NALINAKSHA NEEKU /నలినాక్ష నీకు నమస్కరించిన / AAV SERIES 04 EP 358 / VANI JAIRAM / SUDDHA SAVERI

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • 🌺🍃 ---------------- 🍃🌺
    అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 358
    ( నలినాక్ష నీకు నమస్కరించిన ... )
    🌺🍃 ---------------- 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 358 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్థన ః--🌹🙏
    సమయంబంతయు రక్షగ
    మముగాచెడి నీదు నామమహిమును బొగడం-
    గమలోద్భవనుకిఁ దరమా ,
    విమలహృదయ ? తరముగాదు వేల్పులెవరికిన్ !
    🌹🙏🌹
    ✍️ స్వీయ పద్యము ( కందము )
    🌹🌹
    అన్ని సమయాలలోనూ మాకు రక్షగా నిలిచే ,
    నీ నామమహిమను పొగడుట ఆ బ్రహ్మకైనా తరమా ?🙏
    ఓ పవిత్ర హృదయా ! ఎవరి తరమూ కాదు !
    అసలు ఏ దేవతలకూ సాధ్యము కాదు అంతే !🙏
    🌹🙏🌹
    🌺🍃 ---------------- 🍃🌺
    అన్నమాచార్యులవారు ఆ కమలలోచనుడైన శ్రీహరి నామము యొక్క మహిమను పొగడుట ఎవ్వరి వలనా సాధ్యము కాదు ,అని అతిశయమును తెలుపుచూ ,
    ఆ నామము వల్లన మనకు ఎంత మేలు కలుగుచున్నదో వివరించారు బహు చక్కగా .🙏
    మరి ఆ అద్భుతమగు కీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా .👇
    🌺🍃 ---------------- 🍃🌺
    🌹🌹
    తామరల వంటి కన్నులు గల చల్లని చూపుల వాడా ,
    నీకు చిత్తశుద్ధితో నమస్కరించుకోవటము వలన మేము పొందే ఫలములనూ ,శుభములనూ వివరించి పొగడుటకు ఆ బ్రహ్మకైనా సాధ్యమా ?🙏
    అవి మామూలు శుభములా చెప్పు !!
    ఇదిగో ఇలా మమ్మల్ని ఉద్ధరిస్తున్నదయ్యా నీ నామ మహిమ ! వినుము స్వామీ !!🙏
    🌹🌹
    ఎప్పటినుంచో మేము చేసిన తప్పులను కూడా ప్రక్కకు త్రోసేసి , మా అపచారములనన్నిటినీ క్షమించి వేయుచున్నది నీ నామము .🙏
    ఆ నామమును ధ్యానించిన కారణము చేతనే మా లోని
    గర్వము , మదము , అనే మాలిన్యాలను తుడిచి పెట్టేసి ,
    ఇక మమ్ములను చక్కనైన త్రోవలో నడిపించుచున్నది నీ నామము .🙏
    🌹🌹
    పూర్వపు దోషములనే కాదు , ఇప్పుడు నేడు మేము తెలియక చేసే నేరాలను కూడా అణచి వేయుచున్నది ,
    నిత్యమూ కర్మ బద్ధులమై తాపముతో ఉన్న ఈ బంధనాలను ఒక్కొక్కటిగా విడిపించున్నది నీ నామము .🙏
    పదునుగా మా మనస్సులను గుచ్చుతున్న బాధలన్నీ ,
    ఇట్టే అవలీలగా నివారించుచున్నదయ్యా నీ నామము .🙏
    నీ నామము అనే నాడిని బాగుగా తెలుసుకుని పట్టుకున్నాము గనుకనే ఇవి యన్నీ సాధ్యమౌచున్నవి.🙏
    🌹🌹
    నీ నామమే మాకు తోడుగా ఉండి , మాతో పాటు ఇవ్వలవ్వల సౌభాగ్యములనన్నియూ అందజేయుచున్నది .🙏
    మాకు అనుకూలించి శుభములనూ ,విజయములనూ ఒసగుచున్నది .🙏
    ఇంపుగా ఓ శ్రీ వేంకటేశ్వరా ఇదిగోనయ్యా నీ నామము మాతో స్నేహపూర్వకముగా ఉంటూ , అతి సుకుమారముగా మమ్ములను చూచుకొనుచూ రక్షించుచున్నది .🙏
    నీ నామమును ఎన్నటికీ విడువబోము శ్రీ వేంకటేశ్వరా !🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 358)
    ✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ॥పల్లవి॥
    నలినాక్ష నీకు నమస్కరించిన-
    ఫలము వొగడ నిఁక బ్రహ్మకు వశమా
    ॥చ1॥
    పూర్వదోషములఁ బోఁదోలి మఱియు
    సర్వాపచారము క్షమియించి
    గర్విత మదముల కసటు వాపి నను
    నిర్వహించె నిదె నీనామము
    ॥చ2॥
    నేఁడునుఁ జేసిన నేరము లణఁచి
    వేఁడి కర్మముల విడిపించి
    వాఁడి దుఃఖముల పడిఁ బరిహరించె
    నాఁ డెఱఁగఁగ నీ నామము
    ॥చ3॥
    ఉమ్మడి సుఖముల నొనరించీ మాకు
    సమ్మతి శుభములు జయమొసఁగీ
    యిమ్ముల శ్రీవేంకటేశ్వర యిదివో
    నెమ్మది రక్షించె నీనామము
    🌹🙏🌹🙏🌹
    #NALINAKSHANEEKU #నలినాక్షనీకు #vanijairam #vanijayaramsongs #vanijayaram
    #అన్నమయ్యకీర్తనలు #annamacharya #annamacharyakeerthanalu #annamayya #annamayyaaksharavedam #annamayyasongs #అన్నమయ్య #అన్నమాచార్య #annamayyakeerthanalu #annamayyakeerthana

Комментарии • 16

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  9 месяцев назад +3

    🌺🍃 ---------------- 🍃🌺
    అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 358
    ( నలినాక్ష నీకు నమస్కరించిన ... )
    🌺🍃 ---------------- 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 358 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్థన ః--🌹🙏
    సమయంబంతయు రక్షగ
    మముగాచెడి నీదు నామమహిమును బొగడం-
    గమలోద్భవనుకిఁ దరమా ,
    విమలహృదయ ? తరముగాదు వేల్పులెవరికిన్ !
    🌹🙏🌹
    ✍ స్వీయ పద్యము ( కందము )
    🌹🌹
    అన్ని సమయాలలోనూ మాకు రక్షగా నిలిచే ,
    నీ నామమహిమను పొగడుట ఆ బ్రహ్మకైనా తరమా ?🙏
    ఓ పవిత్ర హృదయా ! ఎవరి తరమూ కాదు !
    అసలు ఏ దేవతలకూ సాధ్యము కాదు అంతే !🙏
    🌹🙏🌹
    🌺🍃 ---------------- 🍃🌺
    అన్నమాచార్యులవారు ఆ కమలలోచనుడైన శ్రీహరి నామము యొక్క మహిమను పొగడుట ఎవ్వరి వలనా సాధ్యము కాదు ,అని అతిశయమును తెలుపుచూ ,
    ఆ నామము వల్లన మనకు ఎంత మేలు కలుగుచున్నదో వివరించారు బహు చక్కగా .🙏
    మరి ఆ అద్భుతమగు కీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా .👇
    🌺🍃 ---------------- 🍃🌺
    🌹🌹
    తామరల వంటి కన్నులు గల చల్లని చూపుల వాడా ,
    నీకు చిత్తశుద్ధితో నమస్కరించుకోవటము వలన మేము పొందే ఫలములనూ ,శుభములనూ వివరించి పొగడుటకు ఆ బ్రహ్మకైనా సాధ్యమా ?🙏
    అవి మామూలు శుభములా చెప్పు !!
    ఇదిగో ఇలా మమ్మల్ని ఉద్ధరిస్తున్నదయ్యా నీ నామ మహిమ ! వినుము స్వామీ !!🙏
    🌹🌹
    ఎప్పటినుంచో మేము చేసిన తప్పులను కూడా ప్రక్కకు త్రోసేసి , మా అపచారములనన్నిటినీ క్షమించి వేయుచున్నది నీ నామము .🙏
    ఆ నామమును ధ్యానించిన కారణము చేతనే మా లోని
    గర్వము , మదము , అనే మాలిన్యాలను తుడిచి పెట్టేసి ,
    ఇక మమ్ములను చక్కనైన త్రోవలో నడిపించుచున్నది నీ నామము .🙏
    🌹🌹
    పూర్వపు దోషములనే కాదు , ఇప్పుడు నేడు మేము తెలియక చేసే నేరాలను కూడా అణచి వేయుచున్నది ,
    నిత్యమూ కర్మ బద్ధులమై తాపముతో ఉన్న ఈ బంధనాలను ఒక్కొక్కటిగా విడిపించున్నది నీ నామము .🙏
    పదునుగా మా మనస్సులను గుచ్చుతున్న బాధలన్నీ ,
    ఇట్టే అవలీలగా నివారించుచున్నదయ్యా నీ నామము .🙏
    నీ నామము అనే నాడిని బాగుగా తెలుసుకుని పట్టుకున్నాము గనుకనే ఇవి యన్నీ సాధ్యమౌచున్నవి.🙏
    🌹🌹
    నీ నామమే మాకు తోడుగా ఉండి , మాతో పాటు ఇవ్వలవ్వల సౌభాగ్యములనన్నియూ అందజేయుచున్నది .🙏
    మాకు అనుకూలించి శుభములనూ ,విజయములనూ ఒసగుచున్నది .🙏
    ఇంపుగా ఓ శ్రీ వేంకటేశ్వరా ఇదిగోనయ్యా నీ నామము మాతో స్నేహపూర్వకముగా ఉంటూ , అతి సుకుమారముగా మమ్ములను చూచుకొనుచూ రక్షించుచున్నది .🙏
    నీ నామమును ఎన్నటికీ విడువబోము శ్రీ వేంకటేశ్వరా !🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 358)
    ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ॥పల్లవి॥
    నలినాక్ష నీకు నమస్కరించిన-
    ఫలము వొగడ నిఁక బ్రహ్మకు వశమా
    ॥చ1॥
    పూర్వదోషములఁ బోఁదోలి మఱియు
    సర్వాపచారము క్షమియించి
    గర్విత మదముల కసటు వాపి నను
    నిర్వహించె నిదె నీనామము
    ॥చ2॥
    నేఁడునుఁ జేసిన నేరము లణఁచి
    వేఁడి కర్మముల విడిపించి
    వాఁడి దుఃఖముల పడిఁ బరిహరించె
    నాఁ డెఱఁగఁగ నీ నామము
    ॥చ3॥
    ఉమ్మడి సుఖముల నొనరించీ మాకు
    సమ్మతి శుభములు జయమొసఁగీ
    యిమ్ముల శ్రీవేంకటేశ్వర యిదివో
    నెమ్మది రక్షించె నీనామము
    🌹🙏🌹🙏🌹

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 9 месяцев назад +3

    Om Namo Venkatesaya🙏🙏🙏 Naama mahimanu adbhutanga Keerthinchina excellent Keerthana; very nice Padhyamu thank you so much for chakkati vivarana and wonderful presentation of Keerthana Madhuramga sung by Vani Jayram garu Om Sri Alamelu Manga Venkateswara Swamy bless you🙏🙏🙏

  • @saraswathiavija6327
    @saraswathiavija6327 9 месяцев назад +2

    🙏Om Namo Sri Venkatesaya🙏. Thank you for such Beautiful song with lyric and meaning.

  • @tvraorao2509
    @tvraorao2509 9 месяцев назад +1

    A beautiful presentation of Annamaiah Keertana by Sri Yellepeddi Venugopal garu attaching holy visuals & lyrics with clear explanations, particularly melodiously sung by Smt Vani Jayaram garu in Sudda Saveri ragam .God blesses 🙌 to the entire team of YVG ANNAMAIAH AKSHARA VEDAM OM NAMO VENKATESHAYA 🌷 🙏🏽

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  9 месяцев назад +3

    🌺☘ -----------------☘🌺
    ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 358
    ( NALINAKSHA NEEKU NAMSKARINCHINA ..)
    🌺☘ -----------------☘🌺
    PREFACE :--🌹👇
    Annamacharya in this keertana expresses that The Glory and Power Of The Name of The lord cannot be praised fully even by Lord Brahma .🙏
    He continues in all stanzas of the keertana , how the holy name has transformed the jeevatman into a pious soul and stood as a support always .🙏
    Here goes the interesting keertana as below .👇
    🌺☘ -----------------☘🌺
    🌹🌹
    Oh Lotus Eyed Lord ! The Fortune We Reap
    With The Salutations Offered To You ,
    Is it Possibble Even For The Lord Brahma To Glorify It ?🙏
    🌹🌹
    By Chasing Away All My previous faults and Sins ,
    And By Pardoning All My Improprieties ,
    By Removing The Impurities Of Pride , arrogance and Lust From My Mind ,
    Your Name Alone Is Managing Me And Protecting in The Right Way !🙏
    🌹🌹
    By Ruining The Crimes And offences I did Now ,
    And by relieving Me from
    The Hot Tangles Of My Deeds ,
    All My piercingly Sharp Grieves and Miseries
    were Also Abolished Swiftly .
    All These were Possibble Only By Aptly Knowing And Chanting Your Name .🙏
    🌹🌹
    By Being as Our partner And Performing
    All The Welfare and bestowing Happiness
    And by Showing Your Consent Always
    and gracing us with success and Prosperity
    Suitably For All Of us You Are Here
    Oh Lord Sri Venkateswara
    Soothingly Your Name Alone Is Protecting Us Always .🙏
    🌹🙏🌹
    Bow To That Lotus Eyed Lord Forever ! 🙏
    🌹🙏🌹
    OM SRI ALAMELUMANGA SAMETHA
    SRI VENKATESWARA SWAMINEY NAMAHA !🙏
    ✍ -- VENUGOPAL

  • @VGuruPrasadVGuruPrasad-m7e
    @VGuruPrasadVGuruPrasad-m7e 9 месяцев назад +2

    OM Namo VENKATESHAYA THANDRI NANNU NAA KUTUMBHANI Ayu Arogya Latho CHALAGA CHUDU SWAMY

  • @padmajasingaraju862
    @padmajasingaraju862 9 месяцев назад +1

    Dhanurmasam starts with wonderful Sankeerthana 👏👏🙏🙏🙏🙏

  • @streddys
    @streddys 9 месяцев назад +2

    గోవింద గోవింద గోవింద

  • @VsvlsraoAyithy
    @VsvlsraoAyithy 4 месяца назад +1

    ఓమ్ నమో వేటకటేశాయ గోవిందా

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 27 дней назад +1

    Of all Annamayya's keerthanas this one has attracted me so much along with some other keerthanas.All His keerthanas are superb But certain ones attracted me so much. I am immersed in the devotional songs of Lord Venkatesha'.

  • @B-kx1gl
    @B-kx1gl 9 месяцев назад +2

    sankeerthana ,meaning n visuals 👌👏🙏🏻