వేదముల యొక్క సంక్షిప్త చరిత్ర || A brief history of the Vedas || Project SHIVOHAM

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2021
  • వేదభూమి - ఇది భారతదేశం యొక్క పేరు. ఈ డాక్యుమెంటరీలో, మేము భారతదేశం యొక్క అన్ని పురాతన గ్రంథాలను వివరించాము.
    Twitter: / projectshivoham
    Insta: / projectshivoham
  • НаукаНаука

Комментарии • 2,2 тыс.

  • @deevigowrisankar4475
    @deevigowrisankar4475 2 года назад +442

    అయ్యా! నమస్కారం, ఇది చూశాక మనసుకి ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రాచీన జ్ఞాన సంపదను నేటి తరం కోల్పోతున్నది, ఈ ఉపద్రవం నుండి కాపాడాలని ఆ భగవంతుడు మిమ్ములను ఇందుకు నియమించాడు . మీ కృషి శ్లాఘనీయం .. ఈ కార్యం నిర్విఘ్నం గా కొనసాగాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నాను, ధన్యవాదములు.

    • @radhakrishnaa9561
      @radhakrishnaa9561 2 года назад +10

      Very much knowledgeable and a very great service,sir
      Thanks.

    • @venkataramarao6788
      @venkataramarao6788 2 года назад +7

      Excellent

    • @vinni5497
      @vinni5497 2 года назад

      @@radhakrishnaa9561 వీడు పెద్ద దొంగ అ వీడు హిందూ మతం పేరు చెప్పి చాలా డబ్బులు వసూలు చేశాడు అని చెప్పి పోలీస్స్టేషన్లో కరాటే కళ్యాణి అనే సినిమా యాక్టర్స్ నిన్ననే పోలీస్ కేసు పెట్టింది

    • @bhagavatulavenkatanarayana3713
      @bhagavatulavenkatanarayana3713 2 года назад +11

      @@vinni5497 నీవు రాసిన కామెంటు ని బట్టి నాకు అర్థం అవుతుందిఏమిటంటే, నీకు అర్థం చేసుకొని కెపాసిటీ లేదన్నది కరాటే కళ్యాణి కేసు పెట్టినది కరుణాకర్ సుగుణ పైన. ఈ ప్రాజెక్టు శివోహం వ్యక్తి వేరు. కరాటే కళ్యాణి ఈర్ష్యతో కేసు పెట్టింది కానీ దాన్ని కూడా నిరూపించలేక పోయింది. పైన పేర్కొన్న వ్యక్తులందరూ తమ పూర్తి పేరును ఇచ్చారు కానీ నీవు నీ పేరును సరిగ్గా ప్రకటించలేదు దీనికి కారణం నువ్వు ఒక దొంగ వ్యక్తివి.

    • @wavesoflife2906
      @wavesoflife2906 2 года назад

      Puranalu manaki ekkada labhisthayo cheppagalara anyone please

  • @janakiramayyakoka5082
    @janakiramayyakoka5082 Год назад +49

    మిత్రమా పురాతన విజ్ఞానమును వెలికితీసి
    ప్రస్తుత కాలంలో అందుబాటు లోనికి అందునా తెలుగు భాషలో అందజేసిన
    అందరికిని ధన్యవాదములు.🙏

  • @lhsilhs1512
    @lhsilhs1512 2 года назад +41

    అయ్య బాబోయ్...ఇంత నిశితంగా గా అధ్యయనం చేసి ఒక పునాది వేసి ఒక సమగ్రమైన విషయ సూచీ తయారు చేశారు..అద్భుతం అమోఘం..మీ యొక్క నిబద్దత, కృషి శ్లాఘనీయం.

  • @Rajaaofficialthoughts
    @Rajaaofficialthoughts Год назад +29

    సనాతన భారతీయ హిందూ ధర్మాన్ని ప్రపంచానికి నేటి నవ యువ భారతీయులకు తమ ములల్లో ఉన్న అమోఘమైన జ్ఞానాన్ని వివారిస్తునందుకు ధన్యవాదములు...🙏🙏

  • @samratkadiyam4071
    @samratkadiyam4071 2 года назад +663

    సోదరా! తెలుగులో కూడా ప్రారంభించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఇది 10 కోట్ల తెలుగు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. చాలా సంతోషంగా ఉంది.

  • @MadhusudhanKekelathur
    @MadhusudhanKekelathur 2 года назад +28

    మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను, అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను …🙏

  • @martheenbalusu9187
    @martheenbalusu9187 2 года назад +3

    అవగాహన లేని అంధకార అజ్ఞానులకు ఎంతో అందంగా వివరించినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు

  • @nrm2511
    @nrm2511 2 года назад +51

    శ్రీ గురుభ్యోన్నమః, మీరు చేసే ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన ప్రతీ ఒక్కరికీ పాదాభివందనాలు
    మీరు మా యందు దయవుంచి కొద్ది కొద్దిగా సంస్కృత (samskrit) పరిజ్ఞానాన్ని అందించే ప్రత్నం చేయగలరని ప్రాధన

  • @BePractical9
    @BePractical9 2 года назад +110

    🙏నమస్కారం! చాలా సంతోషంగా ఉంది. అందరికీ అర్థమయ్యేలా వేద విజ్ఞానాన్ని, వేదం యొక్క విశిష్టతను అందిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు🙏

  • @vamshibolte7
    @vamshibolte7 2 года назад +36

    తెలుగు బాగా మాట్లాడారు అన్న 👌
    జై శ్రీరామ్ 🚩🙏

  • @rajulucbg7220
    @rajulucbg7220 2 года назад +2

    🙏🙏,మనస్ఫూర్తి గా కృతజ్ఞతాభి వంద నములు . ఇలా తెలుసుకోవటం చాలా ఆనందం గా వుంది. అధ్భుతమైన మీ పూర్తి వివరణ కు 🙏.
    రికార్డ్ చేయటం జరిగింది. పూర్తి గా తమరు పుస్తకం గా రూపొందించిన యెడల ,తెలియ జేయకోరడ మైనది.
    దన్య వాదములు

  • @lalithadevarakonda9077
    @lalithadevarakonda9077 2 года назад +1

    మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ పరిశోధన, పరిశోధనాత్మక విశ్లేషణ ,వివరణ అన్నీ.అద్భుతంగా ఉన్నాయి .అన్నీ ,అన్నీ వేదాల్లోనే ఉన్నాయి అన్న సత్యం తిరిగి విశదీకరించబడింది సంస్కృత భాష యొక్క అవసరం కూడా ....మీరు చేయబోయే మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటాం

  • @sarathp3257
    @sarathp3257 2 года назад +65

    తెలుగులో అనువధించి ప్రసారం చేస్తున్నందుకు మీకు(Sivoham YC) ధన్యవాధములు.

  • @achantaaishwarya7362
    @achantaaishwarya7362 2 года назад +74

    Wow... చాలా చాలా చక్కగా చెప్పారు.. సరస్వతి దేవి ఆశీస్సులు మీ మీద ఉండడం వలనే మీ ఈ ప్రయత్నం ఇంత మందికి ఉపయోగపడుతుంది...

  • @AVVARIVENKAT1959
    @AVVARIVENKAT1959 2 года назад +5

    వేదముల గురించి అందరికీ అర్థమగునట్లుగా చాలా ఓపికగా చక్కని వివరణ ఇచ్చుచున్నటువంటి పెద్దలకు అనేక నమస్కారములు.

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 2 года назад +6

    వేదాల గురించి చాలా అర్థవంతమైన వివరణ చేసినందుకు దేవుని కృప మీకు కలగాలని కోరుకుంటున్నాను, మీ అమ్మ నాన్నలకు మా కృతజ్ఞతలు, ఓం నమఃశివాయ

  • @rudramohan5258
    @rudramohan5258 2 года назад +33

    కేవలం 35 నిముషాలలో, మన దేశ ఆధ్యాత్మిక సంపద గురించి, అన్ని అపోహల గురించి అందరికీ అర్థం అయ్యేలా, చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏
    మీ ప్రయత్నం సఫలం కావాలని ఆశిస్తూ

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 2 года назад +27

    ఓం శ్రీ సాయిరాం
    ఓం అరుణాచల శివ
    మీకు శత కోటి వందనాలు
    నాకు మరియు మన భారతీయుల కు మీరు చేసిన ఈ విడియో లో మనలను మరింత మన చరిత్ర ను తెలుసుకోవడం చాలా అవసరం

  • @rohitkrishna7071
    @rohitkrishna7071 2 года назад +3

    అమూల్య మైన సమాచారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 2 года назад +9

    *అద్భుతమైన మీ పరిశోధనా శక్తికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను!!!లోక క్షేమం కోసం మీ తపన భగవంతుడి దయాఅమృత వర్షముగా మారి మీ మీద కురుస్తుంది!!!🙏🙏🙏*

  • @bharathiyasanathanam7181
    @bharathiyasanathanam7181 2 года назад +55

    Project Shivoham తరఫున తెలుగులో వీడియోలు విడుదల చేసినందుకు ధన్యవాదాములు.

  • @psudheersharma
    @psudheersharma 2 года назад +26

    భారతీయ సంస్కృతి మరియు సనాతన ధర్మ పునరుద్ధరణకు మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ప్రశంసనీయం. నేను మీ videos అన్నిటినీ English లో చూసాను. ఇప్పుడు తెలుగు లో అందుబాటలోకి రావడం వల్ల అందరకీ తప్పక ఉపయోగ పడతాయి. ఏ విధమైన సహాయం కావాలన్న చెప్పగలరు. నా వంతు సహాయంగా చేయగలను.
    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @AnnaiahSannidhi
    @AnnaiahSannidhi 2 года назад +6

    పలుకు పలికించు, చెప్పు చెప్పించు, బ్రతుకు బ్రతికించు అన్న రీతిలో సాగిన వేదాధ్యాయన పరిశీలనకు మీకు ధన్యవాదములు, అభినందనలు....!!

  • @kvpadmaja8843
    @kvpadmaja8843 2 года назад +5

    మీ యీ ప్రయత్నానికి , నా హృదపూర్వక నమస్కారం🙏

  • @vivekvishwa7276
    @vivekvishwa7276 2 года назад +17

    No doubt,project shivoham అతి శీఘ్రం గా, దేశ0లో ఒక పెద్ద మార్పును త్యావపో తుంది,....yes corporate వలయం వదిలేసి మళ్ళీ organic firming కి వస్తున్నారు, మన గ్రంథాల పైన ఒక కొత్త నమ్మకం ధైర్యం ఏర్పడింది,...praject shivoham ఇంకా గొప్ప నిర్ణయాలు తీసుకోవాలి,... ఇదీ మీ పాదాల మీద పది వేడుకుంటూ ఉన్నాను

  • @syamtolety7969
    @syamtolety7969 2 года назад +64

    🙏🙏🙏🙏🙏తెలుగులో వేద వింగ్నాన్ని అందిస్తున్నందుకు మీకు తెలుగు ప్రజలు ఎంతో ఋణపడి వుంటారు 🙏🙏🙏🙏🙏

    • @yadaiahvallapu8332
      @yadaiahvallapu8332 2 года назад +2

      Om nama shivaya

    • @sujathatulasi2109
      @sujathatulasi2109 2 года назад

      ధన్యవాదాలు మి ఇ సంకల్పం నికి భగవాన్ సహకారం ఉండుగాక

  • @kudupudikrishna1282
    @kudupudikrishna1282 2 года назад +2

    మీలా ఇంత వివరంగా నేటితరానికి తెలియజేయటానికి మీరుచేస్తున్న ఈ ప్రయత్నానికి పాదాభివందనాలు

  • @krishnamohang3059
    @krishnamohang3059 Год назад +3

    మన విజ్ఞాన సంపద ఎంత పురాతనమైనదో, ఎంత గొప్పదో చాలా చక్కగా విశదీకరించినందుకు చాలా ధన్యవాదాలు

  • @RHSR
    @RHSR 2 года назад +76

    ఎన్నో ఏళ్లుగా నా అన్వేషణ ఫలించింది, నేను 1వ తరగతి నుండి 10 వ తరగతి వరకు అభ్యసించిన 10 సంవత్సరాలు,గడిచిన 30 సంవత్సరాల మొత్తం 40 సంవత్సరాల నిరీక్షణ
    "నాకు ఒక గురువు దొరికారు"
    "ఓం గురుభ్యోన్నమః"🙏🙏🙏

    • @rahukethutemplenizamabad4680
      @rahukethutemplenizamabad4680 Год назад +3

      భగవంతుడు మీకు ఆయుర్భాగ్యన్నిచి, కాపాడాలి. మన పురాతన సంసృతి జనులందరికి అర్ధమయ్యేలా చాలా చక్కగా చెపుతున్నారు. వేదమాత ను అర్ధం చేసుకోలేని వారికి చక్కగా చెపుతున్నారు. కృష్ణమూర్తి, సన్నిధి. నిజామాబాదు, తెలంగాణ.

    • @narsingraojangalanarsing6286
      @narsingraojangalanarsing6286 6 месяцев назад

      Nilanti Guru Garu yah Kala Nike tappakunda undali Bhagwat

    • @vasanthidarisi9117
      @vasanthidarisi9117 6 месяцев назад

      ​@@rahukethutemplenizamabad4680and

  • @anirudhachakri4295
    @anirudhachakri4295 2 года назад +143

    I loved your videos in fluent English
    But the vibes are different and hearty when you speak in your mother tongue
    Much love and much respect🙏🙏❤️

  • @haibhanu
    @haibhanu 2 года назад +6

    చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు.. ఎన్నో లోతుల్ని స్పృశించిన భారతీయ విజ్ఞానాన్ని .. ఇలా వీడియోస్ రూపంలో తీసుకువచ్చి.. మరింత ఎక్కువ మందికి చేరువ అయ్యే విధంగా చేసినా మీ ప్రయత్నానికి శతకోటి వందనాలు..🙏🙏🙏🙏🙏

  • @anandakumarbudi3668
    @anandakumarbudi3668 2 года назад +3

    ఎంత బాగా, అర్థమయ్యేలా చెప్పారో, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, దేవుడే మీ ద్వారా మాకు ఇలా తెలుసు కోవటానికి అవకాశము ఇచ్చాడు 🙏🙏👋

  • @trinadharaomaddila662
    @trinadharaomaddila662 2 года назад +109

    ఓం నమో నారాయణాయ
    🙏🙏🙏🙏🙏🙏🙏
    మీ వివరణ, ప్రతీ సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో ఉంది.
    చదువుకున్న వారి నుండి చదువులేని వారికి కూడా చాలా చక్కగా అర్థమవుతుంది.
    మన సంస్కృతి, మన సంప్రదాయాలను మనమే
    విలువ నిచ్చే పాటించి, సంరక్షించాలి.
    శివోహం టీంకి ధన్యవాదములు.
    🙏🙏🙏🙏🙏🙏🙏
    జై హింద్.

    • @venkatalakshmimarni6967
      @venkatalakshmimarni6967 2 года назад +3

      ధ న్య వా ద ము లు సా ర్

    • @rajyasriketavarapu7757
      @rajyasriketavarapu7757 Год назад +1

      చాలా చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి వేదాల గురించి నిజంగా ఇది నేను మా పిల్లలందరికీ కూడా యంగ్ స్టార్స్ కె ముఖ్యంగా పంపిస్తున్నాను చాలా బాగుంది మొత్తం అంతా కూడా ఒక అరిచేతిలో పెట్టినంత ఈజీగా వేదాల గురించి చెప్పారు చాలా చాలా సంతోషం ఉంది ధన్యవాదాలు

    • @subhashinigudepu4609
      @subhashinigudepu4609 8 месяцев назад +1

      Book ekkada dorukuthundhi sir

    • @sreenivasulupathakamuri8514
      @sreenivasulupathakamuri8514 6 месяцев назад

      Ok.desaniki anny langiwageslokimarchi andinchandi.

  • @badarinathguptakota4458
    @badarinathguptakota4458 2 года назад +62

    జై సనాతన ధర్మం !!
    జై జై వైదిక ధర్మం !!

  • @Vishwambhara
    @Vishwambhara 2 года назад +1

    మీరు చేసే ప్రతి వీడియో తెలుగులో అప్ లోడ్ చేస్తానని చెప్పినపుడు చాలా సంతోషం కలిగింది. వీలయినంత త్వరగా చేయాలని ప్రాధేయపడుతున్నాను...

  • @rukmangadharaokoppala2725
    @rukmangadharaokoppala2725 Год назад +1

    మనస్పూర్తి గా నమస్కారం Sir మీ లాంటి వారు మన ఇతిహాసాలను అత్యంత విపులంగా వివరించి ప్రపంచానికి తెలియ చేసారు మెరన్నట్లు మన సంస్కృత భాష మీద మనవాళ్లకు పట్టులెకపొవడమే

  • @prasannakumar4414
    @prasannakumar4414 2 года назад +8

    అబ్బా, ఎంత బాగా అద్భుతంగా చెప్పారండి, ఎంతో విశేషంగా విశ్లేషించి, అందరికీ అర్థం అయ్యేట్టు చెప్పారు. ఎన్ని రోజులు శ్రమించారో, ఎంతగా ఆలోచించి చేశారో, అభినంద నీయులు. మీ ఈ యజ్ఞానికి పాదాభివందనాలు.👌👌👌

  • @vamshibolte7
    @vamshibolte7 2 года назад +103

    మీ వివరణ చాలా సహజంగా ఉంది.
    Hatsoff for your work towards Bharath and Dharma

    • @manoharkandukoori264
      @manoharkandukoori264 2 года назад

      గ్రామ దేవతల గురించి తెలియచెయండి

  • @padmarajaprreddy7804
    @padmarajaprreddy7804 Год назад +3

    నేటి తరం కోల్పోతున్నది,, ఇది చూశాక మనసుకి ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రాచీన జ్ఞాన సంపదను కాపాడాలని ఆ భగవంతుడు మనస్పూర్తిగా కొరుకుంటున్నాను, ధన్యవాదములు.

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 2 года назад +1

    ఆర్యా , మీకు శత శత శత ప్రణామాలు , చాలా చాలా చాలా గొప్ప గా ఉన్నది ఈ భాగం మన సంప్రదాయం , సంస్కృతి గురించి మన పురాణాలు గురించి మన పురాతన చదువు గురించి , మనము మరచి పోయిన , మనలను మన చదువులను మరచి పొయెట్ట్ చేసిన ప్రయత్నాలు . మీ కృషికి ధన్యవాదాలు . మీ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మన సంప్రదాయం , సంస్కృతి బ్రతికి ఉన్నది . జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హిందూ ధర్మం జై భారత్ మాతా వందేమాతరం .

  • @vivekreddy601
    @vivekreddy601 2 года назад +6

    తెలుగు లో ప్రేక్షకులకు ఈ ఙ్ఞానాన్ని ప్రసాదించినందుకు నా క్రుతజ్ఞతలు

  • @takini4918
    @takini4918 2 года назад +61

    I don't understand Telugu. I am here to just hear him talk in Telugu 😅. Such a beautiful language ❤️

    • @Kakarot_369
      @Kakarot_369 2 года назад +8

      Thanks for viewing

    • @samratkadiyam4071
      @samratkadiyam4071 2 года назад +3

      Your mothertongue?

    • @takini4918
      @takini4918 2 года назад +6

      @@samratkadiyam4071 I am Marathi 🧡

    • @samratkadiyam4071
      @samratkadiyam4071 2 года назад +17

      @@takini4918Marathi too is very beautiful language. I heard it many times on TV. Balasaheb jee is my inspiration. He was a Hindu Lion. Our Bhaarat misses him very much.

    • @quantumconsciousness-theac4205
      @quantumconsciousness-theac4205 2 года назад +1

      Can you please post the same in english

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 Год назад +2

    చాలా మంచి కార్యక్రమం చేపట్టారు, ధన్యవాదములు. భవంతుడు తప్పక సహాయం చేస్తాడు. అనేక అభినందనలు.
    సర్వే జీవా సుఖినోభవంతు.

  • @ravindersairam
    @ravindersairam 7 месяцев назад +2

    గురువు గారికి నమస్కారములు ..
    మేము చాలా అదృష్టవంతులం
    అసలు వేదముల గురించి
    ఏ మాత్రము కూడా తెలియని వారికి మీరు అద్భుతముగా అర్థమయ్యేటట్లుగా
    వీడియోలు పెట్టి వేద విజ్ఞానాన్ని
    సమాజానికి అందిస్తూ ఉన్నారు .
    మీకు మా యొక్క
    ప్రత్యేక నమస్సుమాంజలులు
    మీయొక్క సంకల్పములు అన్నీ
    నెరవేరి లోక కళ్యాణం జరుగుగాక
    అలాగే జరగాలని
    మేము ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాము .
    ప్రత్యేక నమస్కారములు మరియు ధన్యవాదములు

  • @ShrikanthSharma
    @ShrikanthSharma 2 года назад +5

    మీరు తెలుగు ప్రోగ్రాం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది👌👌🙏😀👍

  • @thirupathaiahkondu2666
    @thirupathaiahkondu2666 2 года назад +3

    మీరు చాలా మంచి మరియు గొప్ప పని చేస్తున్నారు.. ఇలాంటి పనికి పూనుకున్నారంటే మీ వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. మీలాంటి విద్యావంతులు మాత్రమే మన దేశానికి పునర్వైభవాన్ని తీసుకురాగలరు.. మీకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు.. మీకు ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుంది.. జై హింద్... భారత మాతకి జై...

  • @mallepellilaxmi66
    @mallepellilaxmi66 Год назад +2

    చాల బాగుంది మీ యొక్క ప్రయత్నం ఎప్పుడు ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో మరిన్ని వివరాలకు సంబంధించిన విషయాలు వెలుగులోకి రావాలని కోరుతున్నాము 🙏🙏🙏

  • @narasingaraomadabathula6370
    @narasingaraomadabathula6370 2 года назад +7

    సోదరా! భారతీయ సంస్కృతీ సంపదలను పది మందికి అందించు చున్న మీ కృషికి జోహార్లు...

  • @vijaych915
    @vijaych915 2 года назад +5

    మన హిందూ ధర్మం ని రక్షించేది ఎప్పటికి వేదములే అటువంటి వేదములను కాపాడాలి జై హింద్

  • @SatishKumar-iu4mw
    @SatishKumar-iu4mw 2 года назад +27

    చాల అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు🙏

  • @rokkam5555
    @rokkam5555 2 года назад +6

    Shivoham Adbhutam. All Hindus should know the treasure of facts of Vedanta. Thanks sir, for detailed information.🙏

  • @erajyalakshmi4584
    @erajyalakshmi4584 2 года назад +1

    ముందుగా, మీరు తెలుగు భాష ఇంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే వినడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజుల్లో చాలా మంది మాట్లాడే తెలుగు వింటూ ఉంటే చెప్పలేని బాధ అనిపిస్తోంది.
    ఎన్నో విషయాలు క్లుప్తం గా చెపుతూనే, చక్కగా అర్థం అయ్యేలా వివరించారు. 🙏🙏

  • @dev4rajan
    @dev4rajan 2 года назад +54

    వేదముల పై అమూల్యమైన వీడియో అందించినందుకు ధన్యవాదాలు 🙏

  • @raghavrr503
    @raghavrr503 2 года назад +3

    అద్భుతం, మీ కృషి అత్యద్భుతం, మీకు ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలి. ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. 🙏శివోహం🔱

  • @srigowri992
    @srigowri992 2 года назад +1

    Project Sivoham gariki యెన్ని నమస్కారము lu చేసిన చాలవు, మీకు sethakoti నమస్కారము లు, antha విజ్ఞానం తెలిపారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @vignanamithra4062
    @vignanamithra4062 2 года назад +2

    ప్రోజెక్ట్ శివోహం లో ఉన్న వారందరికీ నా హృదయపూర్వక నమః సుమాంజలి 🙏.మీరు అందరూ కూడా నిజంగా కారణ జన్మలు ఎందుకనగా మన సనాతనధర్మంని కాపాడుతున్నారు. మా లాంటి ఎందరో అజ్ఞానులకు జ్ఞానాన్ని ప్రసదిస్తునరు.🙏🙏🙏🙏
    Please enlighten us more with your documentaries and జ్ఞాన సరస్వతీదేవి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు తాప్పక ఉండాలి అని మరియు ఉండును అని పూర్తి విశ్వాసం తో మీ ఈ ప్రోజెక్ట్ శివోహం మరింత అభివృద్ధి చెంది మా లాంటి ఎందరికో జ్ఞానాన్ని కలిగించాలని నా అభిలాష.
    శివోహం!!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @patsagreen
    @patsagreen 2 года назад +4

    మీరు తెలుగువారు అని తెలిసాక మాకు చాలా గర్వంగా ఉంది .
    తెలుగు భాష సంకృతంకు దగ్గర ఉండటం మన అదృస్టం

  • @viratvenky
    @viratvenky 2 года назад +13

    శివోహం వేద భూమి సనాత భూమి..
    నా భారతం. .❤️🕉️

  • @Sirieditz.v
    @Sirieditz.v 2 года назад +2

    కచ్చితంగా సరస్వతి దేవి అమ్మ వారి కటాక్షం మీకు లభిస్తుంది ....చాలా గొప్పగా చెప్పారు ధన్యవాదములు అన్నగారు..

  • @prabhakarraosangu7983
    @prabhakarraosangu7983 8 месяцев назад +2

    నేను చాలా పెద్ద పండితుడిని అని గర్వపడే వారికి ఇది కళ్ళు తెరిపించి, నేను ఇంకా ఎంతో నేర్చువాలని తెలియ చెప్పే వీడియో ఇది అని నా అభిప్రాయం. జై భారత్.

  • @k.l.n.h6253
    @k.l.n.h6253 2 года назад +142

    ధన్యవాదములు🙏 జై శ్రీ రామ్.🙏

  • @vemireddyvijayalakshmi7000
    @vemireddyvijayalakshmi7000 2 года назад +2

    వేదాలను గురించి అద్భుతంగా వివరించారు. ధన్యవాదములు 🙏

  • @jeevanlalg
    @jeevanlalg 7 месяцев назад +8

    Very noble cause taken sir.. It was my wish always... Everyone one of us know the fact that we had this great literatures... but, for various reasons it didn't carry to the successive generations... And you're doing this great work... Every proud Indian will be indebted to you sir...🙏🏻🙏🏻🙏🏻

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 2 года назад +1

    వేదం తెలుగులో చెప్పటం చాలా అభినందనీయం మీకు మా హృదయ పూర్వక అభినందనలు తెలియ చేస్తున్నాం మీరు తెలుగులో పుస్తకం లో అచ్చు veyendi మా అందరికీ అంటే భారతీయ అందరికీ ఉపయోగము

  • @jhansikummari5345
    @jhansikummari5345 2 года назад +3

    ధన్యవాదాలు అన్నయ తెలుగు పెట్టినందుకు🙏. భారతీయ సంస్కృతి విశిష్ఠత గురించి అందరూ తెలుసుకోవాలి
    జై శ్రీ రామ్ 🚩🙏🚩

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 2 года назад +3

    ప్రాచీన విజ్ఞానం అందించిన మీకు ధన్యవాదాలు

  • @anitharayakota6615
    @anitharayakota6615 2 года назад +1

    వేదజ్ఞానమును ఎంతో అద్భుతంగా వివరించే ప్రయత్నం
    చేశారు..🙏

  • @ramadevivedanabhatla3567
    @ramadevivedanabhatla3567 9 месяцев назад +1

    శాస్త్రం గురించి ఎవరూ తెలిసీ తెలియని ఇమర్శ చేయరాదు.శాస్త్రం ఎప్పుడు గొప్పదే... చెప్పే వారిని బట్టి ఉంటుంది..
    మీ ప్రయత్నం చాలా అద్భుతం...పరమాత్మ మీకు సదా ఆశీస్సులు ఇయ్యలి.

  • @drarunkakani1214
    @drarunkakani1214 2 года назад +7

    You are doing a great job my dear friend. I have recommended this channel of yours to my friends as well.
    ఆ సరస్వతి దేవి ఆశీస్సులు మీపట్ల ఎల్లప్పుడూ వుండాలి.
    జై శ్రీ రామ్

    • @krishnamurthybodu1911
      @krishnamurthybodu1911 2 года назад

      సోదర భారతదేశ చరిత్ర వందల వేల సంవత్సరాలు కాదు మీరు చాలా పొరపాటు పడుతున్నారు ప్రపంచం లో పురాతనమైన చరిత్ర కావచ్చు అంతేకాని వందల వేల సంవత్సరాల క్రితం భారతదేశ చరిత్ర కాదు

    • @drarunkakani1214
      @drarunkakani1214 2 года назад

      @@krishnamurthybodu1911 miku ela telsu?

  • @girichinimilli483
    @girichinimilli483 2 года назад +5

    వేదాలు గురించి మొదటిసారి తెలుగులో వివరణాత్మక విషయం విన్నాను సంతోషం మీకు వందనాలు

  • @sastrygimokkarala1834
    @sastrygimokkarala1834 2 года назад +1

    చక్కనైన విషయాలు అద్భుతమైన వాక్యలు తెలియచేసినారు , మీకు ఇలాగున ప్రజలు కు, తెలియచేయాలి, అని వేదము గూర్చి, గొప్ప విషయం. మీకు మా ధన్యవాదములు 👌👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-ik9tv7mj2o
    @user-ik9tv7mj2o 2 месяца назад +2

    మీరు తెలుగు వారు అవ్వడం మేము చేసుకున్న అదృష్టం 🙏🙏

  • @kotireddymf4325
    @kotireddymf4325 2 года назад +4

    మీకు చాలా చాలా ధన్యవాదాలు.. సార్..
    మీలాంటి వారు ఇంకా ఎందరో కలిసి ఒక్కటై మన సాంప్రసాయాలను , సంస్కృతిని నేటి వారితో పాటు రేపటి తరాలకు కూడా అందించాలని ఆసిస్తూన్నాం 💐🙏
    మీలాంటి జ్ఞాని అయిన మంజునాద్ గారు అని బెంగళూర్ లో వున్నారు వారి తరగతులు విని ఇప్పుడు మీ వాయిస్ లో ఈ వీడియో వింటూ ఉంటే ఆ సార్ మీలో గుర్తుకు వచ్చారు..👍👍👍👍👍✊👍🕉️🕉️🕉️🙏

  • @zithuwithu
    @zithuwithu 2 года назад +16

    Bro, iam your fan since danurvedham video. And as a Telugu guy I know your a Telugu guy when you spoke some words in Sanskrit in some videos. Finally I am soo happy that you have done great thing to Telugu people by translating this video's. I am a fan of chaganti garu. And now I am so happy I have you now.

  • @purityoflove3205
    @purityoflove3205 2 года назад +1

    హై అన్న మీరు చెప్పిన మాటలు విని ఎంతో ఆనందం ఉంది అన్న. నాకూ సంస్కృతం అర్దం కాదు అనుకున్న. ఇప్పుడు అర్దం చూసుకోవాలి అని ఉంది... జై గురు దేవ్.🌹🌹

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 2 года назад +17

    Sir, hearty congratulations! I am working on the project called "Vedic Sanskrit and World Languages" to prove that all the languages are derived from Sanskrit. First I have taken English language. About 50 percent of work is over. Felt very happy to subscribe and follow your channel. It's superb.

    • @anonymous74961
      @anonymous74961 10 месяцев назад

      Namaste ma'am, I am pursuing my PhD now in Sanskrit. Did you complete your research?

    • @learneg2935
      @learneg2935 6 месяцев назад

      Great thought . All the best

  • @SK-xm4yt
    @SK-xm4yt 2 года назад +4

    Wow … Amazing….🙏🙏 .. looking forward for more videos in Telugu… God bless you.. సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు… 💐💐

  • @pradeepkilli5564
    @pradeepkilli5564 2 года назад +30

    It's incredible to listen your voice in telugu anna🤩😍🥰.... Om shivoham

  • @ramalingeswarraomantriprag4215
    @ramalingeswarraomantriprag4215 2 года назад +1

    👌👌👌👍👍👍🙏🙏🙏మీ యొక్క శ్రమ, కృషి, సాధనకు నా శుభాభినందనలు, 🌹🌹🌹మీ శ్రమ, పరిశోధన విలువ కట్టలేనిది, మీరు ఇస్తున్న ఈ విజ్ఞానానికి వయసుతో సంభందం లేకుండా మీకు శతాభి వందనాలు 🙏🙏🙏🙏🙏MRLrao

  • @gantasathyanarayanareddy1530
    @gantasathyanarayanareddy1530 Год назад +4

    Excellent effort in bringing our traditional knowledge to the common man ,need of the hour, blame our education system which kept us away by the British and post independent Era, the present government is trying in some way. Dhanyavad and best wishes🌹🌹🌹🙏

  • @mangatinanda
    @mangatinanda 2 года назад +4

    ధన్యవాదాలు అన్న. చాలా సులభంగా అర్ధం అయ్యేలా చెప్పారు 🙏🙇🏻🙇🏻

  • @k.l.n.h6253
    @k.l.n.h6253 2 года назад +11

    "The Untold Story of Samskritam " after watching this video, I was subscribed this Channel Project Shivoham. Jai Shree Ram🙏

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 7 месяцев назад

    ఇంత కాలానికి నా కోరిక నెరవేరుతుంది. మన తెలుగు ప్రజలు మీ అపార జ్ఞానము ఇప్పటికైనా తెలుసు కుంటున్నందుకు ఆనందంగా ఉంది. మీ స్వరం వింటుంటేనే ఎదో తెలియని ఆనందం. మీరు కారణ జన్ములు..🌹🙏

  • @rajashekarbeerpur8239
    @rajashekarbeerpur8239 8 месяцев назад +2

    A person born in Bharat becomes a natural seeker. You've taken the rebirth for a reason and you are concretizing the path for many of us, to follow. I'm writing in English merely because I don't know how to use Telugu dictionary in RUclips.
    Nuvvu kaarana janmudavu🙏 Aum Namah Shivaya

  • @sritejadevarakonda8890
    @sritejadevarakonda8890 2 года назад +52

    I watch your videos regularly in english! But Telugu hits differently. I’m really really happy that you took up this huge task!! More power. I’d also like to help/ contribute: kindly let me know how. 👏👏🙌🏻

    • @indrakantisurekha2593
      @indrakantisurekha2593 2 года назад

      May i know your good name?

    • @rithinreddy1635
      @rithinreddy1635 2 года назад

      ee vishayani telugu lo rasundochukada

    • @dhasharathichalapathikumar5738
      @dhasharathichalapathikumar5738 2 года назад

      మీరు చాల గొప్ప కార్యం చేస్తున్నరు మీకు భగవతున్ని ఆశలు ఉండాలనీ ఉండాలనీ కోరుకున్నా

  • @akashk961
    @akashk961 2 года назад +9

    A great comeback in Telugu, love, and respect for Project Shivoham!

  • @adigopularavi4340
    @adigopularavi4340 6 месяцев назад

    మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావడం లేదు మీరు చేస్తున్న ఈ అన్వేషణ సరస్వతి మాతా అనుగ్రహం తో ఈ సనాతన ధర్మ గౌరవాన్ని మరింత గొప్పగా అర్థం చేసుకునేలా మీ ఈ పరిశోధన భావితరాలకు జ్ఞానామృతం గా మిగిలిపోతుందని ఆశిస్తూ మీరు ఇంగ్లీష్ లో చేసిన వీడియోస్ తెలుగులోనూ వచ్చేలా చూడగలరు అని మీకు అంత సమయాన్ని, శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తాను

  • @gayatrineti2330
    @gayatrineti2330 2 года назад +1

    చాలా చక్కగా వివరించారు.ప్రతి వారు తప్పక తెలుసు కోవలసిన అపూర్వ సంపద🙏🙏🙏

  • @selvaraj-rs4sg
    @selvaraj-rs4sg 2 года назад +4

    చాలా చాలా కృతజ్ఞతలు ....

  • @kashyapchalla4565
    @kashyapchalla4565 2 года назад +3

    Mee mission chaalaa goppadi!!! Aaa parameshwarudi Krupa mee pai undi inka ilane undali ani korukuntunnanu!!!

  • @mummykitchen1200
    @mummykitchen1200 Год назад

    నా జీవితంలో నేను చూసిన ఏకైక అద్బుత చానల్ మీది. ఇన్నాళ్ళు ఈ విజ్ఞానాన్ని అచ్చ తెలుగులో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పంచేవారు ఎప్పుడు వస్తారు అనుకునేవాడిని... మీకు నా శతకోటి వందనాలు...

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 5 месяцев назад

    ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻 ఆత్మస్వస్వరూపులైన శివోహం ప్రాజెక్ట్ నిర్వాహకులైన సమాజ హితార్థులకు పెద్దలకు ప్రణామములు!! ఆ చదువులతల్లి సరస్వతి దేవి సంపూర్ణ ఆశీస్సులు ఈ వీడియోలో ఎంతో విలువైన వేద, సనాతన ధర్మ సంప్రదాయ సంపదలను మాలాంటి సామాన్యులకి పంచినందుకు ధన్యోస్మి 🌹👋👋👋 🙏🏻🙏🏻🙏🏻
    Doing a Great job to the Society 🙏🏻🙏🏻🙏🏻
    జై శ్రీమన్నారాయణ 🙏🏻

  • @alexalex9700
    @alexalex9700 2 года назад +19

    Been following the channel in English, now in Telugu, superb👍. Always wondered about importance of phonetics, coz phonetics in english makes no sense,but from ur video I inferred that phonetics in Sanskrit was the science to preserve scientific knowledge in human memory that can last till our existence 👍😲.with phonetics vast knowledge is not crammed in mind rather arranged in order👍👍. It seems Atharva veda was not given much importance coz of which we have been ruled by outsider repeatedly, which is also a fact

  • @anandsarma4680
    @anandsarma4680 2 года назад +5

    Telugu lo chuste kick a verappa🤩🔥

  • @akhandanandagiriswamiji3049
    @akhandanandagiriswamiji3049 2 года назад

    చాలా చక్కగా ఈనాటి రేపటి సమాజాన్ని కూడా వేదజ్ఞాన మార్గంలో పయనించి భారతీయ ఔన్నత్యాన్ని చాటి చెప్పే అవకాశం పరమేశ్వరుడు మీకు కరుణించి మీకుజన్మ సార్థకత ను చేకూర్చుతున్నందులకు చాలా చాలా సంతోషం , ఇంగ్లీష్ , తెలుగు భాషలలో సేవలందిస్తున్న మీకు విశేష ధన్యవాదములు, శుభం భూయాత్ ఓమ్.............

  • @pranaykumar8273
    @pranaykumar8273 2 года назад

    సోదరా ! ఆ పరమ శివుడే మిమ్మల్ని మా కోసం పంపించాడు. ఎప్పటి నుండో వేదాల గురించి తెలుసుకోవాలని మనసు తహతహ లాడుతూ వుండేది. మీ దయ వలన మేము సులభంగా అర్థం చేసుకొంటున్నాము. అరటి పండు వలిచి నోటికి అందించి నట్లు ప్రతి సామాన్యుడికి అర్థమయ్యే విధంగా చెబుతున్నందుకు, ఈ ప్రాజెక్టు చేపట్టినందుకు మీకు ఆ పరమ శివుని అశీస్సులు ఎల్లవేళలా వుండాలని కోరుకుంటూ మీకు నా ధన్యవాదాలు.

  • @sadhvika1587
    @sadhvika1587 2 года назад +17

    Really proud of project shivoham 🙏

  • @sunilfauji
    @sunilfauji 2 года назад +5

    I.am a Kashmiri Hindu. watched it till end
    Sanskrit is our mother language of entire Bharat and could understand almost all as explained very well. Proud of this team.
    Satya Sanatan Hindu Dharam ki Jai
    You people have big responsibility to take to last line of society. Less time as administrators are hell belt to destroy Humanity but taking away their Dharma and giving them Abrahamic faults.
    More power to you all

    • @GoudSabhab
      @GoudSabhab 7 месяцев назад +1

      🚩🕉️🙏 love from Telugu brother

  • @kishandumpeti3276
    @kishandumpeti3276 Год назад

    సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు, ఇంత గొప్ప వాఙ్మయం ఉన్నా, మన పాలకులు భారతీయ విద్యావిధానంలో చేర్చలేక పోవటం దురదృష్టం, వలస తుగ్లక్ల పాలనలో ఏముందని స్కూల్లలో నేర్పిస్తున్నారు. ఇప్పటికైనా భారతీయ సంస్కృతి మిలితమైన తార్కిక విజ్ఞానం తో కూడిన విద్యావిధానం ప్రవేశ పెట్టాలి.

  • @janapareddinmahadevan7485
    @janapareddinmahadevan7485 2 года назад

    మన సనాతన ధర్మాని తెలియ చేసే మీ సామాజిక స్పృహ కి నా జోహార్లు - నాకు ఎప్పటి నుంచో మనసులో సంస్కృత బాష రానందుకు చాలా బాధాకరముగ ఉన్నాది - ఆ లోటు ను మీరు మీ డాక్యుమెంటరీల ద్వారా మాకు వేదములు వాటి ముాలాలు తెలియచేసినందులకు మీకు నా కృతజ్ఞతలు - ఇది ఆ దేవుని సంకల్పం- God Bless you in your Endeavours- Janapareddi Narayana Mahadevan, Age 74 - in the process of Meditation & Spiritualism as of now