
మా ఱేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు
ఈ వాక్యము లో మా ఱేడు ( రాజు-ప్రకృతి, ఱేడు-వికృతి ) అనగా మా రాజు వి లేదా మా ప్రభువు వి అని అర్ధం. రెండవ సారి వచ్చిన మారేడు అనగా వృక్ష జాతి కి సంబంధించిన పేరు. కాబట్టి ఇది యమకాలంకారమే.
చాలా చక్కగా వివరించారు అండి ధన్యవాదాలు
చుక్కాని అంటే సముద్రము లో దిక్కులు తెలిపే నక్షత్రములు అందులో దృువనక్షత్రం
చాలా ఆసక్తితో చూసాను. ఇంత boring విషయాన్ని చాల చక్కగా చెప్పారు.
మన తెలుగు భాష చాలా గొప్పది.
మన భాషను మరువనని బాస చేసేవాళ్ళు 👍
చాలా చక్కగా వివరించారు... ఇలాంటి అలంకారాలు.. ప్రాసలు.. వీనులవిందుగా రాయడంలో మన తెలుగు కవులకు సాటి లేరు అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కానేకాదు... సప్తపది చిత్రంలో కూడా రేపల్లెయ యద జల్లున పొంగిన రవళి అనే పాట ఇలాంటి అలంకారాలతోనే ఉంటుంది...
ధన్యలం మేము నీవు చిన్న వాడైనను తెలుగులో ఇంత నేర్చుకోని మాకు తరువాతి తరాలకు ఉపయోగపడే విదంగా క్షుణ్ణంగా వివరించే నీ కృషికి మా ఆశీస్సులు.
తెలుగు వీర లేవర..❤️🙏🙏
చక్కగా చూపించారు 👍 ఇదే మన తెలుగు బాష ప్రత్యేక. 👏👌
దేశ భాషలందు తెలుగు లెస్స🔥
1. బాహుబలి సినిమా పాట శివుని ఆనలో
ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుందీ
ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది
ఎవ్వరూ కనంది
ఎక్కడా వినంది
శివుని ఆన అయిందేమో
గంగ దరికి లింగమే కదిలొస్తానంది
2. గంగోత్రి సినిమా గంగా పాటలో
గంగా... నిజంగా...
నువ్వే నాలో సగభాగంగా
నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా నాలో సగభాగంగా
3. లక్ష్మి సినిమాలో తారా తళుకుతారా
4. అర్జున్ సినిమాలో మధుర మధుర తర మీనాక్షి..........
......వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా
(ఒక అర్థం చిలక; పక్షి అని, మరో అర్థం చిలికించటం అని; చిలకరించు, ఇంకో అర్థం ఒక ప్రదేశంలో ఉండేదని, ఒక తీపి పదార్ధ విశేషము, ప్రసరించు, చిలకటం అని. )
5. మా అన్నయ్య సినిమాలో మైనా ఏమైనావే మన్మథ మాసం
6. కబడ్డీ కబడ్డీ సినిమాలో కోకిల కోకిల కోకిల కిల కిల గల గల పాడగా
Very good👍
1)ఐ లవ్ యూ ఓ హారిక
నీ ప్రేమకే జోహారిక (యమకం)
2)వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం (యమకం)
శ్రీ రామదాసు సినిమా లో ని ఒక పాట లో " ఏల రావు, ఏల రావు, నన్నేల ఏల రావు" అంటాడు. మొదటి రెండు ప్రశ్నలు, మూడవది "నన్ను ఏలడానికి ఎందుకు రావు" అని అర్థం వస్తుంది
Dear Sir,
Jai Sri Ram !
Your explanation is Impressive. This is Interesting. This is Inspiring.
Thank you very much for your great services.
Wish You All The Best.
Batenge Toh Katenge !
Ek Hain Toh Safe Hain !
Bharat Mata Ki Jai ! Jai Hind !
తొలిచూపు తోరణమాయే, తొలిచూపుతో రణ మాయే
తెలుగువీర లేవరా అన్నారుగా❤❤❤❤❤ లేస్తున్న లేస్తున్న మెల్లమెల్లగా❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂 మీరు మాత్రం ఎప్పుడూ ఇలానే లేపుతూ ఉండాలి సుమా😊
కల వరం, కలవరం :: మాత , జామాత వేటూరి గారి ఈ రెండు ప్రయోగాలు నాకు చటుక్కున గుర్తుకొచ్చాయి. మీ ప్రయత్నానికి 👏👏👏
అద్భుతం 🔥👌👌....ఇలాంటి ఒక అలంకారం ఉందని తెలియక ,అలా రాయడం ఒక talent అనుకున్న..
సప్తపది చిత్రంలో
"వ్రేపల్లియ యెదఝల్లున పొంగిన రవళి.." ఈ పాటలో మొదటి చరణంలో
కాళింది మడుగున కాళీయుని పడగలా.. ఆబాల గొపాల మా బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులతో
ఆ బాల గోపాలము = ఆ గోప బాలుర సమూహము
ఆ బాల గోపాలుని = ఆ చిన్ని కృష్ణుడిని,
అచ్చెరువున = ఆ + చెరువున = ఆ నీటి మడుగున
అచ్చెరువున విచ్చిన= ఆశ్చర్యముతో విచ్చుకున్న ,
రెండవ చరణంలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
ఆ రాధ= ఆ యొక్క "రాధ"
ఆరాధనా గీతి = ఆరాధనా గీతము
యమకాలంకారము
మీ ఛానల్ భలే ఉంది అండి...మీ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం గా ఉంది...మీ ఛానల్ లో ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి 🙏🙏🙏🙏🙏...మీకు మా నమస్కారములు 🙏🙏🙏🙏
కల వరించి కలవరించి
కల వరించి కలవరించి
ఇది కురుక్షేత్రం చిత్రం లోని మ్రోగింది కళ్యాణ వీణ పాట లోనిది.
ఒకే అక్షర సమూహాన్ని రెండు రకాల ప్రయోగాల తో మంచి అర్థాన్ని స్పురింప చేశారు సినారె గారు
"His story" is nothing short of a "History"
మంచి వీడియో సోదరా., అభినందనలు., మీ ఛానల్ చాలా బాగా ఉంది., తెలుగు భాష మీద మీ వీడియో లు బాగా ఉన్నాయి.,
సప్తపది చిత్రంలో "అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ"
ఆ చెరువున ఆశ్చర్యంతో చూస్తున్న కన్నులు అనే అర్థం...
శంకరాభరణం సినిమాలో- శంకరా.. పాటలో.. పరవశాన శిరసూగంగా… ధరకు జారెనె శివ గంగ
Anna meeku sathakoti vandanalu
అద్భుతం తమ్ముడూ. కొనసాగించు. ఎంతమంది లైక్ చేశారో షేర్ చేశారో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొన్నారో ఆ సంఖ్య కాదు, ఉన్న వాళ్లు అందరూ నిజమైన తెలుగు భారతీయులు.
అచ్చెరువునా...., అచ్చెరువున విచ్చిన కన్నుల జాడ....
ఆ బాలాగోపాలామా బాల గోపాలుని
మీ వివరణ మహా అద్భుతం, చాలా సరళమైన భాషలో స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పారు. మీ ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను. ఇట్లు తెలుగు భాషాభిమాని 🙏🫡
ఇది నీ దర్శనం ఇది నిదర్శనం
చాల చక్కగా వివరించారు
Jai Sri Ram
అబ్బా తెలుగులోని అద్భుతమైన ప్రాసల గురించి చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏
Well explained
జై తెలుగు వెలుగు
"భద్దరగిరి రామయ్య పాదాలు కడుగంగా
పరవళ్ళు తొక్కింది గోదారిగంగా"
సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని పాట
Bro చాలా బాగుంది.. ఈ అలంకారాలను మనం AI కి ట్రైనింగ్ చేయగలమేమో చూడండి అపుడు ఎప్పటికీ నిలిచి ఉంటాయి
చాలా బాగా చెప్పారు సోదరా ❤
wow chala anandhanga undhi ....idhi kadha maaku kavalsindhi. aina Telugu bhashalo unna magic ee veru ayya....
మీ కష్టానికి మీ కృషి కి ధన్యవాదాలు అన్నయ్య గారు
Khaleja climax lo
Rao ramesh dialogue untadi
Idi nee darshanam
Idi Nidarshanam ani super dialogue ❤
యమక అలంకారం:- ఒకే హల్లుల జంట అర్థ భేదం తో పదవిరుపులతో రావడం అన్న గారు
ఇలాంటివి ఉన్నాాయని తెలుసుగానీ వీటిని ఏమంటారో? పేరు తెలియరాలేదు, ఇప్పుడు మీ వల్ల తెలుసుకున్నాను, 🤗
ఇక్కడ మీరు చెప్పినవి మాత్రమే కాకుండ, ఇక్కడి వ్యాఖ్య విభాగంలో వ్యాఖ్యాతలు రాసినవి కూడా అన్నీ ఒక పుస్తకం లో రాసిపెట్టుకుని పిల్లలకు మన తెలుగు నుడి విశిష్టత తెలియజేస్తాను 🤗
నాకే తెలుగు భాష మీద నోరు ఊరిపోతోంది, ఉవ్విళూరుతోంది 🤤
మన తెలుగు భాష కు జేజేలు, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలుగువాడిగా పుట్టాను, తెలుగు భాష నా ఊపిరిగా నిలబెట్టుకున్నాను, మరిన్ని వీడియోలు కోసం ఎదురు చూస్తూ ఇట్లు మీ తెలుగు అభిమాని 🤗
ఇవే మాటలు భావన నావి కూడా. ధన్యవాదములు తెలుగు సముద్రనావికుడా
@malathikaramala6840 🤗
Mana paata telugu paatalu vinandi,avi poorthi telugutanam tho nundi vuntayi.
@@monstergaminggg4998 నేను ఎప్పటి నుండో వింటున్నా, ఈ మధ్య శోభనాచల, పాటల విహారం ఛానెల్స్లో అన్ని రకాల లలిత గీతాలు, జానపద గీతాలు, కర్ణాటక సంగీతం అన్నీ వింటున్నాం, మరియు ప్రోటో తెలుగు పదాలు నేర్చుకుంటున్నాం, నెనరులు ( ధన్యవాదాలు ) 🙏🤗
ఎప్పట్నుండో వింటున్నాను, ఆ మాధుర్యం ఆ సాహిత్యం ఎంత బావుంటుందో 🤤🥰🤗@@monstergaminggg4998
❤❤❤
సప్తపధి సినిమాలో "రెపల్లి న ఎద ఝాల్లున పొంగిన రవళి అనే పాటలో...
కాలింది మడుగునా... కాళీయుని పండగల అనే చరణం లో కూడా...
అచ్చెరువున, అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ అనే లైన్లో కూడా ఈ అలంకారమే వాడారు.
మొదటి అచ్చెరువు అర్ధం " ఆశ్చర్యం " ఐతే,
రెండో అచ్చెరువు ku అర్ధం " ఆ చెరువు " అని..
మనతెలుగు ఎంత గొప్పదో..
You are so young and your interest in reviewing and reviving Telugu is great
యమహా నగరి సాంగ్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యగలరా..?
ఆ పాట సాహిత్యం చాలా బాగుంటుంది
Instagram lo vundi chudandi.
link provide cheyagalara ?
Saptapadi movie song: "Repalliya yeda jallina muarli" .In this song Veturi wrote "Aabala gopalam Aa Baala gopaluni gani".
శంకరాభరణం చలనచిత్రంలో , శంకరా నాద శరీరాపరా అనే పాటలో
పరవశాన శిరసూ"గంగ" ధరకు జారెనా శివ"గంగ"
నా గానలహరి నువు మును"గంగ"
ఆనందవృష్టి నే తడవంగ
👌👌👌
This is an excellent video. More of such content that shows the beauty of telugu language and the talent of our lyricists or writers please!
Thanks for explaining it in a simple way so everyone can understand
అర్జున్ లో - మధుర మధుర తర మీనాక్షిలో అనేక చిలుకలు
మంచి వీడియో అందించినందుకు ధన్యవాదాలు మిత్రమా
Subscribed.... ఈరోజే చూశాను మీ ఛానల్... Nice one... Very good trial.. Bless you son !
చాలా బాగా వివరించారు ....
👌🙏👏
Super super super
చాలా బాగా చెప్పారు.
తెలుగు ❤
"ఈ కొమ్మని
ఏలుకొమ్మని"
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమాలో మన్మధుడే పాటలో వస్తుంది
చాలా మంచి వీడియో చేశారు.
Chala chakkaga vivarincharu... Miku Dhanyavadalu
Why there is no super thanks enabled on your videos? Could you please enable it. 🙏
Great research
Chala baga chestunnaru anna videos with nice examples
Excellent ❤
సోదరా! చాలా బాగా చెప్పావు.
అన్నమయ్య చిత్రం లో
పద్మావతి దేవి వచ్చి ఏమిటలా పడిపోయావు ఆకలిగా ఉందా అని అడిగిన సంఘటనలో
అన్నమయ్య ఇలా అంటాడు ఆకలి ఆ కలియుగా ప్రత్యక్ష దైవమైన పద్మావతి మనోనదున్ని దర్శించుకోవాలని ఆకలి.
ఇందులో మొదటి ఆకలి అంటే తృష్ణ(hungry).
రెండవ ఆ కలి అంటే ఆ కలియుగ యుగా దైవం ఐనా శ్రీ వేంకేశ్వరస్వామి అని.
చివరి దర్శించుకోవాలని ఆకలి అంటే దర్శించుకోవాలని కోరిక.
ఇది ఏ అలంగారం?
ఖలేజా సినిమాలో ఒక పాప పుట్టిన తర్వాత రావు రమేష్ మహేష్ బాబు తో చెప్పే మాట "ఇది నీ దర్శనం ఇది నిదర్శనం"
Waiting for this dialogue!!
The entire dialogue scene is awesome write up.
అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు .. జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరము లేదు
నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కర లేదు ..
సామి... ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం
1) Bharatha vedamuna song from pournami
Shivanivedanaga avani vedanaga
2) sharanu sharanu song fromShiridi sai
Prathi roopam thana prathiroopamani mrugalake mokshamichu mouni
ఇది నీ దర్శనం ఇది నిదర్శనం - Khlaeja movie
చిత్రం : రుద్రవీణ
పాట : తరలిరాద తనే వసంతం
యమకం : ఏ కళకైనా..... ఏ కలకైనా.... జీవితరంగం వేదిక కాదా
చిత్రం : సీతారామయ్య గారి మనవరాలు
పాట : పూసింది పూసింది పున్నాగ
యమకం : పట్టుకుంది నాపదమే నీ పదమే పారాణిగ
తప్పులుంటే క్షమించమని ప్రార్ధన 🙏
🙏🙏🙏🙏
జై శ్రీ రామ్....
Great work brok..
👍👍👍👌
Appreciate your efforts......thanks for sharing the knowledge
Kurukshethram movie lo mrogindhi kalyana veena song lo… kala varinchi ,kalavarinchi ani vasthundhi. Modhati kalavarinchi ante kala kani ani ardham, rendava kala varinchi ante aa kala thanani varinchi ante dream fulfill ayyi ani ardham
అర్జున్ సినిమా లోనిది: ప్రతి వాక్యం లో చిలక కి అర్థం వేరు..
వరముల చిలకా
స్వరముల చిలకా
కరమున చిలక కలదానా
హిమగిరి చిలకా
శివగిరి చిలకా
మమతలు చిలుకా
దిగి రావా
👌👌👌👌👌
super brother, this is right way to show the beauty of telugu to next generation 🎉
Thank you for every video nd every shorts nd every reel❤
Gangotri lo song.
Gangaa
Nee urukule raaGanga, naa gundelo moGanga
Sarigamalai saaGanga, madhurima lo munaGanga
Gangaa, nizangaa
Nuvve naalo saga bhaaGanga....
గంగోత్రి సినిమా లో..నీ ఊరుకులే రాగంగా..నా గుండెలు మోగంగా
నాదానివి నువ్వే నా దానివి - శివ రంజిని నవ రాగిణి పాట నుంచి.
మంచి వీడియో విద్యార్డులకు ఉపయుక్త ము
👏👌🙏
రా రా స్వామిరారా లో రా. రారా. రా అమ్మని అర్థం
నల్లానల్లాని కళ్ళ పిల్లా.... From sye movie
Good job. Keep it up
Super ga chepparu broh🙏
🙏🙏🙏
Baagaa chepparu. Oka chinna savarimpu. Adi kandarpa darpa bhangha . Kadarpa antee manmadhudu. Darpamu antee garvamu. Adi darbhamu kaadu darpamu
విద్యార్దు లకు చాల ఉపయుక్తం
Nice n easy explanation
సోదరా.. ఖలేజా సినిమాలో.. అది నీ దర్శనం, ఇది నిదర్శనం.. కూడా యమక అలంకారమే కదా
khaleja movie lo "idi nee darshanam--idi nidarshanam"
Instant subscription !!