బసవ పురాణంలో ఏముంది? | Basava Puranam Story | Rajan PTSK

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • పాల్కురికి సోమనాథుడు రచించిన ఈ బసవ పురాణం ఒక ద్విపద కావ్యం. ద్విపద అనేది మన తెలుగులో ఓ ఛందోరీతి. ఈ ద్విపద పద్యానికీ రెండే పాదాలుంటాయి. పాడుకోవడానికి చాలా హాయిగా ఉండే ఈ ద్విపదలకు కావ్య గౌరవం కల్పించిన కవి పాల్కురికి సోమనాథుడు. 12వ శతాబ్దానికి చెందిన ఈ మహాకవి శివ కవిత్రయంగా పేరుమోసిన ముగ్గురు కవులలో ఒకడు. మిగిలిన ఇద్దరూ నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అనే కావ్యాలు సోమనాథుని తెలుగు సాహిత్యంలో చిరంజీవిని చేశాయి. ఈ కవి మన తెలంగాణాలో వరంగల్లుకు సమీపంలో ఉండే పాల్కురికి అనే గ్రామంలో పుట్టాడు. సోమనాథుడు తెలుగులోనే కాదు కన్నడ, సంస్కృతాలలో కూడా రచనలు చేసిన మహాకవి.
    ఇక బసవపురాణం విషయానికి వస్తే.. ఇందులో బసవేశ్వరుని చరిత్రతో పాటూ బెజ్జమహాదేవి, కన్నప్ప, సిరియాళుడు మొదలైన ఎందరో శివభక్తుల కథలున్నాయి. బసవేశ్వరుడు 12వ శతాబ్దానికి చెందిన చారిత్రక పురుషుడు. ఆ బసవేశ్వరుడు మరణించిన కొద్దికాలానికే పాల్కురికి సోమనాథుడు జన్మించాడు. అందుకే బసవపురాణంలో విషయాలు అసలు చరిత్రకు చాలా దగ్గరగా ఉండవచ్చన్నది పరిశోధక పరమేశ్వరులైన వేటూరి ప్రభాకరశాస్త్రి గారి మాట. ఇక కథలోకి వెళదాం.
    #basavapuraana #basaveshwara #lordshivastatus

Комментарии • 46

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 Год назад +8

    Basava పురాణం మొత్తం వివరించ ప్రార్థన

  • @sureshmaripelly5654
    @sureshmaripelly5654 Год назад +9

    మీ దయ వల్ల నేను చదువుకున్న పాఠాలు స్పురణకు వస్తున్నాయి.. ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @madhukuthati9022
    @madhukuthati9022 Год назад +13

    గురువు గారు మీరూ అంటే నాకు అమితమేన ప్రేమ, గౌరవం. మీరు చెప్పిన కాశీ మజిలీ కథలు నాకు చాలా నచ్చింది. నేను కన్నులారా చూసినట్లు అనిపించింది. మీరు చెప్పే ప్రతి కథ, కావ్యం, పద్యాలు, నవలలు, నాటకాలు నాటికలు చాలా ఇష్టం. మీరూ ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తారా అనీ చూస్తూ ఉంటా గురువు గారు.

  • @madhukuthati9022
    @madhukuthati9022 Год назад +4

    మీరు చెప్పిన. కన్యాశుల్కం నాటకం కథ. ఆ నాటకం లో నేను కూడా ఉన్నటు. ఆ కథ నా ముందే జరిగినట్లు ఉంటది మీరు చెప్తుంటే ❤❤❤ చాలా ధన్యవాదాలు. నేను తెలుగు పండిట్ చేశాను. గురువు గారు. మీరు. ఇంక కొన్ని కాశీ మజిలీ కథలు చెపండి గురువు గారు. నాకు గురుకుల exam's ఉన్నాయి అని మీ వీడియోస్ చూడటం కుదరటం లేదు కాని అంతకు ముందు. చూసిందే చూసేవాడిని గురువు గారు. ఐన చూడకుండా ఉండలేను కూడా

  • @gram1037
    @gram1037 Год назад +2

    ముందుగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
    మీరు మంచి మంచి గ్రంథాలు యొక్క వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను.....

  • @vkrm2000
    @vkrm2000 8 дней назад +1

    ఓం నమః శివాయ ❤❤❤❤

  • @mahendraaralingam7470
    @mahendraaralingam7470 Год назад +3

    గొడగూచి కథ నా చిన్నతనంలో పాఠము గా వచ్చింది.ఆ కథ మరలా నాకు లభ్యము కాలేదు.మీరు నాయందు దయవుంచి గొడగూచి గురించి వి వరించగలరు.నేటికీ ప్రదేశము వుందని చెప్తారు.అది ఎక్కడుందో చెప్పగలరు.ధన్యవాదములు.

  • @suneetha3106
    @suneetha3106 Год назад +4

    పింగళి సూరన కలపూర్ణోదయం వీడియో చెయ్యండి సార్ 🙏🏻

  • @vinodkumarbatthula9255
    @vinodkumarbatthula9255 Год назад +7

    చిలకమర్తి లక్ష్మనరసింహం గారి, గయోపాఖ్యానం గురించి చెప్పండి sir..

  • @anilkumarpodishetty2172
    @anilkumarpodishetty2172 Год назад +3

    ధన్యున్ని ప్రభు భక్తిరస కథామృతాన్ని నాకు అనుగ్రహించినందుకు🙏🙏🙏

  • @MrRamsairahul
    @MrRamsairahul Год назад +2

    Me Telugu Sahithya sevaki dhanyavadamulu

  • @mastermiss802
    @mastermiss802 Год назад +2

    Highschool lo maa Telugu mastergaru cheppina pathalu gurthu vasthunnai sir .. thankyou

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 Год назад +2

    మీ పాదాలకు నమస్కారం

  • @nainaboinasuresh1005
    @nainaboinasuresh1005 Год назад +2

    ధన్యవాదాలు గురువుగారు

  • @satyakaamesh2634
    @satyakaamesh2634 Месяц назад

    చిన్నప్పుడు చదివిన పద్యాలు గుర్తు వచ్చాయి 😢

  • @prakashrao8077
    @prakashrao8077 3 месяца назад

    Can’t thank you enough. Best wishes

  • @srinivaskasivajhala5533
    @srinivaskasivajhala5533 3 месяца назад

    చాలా బాగా వివరించారు

  • @SaragondaDharanivijay
    @SaragondaDharanivijay 2 месяца назад

    Sir miru chala Baga chepthunaru tq sir

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 Год назад +1

    Guruvugariki munduga namaskaram chala rojula tharuvtha vintunna katha manasuki chala santhosh agam undi

  • @SubbaraoMachineni
    @SubbaraoMachineni Год назад +1

    Excellent video sir bout Basavapuranam thank you Sir, 👍👍👍👍🙏👍🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 4 месяца назад

    అయ్యా సాహిత్య వజ్రాలు మాకు పంచుతున్నందుకు. శతధా ధన్యవాదాలు

  • @mkrishna1062
    @mkrishna1062 Год назад +1

    Super ga vunnaadi sir

  • @sidhapuramnaresh3937
    @sidhapuramnaresh3937 Год назад +1

    Thank you Guruju🎉👌🤗👍

  • @vamseemohan6594
    @vamseemohan6594 Год назад +1

    ధన్య వాదాలు

  • @jhansilakshmibhai7783
    @jhansilakshmibhai7783 Год назад +1

    Chala Baga chepparu sir

  • @vijayabhaskar6746
    @vijayabhaskar6746 Год назад +1

    Super sir chala baga cheparu

  • @klramachandrareddyramachan3032
    @klramachandrareddyramachan3032 Месяц назад +1

    బసవపూరణము బుక్కు ఎక్కడా దొరుకుతుంది . అన్నా చెప్పాండి

  • @VenkatJamalpuram
    @VenkatJamalpuram 10 месяцев назад +1

    E pusthakam Akkadaina vunte vivaralu teliyajeyagalaru

  • @JanakiramayyaK-hw7xv
    @JanakiramayyaK-hw7xv 7 месяцев назад

    ధన్య వాదములు జీ

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 Год назад +1

    Namskaram Gurg. Super Analysis 👌

  • @sreenivastirumalasetty8945
    @sreenivastirumalasetty8945 6 месяцев назад

    Ayya namakaskaram, dhanaya vaadalu🙏

  • @singapuramakhila3793
    @singapuramakhila3793 Год назад +1

    Super👌👌👌👌

  • @mssharma1510
    @mssharma1510 Год назад +1

    తేట తెలుగు కవి సోమనాథుడు. ఇంకోమాటలో ద్రావిడ తెలుగు కవి.

  • @jathindrasarmamodukuri4983
    @jathindrasarmamodukuri4983 2 месяца назад

    బసవ పురాణం ఆసక్తిగా చివరివరకూ చదివేను. గానీ ఆఖరున సోమనాధుడు విష్ణు భక్త నింద చేస్తాడు. మంచి భోజనం చేసేక తాంబూలంలే రాయి పంటిలో పడ్డట్టయింది

  • @matam.viswanathamatam.visw837
    @matam.viswanathamatam.visw837 3 месяца назад

    మీకు ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బసవడు పాలననలో ముఖ్యమైనది "అనుభవమండపం" మరిచారు

  • @mallikarjunreddy2418
    @mallikarjunreddy2418 5 месяцев назад

    ఓం నమః శివాయ

  • @ramakagayathri9509
    @ramakagayathri9509 Год назад +1

    👌👌👌👌🙏

  • @shantiramana9868
    @shantiramana9868 Год назад +1

    🙏🙏

  • @mouliswarreddy
    @mouliswarreddy Год назад +2

    Manimegalai Tamil story ni Telugu lo cheppandi sir

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 Год назад

    Guruvugaru 🙏, mail ID ivvagalaru...!!

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Год назад +1

    చిరుతొండనంబి కుమారుడు సిరియాళుడు కదా ? గురువు గారు

    • @Ajagava
      @Ajagava  Год назад +3

      బసవపురాణం ప్రకారం చిరుతొండనంబి అనే శివభక్తుడే సిరియాలుడండి.
      "నంచితమతి సిరియాలుండు నాఁగఁ - గంచిలో నిత్య జంగమము లేవురకు
      నిష్టాన్నపానాదులీప్సితార్థములు - దుష్టిగా నందిచ్చుశిష్టవ్రతమునఁ
      జరియించుచుండంగ సర్వేశ్వరుండు - సిరియాలు భక్తిలోఁ తరయఁగఁ దలఁచి
      కృతక తపోధనాకృతి నేఁగుదేర - హితజంగమార్థమై యేతెంచి...." అంటూ బసవపురాణంలో సిరియాలుని కథ మొదలవుతుంది.
      అయితే ఆ తరువాత కాలంలో శ్రీనాథ మహాకవి హరవిలాసాన్ని రచించాడు. ఆ కావ్యం ప్రకారం చిరుతొండనంబి సిరియాలుడు తండ్రీ కొడుకులు.

  • @krishnaveni3739
    @krishnaveni3739 Год назад +1

    👃👃👃

  • @kondadhoddivenkatreddy8978
    @kondadhoddivenkatreddy8978 Год назад +1

    🙏🙏🙏

  • @prasadlcs7051
    @prasadlcs7051 Год назад

    🙏🙏🙏