వేదములు, ఉపనిషత్తులలో ఏముంది? Vedamulu - Upanishads | Rajan PTSK | Ajagava

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • చతుర్వేదములు - దశోపనిషత్తులు
    సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.com కు email చెయ్యండి.
    అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.
    వేదము అనే మాట విద్ అనే ధాతువు నుండి పుట్టింది. ఏది తెలుసుకుంటే మరేదీ తెలుసుకోవలసిన అవసరము లేదో ఆ పరిపూర్ణజ్ఞానమే వేదము. ప్రత్యక్ష ప్రమాణం చేతకానీ లేదా తర్కంచేత కానీ తెలుసుకోలేనటువంటి బ్రహ్మపదార్థాన్ని ఎలా తెలుసుకోవాలో ఈ వేదం చెబుతుంది. ఈ వేదాలనే శ్రుతులు అని కూడా పిలుస్తారు. అలానే వేదములకు భాష్యం వ్రాసిన సాయణాచార్యులవారు.. “ప్రతీజీవీ తనకు ఇష్టమైనవి పొందడానికి, ఇష్టములేనివాటిని తొలగించుకోవడానికి, మంత్రజపాలు, హోమాలూ వంటి అలౌకికములైన ఉపాయాలను తెలియజేసేదే వేదము” అన్నారు. “అనంతా వై వేదాః” అన్న మాటను బట్టి ఈ వేదములు అనంతములు. అలానే ఇవి అపౌరుషేయములు. అంటే ఒకరిచేత వ్రాయబడినవో, పుట్టించబడినవో కావు. వేదములు సాక్షాత్తూ పరమాత్మయొక్క నిశ్వాసము. ఆ అనంతమైన వేదాలనుండి అతి కొద్ది భాగాన్నే మన మహర్షులు గ్రహించి లోకకల్యాణం కోసమై మానవాళికి అనుగ్రహించారు. వేదవ్యాసుల వారు ఆ కొద్దిపాటి వేదభాగాన్నే బుగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అనే పేర్లతో విభజించి మనకందించారు. ఈ ఋుగ్, యజుర్, సామ, అథర్వ వేదాలనూ, వాటి శాఖలనూ ప్రచారంలోకి తీసుకురావడానికి వాటిని వరుసగా తన శిష్యులైన పైలునికీ, వైశంపాయనునికీ, జైమినికీ, సుమంతునికీ అప్పగించాడు. పూర్వం ఈ నాలుగు వేదాలకూ కలిపి 1131 శాఖలు ఉండేవి. కానీ ఇప్పుడు వాటిలో కేవలం 7 శాఖలు మాత్రమే లభిస్తున్నాయి. అంటే మనకిప్పుడు లభిస్తున్న వేద విజ్ఞానం అసలులో ఒక్కశాతం కూడా కాదన్న మాట. ఈ వేదాలు మళ్ళీ మూడు భాగాలుగా ఉంటాయి. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము. వేదాల అంతరార్థాన్ని మంత్రాల రూపంలో చెప్పేవి సంహితలు. ఆ మంత్రాలలో ప్రతీ మాటకూ అర్థం చెప్పి, వాటిని యజ్ఞంలో సరైన రీతిలో వాడడానికి ఉపయోగపడేవి బ్రాహ్మణాలు. సంహితలోని మంత్రాలకు, బ్రాహ్మణాలలోని కర్మలకూ వెనుకనున్న అంతరార్థాన్ని వివవరించేవి అరణ్యకాలు. అంటే ఒక కర్మ ఎలా చెయ్యాలో అన్నదానికంటే కూడా అసలు ఆ కర్మ ఎందుకు చెయ్యాలి? అన్నదానినే.. ప్రధానంగా చెప్పేది అరణ్యకం. ఈ అరణ్యకాల చివరిలోనే ఉపనిషత్తులుంటాయి. వేదాలకు చివరిలో ఉండేవి కనుక వీటినే వేదాంతములు అని పిలుస్తారు. మొత్తంగా చూస్తే ఈ వేదాలను కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. సంహితలు, బ్రాహ్మణాలు కర్మకాండలోకి వస్తే.. ఉపనిషత్తులతో కూడిన అరణ్యకాలు జ్ఞానకాండలోనికి వస్తాయి.
    కర్మకాండను అధ్యయనం చేసిన జైమినీ మహర్షి.. వేదములలో కర్మకాండ భాగమే గొప్పదన్నాడు. ఆయన చేసిన ఆ కర్మకాండ విశ్లేషణకే పూర్వమీమాంస శాస్త్రమని పేరు. అలానే జ్ఞానకాండను విశ్లేషించిన వేదవ్యాసుడు అదే వేదముల సారమన్నాడు. దానికే ఉత్తరమీమాంస అని పేరు. ఉపనిషత్తులతో పాటూ, బ్రహ్మసూత్రములు, భగవద్గీత కూడా ఉత్తరమీమాంసలోకే వస్తాయి.
    వేదాల తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి యజ్ఞాలవంటి విధుల ద్వారా ఒక జీవనవిధానాన్ని చెబుతుంది కర్మకాండ. అలా చేయడం ద్వారా కొంతకాలానికి శరీరమూ, మనస్సూ శుద్ధి అవుతాయి. చిత్తశుద్ధి కలుగుతుంది. మన బుద్ధికి సత్యాన్ని గ్రహించే శక్తి లభిస్తుంది. అప్పుడు ఉపనిషత్తులను అధ్యయనం చేస్తే జీవాత్మ, పరమాత్మల అద్వైత స్థితి అనుభవంలోకి వస్తుంది. వేదముల పరమప్రయోజనం మానవుడు జీవన్ముక్తుడు అవ్వడమే, అంటే ఈలోకంలో ఉండగానే మోక్షాన్ని పొందడం. అప్పుడు మాత్రమే వేదాల సారమైన నాలుగు మహావాక్యాలు విశదమవుతాయి.
    ఇక ఇప్పుడు నాలుగు వేదాల గురించీ సంగ్రహంగా చెప్పుకుందాం.
    Rajan PTSK
    #RajanPTSK #Vedas #Upanishads #Ajagava

Комментарии • 455

  • @Ajagava
    @Ajagava  3 года назад +92

    సంహితలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు అని వేదములు మూడు భాగములుగా ఉంటాయి. ఈ వీడియోలో "ఆరణ్యకములు" అని పలుకవలసిన చోట "అరణ్యకములు" అని పలికాను. తప్పుగా ఉచ్చరించినందుకు మన్నించండి.

    • @harishatreya4669
      @harishatreya4669 3 года назад +23

      ఆరణ్యంలో.అభ్యసించిన.విద్య కాబట్టే ఆరణ్యకములన్నారు.అరణ్యకం అనడంలో దోషమేమీ లేదు. సరళంగా సామాన్యులకు సైతం.అర్థమయ్యే రీతిలో. బాగా.చెప్పారు
      మీ ప్రయత్నం. అభినందనీయమని భావిస్తున్నా

    • @vedapraveen5491
      @vedapraveen5491 3 года назад +8

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @mubeenaliali6640
      @mubeenaliali6640 3 года назад +1

      Sir vimanika sastrm book kavali dayachesi replay cheyandi plzzz dandam pedta sir plzz

    • @siddappam1165
      @siddappam1165 3 года назад +3

      and Gary chadhvalli asthma vidhya chalabagavundhi janmasartham dhanamu labhistundhi meeku na atmiya pranamamlu thanks

    • @challabangaruparthasarathy1575
      @challabangaruparthasarathy1575 3 года назад +1

      Hari oom

  • @vittalbandari6116
    @vittalbandari6116 3 года назад +14

    ఇంత మంచి గొప్ప జ్ఞానాన్ని మనం మర్చిపోతున్నామ్... ఇలాంటి మంచి జ్ఞానం మన హిందూ పెద్ద పెద్ద టెంపుల్స్ కి వచ్చే ఆదాయం తో ప్రతి ఒక్క హిందువులకి అర్థం చేయించే పని చేయొచ్చు గా మన దేవాదాయ శాఖ వారు. మనం దేవుడి కోసం వేసిన డబ్బు అన్య మతస్తుల పాలు, అనవసర ఖర్చులకి ఎందుకు ఉపయోగిస్తున్నారు.
    ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు అందించాలి గురువుగారు...
    వేదాలు ఉపనిషత్తుల గురించి చాలా చక్కగా అర్థం చేయించారు. ధన్యవాదాలు.

  • @veeracharinadikudi5824
    @veeracharinadikudi5824 11 месяцев назад +9

    ఇలా దివ్యంగా మంగళ కరంగా మీ దివ్యోపన్యాసం కొనసాగించాలని మనవి.నమస్సులు శ్రీ సత్యసాయి రాం.

  • @psranjaneyulu6502
    @psranjaneyulu6502 3 года назад +38

    వేదాలు, ఉపనిషత్తుల గురించి కనీస ప్రాథమిక విషయాలను అద్భుతమైన రీతిలో చక్కగా వివరించారు. శతాధిక నమస్సు లు.

  • @parameshwargundeti9859
    @parameshwargundeti9859 3 года назад +27

    గురువు గారు శక్తి వంచన లేకుండా మీవంతు ప్రయత్నం చేసారు....కృతజ్ఞతలు...

  • @gurappaallamsubbaiah7414
    @gurappaallamsubbaiah7414 10 месяцев назад +7

    రాజన్ గారు మీకు శ తా ధి క వందనాలు. ఎంతో వ్యయ ప్రయాసలకు లో నై తెలుగు జాతికి మీరు చేస్తున్న సేవ చిరస్మణీయమైనది. తెలుగు సాహిత్యం గురించి వేద వాంగ్మయం గురించి చదువుకున్న వారికే కాకుండా సామాన్యులకు అర్థమయ్యే జనసామాన్యానికి పంచుతున్నారు. ఇది తెలుగు జాతికి గొప్ప సేవ. తెలుగు జాతి మీకు రుణపడి ఉంటుంది. సామాన్యులకు అర్థమయ్యే విధంగా తెలుగు కావ్యాలను,పురాణాలను వేద వాఙ్మయాన్ని పరిచయం చేసిన తీరు చాలా బాగుంది. మీకు పదేపదే ధన్యవాదాలు తెలుపవలెననిపిస్తుంది. ఈ వాంగ్మయ సమారాధన వెనక మీ శ్రమ ఎంత ఉందో ఆర్థికంగా మీరు ఎంత భరిస్తున్నారు మేము voohinchukogalm. భగవంతుడు మీకు ఆయురారోగ్య లను ప్రసాదించుగాక. ఉడతా భక్తిగా చిన్న మొత్తాన్నీ rupees 3116 పంపుతున్నాను. దయచేసి స్వీకరించండి. అదేవిధంగా శ్రోతల అందరికీ నా విజ్ఞాపన. ఇతోధికంగ వారిని ప్రోత్సహించవలసిన ప్రార్థన. ఇంకా ఎంతో మిమ్మల్ని అభినందించ వలసి ఉంది. ఈ సంక్షిప్త సమాచారం లో అది ఇమడదు.

    • @Ajagava
      @Ajagava  10 месяцев назад +1

      మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదములండి

  • @raviprasadmasarla2160
    @raviprasadmasarla2160 3 года назад +19

    Ayya nenu oka christian ni ayyundi mee video ni like chesi aasantham purthiga vinnaanu , meeru vedhalanu , upanishatthulanu vivarinchina theeru chaalaa bagundhi kaka pothe ee video ki intha thakkuva likes ravadam Naku chala badha ga undhi , kaani meeru likes kosam e video cheyaledhani Naku telusu ekapothe meeru cheppinatuvanti ee vivarana chala samanya bhashalo andhariki ardhamayyetatlu chala vivaranga cheppadam chala nachhindhi . Meeku dhanyavaadamulu . Mukyanga e video ni marinthamandhi chusi like kotti meeku marintha protsaham kaliginchi meeru marinni videolu cheyadaniki dohadhapadatharani aasisthunnaanu .

    • @Krishnaveni-wl6rl
      @Krishnaveni-wl6rl 6 месяцев назад +3

      మీ లాగానే అందరూ అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 5 месяцев назад +1

      Meeru ardham chesukoni sanathanam loki raavaali ani maa korika

    • @vaenkatapadmavati9618
      @vaenkatapadmavati9618 2 месяца назад +1

      Ika late cheyakani sir, manadi sanatana dharmam, vochaiyandi talli lanti mana hindutvam ki.

    • @cvenkat7766
      @cvenkat7766 2 месяца назад

      మీరు అందరూ ఒకప్పుడు హిందువులే . ఏదో కారణాల వలన క్రైస్తవం పుచ్చు కున్నారు .సత్యం గ్రహించాలి .

  • @srinivasraolanka4139
    @srinivasraolanka4139 29 дней назад +1

    నేటి యువతకు బాగా వంటపట్టించు కొని తదనుగుణంగా మత ధర్మాలను కాపాడవలసిన బాధ్యత చాల ఉంది.

  • @gatramchinnichinni4642
    @gatramchinnichinni4642 3 года назад +17

    వేదాల గురించి సామాన్యులకు మాలాంటి వారికి అర్థం అయేలావివరించారు ధన్యవాదములు

  • @Saipurli
    @Saipurli 3 года назад +16

    సామాన్య ప్రజలకు సైతం అర్దం అయ్యే విధంగా క్లుప్తంగా చాలా చక్కగా వివరించారు.
    ధన్యవాదాలు 🙏

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 6 месяцев назад +4

    అద్భుతమైన వివరణ. ప్రతీ హిందువుకు వేదోపనిషత్తుల కనీస పరిజ్ఞానం అవసరం. అందుకే ప్రతీహిందువు యిది వినాల్సిందే. మీకు శతకోటి ధన్యవాదాలు .

  • @sivakrishna222
    @sivakrishna222 3 года назад +40

    నమస్కారం గురువు గారు...మీరు ఇచ్చిన విషయం సులభం గా వచన రూపం లో చదువు కొనేందుకు పుస్తకాన్ని..సూచించగలరు...మీకు శతకోటి ధన్యవాదాలు

  • @pannagaveni6371
    @pannagaveni6371 3 года назад +16

    వేదములు ఉపనిషత్తులు ఏ విషయాలు గురించి తెలుపుతాయి అని విశదీకరించి తెలియని మాకు ఈ విధముగా.తెలుసుకునే అవకాశము కలిగించినందుకు గురువుగారికి పాదాభివందనములతో ధన్యవాదములు🙏🙏🙏🙏

    • @boddusurya5710
      @boddusurya5710 3 года назад

      పాదాభివందనం, మాలాంటి సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో చెబుతున్నారు

  • @user-dg7do4jl4h
    @user-dg7do4jl4h 9 месяцев назад +4

    మీకు మా కృతజ్ఞతలు ప్రభు 🙏🙏🙏🙏 చాలా విషయాలను తెలుసుకున్నాము మీలాంటి మహాత్ములు ఎంతో టైమ్ నీ ఇస్తూ ఎన్నో విషయాలు అందరు తెలుసు కోవాలి అనే లక్ష్యం తో సంకల్పం తో చేసిన వీడియో ఇది మన పురాణాలూ ఉపనిష్యత్ లు తెలుసుకోవాలి అనే మాలాంటి వారికీ మంచి విషయాలు వివరణ చాలా బాగా చెప్పరు 🙏🙏🙏🙏

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 28 дней назад +1

    Rajan gari effort is most beneficial to the present generation's ignorance about the Vedas . it's a way of knowing about the greatness of our holy Scriptures

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 3 года назад +17

    చాలా చక్కగా, స్పష్టంగా ,చెప్పారు. కొండను అద్దంలో చూపారు

  • @sharmagub5433
    @sharmagub5433 29 дней назад +1

    Every literate Hindu should listen this
    Thank you sir

  • @ramachandrareddy3593
    @ramachandrareddy3593 3 года назад +8

    వేదాలుఉపనిషత్ ల మంచిఅవగాహన కల్పించారు ధన్యవాదాలు

  • @sriramayadavalli206
    @sriramayadavalli206 3 года назад +18

    నమస్కారం గురువుగారు. 🙏🕉️🙏
    చాలా స్పష్టముగా, నెమ్మదిగా, శ్రద్ధగా వేదములు మరియు ఉపనిషత్తుల గురించి తెలియచేసారు.
    🙏🕉️🙏

  • @chandrasekharpilla5447
    @chandrasekharpilla5447 3 года назад +22

    మంచి జ్ఞానాన్ని పంచుతున్న మీకు శతకోటి నమస్కారాలు గురువుగారు .

  • @k.b.prasad2529
    @k.b.prasad2529 Год назад +2

    వేదాల గురించి మీ వివరణ , మా అదృష్టం కొలది విన్నాము .?అనేక ధన్యవాదములు . వేదాల గురించి, సంక్షిప్త వివరాలు ఈ విధముగా తెలిపినందుకు అనేక నమస్కృతులు . అక్షరాబ్యాసం లాంటి మీ వివరణ ద్వారా వేదాలను , సాహిత్యాన్ని మేము చదువుకొనగలితే , అది మా అదృష్టం ఆవుతుంది . 🙏

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 3 года назад +28

    చాలా బాగా వివరించారు. ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. 🙏

  • @harrshasuri1035
    @harrshasuri1035 3 года назад +13

    చాలా అద్భుతంగా ఈ పరిజ్ఞానాన్ని అందించిన మీ కృపకు కష్టమునకు మా వందనములు 🙏

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 3 года назад +17

    గురువు గారు మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు..

  • @ramasaimathrumandali1154
    @ramasaimathrumandali1154 Год назад +4

    ఉపనిషత్తుల గురించి బాగా వివరించారు అండి మేము ఉపనిషత్తులు మా గురువుగారి దగ్గర నేర్చుకుంటున్నాము

  • @dwarakakrishna.v344
    @dwarakakrishna.v344 9 месяцев назад +3

    వేదోపనిషత్తుల వివరణ చాలా చక్కగా విశదంగా ఉంది. మీకు అభినందనలు.

  • @parvathidevikala6126
    @parvathidevikala6126 3 года назад +6

    Sir తెలియని చాలా విషయాలు క్లుప్తంగా వివరించారు ఇలాంటి మన దేశ సంస్కృతి ముందు తరం వారికి మీ ద్వారా అందుతుందని ఆశిస్తున్నాను ఇలాంటి యెన్నో videos చేసి మాకు మరింత సమాచారం అందించాలని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mylavarapulakshminarasimha3431
    @mylavarapulakshminarasimha3431 Год назад +6

    రాజన్ మహాశయులకు శుభాభినందనలు సామాన్యులకు కూడా సదవగాహన కల్పిస్తున్న మీ ప్రసంగాలు స్ఫూర్తి దాయకాలు, పరమాచార్యులవారి దివ్యానుగ్రహం ఈ సత్సంగ ప్రక్రియలో మిమ్మల్ని పురోగమింపజేయుగాక

  • @gangadhararao7134
    @gangadhararao7134 2 года назад +7

    చాలా చక్కగా స్తూలంగా వివరించారు. ధన్యవాదములు. ఉపనిషత్తులగురించి ఇంకా సవివరంగా వినాలని మా కోరిక.

  • @kameswarrao4200
    @kameswarrao4200 3 года назад +11

    గురువు గారికి నమస్కార చాల మంచి విషయాలు.మర్రిన్ని విషయాలు చేపుతర్రాణి ఆశిస్తున్నాను.

  • @user-ih4ef4vl7j
    @user-ih4ef4vl7j 3 года назад +8

    నమస్తే ధన్యవాదములు స్వామీజీ

  • @pobbatigovindappa729
    @pobbatigovindappa729 10 месяцев назад +3

    మీ ప్రయత్నము ఉన్నతమైనది. నమస్కారములు.

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 3 года назад +7

    గురువుగారికి నమస్కారములు 🙏 ప్రస్తుతం దేశం, కాలం, మాన పరిస్థితులలో వితండవాదులు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సామాన్య హిందువు బాధపడుతున్నారు. సప్రమాణంగా మీరు అందించిన ఈ వీడియో ఎందరికో మార్గదర్శకంగా నిలిచింది. ధన్యవాదములు తెలుపుతూ 🙏🙏

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 года назад +8

    నమస్కారం గురువర్యా🙏
    మీరు వేదాలూ ఉపనిషత్తులను
    చాలా బాగా వివరించారు.
    నా శక్త్యానుసారం కొంతవరకు
    అర్దం చేసుకున్నాను.
    ధన్యవాదాలు గురుదేవా🙏

  • @uravakondakummarayerriswam6708
    @uravakondakummarayerriswam6708 7 месяцев назад +1

    ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం నమో భగవతే శ్రీ రమణా య మీరు చెప్తుంటే మొత్తం మీరు చెప్పింది అంతా బుర్రలోకి ఎక్కిపోయింది అన్న అంత సంతృప్తి కలిగింది. మీకు చాలా చాలా ధన్యవాదాలు అన్న

  • @mohansaritha6092
    @mohansaritha6092 3 года назад +12

    Now only I became a Hindu. Thanks for this real education.

  • @saradadevikalavacherla4318
    @saradadevikalavacherla4318 3 года назад +13

    మీకు శతకోటి వందనాలు.🙏🙏🙏

  • @adivijavagdevi4613
    @adivijavagdevi4613 Год назад +3

    మన సంస్కృతిని రక్షించేందుకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మీరు సర్వదా శుభమే కలగాలని కోరుకుంటున్నాము.

  • @padmarajaprreddy7804
    @padmarajaprreddy7804 Год назад +1

    శతకోటి నమస్కారాలు మీకు వేదాలు, ఉపనిషత్తుల గురించి కనీస ప్రాథమిక విషయాలను అద్భుతమైన రీతిలో చక్కగా వివరించారు ధన్యవాదములు.

  • @dewpoint1637
    @dewpoint1637 3 года назад +16

    ఉపనిషత్తులు గురించి చాలా చక్కగా చెప్పారు ఇవి పిల్లలకు పాటాలలో చేర్చి నేర్పితే చాలా బాగుంటుంది క్రీస్టీయన్ స్కూల్ ఉన్నట్లు బ్రాహ్మణ స్కూల్ ఉంటే బాగుంటుంది

    • @ramamuruthyrevoori8255
      @ramamuruthyrevoori8255 3 года назад +3

      Vedha patashala llani bramana schools ee kadha sir

    • @dhebbatasanthosh3140
      @dhebbatasanthosh3140 3 года назад +2

      Brammana school kadhu, hindhu school

    • @marketingsm5192
      @marketingsm5192 3 года назад

      Good but veda school

    • @cvenkat7766
      @cvenkat7766 2 месяца назад

      అలాంటి స్కూల్ పెడితే మన దేశం లోని సెక్యులర్ మేధావులు మిన్ను విరిగి మీద పడినట్లు రాద్ధాంతం చేస్తారు . అయినా పెట్టాల్సినవి హిందూ పాఠశాలలు , బ్రాహ్మణ పాఠశాలలు కాదు . వేదాలు , ఉపనిషత్తులు అందరివీ . ఎవరి సొంత సొత్తు కాదు .

  • @chandaluris
    @chandaluris 2 года назад +1

    వేదములకు, ఉపనిషత్తులకు ఉన్న అర్థాన్ని ఒక చెట్టుతో పోల్చి చాలా తేలికగా అర్థమయేలా చెప్పారు. ప్రతి ఉపనిషత్ దేని గురించి చెపుతుందనే విషయంతో నాకు చాలా రిలీఫ్ వచ్చి, ఒక అవగాహన వచ్చింది.
    మాకు చాలా చాలా కృతజ్ఞతలు.
    మీ పుట్టుక కారణం స్పష్టమైతోంది. మీరు కారణజన్ములు గా నేను భావిస్తున్నాను. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @narasimharao8841
    @narasimharao8841 3 года назад +8

    అద్భుత వివరణ. నమస్కారము.

  • @purushottamasastrydivakaru7107
    @purushottamasastrydivakaru7107 3 года назад +23

    This type of videos are required for the present generation to know about
    Hinduisum. Such more videos are requested at frequent interwals so that people can realise the importnace of Vedas and upanishads.

  • @ramalingeswararao-j8y
    @ramalingeswararao-j8y 3 месяца назад

    మీరు సంక్షిప్తంగా overview ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన సాహిత్యం (తెలుగు), ఆధ్యాత్మికం, culture గురించి చాలా మంది గొప్పగా చెప్తుంటారేకాని అసలెందుకు మనం మన culture గొప్పదని అందులో అసలేముందని తెలుసు కాకుండా మాట్లాడడం వలన చులకనైపోతాము, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే యువత. వారు గొప్పగా చెప్పుకునేందుకు వీలుగా ఒక వీడియో చేస్తే బాగుంటుంది.
    Rao, Mumbai.

  • @raoba4109
    @raoba4109 3 года назад +10

    ధన్యోస్మి...

  • @ddraju888
    @ddraju888 3 года назад +8

    సహస్ర నమస్సుమాంజలి గురువుగారూ...

  • @vishnu5822
    @vishnu5822 Год назад +2

    Meeku na namakaralu🙏🙏🙏 entha clear ga chepinandhuku meku na yoka dhanyavadhalu🙏🙏🙏

  • @srinivaspattisapu8587
    @srinivaspattisapu8587 3 года назад +13

    I am grateful for your valuable service to help us to understand and try to reach god in right paths.

  • @KondalaRaoAdapa-dm7ci
    @KondalaRaoAdapa-dm7ci 3 месяца назад +1

    Meeru mahanu bhavulu.
    Meeku padhabhi vandanalu....

  • @abttvpolitics7094
    @abttvpolitics7094 3 года назад +2

    ధన్యవాదములు
    ఇలాంటి వీడియోలు మరిన్ని చేయ ప్రార్థన

  • @vigneshp8027
    @vigneshp8027 3 года назад +3

    Dhanyosmi Dhanyosmi Dhanyosmi 🙏🙏🙏

  • @Blackliliek4p
    @Blackliliek4p 3 года назад +4

    Adbhutham guruvugaru 🙏

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 3 года назад +6

    చాలా చక్కగా చెప్పారు చెప్పే విషయాలు చాలా గొప్పగా ఉంది

  • @saradadevikalavacherla4318
    @saradadevikalavacherla4318 3 года назад +9

    అద్భుతమైన వివరణ.🙏🙏🙏🙏🙏🙏🙏👏

  • @madhu13madhu20
    @madhu13madhu20 Год назад +1

    Chala bagundhi mi vyakyanam, vishleshana & vivarana

  • @nsreekanth7252
    @nsreekanth7252 3 года назад +20

    నమస్కారం గురువు గారు 18 పురాణాలు గురించి క్లుప్తంగా వివరించగలరు అని నేను ఆశిస్తున్నాను వచ్చే వీడియోలో చెప్పగలరు కోరుకొంటున్నాను ధన్యవాదాలు

  • @ramakrishnandadibhatla
    @ramakrishnandadibhatla 4 месяца назад +1

    చాలా బాగుంది మీ వివరణ వేదవేదాంగాలను గురించి.

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 года назад +10

    నమస్తే ఓం శ్రీం సనాతనం 🚩🌹👏

  • @saivadlamudi7077
    @saivadlamudi7077 3 года назад +10

    Sri you are giving a good information
    Some of children doesn't know about this type of info it is very useful to this జనరేషన్

  • @ramakrishnaakella907
    @ramakrishnaakella907 Год назад +1

    Wonderful job PTSK bless u

  • @nagabhushana1150
    @nagabhushana1150 3 года назад +8

    Brief and lucid introduction to vedas. Great video. Pranam.

  • @lalithathota8316
    @lalithathota8316 27 дней назад +1

    ధన్యవాదాలు గురువు గారు

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 Год назад +1

    Sree Rajangaru your analysis is very high, namesthe

  • @srinivasrao960
    @srinivasrao960 23 дня назад +2

    Thank you.sir you have given every thing in nutshell

  • @srivatsavsri5789
    @srivatsavsri5789 3 года назад +5

    చాల ధన్యవాదములు🙏

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 3 года назад +4

    Munduga guruvugarki 🙏 namsakaram

  • @entertainmentmasala5670
    @entertainmentmasala5670 2 года назад +2

    రాజన్ గారు మీకు శత కోటి వందనాలు, ఈ వీడియో ల కోసం చేస్తున్న మీ పరిశ్రమ అనిర్వచనీయం. వీడియో description లో పుస్తకాలు లభించే వివరాలను పొందుపరిచిన చదువరులు సంతోషించెదారని మా యొక్క మనవి. 🙏

  • @pvbnmurty
    @pvbnmurty Год назад +1

    గురువు గారు... చాలా బాగా, చాలా సులభరీతిలో వివరించారు... అనేకానేక ధన్యవాదములు... మీ కృషి శ్లాఘనీయము... ఈ వీడియోను కనీసం 20,30 సార్లు శ్రద్ధతో విని, మీరు సూచించిన పుస్తకాలలో రెండు, మూడింటిని కొన్ని సార్లు అయినా చదివితే ఈ విషయం మీద మరి కొంత ప్రాధమిక అవగాహన వస్తుందని నమ్ముతున్నాను... తప్పక ప్రయత్నిస్తాను... మీకు మరో మారు ధన్యవాదములు, నమస్కారములు... 🙏🙏🙏

  • @jayanthilakshmi5973
    @jayanthilakshmi5973 Год назад +1

    Meeprayathanam
    Amogham Dhanyavadamulu.❤

  • @akhileshd7695
    @akhileshd7695 3 года назад +1

    Dhanyosmi Dhanyosmi Dhanyosmi gurudev. Dhanyavadah mahodaya.

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Месяц назад

    ధన్యవాదములు గురువు గారు 🙏🙏

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 3 года назад +3

    వేదములు గురించిన వివరణ చాలా బావుంది...🙏

  • @TheGeeyes
    @TheGeeyes Месяц назад +1

    THANK YOU FOR SHARING. GREAT INFORMATION FOR HUMANS. WE APPRECIATE YOUR EFFORTS

  • @reddymolakala6493
    @reddymolakala6493 3 года назад +4

    Namaste swamy ur given amazing knowledge about our Vedhas I am very thankful in my life and govinda always blessing you jai hind

  • @prabhakarmurthy6805
    @prabhakarmurthy6805 Год назад +1

    Spiritual knowledge pmurthy

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Год назад +1

    ఓం శ్రీ గుుభ్యోన్నమః మీ వివరణ అద్భుతం ధన్య వాదములు

  • @GiriNaidu
    @GiriNaidu 3 года назад +4

    Well explained guruji. We need people like you who are dedicated to share knowledge about our Sanatana Dharma.!! Watching from USA. Really I got all answers to my questions.!!

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 месяцев назад

    Vedalaku Upanishuttulaku adbhutamina vivarana cheppinaru.Guruvu gariki Padabhi Vandanamulu..

  • @bvkrishnamurthy6887
    @bvkrishnamurthy6887 2 месяца назад

    Chala baga bagaexplain chasers. May God bless you with peace security and happiness and prosperity. I attend the classes of swami Paramardananda thank u so much Mrs krishnamurthy

  • @pdamarnath3942
    @pdamarnath3942 Год назад +1

    Thank you very much. GREAT

  • @bhupathidev6266
    @bhupathidev6266 3 года назад +1

    వేదాలను,ఉపనిషత్తులు ను గురుంచి వివరించారు. సం స్కృతా నికి లిపి లేదు అనికొం దరు విమశిస్తున్నారు. ఆలిపిని కుడాతెలియజేయగలరు. అలాగే ఒకొక్కవేదం ఏమిచెపుతుందో వివరించగలరు జైశ్రీరాం.

    • @phanirag
      @phanirag 3 года назад +1

      Devanaagari lipi

  • @mmksarma1907
    @mmksarma1907 Год назад

    చాలా సూక్ష్మ ముగా వేదముల పట్ల అవగాహన కల్పించి నందుకు కృతజ్ఞతలు.

  • @shrimanenterprises6068
    @shrimanenterprises6068 2 года назад +1

    Nicely briefed about our Vedas and Upanishads. Every Hindu mist know these. Frankly, I had no idea on Upanishads before watching this .
    Thankful to you Acharya.

  • @venkateshmurthynutheti1112
    @venkateshmurthynutheti1112 3 года назад +2

    Guruvugariki pranamamulu. Vedala gurinchi thelipinanduku dhanyavadamulu. Marinni vishayamulu thelupavalasindiga prarthana 🙏🙏🙏

  • @spmdm9764
    @spmdm9764 3 года назад +2

    Very good vedeo,thanks... L. Subbi Reddy,

  • @krivison
    @krivison Год назад +1

    మీ ప్రయత్నం...సఫలం..,సుఫలం..,మరియు..మిగుల అభినందనీయం గురువు గారూ. ఓం.. శాంతి.. శాంతి.. శాంతి:

  • @salmasyedsalma786
    @salmasyedsalma786 Год назад +1

    Great

  • @r.venkateswararaorao4757
    @r.venkateswararaorao4757 3 месяца назад

    ధన్యవాదములు 🙏

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 8 месяцев назад

    Sir, please continue to bless us with such good informative and knowledgeable more such videos. Sanathana dharmanni kaapaadandi

  • @tbhaskarreddy
    @tbhaskarreddy 3 года назад +3

    Thanks for your valuable information

  • @taddiappalaswamy
    @taddiappalaswamy 23 дня назад +1

    వేదములు.ఉపనీషత్తులగూర్చినేటీయువతురవకూపాఠ్యంగాఛేరిప

  • @user-iv7wz1bu8v
    @user-iv7wz1bu8v Год назад

    నాలుగు వేదాలు 10 ఉపనిషత్తులు గురించి సంక్షిప్త వివరణ చేశారు. వేద వాంగ్మయం, ఆర్ష సాహిత్యం ప్రచురించి జ్ఞాన పిపాసులయిన పాఠకులకు అందజేసే ఆయా ప్రచురణకర్తల ప్రయాస అభినందనీయం. కానీ పుస్తక పఠనాసక్తి, సంస్కృతి తగ్గిపోయింది. క్రమంగా లుప్తమై పోయే అవకాశం ఉంది.కనీసం ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మీడియా ద్వారానైనా ప్రచారం కొనసాగిస్తే కొంతమందైనా ఆసక్తి కలవారు మన సనాతన ధర్మం, సంస్కృతి మరియు వాని ఔన్నత్యం తెలుసుకుంటారు. దానికి వారసులు అయినందుకు గర్విస్తా రు. ఇలాంటి చానల్స్ ఈలాంటి పరిచయాత్మక, సంక్షిప్త ప్రాసంగికులకు, నా వినమ్ర నమస్సుమాంజలి. .. వెగ్గలం సత్యనారాయణ, కరీంనగర్.

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 3 года назад +4

    బాగుంది

  • @suryamsurampudi8745
    @suryamsurampudi8745 3 года назад +1

    చక్కటి వివరణ ఇచ్చారు ధన్యోస్మి గురూజీ...

  • @VenuGopal-vd8gi
    @VenuGopal-vd8gi Год назад +1

    ❤ no words to say guruvu garu....adhbhutham sir...

  • @mallelapadmavathi350
    @mallelapadmavathi350 11 месяцев назад

    chaalaa santhosham meeru vupanishathula jnanaanni suukshmam gaa andinchaaruu , 🙏🙏🙏

  • @renukadevi7247
    @renukadevi7247 3 года назад +2

    చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు.

  • @movie1skr
    @movie1skr 3 года назад +2

    Namaskaramulu Guruvugaaru 🙏, thank you for the authentic information

  • @akuladurgaprasad3152
    @akuladurgaprasad3152 3 года назад +1

    మాకు తెలియని విషయాలు తెలిపారు... మీకు ధన్యవాదాలు

  • @rockyvlogs3399
    @rockyvlogs3399 3 года назад +2

    ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏