Vandanam Sri Krishna (వందనం శ్రీకృష్ణ మోహనా !) | Lyrical Song - 151 | Sravana Maasa Amavasya Spl

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025
  • జ్ఞానవాహిని శ్రోతలకు, వీక్షకులకూ అందరికీ శ్రావణ అమావాస్య సందర్భముగా శుభాకాంక్షలు!
    వినయముతో కూడి చేయు వందనము మరియు శ్రీకృష్ణునికి చేయు సాష్టాంగ వందనమును గురించిన సమాచారమును ముందు వచ్చిన వందనము పాట description లో కొంత వరకు చెప్పుకున్నాము. అయితే ఈ గీతంలో మరొక ప్రత్యేకత ఏమి అంటే! "సర్వాంగ వందనము" అను మరొక పదము రావడమే.
    ఇక్కడ సర్వాంగ వందనమును గమనిస్తే, జీవాత్మ తన శరీర గీత హద్దులోని జ్ఞాన ప్రయాణములో భాగముగా, మొదట సాష్టంగ వందనము చేయుట కొరకు, శరీర సాంఖ్యాన్నంతా తెలుసుకుని, జ్ఞానిగా మారి, మొత్తము శరీరమంతా వ్యాపించిన ఆత్మ శక్తిని అధ్యయనము చేసుకుంటూ లోనికి వెళ్ళి, యోగిగా మారి బ్రహ్మనాడిలోనికి ప్రవేశించి అంతర్ముఖుడై, ఏడు అంగములుగా (మధ్యాత్మగా) వున్న తన బ్రహ్మనాడిని, ఆదిగురువు యొక్క అనుమతితో ఆయన దీవించగా అధిష్టించి, అటు పిదప కూడా ఇంకా వినయముతో కూడి పైకి వెళ్ళే విధానము వుంది.
    దీనినే వేమనయోగి తన పద్యములో ఇలా అన్నారు:
    ఈశ్వరుని దలంప నేడు పాళ్ళుగ జేసి
    తనదు మూర్తినెల్ల ధారబోసి
    నిత్యకర్మమునను నిల్చురా నెఱయోగి
    విశ్వదాభిరామ వినుర వేమ!
    కనుకనే, "తద్విద్ధి ప్రణిపాతేన" అని భగవద్గీతలో (జ్ఞానయోగం 34వ శ్లోకములో) అన్నారు. అనగా గురువు కొరకు ప్రాణమును సహితము విడిచి సాష్టాంగపడుట. మధ్యనాడిలో ప్రయాణిస్తూ అష్టమి దాకా వెళ్ళడము ఒక విధానము కాగా, అష్టమికి చేరాక మళ్ళీ క్రిందకో, లేక ఇంకా పైకో పోయే విధానము కూడా ఒకటి కలదు.
    అష్టమి దాకా వెళ్ళిన తరువాత అక్కడ సరైన శిష్య (శిశు) విధానము లేని వానిని, గురువు మళ్ళీ క్రిందకి పంపే అవకాశము వుంది. కావున, పరమాత్మ స్వరూపమైన గురువుకు తాను తన సర్వాంగములు సమర్పించి సూన్యముగా ఉండి, ఆ గురువును తన పంచభూతముల అంగములో ప్రతిష్టించుకోగలగడమే అసలైన నవమి.
    అయితే ఇక్కడ సర్వాంగ వందనము చేయడము అంత సులభము కాదు. ఈ సందర్భములో కూడా "అష్టమి కష్టము, నవమి నష్టము" అన్న నానుడిని అన్వయించుకొనవచ్చును.
    అష్టమి అనేది ద్వారము కాగా ఆ ద్వారానికి అధిపతి గురువు.
    "యోహాన్ సువార్త 10:8. ― గొఱ్ఱెలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు."
    మార్గము ద్వారా గురువునే వెనక్కి నెట్టి వారు ముందు వస్తారు కాబట్టి అటువంటి వారిని దొంగలు దోచుకొనువారు అన్నారు. కాబట్టి 8 వారికి కష్టంగా మారి దాని తరువాత పొందవలసిన 9 నష్టము అయిపోయినది, అందుకే నవమి నష్టము అన్నారు. అలా కాకుండా ఈ అష్టమిని ఇష్టపడు వారికి ఇష్టదైవము 8 అవగా ప్రాణదైవము 9 అవుతుంది. కాబట్టి "ప్రణిపాతేన" లాగా ప్రాణముతో సహా 8 లో చచ్చినవానివలె పడిపోవడమే "శివలింగ స్థాపనం". అటువంటి వాడు సర్వాంగ వందనము చేయగలిగి ఆ గురువు యొక్క దశ దిశా వ్యాపకం తెలుసుకుని దశాంగ నమస్కారము చేయగలిగి దైవమును పొందగలడు.
    అహంకార రహితమే పూర్ణ శిష్యత్వము. అందుకే, శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారు, "అత్తపత్రి-కలబంద" అను కథలో, ఒక గురువుకు గల ఏడుగురు శిష్యులకూ అత్తపత్రి వలె అహంకార రహితులు కండి అని శతవిధాలా చెప్పియున్నారు.
    TEAM:
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Nandini
    Music - Nagesh
    Co-ordination - NR Chaitanya Kumar
    Editing - Sai Songa
    Production & Presented By - Gnanavaahini Channel
    సాకీ:
    జ్ఞానజన్మంబులనెన్నో బొంది పొంది ...
    తుదకు బ్రాప్య బ్రాపాకంబుల సర్వంబునూ ...
    వాసుదేవుడేనని తలచి ... కొలచి..
    ఓ కృష్ణా ... నీకే నా వందనమ్ము అర్పించితినీ .....
    నీకే నా అభివందనము అర్పించితిని !!!
    పల్లవి:
    వందనం శ్రీకృష్ణ మోహనా ... వందనం నిజ జ్ఞాన వాహనా
    వందనం సాష్టాంగవందనం వందనం
    వందనం దేహాంగ ధారణా . వందనం శివలింగ స్థాపనా
    వందనం సర్వాంగవందనం వందనం
    సప్తమి నరముల నారదుడై . సప్తమి గ్రంథుల సారథుడై
    గుప్తము చూపే సత్త్వము నీవే . వందనం
    అష్టమ గర్భము జనియించి . అష్టమి తిథినధిరోహించే
    ఇష్టదైవమా నీకే నా అభివందనం ..అభివందనం
    చరణం 1:
    పరమాత్మే భగవానునిగా ... వసుదేవునికే సుతుడవగా
    ప్రభవించిన శ్రీ వాసుదేవుడా! వందనం
    ప్రకృతియే తన భగమవగా... దేవకిదేవీ గర్భముగా
    ప్రసవించిన ఓ దేవదేవుడా! వందనం
    యదూవంశాన ఉదాయించావు యాదవుడ నీవుగా
    మందగోవులను మందలించావు మాధవుడ నీవుగా
    గొల్లకులములో చల్లవెన్నలా చోరుడే నీవుగా
    ఉల్లమందునా పిల్లగ్రోవితో గోరుడే నీవుగా
    శీర్షముపై శిఖిపింఛము దాచని సఖుడా వందనం
    అస్ఖలనముగా యోగముసలిపిన ముఖుడా వందనం ... అంతర్ముఖుడా వందనం !!!
    వందనం కలికాల వేషణా ... వందనం గురులీల పోషణా...
    చరణం 2:
    ధర్మస్థాపనే ధ్యేయముగా ... ద్వాపరయోగమే ద్వారముగా
    దూతగ వచ్చిన గీతాచార్యా! వందనం
    వేదావాదము యజ్ఞముగా.. దానాతపమును భగ్నముగా
    చేయగ వెలసిన త్రైతాచార్యా! వందనం
    సదాచారాన్ని సుబోధించావు సత్తువే నీవుగా
    పరంధామాన్ని ప్రబోధించావు ఆత్మవే నీవుగా
    అధర్మాలన్ని నిరోధించావు తత్త్వమే చూపగా
    ఆత్మయోగాన్ని ప్రసాదించావు త్రైతమే చాటగా
    కాలమె నీవుగ కాయము దాల్చిన కాలుడా వందనం
    మాకే అందక మాయలు చేసే జాలుడా వందనం ... మాయాజాలుడా వందనం !!!
    వందనం శ్రీకృష్ణ మోహనా ... వందనం నిజ జ్ఞాన వాహనా
    వందనం సాష్టాంగవందనం వందనం ... ఓఓఓఓ
    వందనం పరధర్మ శోషణా... వందనం గురు జ్ఞాన భాషణా
    వందనం సర్వాంగవందనం వందనం...
    శిష్టుల పాలి రక్షకుడై ... దుష్టుల పాలి శిక్షకుడై
    సృష్టిని ఏలే సత్యము నీవే వందనం
    జ్ఞానుల మదిలో చేరుడవై ... అజ్ఞానులకతి దూరుడవై
    ప్రాణదైవమా నీకే నా అభివందనం ... అభివందనం
    వందనం //
    వందనం పరధర్మ శోషణా... వందనం గురు జ్ఞాన భాషణా
    అష్టోత్తర శత నామం:
    గీత మాధుర్యమును మతికందజేయగా
    త్రైత భావము క్షితిన బల్కినావు
    జ్ఞాత జ్ఞేయమునొందుచూ మృతము కోరగా
    స్మ్రుతిన గురువై నిల్చినావు కృష్ణా ! శ్రీ కృష్ణా
    ఏలేలో ఏలో ఏలో ఏలేలో ... ఏలేలో ఏలో ఏలో ఏలేలో
    కంస మర్దనా .. గోప వర్ధనా .. హే జనార్దనా వందనం
    రుక్మి కూలకా .. సత్య పాలకా .. నంద బాలకా వందనం
    దేవకీసుజా .. యశోదాత్మజా .. యాదవాగ్రజా వందనం
    యమునబృందయా.. మాధవప్రియా.. మధురనాధాయ వందనం
    భీష్మ సమ్మతి.. ధర్మశ్రీ ధృతి.. ద్వారకాపతి వందనం
    పార్థసారధి ... మోక్షవారధి .. గీతాప్రబోధి వందనం
    ఏలేలో ఏలో ఏలో ఏలేలో ... ఏలేలో ఏలో ఏలో ఏలేలో

Комментарии •