PM Modi Congratulated Team India | On Wining Of T20 World Cup | టీమ్‌ ఇండియాను అభినందించిన ప్రధాని

Поделиться
HTML-код
  • Опубликовано: 3 июл 2024
  • టీ20 ప్రపంచకప్ ను గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యులు...... ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆటగాళ్లు అందరూ ప్రత్యేక బస్సుల్లో.. పటిష్ట భద్రత మధ్య ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ప్రధాని నివాసంలో....... జట్టు సభ్యులు అల్పాహారం చేశారు.
    ఉత్కంఠ భరిత పోరులో ప్రపంచ విజేతలుగా నిలిచిన జట్టును...... ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. జట్టు సభ్యులను పేరుపేరునా పలకరించారు. వారితో... ఎంతో సరదాగా సంభాషించారు. ఆటగాళ్లు తమ అనుభవాలను మోదీతో పంచుకున్నారు. ఈసందర్భంగా
    టీ20 ప్రపంచకప్ ను పట్టుకుని జట్టు సభ్యులతో కలిసి.......... ప్రధాని గ్రూప్ ఫోటో దిగారు.17 ఏళ్ల సుధీర్ఘ విరామానికి తెరదించుతూ దక్షిణాఫ్రికాపై విజయంతో...... భారత జట్టు టీ20 ప్రపంచకప్ ను కైవసం చేసుకుంది.బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్ లోనే నిలిచిపోయిన భారత జట్టు సభ్యులు.... ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ఈ ఉదయం 6 గంటలకు
    న్యూదిల్లీ చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన అభిమానులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో....... భారత జట్టు సభ్యులకు ఘన స్వాగతం పలికారు. అభిమానులకు వందనం చేసుకుంటూ....... ఆటగాళ్లంతా రెండు ప్రత్యేక బస్సుల్లో దిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్ కు చేరుకున్నారు. అక్కడ కూడా అభిమానులు... జట్టు సభ్యులకు ఘన స్వాగతం పలికారు. టీమిండియా కోసం ఐటీసీ మౌర్య యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లతో స్వాగతం పలికింది. టీ20 ప్రపంచకప్ నమూనాలో తయారు చేసిన కేక్ ను..విరాట్ కోహ్లీ కట్ చేశాడు. ద్రవిడ్ , రోహిత్ సైతం కేక్ ను కట్ చేశారు. అభిమానుల సందడి తర్వాత.. ప్రత్యేక బస్సుల్లో
    లోక్ కల్యాణ్ మార్గ్ లోని.... ప్రధాని నివాసానికి వెళ్లారు. దాదాపు 2 గంటలు చాంపియన్లు
    ప్రధాని నివాసంలోనే ఉన్నారు. తర్వాత నేరుగా విమానాశ్రయం చేరుకున్న భారత జట్టు సభ్యులు ముంబయికి పయనమయ్యారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 1

  • @jss758
    @jss758 19 часов назад +1

    భారత క్రికెట్ టీం కి జై