Vandanam Sri Krishna (వందనం శ్రీకృష్ణ మోహనా !) | Lyrical Video Song - 149 | Singer: Geetha Madhuri
HTML-код
- Опубликовано: 19 ноя 2024
- జ్ఞానవాహిని శ్రోతలకు, వీక్షకులకు అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భముగా శుభాకాంక్షలు!
త్రైతసిద్ధాంత భగవద్గీతయందు "3"వ అధ్యాయము జ్ఞానయోగము కాగా, "6"వ అధ్యాయము విజ్ఞానయోగము. ఈ వందనం.. పాట సందర్భానుసారమును చెప్పుకున్న యెడల, "వినయము"తో కూడిన "జ్ఞానమే" విజ్ఞానమగును. ఆత్మకు వంగి చేయునది వందనము, గురువువద్ద వంగి ఉండునది వినయము.
వందనము అను పదమును "వన్ + ధనము" అని విడదీసిన యెడల, వినయముతో చేకూరు జ్ఞాన ధనమే ఈ వందనము అని తెలియుచున్నది. ద్వితీయ దైవగ్రంథములో మత్తయి సువార్తలో 19 : 23 , 24 వచనములలో శ్రీ క్రీస్తు ప్రభువు తన శిష్యులతో మాత్రమే నిశ్చయముగా చెప్పిన మాట "ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము" అని. ఇక్కడ ధనవంతుడు అంటే జ్ఞానవంతుడు అనుకుంటే, ఎవరైతే ఆత్మజ్ఞానమును కొంత తెలిసి తనను తాను జ్ఞానవంతునిగా అనుకుంటాడో, అతడు పరలోకాధిపతియైన గురువును పొందలేడు.
"ధనమెక్కిన మదమెక్కును" అని పెద్దలన్నట్లు, జ్ఞానము తెలియు శిష్యునికి గర్వము (మదము) ఎక్కినయెడల, తాను జ్ఞానవంతుడనను అహము కల్గును. అట్టి గర్వాహముచే వినయము కోల్పోయిన దానివలన, అతడు గురువును పొందలేక ఎన్నో జన్మలను ఎత్తవలసి వచ్చుచున్నది. అందుకే గీతలోని విజ్ఞాన యోగమున 19 వ శ్లోకములోనే "ఆత్మజ్ఞానవంతుడు ఎన్నో జన్మలు పొంది చివరకెప్పుడైతే గురుదేవుడే సర్వమని తలుస్తాడో, అప్పుడే ఆయనను పొందగలడు. అట్టివాడు ఎంతో దుర్లభముగా లభించును" అన్నాడు ఆ కృష్ణ పరమాత్మ.
"గురువుకు గర్వము... శిష్యునకు వినయము" స్వభూషణములు.
అందుకే దేహమున సప్తాంగములైన సప్తాత్మలను పొందికూడా, గర్వమునొందక.. అష్టాంగమునకై సంపూర్ణ వినయముతో వేడువానికి "సాష్టాంగ పడగల" అవకాశము ఆ గురుదేవుడు ప్రసాదించుటయే కాక, అట్టి శిష్యరత్నము యొక్క విజ్ఞానమును మెచ్చినవాడై.. ఆయనే ఇష్టముతో తన హృదయమున చేర్చుకొనును.
అష్టమైన ఆ గురు ఆత్మను ఇష్టపడువాడు సాష్టాత్ముడగును (స+అష్ట ఆత్ముడు). అతనిని ద్వేషించువాడు నష్టాత్ముడగును (న+అష్ట ఆత్ముడు).
తనను తాను తగ్గించుకొనువాడు... హెచ్చింపబడును అంటే ఇది కదా! ... ఇదే కాదా ?
ఈ అష్టమిన... శ్రీ క్రీస్తుయైన కృష్ణునిగా నాకు దర్శమిచ్చిన నా ఆనందగురువునకు ఇవే నా సర్వాంగమైన సాష్టాంగ దండ ప్రణామములు !!!
TEAM:
Lyricist - Siva Krishna Kogili
Singer - Geetha Madhuri
Music - Nagesh
Co-ordination - NR Chaitanya Kumar, Nandini
Video Composition - Saleem
Production & Presented By - Gnanavaahini Channel
సాకీ:
జ్ఞానజన్మంబులనెన్నో బొంది పొంది ...
తుదకు బ్రాప్య బ్రాపాకంబుల సర్వంబునూ ...
వాసుదేవుడేనని తలచి ... కొలచి..
ఓ కృష్ణా ... నీకే నా వందనమ్ము అర్పించితినీ .....
నీకే నా అభివందనము అర్పించితిని !!!
కోరస్:
అష్టమి దినమున .. సృష్టిని సలిపిన కృష్ణా నీకే వందనము
శిష్టుని మనమున ... దృష్టిని నిలిపిన నీకే నా అభివందనము
పల్లవి:
వందనం శ్రీకృష్ణ మోహనా ... వందనం నిజ జ్ఞాన వాహనా
వందనం సాష్టాంగవందనం వందనం
వందనం దేహాంగ ధారణా . వందనం శివలింగ స్థాపనా
వందనం సర్వాంగవందనం వందనం
సప్తమి నరముల నారదుడై . సప్తమి గ్రంథుల సారథుడై
గుప్తము చూపే సత్త్వము నీవే . వందనం
అష్టమ గర్భము జనియించి . అష్టమి తిథినధిరోహించే
ఇష్టదైవమా నీకే నా అభివందనం ..అభివందనం
వందనం శ్రీకృష్ణ మోహనా.. వందనం నిజ జ్ఞాన వాహనా
వందనం సాష్టాంగవందనం వందనం ... ఓఓఓఓఓ
వందనం దేహాంగ ధారణా వందనం శివలింగ స్థాపనా...
వందనం సర్వాంగవందనం వందనం...
కోరస్:
కరమున గ్రోవము .. శిరమున కౄశము కలిగిన కృష్ణా వందనము
నళమున నాదము .. గళమున గ్రంథము చెలిగిన నీకభివందనము
చరణం 1:
పరమాత్మే భగవానునిగా ... వసుదేవునికే సుతుడవగా
ప్రభవించిన శ్రీ వాసుదేవుడా! వందనం
ప్రకృతియే తన భగమవగా... దేవకిదేవీ గర్భముగా
ప్రసవించిన ఓ దేవదేవుడా! వందనం
యదూవంశాన ఉదాయించావు యాదవుడ నీవుగా
మందగోవులను మందలించావు మాధవుడ నీవుగా
గొల్లకులములో చల్లవెన్నలా చోరుడే నీవుగా
ఉల్లమందునా పిల్లగ్రోవితో గోరుడే నీవుగా
శీర్షముపై శిఖిపింఛము దాచని సఖుడా వందనం
అస్ఖలనముగా యోగముసలిపిన ముఖుడా వందనం ... అంతర్ముఖుడా వందనం !!!
వందనం//
వందనం కలికాల వేషణా ... వందనం గురులీల పోషణా...
వందనం సర్వాంగవందనం వందనం...
కోరస్:
అస్త్రము శస్త్రము ... హస్తము బూనని కృష్ణా నీకే వందనము
అస్థిగ త్రైతము ... మస్తము గురిగొను నీకే నా అభివందనము
చరణం 2:
ధర్మస్థాపనే ధ్యేయముగా ... ద్వాపరయోగమే ద్వారముగా
దూతగ వచ్చిన గీతాచార్యా! వందనం
వేదావాదము యజ్ఞముగా.. దానాతపమును భగ్నముగా
చేయగ వెలసిన త్రైతాచార్యా! వందనం
సదాచారాన్ని సుబోధించావు సత్తువే నీవుగా
పరంధామాన్ని ప్రబోధించావు ఆత్మవే నీవుగా
అధర్మాలన్ని నిరోధించావు తత్త్వమే చూపగా
ఆత్మయోగాన్ని ప్రసాదించావు త్రైతమే చాటగా
కాలమె నీవుగ కాయము దాల్చిన కాలుడా వందనం
మాకే అందక మాయలు చేసే జాలుడా వందనం ... మాయాజాలుడా వందనం !!!
వందనం శ్రీకృష్ణ మోహనా ... వందనం నిజ జ్ఞాన వాహనా
వందనం సాష్టాంగవందనం వందనం ... ఓఓఓఓ
వందనం పరధర్మ శోషణా... వందనం గురు జ్ఞాన భాషణా
వందనం సర్వాంగవందనం వందనం...
శిష్టుల పాలి రక్షకుడై ... దుష్టుల పాలి శిక్షకుడై
సృష్టిని ఏలే సత్యము నీవే వందనం
జ్ఞానుల మదిలో చేరుడవై ... అజ్ఞానులకతి దూరుడవై
ప్రాణదైవమా నీకే నా అభివందనం ... అభివందనం
వందనం //
వందనం పరధర్మ శోషణా... వందనం గురు జ్ఞాన భాషణా
వందనం సర్వాంగవందనం వందనం...
వందనం పరధర్మ శోషణా... వందనం గురు జ్ఞాన భాషణా
వందనం సర్వాంగవందనం వందనం...
అష్టోత్తర శత నామం:
గీత మాధుర్యమును మతికందజేయగా
త్రైత భావము క్షితిన బల్కినావు
జ్ఞాత జ్ఞేయమునొందుచూ మృతము కోరగా
స్మ్రుతిన గురువై నిల్చినావు కృష్ణా ! శ్రీ కృష్ణా ...
వందనం//4
ఏలేలో ఏలో ఏలో ఏలేలో ... ఏలేలో ఏలో ఏలో ఏలేలో
కంస మర్దనా .. గోప వర్ధనా .. హే జనార్దనా వందనం
రుక్మి కూలకా .. సత్య పాలకా .. నంద బాలకా వందనం
దేవకీసుజా .. యశోదాత్మజా .. యాదవాగ్రజా వందనం
యమునబృందయా.. మాధవప్రియా.. మధురనాధాయ వందనం
భీష్మ సమ్మతి.. ధర్మశ్రీ ధృతి.. ద్వారకాపతి వందనం
పార్థసారధి ... మోక్షవారధి .. గీతాప్రబోధి వందనం
ఏలేలో ఏలో ఏలో ఏలేలో ... ఏలేలో ఏలో ఏలో ఏలేలో