ఆరుద్ర సరదా కవితలు | Arudra Sarada Kavitalu | Arudra Funny Poems | Rajan PTSK | Ajagava

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024
  • “సంతకం అక్కరలేని కవి ఆరుద్ర - అంత్యప్రాసలే ఆయన వాలుముద్ర”
    అని తమ స్నేహితుడి కోసం రమణీయంగా మురిసిపోయారు బాపురమణలు. అంతేనా! ఆయనతో ఎన్నో పాటలు రాయించుకున్న అనుభవంతో…
    “మాటలు పన్‌నడంలో గడసరి
    పాటలు పేనడంలో పొడగరి
    అర్జంటు రచనల్లో కూడామరి
    అరమెరుపైనా - తప్పనిసరి” అని తమ ఆస్థాన కవీశ్వరుడిని పొగడ్తల్లో ముంచెత్తారు.
    తన జీవితకాలంలో కొన్ని దశాబ్దాలను పరిశోధనకై కేటాయించి, మనకు సమగ్రాంధ్ర సాహిత్యాన్ని అందించిన మహానుభావుడాయన.
    “నువ్వు ఎక్కదలచుకొన్న రైలు
    ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు” అంటూ మొదలు పెట్టి,
    “నువ్వు వెళ్ళదలచుకొన్న ఊరు
    నువ్వు బతికుండగా చేరదా రైలు” అంటూ తన “త్వమేవాహమ్‌” కావ్యంలో నవీన జీవిత ఘోషను తేలికగా, లోతుగా వినిపించిన అభ్యుదయ కవి మన ఆరుద్ర.
    అటువంటి ఆరుద్రగారి రచనలలోనుండి, కొన్ని సరదా కవితలను, ఇంకొన్ని హృదయాన్ని తట్టే కవితలను ఈరోజు చెప్పుకుందాం.
    Rajan PTSK
    #RajanPTSK #Arudra #Telugu

Комментарии • 78

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 7 месяцев назад +1

    Ajagava channel's efforts to diffuse the sweetness of the Telugu poetic magics to the lovers .lt is appreciable and inevitable Long live this channel

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 Год назад +1

    ఆరుద్ర గారి సరదా కవితలు చాలా చాలా బాగా వివరించారండీ.అనేక అభినందనలండీ.

  • @kameswaripeesapati5258
    @kameswaripeesapati5258 4 года назад +2

    గురువుగారు దయచేసి గమనించగలరు చాలా రోజులైంది కాశీ మజిలీ కథలు విని

    • @Ajagava
      @Ajagava  4 года назад

      కాశీమజిలీ కథలు రెండవ సంపుటి నాలుగైదు రోజులలో మొదలవుతుందండి.

  • @cvslsastry3790
    @cvslsastry3790 4 года назад +4

    ధన్యోస్మి. చాలా బావున్నాయి కవితలు.
    చిన్న సలహా. బాలుగారి మాట చెప్పండి.
    లోకసమస్త సుజనా భావంతు.
    సర్వే సుజనా సుఖినా భవంతు అని.
    దుర్మార్గులు కూడా బావుంటే లోకమేల బావుంటుంది అయ్యా.

  • @subramanyamreddy8617
    @subramanyamreddy8617 4 года назад +2

    సొంపైన ఆరుద్ర గారి సరదా కవితలను ఇంపుగా వినిపించి నందులకు ధన్యవాదము.

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 3 года назад +3

    మంచి హృద్యంగా ఆ తేనెపలుకులకు కొంచెం కారం చల్లారు ... అందరికీ రుచించడానికి ..

  • @satyavathipagadala3825
    @satyavathipagadala3825 4 года назад +7

    Excellent sir...excellent collection...varu rasindi emo kani meeru vinipistunte vinasompu ga vundi..👌👌👏
    .

    • @Ajagava
      @Ajagava  4 года назад +1

      Thank you andi

  • @goforgreat7131
    @goforgreat7131 4 года назад +1

    Chala bagundhi guruvugaru.
    Kavithallo rakalu yenni
    Aadhunika Kavitha
    Prachina Kavitha
    Vachana Kavitha
    Abhyudaya Kavitha
    Asu Kavitha
    Viplava Kavitha
    Sthree Kavitha
    Kavyam
    Asalu veeti nibandhanalu yemiti, asalu thedalu yemiti
    Dayachesi vivarinchagalaru
    Ardhisthunnanu🙏🙏
    Dhanyavadamulu

  • @kommukarthik7872
    @kommukarthik7872 3 года назад +3

    సూపర్ అన్నా, మీరు ఇలాంటి పాతవి ఇప్పుడు మాకు తెలియచేస్తూ ఉండాలి ,ధన్యవాదాలు.

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 года назад +1

    మీ ప్రతీ వీడియో ప్రసంశనీయమే🙏🙏🙏

  • @mastermaster5442
    @mastermaster5442 4 года назад +2

    Tq guruji

  • @bhramarapadmanabhuni6729
    @bhramarapadmanabhuni6729 4 года назад +3

    కవితలు చదివే కంటే వింటేనే బావుంటాయి మీ నోటివెంట అవి ఇంకా బాగున్నాయి మా శ్రోతలను ఆరుద్రగారి కవితలతో ఇంకా రంజింపజేశారు.
    కృతజ్ఞతలు

    • @Ajagava
      @Ajagava  4 года назад

      🙏

    • @bhramarapadmanabhuni6729
      @bhramarapadmanabhuni6729 4 года назад +1

      శుభోదయం గురూజీ,
      నాకు మీ శిష్యరికం చేయాలని ఉంది. మీరు ద్రోణాచార్యులు అయితే నేను ఏకలవ్యుని అంతా శ్రద్ధ చూపించగలను నమ్మకం గా చెబుతున్నాను. గురుదక్షిణగా బొటనవేలు కోరుకునే అవకాశం ఇవ్వను. నాకు మీరు చెబుతున్న పద్ధతి చాలా చాలా నచ్చింది మీతో మాట్లాడాలని ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మీ ఫోన్ నెంబర్ ఇస్తారా నాకు ఏమి నేర్చుకోవాలి ఉందో మీకు తెలియజేస్తాను .ఇప్పుడు నేను తెలుగు పుస్తకాలు చదువుతున్నాను. నాకు కొంచెం ఎలాంటి పుస్తకాలు చదివితే నాకు జ్ఞానం పెరుగుతుందో మీలాంటి వాళ్ల సలహాలు కావాలి.
      కృతజ్ఞతలు

    • @Ajagava
      @Ajagava  4 года назад

      ముందుగా మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదములు భ్రమర గారు.
      నేను చదివిన పుస్తకాలలో కొన్నింటిని గురించి కొంతకాలం క్రితం మన "అజగవ"లో ఒక వీడియో పెట్టానండి. ruclips.net/video/LIYRpGwXiy8/видео.html
      నా facebook లో కూడా పాత తరానికి చెందిన మంచి పుస్తకాలను పరిచయం చేస్తుంటాను. మీకు ఆసక్తి ఉంటే నా FaceBook link: facebook.com/rajan.kinige/
      మీకు ఇంకా నానుండి తెలుగు సాహిత్యానికి సంబంధించిన సహాయం ఏమన్నా కావాలనుకుంటే.. Ptskrajan@gmail.com కు మెయిల్ చెయ్యండి.

    • @bhramarapadmanabhuni6729
      @bhramarapadmanabhuni6729 4 года назад

      ధన్యవాదాలు,
      మీరు పెట్టిన ఆ పుస్తకాలు నేను చూశాను అందులో కొన్ని పుస్తకాలు కూడా నా దగ్గర ఉన్నాయి కానీ నేను అంత పర్ఫెక్ట్ గా చదవలేదు .నాకు బాగా మీ దగ్గర నేర్చుకోవాలి అనే విషయం ఏమిటంటే మీరు ఆడియో లో చెప్తే పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది .నేను ఒక మోటివేషన్ ట్రైనర్.
      కానీ నేను ను అందరికీ ఉచితంగానే క్లాసులు చెప్తాను దానివల్ల నేను కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను ఇప్పుడు మహాభారతం రామాయణం భాగవతం ఇంకా బాగా తెలుసు కోవాలని ప్రయత్నిస్తున్నాను ఆ ప్రయత్నంలోనే నాకు మీ ఛానల్ తెలిసింది .నేను ఇప్పుడు నా తృప్తి కోసం చాలా సాహిత్య విషయాలు తెలుసుకుంటున్నాను .

  • @sharmilap6950
    @sharmilap6950 4 года назад +1

    Chaala a bagunnayi andi.

  • @ARaju-io1ek
    @ARaju-io1ek 2 года назад +1

    Super 👌👌

  • @vshyamkumar976
    @vshyamkumar976 Год назад

    Nice to hear . Nice interests and nice video making . Thank you 💐💕 .

  • @medemenagamuralinarasimhar4321
    @medemenagamuralinarasimhar4321 3 года назад +1

    Okkate cheppagalanu.....Adbutaha

  • @ushabhamidi8380
    @ushabhamidi8380 2 года назад +1

    Nice

  • @haragopaltata8411
    @haragopaltata8411 4 года назад +2

    కవితలు అద్భుతంగా ఉన్నాయి.
    ఒక చోట అఋణ అని వ్రాసారు.
    రెండు అచ్ఛులు పక్కపక్కన రావడం నేనెప్పుడూ చూడలేదు.

    • @Ajagava
      @Ajagava  4 года назад +4

      🙏
      సంస్కృతంలో "అఋణి" అన్న మాట ఉందండి, అప్పులేనివాడు అన్న అర్థంలో.

  • @malliksripathi8401
    @malliksripathi8401 3 года назад +1

    Thank you

  • @swamybvr6281
    @swamybvr6281 3 года назад +1

    Fantastic.

  • @ksrinivas6682
    @ksrinivas6682 3 года назад +1

    AMMA NAA BANGARU KVITHALAA

  • @SasiKumar-xx3qk
    @SasiKumar-xx3qk 3 года назад +1

    Excellent

  • @rangavajjula1941
    @rangavajjula1941 4 года назад +1

    🙏🙏🙏

  • @satyakorada4585
    @satyakorada4585 3 года назад +1

    👏👏👏👏

  • @saiprathyushadth1577
    @saiprathyushadth1577 4 года назад +1

    కాశీ మజిలీ కథలు వారానికి రెండు కథలు చెబుతున్నారు ఈ వారంలో ఆ రెండు కథలు కూడా లేవు తర్వాత ఏమైందో తర్వాత ఏమైంది అని ఆతృతతో ఎదురుచూస్తున్న వాళ్ళం మా కోసం వన్ మిగతా కథ కొనసాగించవలసిందిగా కోరుతున్నాం

    • @Ajagava
      @Ajagava  4 года назад

      కాశీమజిలీ కథలు రెండవ సంపుటి నాలుగైదు రోజులలో మొదలవుతుందండి.

  • @gnannavaaniforcompititivee6144
    @gnannavaaniforcompititivee6144 4 года назад +1

    Namaskaram guruji

  • @brundavanamprasanna3404
    @brundavanamprasanna3404 4 года назад

    🙏

  • @rajaraop2560
    @rajaraop2560 4 года назад +1

    Great !

  • @koragangadhar5648
    @koragangadhar5648 4 года назад +1

    Good sar

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 4 года назад +2

    Namaskaram gurvu garu🙏

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 4 года назад +1

    super

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 года назад +1

    Thank you rajan garu please update balence stories of kasi majili katalu

    • @Ajagava
      @Ajagava  4 года назад

      కాశీమజిలీ కథలు రెండవ సంపుటి మరో అయిదారురోజులలో మొదలు పెడతానండి.

    • @RAMPRASAD-ep6uw
      @RAMPRASAD-ep6uw 4 года назад +1

      @@Ajagava alaage sir

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 2 года назад +1

    ఎప్పుడో ఐఏఎస్ కి చదివిన ఆరుద్ర పుస్తకాలను గుర్తుకు తెచ్చారు

  • @gnvivek
    @gnvivek 2 года назад +1

    sir, please let us know books names also, from which you have collected these, memu kuda chaduvukuneki baguntundi. Dhanyavaadalu sir

  • @sknagulmeera9633
    @sknagulmeera9633 4 года назад +1

    Best telugu novels gurinchi chepandi sir. Life ni chadivinattu vundali. Life lo use vundali. Intelligent ni ivali.

  • @namanipadmavathi7000
    @namanipadmavathi7000 4 года назад +2

    नमस्कार अग्रजा..🙏
    यह क्या..?
    जिस चानल " राजन जी" का है
    उस में समय की कमी क्यों ।
    जो रहा कई किस्सों से भरा खजाना
    उस में कामेंट्स की कमी क्यों ।।
    इसलिए मैं ही रख दी पहली comment..

  • @mohinireddy2244
    @mohinireddy2244 4 года назад +2

    Kasimajili Katha lo pettandi plZ

    • @Ajagava
      @Ajagava  4 года назад

      కాశీమజిలీ కథలు రెండవ సంపుటి నాలుగైదు రోజులలో మొదలవుతుందండి.

  • @pawanchaganti7667
    @pawanchaganti7667 4 года назад +1

    Sirivennela sitharama sasthri gari gurinchi okka vdo gurujee

    • @Ajagava
      @Ajagava  4 года назад

      తప్పకుండా ప్రయత్నిస్తానండి!

  • @prashanthkumar5551
    @prashanthkumar5551 3 года назад +3

    రాజన్ గారు
    మీరు కర్నూల్ వాస్తవ్యలు. అవునా?

  • @ebodhan4488
    @ebodhan4488 4 года назад +2

    వీటి సేకరణ మికేలా సాధ్యం? అజగవ రాజన్ గారు.
    నాకు తెలియకుండా మీ అభిమానిని అవుతున్నాను.,,

    • @Ajagava
      @Ajagava  4 года назад +1

      ధన్యవాదములండి.

  • @dandibhotlanarayanamurthy9978
    @dandibhotlanarayanamurthy9978 Месяц назад +1

    , 🙏🙏🙏🙏✍️🙏🙏🙏

  • @chanduazad6403
    @chanduazad6403 4 года назад +1

    Sir kasi majili stories upload cheyyendi sir... Please....🙏🙏🙏

    • @Ajagava
      @Ajagava  4 года назад +2

      కాశీమజిలీ కథలు రెండవ సంపుటి నాలుగైదు రోజులలో మొదలవుతుందండి.

  • @swethasridharachary6613
    @swethasridharachary6613 4 года назад +2

    kashi majili kathalu cheppandi guruji antoooo aduruchustunnanu

    • @Ajagava
      @Ajagava  4 года назад +1

      కాశీమజిలీ కథలు రెండవ సంపుటి మరో అయిదారురోజులలో మొదలు పెడతానండి.

    • @swethasridharachary6613
      @swethasridharachary6613 4 года назад

      ok guruji

  • @chmaheshyadavap5748
    @chmaheshyadavap5748 3 года назад +1

    Please xpline

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 3 года назад +1

    Some body commented some of his poems as “ Arudra 6 Dra 7 PU !

  • @saisreekar4996
    @saisreekar4996 4 года назад +1

    Sir please upload kasi majili katalu please sir it is my humble request

    • @Ajagava
      @Ajagava  4 года назад

      కాశీమజిలీ కథలు రెండవ సంపుటి నాలుగైదు రోజులలో మొదలవుతుందండి.

    • @saisreekar4996
      @saisreekar4996 4 года назад +1

      Ok sir thank you so much

  • @rampradeep.k6953
    @rampradeep.k6953 3 года назад +1

    రాజన్ అంటే సంస్కృతంలో మహారాజు అని అర్థం అది తమిళం కాదు

  • @apparaoapparao8338
    @apparaoapparao8338 4 года назад +2

    మిత్రమా మన్నించండి, కాశీ మజిలీ కథలు, మరిచారా

    • @Ajagava
      @Ajagava  4 года назад

      కాశీమజిలీ కథలు రెండవ సంపుటి అయిదారు రోజులలో మొదలు పెడతానండి.

  • @ananthalakshmi8186
    @ananthalakshmi8186 3 года назад +2

    Gunde vaakili talupu tattanu Rama Lakshmi ni pattanu

  • @lokeswarimatam1619
    @lokeswarimatam1619 4 года назад +1

    Kasi Majili kosam subscribe cheskonna

    • @Ajagava
      @Ajagava  4 года назад

      కాశీమజిలీ కథలు రెండవ సంపుటి మరో అయిదారురోజులలో మొదలవుతుంది 🙏

  • @vmch
    @vmch 4 года назад +1

    🙏🙏🙏