PATTARO VEEDHULA /పట్టరో వీదుల /AAV SERIES 05 EP -497 / JOSYABHATLA / NAYANA NAIR /AATHANA

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2024

Комментарии • 9

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  2 месяца назад +2

    PART O1 MEANING
    🌺🍃 ------------🍃🌺
    అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 497
    ( పట్టరో వీదుల బరువులువెట్టి ..)
    🌺🍃 ----------- 🍃🌺
    ఓం నమో వేంకటేశాయ. 🙏
    అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 497 కి శుభ స్వాగతం ..🙏
    ప్రార్థన ః--🌹🙏
    పట్టుకుఁజిక్కెడి వాఁడే !
    పట్టగవలె హరిని యనుచు , భక్తిని మదిలో
    దట్టముగ నిలుపఁ దానే
    యెట్టైనను మనకుఁజిక్కి యిఛ్చలు దీర్చున్ !
    🌹🙏🌹
    ✍ --స్వీయపద్యము ( కందము )
    🌹🌹
    ఇతనిని పొందాలి అని గట్టిగా అనుకుంటే తప్పక అందెడివాడే !
    కావలసినదల్లా ఇతనిపై అమితమైన భక్తిభావనను సాంద్రముగా మదిలో నిలుపుకుని ఉండుటయే ! 🙏
    అలా ఉండగలిగితే ఎదో ఒక నాడు ఏదో ఒక రూపములో ,ఇతడు తనకు తానే దయతలచి మన వశమై పోతాడు , మన కోరికను తనకు తానే తీర్చుతాడు ! 🙏
    యశోద వద్ద రోలుకు కట్టువడిన రీతిలో చిన్ని కృష్ణుడు !🙏
    🌺🍃 -----------🍃🌺
    మున్నుడి ః-- 🌹👇
    అన్నమాచార్యులవారు అద్భుతమైన రచన చేసారు ఈ కీర్తనలో అలతిపదాలలో ఎంతో పరమార్థమును నిక్షిప్తము చేసి .🙏
    "పట్టుకోండి పట్టుకోండి , వీధులలో పరిగెడుతున్న ఈ బాలకృష్ణుడిని " అంటూ ! 🙏
    మరి ఆ చక్కని కీర్తన అర్థమును పరమార్థమును పరిశీలించుకుని పాడుకుందామా !👇
    🌺🍃 ----------- 🍃🌺
    🌹🌹
    అర్థము ః--
    పట్టుకోండి పట్టుకోండి ! అమ్మలాలా !! ఇదిగో ఈ రేపల్లెలో , వీధులలో ఆడుతూ పరుగెడుతున్న ఈ బాలుడిని !🙏
    చక్కగా ఇక్కడ పుట్టి , ఇక్కడ పుట్టిన వారితో సంచరించుచూ ఆడిపాడుతున్నాడు ఈ హరి ! 🙏
    అంతరార్థము ః--
    ( పరమాత్మునుని మనంతట మనము అంది పుచ్చుకోగలమా ? మన తరము కాదు !
    ఆ భగవంతుడే దయ తలచి మనలను చేపట్టాలి .
    అలా వచ్చిన వాడే కృష్ణుడు .🙏
    ఇక్కడ వీధులు- భౌతిక ప్రపంచానికి సూచన . పుట్టుగులతో పొలసి --- అనగా ఇక్కడ జననమరణ బద్ధులమైన మనకోసము తానే జనియించి మనతో సంచరిస్తున్నాడు అని భావము ) 🙏
    🌹🌹
    అర్థము ః--
    వేల వేల యుగముల సమయములు ( తతులు ) అన్నీ ఏ దేవునికై వెతుకుచూ ఉంటాయో ,
    ఆ దేవుడే ఇక్కడ గోవులను కాచు చిన్ని కృష్ణునిగా కనిపించుచున్నాడు .🙏
    కుప్పల కుప్పల ప్రోగులుగా బ్రహ్మలను అనాదినుండీ సృష్టిస్తున్న ఆ విశ్వజనకుడే , ఇదిగో స్వయముగా యశోదకు బిడ్డడైనాడు !🙏
    అంతరార్థము ః--
    విశ్వజనకుడు ,విశ్వసంరక్షకుడు , విశ్వపాలకుడు ఆ శ్రీ మన్నారయణుడే !
    ఆయన నిత్యమూ సంరక్షించుకునేది తన సృష్టినే .🙏
    ఇక్కడ గోవులు అనగా --
    కాపరిపై ఆధారపడినట్లుగా , పరమాత్ముని కృపపై ఆధారులమైన మనమందరమూ ( జీవాత్మలము ) .🙏
    పరమాత్ముడు తనకు తానే జీవాత్మలను కాచుకుని ఉంటాడు .🙏
    దానికి అతను ఏ రూపమునైనా ధరించగలడు . ఇక్కడ చంటి బిడ్డ అయ్యాడు యశోదా నందనునిగా !🙏
    🌹🌹
    అర్థము ః--
    గొప్పనైన యజ్ఞములకు కర్త యైన వాడే , ఇక్కడ రేపల్లె యిండ్లను సమీపించి , ఆ ఇండ్లలోని వెన్నలను దొంగిలించి మరీ ఆరగించిన వాడాయెను .🙏
    మునిపుంగవులు తమ హృదయాలలో నిరంతరమూ ఏ దేవుడినైతే నిలుపుకుని ఉండాలని తపస్సులు చేస్తారో ఆ దేవుడే ,
    తనకు తానే పొందుకూడి , ప్రతీ ఇంటి గొల్లభామల హృదయాన నిలిచి వారిని పరవశింప చేసినాడు .🙏
    అంతరార్థము ః--
    'ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః" అనుచూ
    పురుషసూక్తము శ్లాఘించుచున్నట్లుగా యజ్ఞమూర్తి , యజ్ఞకర్త యజ్ఞభోక్త కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే !🙏
    ఫలమును ఇచ్చువాడు ఫలమును తిరిగిపొందువాడూ అతడే .
    మనకు తెలియకుండానే మన అంతరాత్మగా ఉంటూ ఆఖరకు ఈ జీవాత్మలను తనలోనే లీనము చేసుకునే వాడు అతడు .🙏
    వెన్న నోటిలో వేసుకున్నంత మాత్రముననే ఎలా కరిగి కనుమరుగై పోవునో , ఆరీతి పరమాత్ముడు జీవాత్మలపై చివరకు కరుణ చూపి తనలో లీనము చేసుకొందుడు .
    మనకు తెలియకుండానే అది జరిగిపోతుంది . అట్టి వాడు ఈ వెన్న దొంగ .🙏
    అదే విధముగా సర్వాంతరాత్ముడై ( ఇంటింట గొల్లెతలకు మనసైన వాడు ) అందరి అంతరాత్మగా అలరించుచున్నది అతడే !🙏
    🌹🌹

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 2 месяца назад +2

    Om Sri Krishnaya Namaha🙏🙏🙏 Sri Venugopal Garu; wonderful Sankeerthananu; present Chesi Ardhamu; Antharaadhamu; Adbhutamga vivarincharu; mee Sweeya Padhyamu chala Bagundi; Abhinandanalu🙏 Bhavamunu Beautiful Drusyamulatho present chesaru; Thank you so much; Madhuramga sung by Nayana Nair Garu; Namo Annamayya🙏🙏🙏 Sri Venkat Giri Sri Krishna bless you

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 2 месяца назад +1

    Om Venkatesaya..🙏🙏🙏🙏🙏🙏🙏❤👋

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 2 месяца назад

    Om namo narayanaya Govinda Govinda

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 2 месяца назад +1

    Kulukuga nadavaro ragam.

  • @bandigayathri6141
    @bandigayathri6141 2 месяца назад +1

    Wonderful song

  • @papayyarunku4279
    @papayyarunku4279 2 месяца назад +1

    Sri Krishna Janmashtami shubha kankshalu 💐💐 anna gaaru

  • @bandigayathri6141
    @bandigayathri6141 2 месяца назад

    Sir tulasi devi ki sambandinchina annamaya songs vunte koncham mee channel lo upload cheyara sir please🙏🏻

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  2 месяца назад +2

    PART 02 MEANING
    🌹🌹
    అర్థము ః--
    ఎన్నెన్నొ చరితలను చెప్పుచూ , ఆతని సుద్దులనే సదా కీర్తిస్తూ నారదుడు పాడే ఆ శ్రీమన్నారాయణుడే ,
    ఎవరికీ అందని వాడైనా ,
    ఇదిగో యశోదమ్మ ప్రేమకు లోబడిపోయి తనకు తానే రోలుకు కట్టి ఆమె ఎదుట పాపడై ఉన్నాడు .🙏
    ఎన్నటికీ చెడిపోని వరములను మెండుగా ఇవ్వగలిగిన వాడు ఇదిగో ఇక్కడ తిరుమల కొండగా ,
    బంగారుకొండవంటివాడై ఉన్నాడు .🙏
    అంతరార్థము ః--

    సతతము నారాయణ సంకీర్తనమే పని గా గల నారదాదులకైనా స్థిరముగా అంది ఉంటాడో లేదో తెలియదు కానీ , అంతటి సర్వాంతర్యామి .
    ఇదిగో ఇక్కడ దాసులకు మాత్రము సుస్థిరముగా తిరుమల కొండగా ఉన్నాడు .🙏
    అనాదినుండీ తిరుమలకొండయే *శ్రీవేంకటేశ్వరుడని విశ్వాసము .🙏
    కొండ అనగా అచలము , సుస్థిరమైన ఇరువు ఇదియే అని భావన ! 🙏
    చెడిపోని వరములు ఏమి ఇవ్వగలడు ?
    భావించితే శాశ్వతమైన వరము కైవల్యము . దానినే ఇవ్వగలిగినవాడు పరమాత్ముడు .🙏
    మిగతా ఎన్ని గొప్ప గొప్ప వరములైనా అవి ఆశాశ్వతములే !🙏
    🌹🙏🌹
    ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
    దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
    ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 497 )
    ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
    🌹🌹 సంకీర్తన 🌹🌹
    ॥పల్లవి॥
    పట్టరో వీదులఁ బరువులువెట్టి
    పుట్టుగులతో హరి పొలసీ వీఁడే
    ॥చ1॥
    వేవేలు నేరాలు వెదకేటి దేవుఁడు
    ఆవులఁ గాచీ నలవాఁడే
    పోవుగ బ్రాహ్మలఁ బుట్టించు దేవుఁడు
    సోవల యశోదసుతుఁడట వీఁడే
    ॥చ2॥
    ఘనయజ్ఞములకుఁ గర్తగు దేవుఁడు
    కినిసి వెన్న దొంగిలె వీఁడే
    మునుల చిత్తముల మూలపుదేవుఁడు
    యెనసీ గొల్లెతల యింటింట వీఁడే
    ॥చ3॥
    నుడిగి నారదుఁడు నుతించు దేవుఁడు
    బడి రోలఁ గట్టువడె వీఁడే
    వుడినోని వరము లొసఁగెడు దేవుఁడు
    కడఁగిన శ్రీవేంకటగిరి వీఁడే
    🌹🙏🌹🙏🌹