Venkatagiri Kamalamma Gari Mysorepak | 100 Years Famous Sweet | Venkatagiri Food | Food Book

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • వైభవంగా విరాజిల్లిన వెంకటగిరి సంస్థానం ఘనత చరితలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది.ఇక్కడ ఉన్న రాజుల కాలం నాటి సౌదాలు వెంకటగిరి విశిష్టతను సాక్షాత్కరిస్తున్నాయి.రాజుల కాలం నుండి జరపబడుతున్న పోలేరమ్మ జాతర ఈ పుడమికి మకుటాయమానం.కమలమ్మ గారి మైసూర్ పాక్ ఆహార పరంగా,చీరలు వస్త్ర పరంగా వెంకటగిరికి కీర్తిని చేకూర్చాయి.
    ప్రాచీన నేపథ్యం గల ప్రసిద్ధి చెందిన తినుబండారం వెంకటగిరి కమలమ్మ గారి మైసూర్ పాక్ పోలేరమ్మ వారి గుడి ఎదురుగా ఉన్న బాబ్జి గారి చెంచులక్ష్మి కిరాణా దుకాణంలో లభిస్తుంది. సాధారణ మైసూర్ పాక్లకు ఈ మైసూర్ పాక్కి వ్యత్యాసం ఉంది.శనగ పిండి కాకుండా జీడిపప్పు మిశ్రమం వినియోగించడం విశేషం.ప్రధాన ముడి పదార్థానికి తోడు పంచదార,స్వచ్ఛమైన నెయ్యి ఉపయుక్తం కాబడి కలరూపు పొందిన మైసూర్ పాక్ని రుచి చూస్తే కమ్మని అమితమైన మధురంతో హిమము వలే కరిగి జిహ్వమ్ తనివి చెందుతుంది.కొన్ని దశాబ్దాల క్రితం కమలమ్మ గారు సొంత సూత్రీకరణలో ఈ పదార్థాన్ని తొలిసారి తయారు చేశారు.దరిమిలా పలువురుకీ తయారీ విధానం నేర్పారు.అలా నేర్చుకున్న వారిలో బాబ్జి గారి పూర్వికులు ఉన్నారు.తమ పెద్దల వద్ద తయారీలో శ్రేష్ఠత పొందిన బాబ్జి గారు సంప్రదాయ పద్ధతిలో రూపుదల్చుతూ మైసూర్ పాక్ మాధుర్యాన్ని అందరికీ పంచుతున్నారు.
    గూగుల్ లొకేషన్ :-
    g.co/kgs/r5zPX8
    గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Комментарии • 219

  • @mypicshots1611
    @mypicshots1611 7 дней назад +1

    అబ్బబ్బ ఎంత బాగుంటది ఆ స్వీట్...
    ఇప్పటికీ వెంకటగిరి ఎల్లినప్పుడల్ల 1కేజీ ఈ స్వీట్ లేనిదే తిరిగిరము ...
    అంత బాగుంటది ఇది..
    మా అమ్మమ్మ ఒళ్ళ ఊరు అని గొప్పగా చెప్పుకునేందుకు గర్వంగా ఉండాది...🎉❤

  • @Savarkar819
    @Savarkar819 Год назад +35

    బాబ్జీ గారి వినమ్రత గొప్పది. తల్లిదండ్రులను, ఈ మైసూరుపాకు సృష్ఠికర్త కమలమ్మ గారినీ జ్ఞాపకం చేసుకున్న కృతజ్ఞతాభావం గొప్పది. వారికి నమస్కారాలు.

  • @user-trade
    @user-trade 7 месяцев назад +13

    మాకు ఆ మైసూర్ పాక్ తినే అదృష్టం లేదు.
    కానీ అంతకంటే తియ్యనైన మీ ఇద్దరి అద్భుతమైన తెలుగు భాష,మర్యాదపూర్వకమైన సంభాషణ వినే భాగ్యం కలిగింది.

  • @si7418
    @si7418 Год назад +107

    1981 నుండి 1984 వరకు నేను వెంకటగిరి లో చదువు నిమిత్తం ఉండడం జరిగింది అప్పట్లో ప్రతి ఆదివారం సెలవు రోజు కమలమ్మ మైసూర్ పాక్ తింటూవుండడం జరిగింది రుచి చాలా చాలా అద్భుతం ఇన్ని రోజుల తర్వాత లోకనాద్ గారి వీడియో ద్వారా గత స్మృతుల లోకి వెళ్లడం జరిగింది లోకనాధ్ గారికి, బాబ్జి గారికి ధన్యవాదములు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад +7

      ధన్యవాదాలు అండి..మీ జ్ఞాపకాలను మాతో పంచుకున్నందుకు.

    • @kanakarajubeesetty8372
      @kanakarajubeesetty8372 Год назад +1

      Good memories

    • @nukalasrinivasarao1364
      @nukalasrinivasarao1364 Год назад +1

      😂

    • @suryateja2402
      @suryateja2402 8 месяцев назад +1

      మీరు అదృష్టవంతులు

    • @haricreations5067
      @haricreations5067 6 месяцев назад

      ఫోన్ నెంబర్ ఉందా సార్

  • @subbaraomadhvapathi8725
    @subbaraomadhvapathi8725 Год назад +39

    మీరు చాల స్వచ్చంగా నిజాయితిగా మాట్లాడారు ,మీకుభగవంతుని అనుగ్రహం సదావుంటాయి .

  • @prasadbolla4579
    @prasadbolla4579 7 месяцев назад +8

    మైసూర్ పాక్ కన్నా బాబ్జిగారి మాటలు చాల మాధుర్యంగా ఉన్నాయండి.🙏

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 Год назад +12

    సగటు మానవుడు ఎలా బతకాలో
    తెలియచెప్పే మంచి సందేశముు కూడిన వ్యాపార లక్షణములు ఇది గో ఎహెడ్.👍

  • @rambaburambabu3476
    @rambaburambabu3476 2 месяца назад

    Sir మీ తెలుగు ఉచ్చారణ ఎంతో బాగున్నది
    మంచి తెలుగు వర్డ్స్ మీ పాలకోవాని చుసినందుకు చాలా సంతోషం సార్
    మీ మర్యాద కు ధన్యవాదాలు

  • @boddusriramaprasad5894
    @boddusriramaprasad5894 Год назад +22

    పుట్టినరోజుశుభాకాంక్షలు లోక్ నాథ్ గారుమీరునిండునూరేళ్ళు ఆయురారోగ్యములతోఉండాలనిభగవంతుడినికోరుకుంటున్నాను మీమాటలమాధుర్యం చాలాబాగుంటుందిసార్ మీవీడియోకోసంఎదురుచూస్తాను సార్

  • @sampathreddy4115
    @sampathreddy4115 Год назад +18

    ముందుగా, ఇటువంటి మంచి వంటలు గురించి,వంట శాలలు నిర్వహించుచున్న వ్యక్తుల గురించి తెలియ చేస్తున్న లోక్ నాధ్ గారికి ధన్యవాదములు...
    కమలమ్మ గారి మైసూర్ పాకు గురించి, బాబ్జీ గారు చేసే విధానంగాని, బాబ్జీగారి మాటతీరు, ఆయన ఆలోచన తీరు,
    తను చేస్తున్న వంటకాన్ని ఇష్టంతో చేస్తున్న విధానం అభినందనీయం..... మీరు ఇలానే మంచి, మంచి వంటకాలు గురించి తెలిజేయాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నాను....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад +2

      అన్న.. హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @MaheswararaoNarne
    @MaheswararaoNarne 8 месяцев назад +7

    బాబీగారు అత్యంత గొప్ప ‌ సంస్కారి. ఆయనకు నా నమస్సులు.

  • @raomallikarjuna2520
    @raomallikarjuna2520 7 месяцев назад +1

    Rs. 500/- per KG of Kaju Mysore Pak with pure ghee and cashew powder ? Such low margins for hard work to make the sweet is really surprising. Mr. Babji Garu is really superb for your humbleness and eager to supply the best quality product. Hats Off.

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 7 месяцев назад +1

    మీ తెలుగు అద్భుతం మీ వివరణ అమోహం మిరుచూపే రుచులు మానోట రపించెను నీటివుటలు

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 5 месяцев назад

    Venkatagiri ante enno madhura smruthulu gurthukosthnnyi, maa piini garu, maa cousins (Suresh & Ramesh) vari pure affection and love, jeedi pappu mysorepak, kasi visveswaralayam, Rajah gari kota veedhi ila enno memories. Superb interview Lokanadh garu

  • @gopalakrishnapollali9337
    @gopalakrishnapollali9337 Год назад +4

    బాబ్జిగారి సంస్కారానికి వేయ్యి నమస్సులు.

  • @chandrasekhar7378
    @chandrasekhar7378 Год назад +1

    Maa chinnappati nundi ante 6th class to graduation varaku venkata giri lo vunnaanu. Appati nundi ee mysore pak ruchi telusu. Vudyogam teeyaga ekkadekkado vunnaa venkata gariki vellinappudu kachitamga kamalamma mysore pak koni ruchi choostunna. Recent gaa katharaku vellinappudu kooda vinnaanu . Ade taste no change . Super.

  • @nvkirankumar7062
    @nvkirankumar7062 Год назад +9

    Shop owner mindset awesome
    .so great personality

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 Год назад +1

    Adbhutamu Aina Kamalamma gari Mysore Pak and Great Sarees of Venkatagiri.....Famous things. 🙏🌹 Manchiga Video upload chesaru 🙏🌹 Eswari Venkat

  • @janardhanreddy766
    @janardhanreddy766 8 месяцев назад +8

    సోదరా..చాలా సంస్కారవంతమైన వ్యక్తులుతో కూడిన వీడియో చూస్తున్నా. చేసిన మీకు మరీ ముఖ్యంగా బాబ్జీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @narenderjt
    @narenderjt 6 месяцев назад +1

    ఒక చక్కటి ఇంటర్వ్యూ...చాలా బాగా చేసారు..🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkataprasad5026
    @venkataprasad5026 Год назад +4

    మా నాన్న గారు వెంకటగిరిలో ఉద్యోగ నిమిత్తం ఉన్న సందర్బంలొ తెస్తూ ఉండేవారు. చాలా రుచికరమైన మిటాయి.
    మీరు ప్రశ్నలు తెలుగులోనే అడగడం అద్భుతం..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      ధన్యవాదాలు వెంకట ప్రసాద్ గారు

  • @visheshmoningi4559
    @visheshmoningi4559 Год назад

    I am a foody and lived T VENKATAGIRI for 3 years and this is my 1st fav dish... i am from srikakulam but became a favorite of KAMALA Mysorepak

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 Год назад +6

    The person is so humble. Great to hear such simple words and very good.

  • @aparnagattupalli7071
    @aparnagattupalli7071 7 месяцев назад +1

    Anchor has a very nice telugu and telugu accent. Chala mandi ithanni choosi nerchukovacchu

  • @Saitalluri97
    @Saitalluri97 Год назад +2

    My all time favourite mysoore pak ....Plzz ndaru try cheyandi chala baguntadi...

  • @ajayaprabha
    @ajayaprabha 3 месяца назад

    ChakkaTi telugu mysorepak maadirE undi ! God bless you !

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 месяца назад

      ధన్యవాదాలు

  • @RajDinesh-v4w
    @RajDinesh-v4w 7 месяцев назад +1

    Babji garu.thanks you are so geat . You are selling reasonable price. God bless you. Long live.

  • @sureshchatriya1848
    @sureshchatriya1848 6 месяцев назад

    Amazing interview 😳👀
    Finally, literature conversation tied between the anchor and the guest.
    Both are winners.
    Babji sir is a true ambassador of Telugu custom and culture. 👌🥰🙏
    He said this sweet might extinct after him because his children had no interest.

  • @AshaBabji
    @AshaBabji Год назад +1

    1st time chustunnanandi me video.. chala manchi language use chestunnaru.. swatchhmina telugu lo interview.. chala bagundhandi..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      ధన్యవాదాలు అండి

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 Год назад +17

    వెంకటగిరి చీరలు ప్రసిద్ధి అని తెలుసు కాని ఇంత స్వచ్చమైన నేతిజీడిపప్పు మైసూరు పాక్ కి కూడా ప్రసిద్ది అని తెలియజేసినందుకు మీకు, ముఖ్యంగా వారికి, ఎంతో వినయంగా డాబు దర్పం లేకుండా ఎలామాట్లాడాలో ఇప్పటి తరం వారికి తెలిపినందుకు కృతజ్ఞతలు. 76.సం.ల వ్యక్తి అభిప్రాయం.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      ధన్యవాదాలు జగన్నాథరావు గారు

  • @syedmustafa867
    @syedmustafa867 7 месяцев назад

    One of the best mysore pak since 1990 i am eating this sweet when every i visit venkatagiri

  • @nvnysarma
    @nvnysarma 8 месяцев назад +3

    I tasted today with the help of friends, and it was so amazing. Thank you Babji garu

  • @sandhyaranianjuru211
    @sandhyaranianjuru211 8 месяцев назад +2

    Venkatagiri is my maternal grandmother 's place Since my childhood I cherished my childhood memories with venkatagiri One among them is KAMALAMMA MYSORE PAK It is known as with that only I have been eating since my childhood It's taste is indescribable if you eat Mann karta hai ki khate raho khate raho but with the fear of increased cholesterol and diabetes I put a check ayishtamgaa
    Ippatikii venkatagiri vellte Mysore Pak teesuku raakundaa ramu vellede Mysore Pak kosam sometimes back maacolleague tho teppincha colleague ki taste cheyinchadaniki maa kakinada Bangalore colleagues aa Mysore Pak taste ki fidaa
    Pl please do not stop the tradition of preparing Mysore Pak mee intlo varasatvam gaa kakapoyina ( vaallaki interest ledu kabatti) vere vallakaina nerpinchi konasaaginchandi pl adi venkatagiri JAATIYA SWEET

  • @Anonymous-m6f
    @Anonymous-m6f Год назад

    Sweets ishtapadevaru Venkatagiri darilo veltubte kanuka thappaka try cheylasina sweet idi.
    Sarigga gramadevatha gudi edurugga untundi.
    Ame asissulatho ilage vardhillalani korukuntunnamu.chakknti interview 👏

  • @sivakrishna7783
    @sivakrishna7783 6 месяцев назад

    Great... Highly committed for Quality. Money is no matter.

  • @venkateswarlupoondla
    @venkateswarlupoondla 8 месяцев назад

    As a Brooke Bond salesman I used to visit Venkatagiri on every Tuesday and regular buyer of Jeedi Pappu Mysorepak what great sweet it is very tasty 😋

  • @PoleboinaAnjaneyanaidu-xr1gr
    @PoleboinaAnjaneyanaidu-xr1gr Год назад +2

    లోక్ నాథ్ గారు నమస్కారం మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఎన్నో ఏళ్ల నాటి మైసూర్ పాక్ను ఈ చిత్రీకరణలో తెలియజేసినందుకు ధన్యవాదాలు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @swarnalatham4464
    @swarnalatham4464 7 месяцев назад

    Venkatagiri antecherale prasiddi ankunnam . Intha charkhkaga tayaru chesi chupincharu. Thanks andi Allthe best 😊🎉

  • @obulachettysreelekha1624
    @obulachettysreelekha1624 3 месяца назад

    Iam also from near venkatagiri i also studied there, this gidipappu Mysore pak very tasty

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Год назад +2

    చాలా చక్కగా మాట్లాడుతున్నారు

  • @chandramohanaraipottasiri8678
    @chandramohanaraipottasiri8678 Год назад

    ee rojullo ilanti business unnnru ante great sir..

  • @lakshminori7602
    @lakshminori7602 3 месяца назад

    Very nice

  • @nirmalapothani2589
    @nirmalapothani2589 Год назад +5

    Nothing can be compared with Venkatagiri Mysore Pam. It tastes soooo wonderful.
    no mysorepak can come close to Venkatagiri mysorepak in taste

  • @7homz930
    @7homz930 3 месяца назад

    Nijamandi memu venkatagi ki velithe e sweet thisukokunda memu ramu chala baguntundi

  • @saik4769
    @saik4769 Год назад +1

    Way of talking of shop owner nice

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 Год назад +2

    అద్బుతంగా ఉంటుంది

  • @mannavasreeramu7774
    @mannavasreeramu7774 3 месяца назад

    Very nice video sir
    Babji garu please make a video on how to prepare it step wise recipe
    Thank you very much

  • @subbuvaranasi2137
    @subbuvaranasi2137 Год назад

    Venkatagiri lo ipudu chala mandhi ammuthunnaru kani babji Anna chesina vidhanga yevaru cheyaleru aa Ruchi yevvari daggara undadhu kuda vere leval anthe😋

  • @bhaskardakarapu
    @bhaskardakarapu Год назад

    Thanks for your information ,we found new food our old redition food.

  • @dayanandamnalagatla3003
    @dayanandamnalagatla3003 Год назад +1

    Sir . Happy birthday.. sorry forgotten to wish you.. happy advance deepavali.. wishing from london

  • @lakshmanarao1532
    @lakshmanarao1532 Год назад

    Mee mata teeru maha adubutam.mee yukka samaskaraniki na namaskaramulu.

  • @vivekanandajampani7262
    @vivekanandajampani7262 3 месяца назад

    Supervedio

  • @harichitrarapu1248
    @harichitrarapu1248 Год назад +1

    Ippudunna media Lo Tegulu Pattina Telugu pokadalaku pokunda, Tene looru Telugu nu bratikistunnaduku Meeku danyavaadalu. 🙏👍🎉💐

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      ధన్యవాదాలు హరి గారు

  • @naveenkumargajula9374
    @naveenkumargajula9374 Год назад +4

    పుట్టిన రోజు శుభాకాంక్షలు సోదరా 🎉🎉🎉🎉

  • @Skjanardhan1780
    @Skjanardhan1780 Год назад

    Thayaru chese vidhanam chepithe bagundunu

  • @srikanthimandi1653
    @srikanthimandi1653 6 месяцев назад

    Great sir

  • @venkateshwarlumiryala1572
    @venkateshwarlumiryala1572 Год назад

    ప్రొద్దుటూరు పట్టణంలో కూడా నేతి మైసూర్ పాకు గొప్పదనం గూర్చి పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Год назад

    బాబ్జి గారికి నమస్కారాలు

  • @pavantammisetti7736
    @pavantammisetti7736 Год назад +1

    Shop owner good man

  • @balkishanbrahmanpally6246
    @balkishanbrahmanpally6246 Год назад +1

    Anchor and owner both are excellent.

  • @muthyalaramadevi
    @muthyalaramadevi Год назад

    Happy birthday Lokanath garu, manchi mittayi choopincharu, thank you very much

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      ధన్యవాదాలు రమాదేవి గారు

  • @yerripenchalaiah825
    @yerripenchalaiah825 Год назад +2

    Anna ofternoon ki antha ipothundhi

  • @Dr.krishnamohan
    @Dr.krishnamohan 7 месяцев назад

    Babji garu, mee nijayithi nachindi sir, entha edigina odigi undalani cheppakane chepthunnaru sir🙏

  • @dasthagirishaik5347
    @dasthagirishaik5347 Год назад +1

    Few days back ye ma nanna garu thecharu venkadagiri పోలేరమ్మ జాతర numdi chala bagundi every year జాతర ki velli konukuntam 😋😋😋supper untadi asalu

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 Год назад +3

    Very Good Job Andi 👏👍🙏

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад

    Nice heritage sweet of Venkata girl, Nellore

  • @ksatyanarayana3181
    @ksatyanarayana3181 Год назад

    Good nice.

  • @sumitharam8370
    @sumitharam8370 Год назад

    Swachamina telugu
    Janmadhayamindi. Mysore Pakistan Kante me telugu madhuramuga undi. Dhanyavadamulu.

  • @shaiksadik-xw6mf
    @shaiksadik-xw6mf Год назад +1

    Wish u meny more happy rituns of the day loknath garu and happy birth day food book nice channel

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      ధన్యవాదాలు సాధిక్ గారు

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 Год назад

    మీ వీడియో లు చాల బాగుంటాయు బ్రో

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      ధన్యవాదాలు సార్

  • @srinivasuluongole168
    @srinivasuluongole168 Год назад +2

    ఈ స్వీట్ ని ట్రాన్స్పోర్ట్ లో బాక్స్ ప్యాకింగ్ చేసే కన్నా స్టీల్ డబ్బాలో ప్యాక్ చేసి పంపిస్తే డ్యామేజ్ కాకుండా ఉంటుంది

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Год назад +3

    Happy Birthday to you sir 💐 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @bvsnarayana6758
    @bvsnarayana6758 Год назад

    లో క నా ద్ గారు మీరు తెలుగు చ క్క గ మాట్లాడుతున్నారు , నేటి anchors కు తెలుగు మరియు ఇంగ్లీష్ పదాలు ప్రయోగించడం తెలియడంలేదు, మీరు చక్కని తెలుగు ని ఉపయోగించి video నీ అందిస్తున్నారు. మీకు ధన్య వాదాలు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      హృదయ పూర్వక ధన్యవాదాలు నారాయణ గారు.

  • @dayanandamnalagatla3003
    @dayanandamnalagatla3003 Год назад +1

    Sir.. you are like Mysore Pak..

  • @mangalampetaananda7941
    @mangalampetaananda7941 8 месяцев назад

    Nice

  • @siripurapuhasini7628
    @siripurapuhasini7628 Год назад +1

    500 rs..kilo chaala thakkuva andi paapam..700rs ayithe chaala reasonable..

  • @indira4625
    @indira4625 Год назад

    Excellent 👑👌⭐️⭐️⭐️⭐️⭐️

  • @princevirat5718
    @princevirat5718 Год назад +1

    I love venkagiri

  • @venkataramana3744
    @venkataramana3744 8 месяцев назад

    Good News brother 😊

  • @paulsudhakarch7062
    @paulsudhakarch7062 Месяц назад

    ఎలా తయారు చేయాలో చెప్పలేదు సార్ .

  • @harishramaiah2503
    @harishramaiah2503 Год назад

    Inspiring story :)

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 Год назад

    Sir mee Voice Superrrrrrrrrrrr Sir

  • @hareesh22
    @hareesh22 8 месяцев назад

    Love from vgr ❤

  • @sindhupunnati
    @sindhupunnati Год назад

    Mee ucharana, voice, mata theeru vedio ke andam thechaie anna, super, vedio cheseppudu ingredients emi vestunnaro kuda metion cheiandi plz, sweet shop owner bgaaru kuda aa credit antha thane theskovali ane thapatream lekunda, chala unnathamga chepparu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @jayam1019
    @jayam1019 8 месяцев назад

    Great 🎉

  • @sriharipadarthi7489
    @sriharipadarthi7489 Год назад

    Both ar good

  • @venkateswararao8515
    @venkateswararao8515 Год назад

    Good

  • @annapurnajinkala5978
    @annapurnajinkala5978 8 месяцев назад

    Lokanath annayya next time maa venkatagiriki vaste inform cheyyandi kalustaamu maa family kamala mysore pak sweet kadu oka anubhooti annayya

  • @kondururadha4546
    @kondururadha4546 6 месяцев назад

    My nevitat place venkatagiri. Ganesh medical&Fancy.❤❤❤

  • @nageshwarahavalada8605
    @nageshwarahavalada8605 8 месяцев назад

    🎉anchor garu meeru mariyu babji gari mukhale chupi nchinaru yemi thayari cheuadam chupisthe mee thathagari sommemayina pothunda

  • @jonnalagaddaprakash2933
    @jonnalagaddaprakash2933 8 месяцев назад

    Super

  • @Harandh007
    @Harandh007 Год назад

    supper

  • @Vibes-p5y
    @Vibes-p5y 8 месяцев назад

    voice highlight

  • @kavipurapubalakrishna6246
    @kavipurapubalakrishna6246 Год назад

    Mysore Pak ఆర్డర్ తీసుకోని courier లో పంపుతారా

  • @dvrmurthy2155
    @dvrmurthy2155 6 месяцев назад

    Tayaru chasa vidanam Chappaladu🎉

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 Год назад

    👌👌👌

  • @pavansaireddy2925
    @pavansaireddy2925 Год назад

    ❤️vgr thank you sir 🙏 jai poleram thalli

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      ధన్యవాదాలు పవన్ సాయి రెడ్డి గారు

  • @sumanthreddyganugapenta2929
    @sumanthreddyganugapenta2929 Год назад

    heart warming video

  • @Chowdary1989
    @Chowdary1989 Год назад +1

    పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      ధన్యవాదాలు వాసు చౌదరి గారు

  • @bodapudisandya8751
    @bodapudisandya8751 6 месяцев назад

    ఇది ఈ మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలి