SRI KRISHNA ASHTAMI 2024 SPECIAL SERIES EPISODE - 07 🌺🍃 ------------🍃🌺 అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 498 ( అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన ..) 🌺🍃 ----------- 🍃🌺 ఓం నమో వేంకటేశాయ. 🙏 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 498 కి శుభ స్వాగతం ..🙏 ప్రార్థన ః--🌹🙏 అమరిన శ్రావణ బహుళా- ష్టమీశుభ దినమన నేడె , టక్కరి గాండ్లన్ దమనము సేయగ బుట్టె న- సమానుడౌ బిడ్డవోలె సర్వేశ్వరుడే !! 🌹🙏🌹 ✍ --స్వీయపద్యము ( కందము ) 🌹🌹 శుభములను సిద్ధించిన దినమనగా ఈ శ్రావణమాసపు బహుళ అష్టమి తిథియే ! 🙏 దుష్టులు కపటులైన ఎంతొమందిని నాశానము చేయుటకు , జనియించునాడు , ఎదురులేని వాడై , చిన్ని శిశువుగా , ఆ శ్రీమన్నారాయణుడే ! 🙏 అట్టి బాలకృష్ణునకు సదా మంగళములు !🙏 🌺🍃 -----------🍃🌺 మున్నుడి ః-- 🌹👇 అన్నమాచార్యుల వారు శ్రీ కృష్ణ జన్మాష్టమి వైశిష్ట్యమును వర్ణిస్తున్నారు ఈ కీర్తనలో . బాల కృష్ణుని జననముచే ఎవరెవరు ఉద్ధరింపబడినారో ,చక్కగా కీర్తిస్తున్నారు .🙏 మరి ఆ చక్కని కీర్తన అర్థమును పరమార్థమును పరిశీలించుకుని పాడుకుందామా !👇 🌺🍃 ----------- 🍃🌺 🌹🌹 విచారించి చూసుకుంటే ఈ శ్రావణ బహుళ అష్టమీ తిథి బహు శుభప్రదమైనది .🙏 అదిగో తాను శంఖచక్ర గదాపద్మ పాణియైన శ్రీమన్నారాయణునిగా దేవకి వసుదేవలకు తొలుత సాక్షాత్కరించి ఆ పిదప వారికి శిశువై జనియించినాడు ఈ శ్రీ కృష్ణుడు .🙏 🌹🌹 ఆ వసుదేవుడు జన్మజన్మలనుంచీ చేసుకున్న తపములకు వరముగా అతని శిశువుగా జనియించి వసుదేవసుతం దేవం అను ప్రఖ్యాతి తెచ్చినాడు !🙏 దేవకీదేవి యెదపై భూషణమై శోభిల్లి దేవకీనందన కృష్ణ అని ప్రఖ్యాతి తెచ్చినాడు .🙏 సూక్ష్మముగా ,బహు తేలికగా , గోకులములోని అంగనల మనసులను దోచుకొని ,వారికి మంగళప్రదుడై , వారి తాళిబొట్టువలె వారి హృదయాలలో ప్రాకాశిస్తూ గోపికావల్లభ అను ప్రఖ్యాతి తెచ్చినాడు .🙏 ఇవ్విధముగా అందరినీ ఆనందపరచుటకు జనియుంచినాడు శ్రీ కృష్ణుడదిగో ! 🙏 🌹🌹 ఆ నందవ్రజమున నందగోపునకు ఎనలేని నిధియై తనకు కొడుకైనాడు . నందనందన అను ఖ్యాతి గడించి అతనిని తరింపచేసినాడు .🙏 ఇక యశోదమ్మకైతే ఏమని చెప్పేము ,ఆమె భాగ్యము అంతా ఇంతా కాదు . నిత్యము ఈ బాలకృష్ణుని సన్నిధిలోనే ఉండి అతనిని పెంచి పెద్దచేయు అదృష్టమును ప్రసాదించినాడు .ఆమెకు అదియే పూజ ,ఆతడే దైవము ! యశోదాకృష్ణ అను పేరు విడదీయలేని పేరు అయినది 🙏 ఇక గోకులములోని గోవులకు , సాధుజనులకు , అందరికీ ఇతడే రక్షకుడైనాడు .ఇతని రక్షణలో అవి వజ్రపంజరములో ఉన్నరీతి నిర్భయముగా ఉన్నవి . ఈ రీతి అతడు గోపాలబాల కృష్ణ అను ఖ్యాతి గడించి గోవులను గోపాలులనూ తరింపచేసినాడు !🙏 ఇలా అందరికీ తాను చెందిన వాడై జనియించినాడు శ్రీ కృష్ణుడు !🙏 🌹🌹 అతనిని ఆశ్రయించి అతని సేవించిన గోకుల వాసులకైతే ,ఇతడు వారిలో ఒకనిగా సులభుడై , వారి అరచేతి మాణిక్యమా అన్న రీతిన అందుబారులో ఉండి వారి బాగునంతా తానే చూసుకున్నాడు .🙏 ఇంతటివాడు ఇదిగో శ్రీ వేంకటాద్రిపై నిలిచి ఉన్నాడు ,తానే పరబ్రహ్మస్వరూపముగా .🙏 తన అంతరంగములోనే అలమేలుమంగను నిలుపుకుని , తన హృదయస్థానమును ఇచ్చి , నేర్పు మీరిన పనులనెన్నెన్నో చేయుటకు సిద్ధపడి జనియించినాడు శ్రీకృష్ణుడు !🙏 🌹🙏🌹 ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 498 ) ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏 🌹🌹 సంకీర్తన 🌹🌹
Sri Krishna Janmaashtami Greetings To Beloved Viewers And Subscribers 🙏 Best Wishes From Annamayya Akshara Vedam💐🙏 SRI KRISHNA ASHTAMI 2024 SPECIAL SERIES EPISODE - 07 🌺☘ ------------☘🌺 ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 498 ( ARAYA SRAVANA BAHULASHTAMI .. ) 🌺☘ ------------☘🌺 PREFACE :-- 🌹👇 Annamacharya is describing the significance of Sri Krishna Janmashtami in this kirtan.🙏 Who All Are uplifted by the birth of Bala Krishna and whom Little Krishna Graced is well glorified in this keertana .🙏 Here Goes The Interesting song as below !👇 🌺☘ ------------☘🌺 🌹🌹 If Observed Well ! On The Eighth Mid Night Post Full Moon Of Sraavana Month , With All The Wealthy Weapons In His Four Arms , He Showed His trace and Lord Sri Krishna Was Born !🙏 🌹🌹 He Is The Choicest Boon As A Fruit Resulted From The Penances Of Vasudeva !🙏 Appearing Passionately He Is The The Wealth Upon The Heart Of Devaki Devi !🙏 Unimepededly He Is Shining As The Holy Wedding String Of The Gokula Maidens !🙏 Such Great Lord Has Born Elegantly As The Lord Krishna ! Look There He Is !🙏 🌹🌹 He Is The Great Treasure Of Nandagopa Who Had Absolute Faith In Him !🙏 He Is Like The Godly Son To Yasoda And Her Worship Is Only His Nurturing !🙏 To The Herd Of Cattle He Is The Great Gaurdian Like A Diamond Cage !🙏 Thus Belonging To Every One This Child Was Born As Krishna !🙏 🌹🌹 To The Devotees Who Serve Him He Is Like A Perfect Ruby In Their Hands !🙏 He Is That Parabrahman Standing On The Venkatadri Hills As Sri Venkateswara🙏 As An Inner Soul He Has Placed Alamelumanga On His Heart Itself And He Was Born Here To Spread His Exceeding Deeds Showing His Courage And Strength !🙏 🌹🙏🌹 Om Sri Alamelumanga Sametha Sri Venkateswara Swaminey Namaha !🙏 🌹🙏🌹 ✍ --Venu Gopal
Sri Krishnuni greatnessnu; Adbhuthamga keerthinchina Great Sankeertana; Sri Venugopal Garu; keertana ardhamu; Paramardhamu excellentga explain chesaru; Thank you so much; very nice, Sweeya Padhyamu; beautiful drusyamalika Abhinandanalu🙏 Adbhutamga sungby Sri Balakrishna Prasad Garu and Sridevi Garu; Sri Venkatadri Sri Alamelu Manga Sri Krishna parabrahmaney Namaha🙏🙏🙏 Sri Krishna bless you
SRI KRISHNA ASHTAMI 2024 SPECIAL SERIES EPISODE - 07
🌺🍃 ------------🍃🌺
అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 498
( అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన ..)
🌺🍃 ----------- 🍃🌺
ఓం నమో వేంకటేశాయ. 🙏
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 498 కి శుభ స్వాగతం ..🙏
ప్రార్థన ః--🌹🙏
అమరిన శ్రావణ బహుళా-
ష్టమీశుభ దినమన నేడె , టక్కరి గాండ్లన్
దమనము సేయగ బుట్టె న-
సమానుడౌ బిడ్డవోలె సర్వేశ్వరుడే !!
🌹🙏🌹
✍ --స్వీయపద్యము ( కందము )
🌹🌹
శుభములను సిద్ధించిన దినమనగా ఈ శ్రావణమాసపు బహుళ అష్టమి తిథియే ! 🙏
దుష్టులు కపటులైన ఎంతొమందిని నాశానము చేయుటకు , జనియించునాడు , ఎదురులేని వాడై , చిన్ని శిశువుగా , ఆ శ్రీమన్నారాయణుడే ! 🙏
అట్టి బాలకృష్ణునకు సదా మంగళములు !🙏
🌺🍃 -----------🍃🌺
మున్నుడి ః-- 🌹👇
అన్నమాచార్యుల వారు శ్రీ కృష్ణ జన్మాష్టమి వైశిష్ట్యమును వర్ణిస్తున్నారు ఈ కీర్తనలో .
బాల కృష్ణుని జననముచే ఎవరెవరు ఉద్ధరింపబడినారో ,చక్కగా కీర్తిస్తున్నారు .🙏
మరి ఆ చక్కని కీర్తన అర్థమును పరమార్థమును పరిశీలించుకుని పాడుకుందామా !👇
🌺🍃 ----------- 🍃🌺
🌹🌹
విచారించి చూసుకుంటే ఈ శ్రావణ బహుళ అష్టమీ తిథి బహు శుభప్రదమైనది .🙏
అదిగో తాను శంఖచక్ర గదాపద్మ పాణియైన శ్రీమన్నారాయణునిగా దేవకి వసుదేవలకు తొలుత సాక్షాత్కరించి ఆ పిదప వారికి శిశువై జనియించినాడు ఈ శ్రీ కృష్ణుడు .🙏
🌹🌹
ఆ వసుదేవుడు జన్మజన్మలనుంచీ చేసుకున్న తపములకు వరముగా అతని శిశువుగా జనియించి వసుదేవసుతం దేవం అను ప్రఖ్యాతి తెచ్చినాడు !🙏
దేవకీదేవి యెదపై భూషణమై శోభిల్లి దేవకీనందన కృష్ణ అని ప్రఖ్యాతి తెచ్చినాడు .🙏
సూక్ష్మముగా ,బహు తేలికగా , గోకులములోని అంగనల మనసులను దోచుకొని ,వారికి మంగళప్రదుడై , వారి తాళిబొట్టువలె వారి హృదయాలలో ప్రాకాశిస్తూ గోపికావల్లభ అను ప్రఖ్యాతి తెచ్చినాడు .🙏
ఇవ్విధముగా అందరినీ ఆనందపరచుటకు జనియుంచినాడు శ్రీ కృష్ణుడదిగో ! 🙏
🌹🌹
ఆ నందవ్రజమున నందగోపునకు ఎనలేని నిధియై తనకు కొడుకైనాడు . నందనందన అను ఖ్యాతి గడించి అతనిని తరింపచేసినాడు .🙏
ఇక యశోదమ్మకైతే ఏమని చెప్పేము ,ఆమె భాగ్యము అంతా ఇంతా కాదు . నిత్యము ఈ బాలకృష్ణుని సన్నిధిలోనే ఉండి అతనిని పెంచి పెద్దచేయు అదృష్టమును ప్రసాదించినాడు .ఆమెకు అదియే పూజ ,ఆతడే దైవము !
యశోదాకృష్ణ అను పేరు విడదీయలేని పేరు అయినది 🙏
ఇక గోకులములోని గోవులకు , సాధుజనులకు , అందరికీ ఇతడే రక్షకుడైనాడు .ఇతని రక్షణలో అవి వజ్రపంజరములో ఉన్నరీతి నిర్భయముగా ఉన్నవి .
ఈ రీతి అతడు గోపాలబాల కృష్ణ అను ఖ్యాతి గడించి గోవులను గోపాలులనూ తరింపచేసినాడు !🙏
ఇలా అందరికీ తాను చెందిన వాడై జనియించినాడు శ్రీ కృష్ణుడు !🙏
🌹🌹
అతనిని ఆశ్రయించి అతని సేవించిన గోకుల వాసులకైతే ,ఇతడు వారిలో ఒకనిగా సులభుడై ,
వారి అరచేతి మాణిక్యమా అన్న రీతిన అందుబారులో ఉండి వారి బాగునంతా తానే చూసుకున్నాడు .🙏
ఇంతటివాడు ఇదిగో శ్రీ వేంకటాద్రిపై నిలిచి ఉన్నాడు ,తానే పరబ్రహ్మస్వరూపముగా .🙏
తన అంతరంగములోనే అలమేలుమంగను నిలుపుకుని , తన హృదయస్థానమును ఇచ్చి ,
నేర్పు మీరిన పనులనెన్నెన్నో చేయుటకు
సిద్ధపడి జనియించినాడు శ్రీకృష్ణుడు !🙏
🌹🙏🌹
ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 498 )
✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
🌹🌹 సంకీర్తన 🌹🌹
అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన
సిరులతోనుదయించె శ్రీకృష్ణుఁడిదివో
॥పల్లవి॥
వసుదేవునిపాలిటి వరతపోధనము
యెసగ దేవకీదేవి యెదపై సొమ్ము
సుసరాన గొల్లెతల సొంపు మంగళసూత్రము
శిశువై ఉదయించె శ్రీకృష్ణుఁడిదివో
॥అరయ శ్రావణ॥
నందగోపుఁడు గన్న నమ్మిన నిధానము
పొందగు యశోదకు పూజదైవము
మందల ఆవులకును మంచి వజ్రపంజరము
చెంది ఉదయించినాఁడు శ్రీకృష్ణుఁడిదివో
॥అరయ శ్రావణ॥
సేవ సేసే దాసుల చేతిలోని మాణికము
శ్రీవేంకటాద్రి నేచిన బ్రహ్మము
వోవరి అలమేల్మంగ నురముపైఁ బెట్టుకొని
చేవదేర నుదయించె శ్రీకృష్ణుఁడిదివో
॥అరయ శ్రావణ॥
🌹🙏🌹🙏🌹
Om namo venkatesaya Govinda Govinda namaste
వేణుగోపాల్ గారు మీరు 498 కీర్తనలకు అత్యద్భుతమైన వ్యాఖ్యానం అందించి ధన్యులైనారు. సదా ఆ ఏడుకొండలవాడి దయ, కరుణ మీ ఎడల ఉండాలని ప్రార్థిస్తాను.
Om NamO Venkatesaya..🙏🙏🙏❤👋Namo Annamaiah..😊
Sri Krishna Janmaashtami Greetings To Beloved Viewers And Subscribers 🙏
Best Wishes From Annamayya Akshara Vedam💐🙏
SRI KRISHNA ASHTAMI 2024 SPECIAL SERIES EPISODE - 07
🌺☘ ------------☘🌺
ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 498
( ARAYA SRAVANA BAHULASHTAMI .. )
🌺☘ ------------☘🌺
PREFACE :-- 🌹👇
Annamacharya is describing the significance of Sri Krishna Janmashtami in this kirtan.🙏
Who All Are uplifted by the birth of Bala Krishna and whom Little Krishna Graced is well glorified in this keertana .🙏
Here Goes The Interesting song as below !👇
🌺☘ ------------☘🌺
🌹🌹
If Observed Well ! On The Eighth Mid Night
Post Full Moon Of Sraavana Month ,
With All The Wealthy Weapons In His Four Arms ,
He Showed His trace and Lord Sri Krishna Was Born !🙏
🌹🌹
He Is The Choicest Boon As A Fruit
Resulted From The Penances Of Vasudeva !🙏
Appearing Passionately He Is The
The Wealth Upon The Heart Of Devaki Devi !🙏
Unimepededly He Is Shining As
The Holy Wedding String
Of The Gokula Maidens !🙏
Such Great Lord Has Born Elegantly
As The Lord Krishna ! Look There He Is !🙏
🌹🌹
He Is The Great Treasure Of Nandagopa
Who Had Absolute Faith In Him !🙏
He Is Like The Godly Son To Yasoda
And Her Worship Is Only His Nurturing !🙏
To The Herd Of Cattle He Is
The Great Gaurdian Like A Diamond Cage !🙏
Thus Belonging To Every One This Child Was Born As Krishna !🙏
🌹🌹
To The Devotees Who Serve Him
He Is Like A Perfect Ruby In Their Hands !🙏
He Is That Parabrahman Standing On
The Venkatadri Hills As Sri Venkateswara🙏
As An Inner Soul He Has Placed
Alamelumanga On His Heart Itself
And He Was Born Here To Spread His Exceeding Deeds
Showing His Courage And Strength !🙏
🌹🙏🌹
Om Sri Alamelumanga Sametha
Sri Venkateswara Swaminey Namaha !🙏
🌹🙏🌹
✍ --Venu Gopal
Sri Krishnuni greatnessnu; Adbhuthamga keerthinchina Great Sankeertana; Sri Venugopal Garu; keertana ardhamu; Paramardhamu excellentga explain chesaru; Thank you so much; very nice, Sweeya Padhyamu; beautiful drusyamalika Abhinandanalu🙏 Adbhutamga sungby Sri Balakrishna Prasad Garu and Sridevi Garu; Sri Venkatadri Sri Alamelu Manga Sri Krishna parabrahmaney Namaha🙏🙏🙏 Sri Krishna bless you