Mahamantri Timmarusu Songs - Mohana Raagam Aha - N.T. Rama Rao, Devika

Поделиться
HTML-код
  • Опубликовано: 16 дек 2024

Комментарии • 498

  • @krishnakanthsbk1336
    @krishnakanthsbk1336 2 года назад +57

    మోహన రాగమహా మూర్తిమంతమాయె
    మోహన రాగమహా మూర్తిమంతమాయె…
    నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే
    మోహన రాగమహా.. మూర్తిమంతమాయె..
    చరణం: 1
    చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
    ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ…ఆ…
    చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
    సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియేయనగా..
    మోహన రాగమహా… మూర్తిమంతమాయె
    చరణం: 2
    నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
    ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ…ఆ..
    నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
    ఆరాధించిన ప్రియభావమిలా పరవశించెననగా…
    మోహన రాగమహా… మూర్తిమంతమాయె

  • @kumarsubraveti
    @kumarsubraveti Год назад +17

    చిత్రసీమలో వెలయగచేసి దివ్య గానమున జీవము పోసి..
    ఈ ఒక్క వాక్యము చాలు ఈ పాట ఎంత మధురమైనదో అనడానికి...

  • @durgadevi7814
    @durgadevi7814 Год назад +12

    నాకే తెలియక నాలో సాగే ఆలాపనాలకే రూపము రాగా...
    మోహన రాగం లో అద్భుతమైన గీతం.

  • @bhaskarmukti6410
    @bhaskarmukti6410 3 месяца назад +12

    దైవ దత్తమైన ఈ దివ్య గాత్రాలకు విలువ కట్టగలవారెవ్వరు???

  • @hariprasadkamalur4662
    @hariprasadkamalur4662 3 года назад +65

    మోహన రాగాన్ని ఒక సమ్మోహనాస్త్రం చేసి మనందరి పైన వదిలారు. విన్నప్పుడల్లా అది మనల్ని సమ్మోహితుల్ని చేస్తుంది.

  • @valmiki527
    @valmiki527 Год назад +17

    పాత పాటలు వింటూ పరలోక ప్రాప్తి పొందాలని కోరిక ♥️♥️♥️

  • @murthysen
    @murthysen 3 года назад +14

    పాట ఆరంభం లో వచ్చే ఆలాపన ఎంత హాయిగా ఉంటుందో.సాహిత్యము,సంగీతం శ్రావ్యాతి శ్రావ్యము.ఒకప్పుడు తెలుగు సినీజీవులకు చక్కని అభిరుచి ఇప్పుడు అది ఏమయిందో. అర్ధం కాదు.చక్కని గీతాల్ని అభిమానించే వారు అప్పుడూ ఇప్పుడూ ఉన్నారనడానికి సాక్ష్యం ఈ పాటకి వచ్చిన కామెంట్లు,వ్యూస్ చాలు.

  • @venkatk1968
    @venkatk1968 Год назад +23

    ఒకప్పుడు ఇలాంటి పాటలు వినేవాడిని కానీ అంతలా ఆస్వొదించేవాడిని కాదు. ఇప్పుడు నాకు దాదాపు 55 .. ఎంతో ఇష్టంగా ప్రతీ పంక్తి ధ్యాసగా వింటున్నాను. వయసు పరిణితి రావాలనుకుంటా ఇంతటి గొప్ప రచనలు అర్థం చేసుకోవాలంటే!

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Год назад +1

      అవును సార్ .నేను 57. అయితే 7 వ ఏట నుండే అభిరుచి వుంది ఈ అమృత భాండాలపై '🙏

    • @parthab3169
      @parthab3169 3 месяца назад

      Nowords to explainsuchbuetyfulsong

  • @nanirajee7286
    @nanirajee7286 2 года назад +23

    మోహన రాగం సమ్మోహనరాగం, అలసిన హృదయాలకు ఓ పిల్లతెమ్మర తాకుతూ వెళితే ఎలా వుంటుందో ఆలా ఉంటుంది, పాట ఆలపించిన, గాయని గాయకులకు స్వరకర్తలకు ఏ మిచ్చి ఋణం తీర్చుకోగలం ఈ తెలుగుప్రజలం

  • @venkatachalam2586
    @venkatachalam2586 Год назад +28

    తెలుగు భాషలోని తియ్యదనం వేరే యే భాష లోన లేదు వీనుల విందయిన సంగీతం 👌👌👌👌👌

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +7

    ఓమ్ నమశ్శివాయ.
    ఈ పృద్వి మీదే యిన్ని వాయిద్య పరికరాల ను ప్రసాదించా రే, మీ దేవలోకం లో ఇంకెన్ని అద్భుత
    వాయిద్య పరికరాలు వున్నాయో! ఆహా! పరమేశ్వరా! మీ లీలలే అద్భుతం తండ్రీ!
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🙏🕉️🌺🌿🌺🌺🌺

  • @kriskary2
    @kriskary2 3 года назад +63

    తెలుగుదేశం లో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది, ఈ లాంటి పాటలు మా సొంతం అయినందుకు,జన్మలో మరువలేని మధుర గీతలు

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 года назад +23

    ఎంత గొప్ప మధురమైన పాట ఎంత చక్కని పింగళి నాగేంద్రరావు ' గారి సాహిత్యం / గొప్ప గా చిత్రించి న అద్భుత దృశ్యం / N. T రామారావు ' దేవిక మ్మ గార్ల అద్భుత మైన ' నటన సుశీలమ్మ / ఘంటసాల మాస్టా ర్లు పోటీ పడి అత్యద్భుతమైన పాటని సంగీత ప్రియుల వీనులకు కానుక గా అందించినారు సదా!ఇక సంగీత దర్శకుడైన పెండ్యాల నాగేశ్వరరావు గారి ప్రతిభకు ఆకాశమే హద్దు . ఎన్నో ' ఎ న్నెన్నో అద్భుతమైన, అమృత తుల్యమైన పాటలను మన కు అందించి తన ప్రత్యేకత ను గొప్పగా చాటుకుని, చిరంజీవియై నిలిచారు కదా సంగీత ప్రియుల గుండెల్లో ' /' దర్శకునికి యూనిట్ సభ్యులందరికి నా శాత సహస్ర ధన్య వాదములు . ఈ పాట వినటము ఒక మరుపురాని మధురానుభూతి . మల్లికార్జున బెంగుళూరు / 24 - 09 - 2020 /. అందుకే పాత పాటలు అంటే నాకు సాక్షాత్తూ ఆ భగవంతుని స్వరాపు లైన చిన్నపిల్లలం త ప్రీతి, ప్రేమ ముద్దు / ముద్దు . అంతే గాక మాధుర్య ప్రధాన మైన ప్రతి పాట అది క్రొత్తదైనా పాతదైనా ' ఉత్తమ సాహిత్య విలువలతో కూడిన ప్రతి పాట , మాధుర్య ప్రధాన మైన ప్రతి పాట నాకు ఎంతో ' ఎంతెంతో ముద్దు ముద్దు ముద్దు . గోల పాటలు, ఆ సభ్యకరమైన పాటలు / ద్వంద్వార్థాల దరిద్రపు పాటలు / బూతు పాటలు / పిచ్చి కూతలు / వెర్రికేకలు / చెవులు రంద్రాలు పడేంత భయంకరమైన సంగీత వింత శబ్దాల పాటలు / బీట్ (అనగా కొట్టడము ) పాటలు అస్సలు వద్దే వద్దు వద్దు ముమ్మాటికి వద్దే వద్దు . ఈ గొప్ప చెత్త లక్షణాల గల పాటలు దైవ స్వరూపులైన పసి పిల్లలు విన్నచో ఏకబిగిన ఏడువు లంగించు కొని ' ఆ దైవము కన్నా ఎన్నో రెట్లు అధికమైన మా తృ మూర్తిని అయో మయము లోపడవైచి ఆనక తెలిసిన తర్వాత ఆమె కోపముతో పెట్టే చివాట్లు, శాపా నర్థాలకు గురియై ఇబ్బంది పడుదురు కదా, ! కనుక ఆ తల్లి తన శిశువును నిద్రపుచ్చుటకు ఎంతో తాదాత్మ్యంతో , అనురాగముతో / తీయనైన కంఠ స్వరముతో మధురాతి మధురముగా ఆలపించే స్థాయిలో వున్న ఆ పాత మధురాల నే ఇష్టపడుదురు కదా. శిశువు లే కాదు బాల బాలికలు , యువతీ యువకులు , మధ్య , వృద్ధ వయస్కులు / పశువులు / పక్షులు 1 ముక్కోటి దేవతలు సైతం ఇష్టపడు దురు కదా! కొత్తదనము పేరు తో భాష ఏమా త్రము తెలియని / అంతంత మాత్రమే సంగీత జ్ఞాన మే వున్న సంగీత దర్శకుల బాణిలో పాడిస్తే, ఓటు డబ్బాలో గులక రాళ్ళ ను సగము మాత్రమే నింపి గిలకరిస్తే వచ్చే శబ్దము విని గాడిదలు సైతం దూరంగా పారిపోయి ఆనక వెనక్కి తిరిగి చూసుకొని _ ఈ పాట కన్నా మా ఓండ్రింపే(ఏఏ - అనే అరుపు) బహు బాగు బాగు అని తమలో తాము సర్ది చెప్పుకొని నెమరు వేసుకొంటూ నెమ్మదిగా తమ తిండి ని వెదుక్కొ 0 టూ బయలు దేరి పోవును కాబోలు . ఇక వ్యక్తిగతము గా పై నవవరించి న ఆ పాట లను నేను తప్పనిసరి యై వినవలసివస్తే - కల్లు త్రాగిన కోతి కి తేలు కుట్టి దయ్యము పట్టినట్లు వు 0 డును కదా నా పరిస్థితి . ఆ హా ఎంత గొప్ప అనుభవము దీనిని కూడా
    చచ్చే వరకు జడుసుకొని మరువను గా క మరువను గాక మరువను కదా. జీవితము పైన విరక్తి సైతం కలుగు నే మో కదా ! నమస్సులతో - మల్లికార్జున బెంగుళూరు - 01 - 10- 2020 / .

  • @dkr8489
    @dkr8489 2 года назад +116

    పల్లెటూరులో నిండు వేసవిలో పండు వెన్నెల్లో ఆరుబయట నులక మంచం పై పడుకొని ఈపాట వింటుంటే స్వర్గం లో వున్నట్టు వుంటుంది

    • @subbu2024
      @subbu2024 Год назад +5

      excellent words. cool life 30 year back. Village life golden life

    • @BalavirupakahiNayudu
      @BalavirupakahiNayudu 11 месяцев назад +4

      అబ్బ. భలే చెప్పావు అన్న

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 9 месяцев назад +2

      Yes. Too happy

    • @SriSri-lo3iv
      @SriSri-lo3iv 8 месяцев назад +3

      బాగా చెప్పారు

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 8 месяцев назад +2

      One of. My favorite masterpiece.🙏🏼👍💐

  • @uobulesusasikiran8605
    @uobulesusasikiran8605 4 года назад +49

    విజయనగర సామ్రాజ్యం నిజంగా ఇలానే ఉండేది అనెంతగా మరిపిస్తుంది ఈ సినిమా.

  • @challasatyam
    @challasatyam 3 месяца назад +3

    అద్భతమైన గానం, అందమైన నటన, అందరూ మహానుభావులు.

  • @jujare1
    @jujare1 Год назад +11

    The beautiful lady on-screen looks majestic and regal. The voice of the singer lady is crystal clear and super sweet. Both the ladies rock.

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 года назад +24

    మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు... బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను

    • @amarnathk3284
      @amarnathk3284 Год назад

      చనిపోయారు అన్నారు
      ఎప్పుడు ??? తెలుగు వారి
      గుండెలలో రక్తమై ప్రవహిస్తున్నారు

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 года назад +8

    Pedyala ,Ghantasala,Suseela garlaku🍀🍀🍀🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 года назад +13

    చిక్కటి పాల లాంటి, అద్భుతమైన గాత్రమున్న సుశీల కెందుకు భారత రత్న ఇవ్వలేదు? పీల గొంతుకలకిచ్చినపుడు?

  • @jagannathamkondagari7378
    @jagannathamkondagari7378 2 года назад +2

    మధురమైన అనుభూతి కలుగుతుంది ఓల్డ్ సాంగ్స్ వింటూనే ఉన్నాం

  • @bhuvaneswarchickentraders8716
    @bhuvaneswarchickentraders8716 3 месяца назад +3

    కల కవితా తెర మాటున దాగిన నీ అందానికి ఈ మోహన రాగాలాపన

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 2 месяца назад +3

    మోహనమే సమ్మోహనం!!! సూపర్

  • @jeevansagionlyfarmers8654
    @jeevansagionlyfarmers8654 2 года назад +17

    దివ్య గానమున జీవం పోసి ప్రేయసీ యనగా
    మోహనరాగఘహ మూర్తిమంతమాయే
    ఈ రాగం లో తేనేలున్నాయా వీల్ల గొంతులో తేనెలూరుతున్నాయా!అధ్భుత గానం

    • @avenugopalarao
      @avenugopalarao Год назад

      Memorable. Cannot be scratched in South Indian music. Mugdha Mogana Ragam. Great.

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 лет назад +36

    నాకే తెలియక నాలో సాగే అలపణలకు
    రూపము రాగా, ఎంత అపూర్వమైన, మాటల చాతుర్యం, ఎంత సొంపుగా పాడారు, దివ్యమూర్తులు, ప్రణామాం.💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @hemanth7119
      @hemanth7119 6 лет назад

      శ్రీజ సాకేపురం గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అద్భుతమైన గీతాన్ని ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @admoaikboosters8101
      @admoaikboosters8101 5 лет назад

      U

    • @rameshanumula4992
      @rameshanumula4992 4 года назад

      Aaa padhaala kurpu , sangeetham, abhinayam oho varnanaatheetham

    • @mallikarjunaraomandapati3309
      @mallikarjunaraomandapati3309 4 года назад

      “నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకు రూపము రాగా”

    • @salalagolden8294
      @salalagolden8294 3 года назад +1

      @@hemanth7119
      నమస్కారం హేమంత్ సార్..🙏🏼🙏🏼🙏🏼
      నేను యస్మిన్ బాగున్నారా సార్, బదులు ఇవ్వండి....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 4 месяца назад +4

    సుందరమైన, అందమైన వీనులవిందైన సంగీతం.

  • @munikrishnanandi418
    @munikrishnanandi418 Год назад +3

    Ee janmalo ika ilanti sumadura Sangeetam yappatiki vinalemu

  • @rambevara5702
    @rambevara5702 2 года назад +11

    Ntr devika deadly combination..made for each other

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 4 года назад +31

    A classic song by Ghantasala mastaru and susheelamma! Beautiful picturization and decent performance by great NTR garu and Devika garu!

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama Месяц назад +2

    నీవు రావు... నిదుర రాదు.. ...
    ఎదురుచూసి ఎదురుచూసి. కన్నుదోయి అలసిపోయే...

  • @mahalingammp
    @mahalingammp Год назад +1

    స్వర్గంలో దేవతలు భూమిపైకి వచ్చి అమృతాన్ని మనకు అందించారు. ఆహా అద్భుతం ఈ మధుర గానం

  • @krishnaraobudithi1659
    @krishnaraobudithi1659 4 месяца назад +3

    మనసు హాయిపొందే పాట.

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 4 года назад +11

    నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపమురాగా.... What a lovely duet.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 года назад +14

    మోహన రాగం 👌గంటసాల గారు, సుశీల గార్లku🙏

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 4 года назад +4

    మృదుమధురమైన సంగీతస్రవంతి లో హాయిగా ,అలా.. అలా..అలలపై ఓలలాడుతూ..తేలియాడుతూ..సాగిన
    గానం.అక్షరాలను లాలనగా...తనస్వరంలో మృదువుగా పలికిస్తూ...ఘంటసాల, సుశీల గానం,చేస్తే వారి స్వరఝరికి ఏవిధంగానూ..తగలకుండా..ఎంతో సున్నింతంగా..పువ్వు కి సుగంధంలా..సంగీతం అందించారు పెండ్యాల నాగేశ్వరరావు గారు. మన అదృష్టం.

  • @mcramu6209
    @mcramu6209 2 года назад +9

    What a melodious song. Sweet romantic between NTR and devika. Photography awesome

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 года назад +22

    Thank God, technology was mature enough long back to preserve these golden voices, an eternal fountain of melody, for future generations.

    • @KapZoom
      @KapZoom 11 месяцев назад

      Just imagine being stuck with the false voices of these days!!!

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 Год назад +3

    దేశ భాషలందు తెలుగు లెస్స

  • @ajay1124
    @ajay1124 4 года назад +6

    ఎంతో చక్కని పాట - మనసుని ఆహ్లాద పరిచింది

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 3 года назад +14

    మోహన రాగం నిజంగా మూర్తీ మంతం అయింది...🙏

  • @raghurambabladi1633
    @raghurambabladi1633 4 года назад +10

    "Mohana Raga Maha"....For this song ALONE, Susheelamma Gaaru......deserved BHARATA RATNA....In my opinion, she is not an ordinary human being.She is from a different celestial world. An reincarnation with an "amsha" of some celestial Gandharva of Deva Loka....No language or vocabulary in this world would suffice to extol her super natural pure 24 carat GOLDEN VOICE. Simply spell binding..

  • @gajavellisrinivasachary4360
    @gajavellisrinivasachary4360 3 года назад +6

    అతి మధురాతి మధురమైన పాట

  • @subbarao1989
    @subbarao1989 3 месяца назад +1

    Pata పాటలు వింటూ వుంటే జీవితం లో అన్నీ బాధలు మర్చిపో తాను

  • @vsssarma
    @vsssarma 2 года назад +4

    Saahityam, sangitham, Ragam, gaanam….all top class…

  • @chandrasekhararaoguntupall6125
    @chandrasekhararaoguntupall6125 2 года назад +1

    Ee patalo prathi amsam amogham. Matlu chalavu varnincha daniki 👍👍👍👌👌👌🙏🙏🙏

  • @settipallikulindareddy442
    @settipallikulindareddy442 4 месяца назад +2

    God gift ghantasala.

  • @MrDvramanarao
    @MrDvramanarao 2 года назад +8

    Lyrics, composition, rendition by singers, ambience, performances are par excellence. Just watch and listen, Is there a heaven like this ?

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 4 года назад +3

    మోహనరాగమహా... మూర్తిమంతమాయే... ఆలాపన ఒక్కటి చాలదా జీవితం పులకించుటకు.

  • @balajitravelhub2123
    @balajitravelhub2123 7 лет назад +24

    చిత్ర సీమలో వెలయగజేసి దివ్య గానమున జీవముపోసి సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసి యే యనగా.........పింగళి గారూ ఏమి కల్పనా చాతుర్యము

  • @drvrkrishna
    @drvrkrishna 6 лет назад +16

    Ntr coming from photo into screen as side shot is excellent idea. Lyric supports the shot .. Chitraseemalo velayaga chesi divya ganamuna jeevamu posi..
    Reflects creative ideas generated and executed to perfection in those days. Salute to all.

  • @durgaprasad-lx3df
    @durgaprasad-lx3df Год назад

    Adhbutham Saahityam, swara kalpana, abhimayam...... All are So Nice.... 🙏

  • @vu0303
    @vu0303 6 лет назад +25

    These wonderful artists - Pendyala, Ghantasala, Pingali, NTR, Devika - physically may not be with us, always in our hearts. Hats off to Pendyala garu, a true legend of Telugu cinema music

  • @pandurangahubli79
    @pandurangahubli79 3 года назад +11

    My favorite Telugu song. Beautifully picturised. Ghantasaala and P. susheela duet songs are evergreen.

  • @chinthasreenivasreddy6256
    @chinthasreenivasreddy6256 3 года назад +14

    Legendary NTR, ghantasala, suseelamma. Great song 🙏.

  • @somasundergutala
    @somasundergutala 8 лет назад +23

    Superb Ghantasala Suseela duet for Master actor NTR.

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 6 месяцев назад

    ఎన్నిమార్లు విన్నా తనివితీరని ఈ మధుర గేయం అందించిన అలనాటి మేటి కళాకారులందరికి జోహార్లు.
    నిజంగా రేడియో తప్ప మరొక సాధనం లేని గతకాలంలో ఈ మాధురిని ప్రశాంత వాతావరణంలో విన్న రోజులు ఇంకా గుర్తుకు వస్తున్నాయి.
    ఒక రకంగా చెప్పాలంటే చెవులతో మాత్రమే ఆలకించి... అందులోని సారాంశాన్ని, సన్నివేశాల్ని ఎవరి మనసుకు, ఊహకు అందినంత మేర ఆనందించడంలో ఉన్న మజాయే వేరు.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 9 месяцев назад +1

    Miss Anna garini,Devika amma nu. 🍀🙏🏼🙏🏼🌼💐

  • @VijayVijay-ty7dh
    @VijayVijay-ty7dh 2 года назад +5

    N T R గారు అచ్చు శ్రీ కృష్ణదేవరాయల అనిపిస్తుంది

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 4 года назад +5

    మోహనరాగమహా మూర్తిమంతమాయే... అద్భుత కల్పన. ఆ... ఆ... చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవము పోసి...

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 лет назад +39

    "చిత్ర సీమలో వెలయగ జేసి దివ్య గానమున జీవము పోసి ఆ....
    సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియే యనగా..." తెలుగుజాతికే అభిమాన గాయనీ గాయకులు ఘంటసాల - సుశీలగా‌ర్ల దివ్య గానం, అపర శ్రీ కృష్ణ దేవ రాయలు ఎన్.టి.ఆర్-దేవికగార్ల అద్బుత అభినయం ప్రేక్షకులకు కనుల పండగ కాక ఏ మౌతుంది?!

  • @sreenivassirvatsa7554
    @sreenivassirvatsa7554 3 года назад +4

    Most melodious singers ghantasala master &p.suseelamma garu!!👍👍

  • @satishnagella4382
    @satishnagella4382 4 года назад +17

    The most favourite song of mine is only this one. Hat's off to ghantasala, suseela and N. T. R. Devika.

  • @kasiramakrishna7203
    @kasiramakrishna7203 2 года назад +10

    A Top Classic Song for ever. Thanks to the entire team behind making this including technicians and non technicians Sri. Gantasala Garu and Susheelamma Talli given life to it. Hats off to the composer.

  • @shivasankar7545
    @shivasankar7545 2 года назад +3

    LEGENDARY MUSIC COMPOSER SRI PENDYALA NAGESWARA RAO GAARIKI PADABHIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandramoulimarachapu6897
    @chandramoulimarachapu6897 8 лет назад +78

    మ్……ఆఆఆ…
    మోహన రాగమహా…. మూర్తిమంతమాయే….
    మోహన రాగమహా…. మూర్తిమంతమాయే….
    నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే….
    మోహన రాగమహా…. మూర్తిమంతమాయే….
    ఆఆఆ......
    చిత్రసీమలో వెలయగ జేసి
    దివ్య గానమున జీవము పోసి
    ఆఆఆ....
    చిత్రసీమలో వెలయగ జేసి
    దివ్య గానమున జీవము పోసి
    సరసముగా నను చేరగ బిలిచే
    ప్రేయసి యేయనగా.....
    మోహన రాగమహా…. మూర్తిమంతమాయే….
    నాకే తెలియక నాలో సాగే
    ఆలాపనలకే రూపము రాగా....
    ఆఆఆ....
    నాకే తెలియక నాలో సాగే
    ఆలాపనలకే రూపము రాగా....
    ఆరాధించిన ప్రియ భావమిలా
    పరవశించెననగా....
    మోహన రాగమహా…. మూర్తిమంతమాయే….

  • @Bts78905
    @Bts78905 2 года назад +3

    This uncomparabe melodius song will take us to another world where we get fragrance of flowers and chirps sounds of birds and find nothing but swinging with full pleasure . Hats of to writer,composer singers,musicians, producer, director and camera man and unless all these people along with technicians come together such a wonderful song will never be produced.

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 5 лет назад +11

    What a song it was! and It is ! Can any one write now and sing? It is so melodious.No words to express.

  • @pullaiahcreatechannelbcm5447
    @pullaiahcreatechannelbcm5447 2 года назад +9

    What a king NTR it seems to be a real image of king

  • @avsprakash917
    @avsprakash917 8 лет назад +2

    Mohana Raagamaha......manalni veere prapanchaniki teesukoni velutundi. chakkani sahityam., sangeetham., adbhutamaina Ghanthasalavari gaanam.....teneluru Suseelamma kantham...verasi amoghamaina Telugu geetam. I really love this song.

    • @Harreduta
      @Harreduta 8 лет назад

      Thanks

    • @satishnagella4382
      @satishnagella4382 5 лет назад +1

      Excellent song which is admirable to listen for a long long time.Never forgettable song and amazing one

    • @tirunagariashok1026
      @tirunagariashok1026 4 года назад

      Mastarugariki bharatha ratna ivvali

  • @welcomegst
    @welcomegst 7 лет назад +21

    అహో ఆంధ్ర భోజా ! శ్రీ కృష్ణ దేవరాయ సార్వభౌమ ! మా నటసార్వభౌముని అప్రతిహత నటవిన్యాసం లో మీ విజయనగర సామ్రాజ్య యశస్సు ద్వేగుణీకృతమైంది ! మీ ఆహార్యం !రాజసం ! నిండైన విగ్రహం ! మా నందమూరి వారిలో చూసుకొని మురుసిపోతున్నాం !అహో నట యశస్వి మీకివే మా ఆనంద బాష్పoజలులు ! అహో ! సాహితి సమరాంగణ సార్వభౌమ ! నటసార్వభౌముని చే మీ పాత్ర ధన్యం !
    కరణం సుబ్బారావు

  • @narayanakrishnamachar1392
    @narayanakrishnamachar1392 2 года назад +5

    Excellent song for equally good actors NTR and Devika

  • @adithyadubagunta9045
    @adithyadubagunta9045 2 года назад +2

    Real ga manamu sri krishna devarayalu gari ni chudaledu kaani mana Anna garu real ga aanati krishna devarayalu gari ni manamu direct ga kallaku kattinattu ga N T R action simply superb maatalu ravadamu ledu nindaina vigrahamu chusy manamu rayala sabhalo unnamani anubhuti kalugutundi mana praykshakalu vaari batana chusi neti ki congratulations teluputhunnaru Dr Y S R garu Parliament yee cinemanu special ga chupinchnaru Telugu movie master piece this is my personal comment if any mistakes sorry Suresh dubagunta

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 9 месяцев назад

    Harmonious duet lyrical song with best
    composition.Beau tiful combination
    NTR/Devika with excited feelings.

  • @chinthasowmya1034
    @chinthasowmya1034 5 лет назад +19

    We are very proud, Ghantasala and Suseela are Telugu singers.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 года назад

    So melodious.Anna garu, Devika amma super combination. Joharlu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🍀🍀🍉🌷

  • @sarvanichejerla7086
    @sarvanichejerla7086 4 года назад +17

    Super song
    Super expressions
    Super lyrics..
    NTR.. 👌👌👌.

  • @imamhussain3667
    @imamhussain3667 6 лет назад +15

    Ramudu elage untademo krishnudu elage untademo raju aina chakravarti aina aa paatraina anna gari taruvate evadaina elanti goppa mahonnatamaina vakti mana telugu varu kavadam manam chesukunna goppa adrustam jayahooo ntr jai jai ntr jai jai ntr jai ntr

  • @vlnarasimharao7095
    @vlnarasimharao7095 3 года назад +8

    I think this is the most melodious song sung by Susbhhela and Ghantasala, written by pingali and composed by pendyala

  • @ShanguChakraGadhaPadmam
    @ShanguChakraGadhaPadmam 5 лет назад +28

    Legendary Gana Saraswathi P Susheelaji's Unparalleled Vocals! Epitome of Divinity. None before her and None after.

  • @kameswararao8977
    @kameswararao8977 4 года назад +8

    Great singing by Ghantasala and Suseela.Pendyala provided beautiful music and nice rhythm

  • @sopintivijayalakshmi7185
    @sopintivijayalakshmi7185 4 года назад +37

    Gives me more energy whenever hear this beatiful classical song. So I hear it at least once in a day. Thanks to Producer.

    • @జూపల్లి.రావు
      @జూపల్లి.రావు 4 года назад +5

      అమ్మా విజయలక్ష్మి గారికి నమస్కారం అమ్మా నేను 1969 ల నాటి కాలం వాడిని ఆనాటి ఆణిముత్యాలవంటి తెలుగు సినిమాలు మరియు ఆ సినిమాలలోని మోహన రాగమహ మూర్తి మంతమాయే వంటి మధురగీతాలు ప్రతీ రోజు రాత్రి వేళళందు చూస్తూ నిద్రలోకి జారుకుంటాను ఇంతటి ఆ పాతమధురతెలుగు గీతాలు ను అభిమానించే మీ వంటి అభిమానులు వ్యక్తం చేసే అభిప్రాయాలను చదివుతాను ఈరోజు ఈ మధుర గానం మీరు రోజూ వింటున్నామని వ్రాసారు, ఇంతచక్కటి గీతం వినే మీరు తప్పక మన తెలుగు వారే అని భావించి మీకు ధన్యవాదాలు తెలియచేసుకోంటున్నాను విజయలక్ష్మి గారు మీకు ఒక విషయం మనవి చేస్తాను నన్ను తప్పు గా అనుకోవద్దు మధురమైన ఇంత మంచి తెలుగు పాటలు రోజూ వినే మీరు మీ ఈ అభిప్రాయాలను మన తెలుగు భాషలో తెలియచేస్తే మావంటి తెలుగు భాషాఅభిమానులం ఎంతో ఆనందిస్తాం ఈ విధంగా మా అభిప్రాయం తో మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించండి

    • @lmanaraovaniggalla9098
      @lmanaraovaniggalla9098 4 года назад

      Same here👍👍🌹🌹🌹NTR,DEVIKA.

    • @srinivasderangula1961
      @srinivasderangula1961 4 года назад +1

      Wonder full voice of gantasala master and susheelamma,NTR ,Devika action is amazing

    • @venkatareddyseelam7195
      @venkatareddyseelam7195 4 года назад

      S FX

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 3 года назад

      Make teliyala nalo sage alapanaku ragamnivie🌞🌺🙏🏿

  • @ravikumar-nu4ri
    @ravikumar-nu4ri Год назад +1

    Maa amma nanna gariki Ee song chala istam❤

  • @gudditinagendra8833
    @gudditinagendra8833 6 лет назад +7

    Mohana రాగం అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా

    • @bns6354
      @bns6354 2 года назад +1

      Ippati ki dadapu enni sarlu vennano na ke thiliyadu enni sarlu vinna malli mali vinali anipinche e song mohona ragamlo undadadam na adrustam

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 6 месяцев назад

      @@bns6354same here👍☘️🍀

  • @sivareddybalinedi5522
    @sivareddybalinedi5522 2 года назад +2

    Very good and impressive the picturisation and the song. I am listening this song almost every day.

  • @srinivasapadmakar3057
    @srinivasapadmakar3057 8 лет назад +24

    Most of the above songs are highly melodious and gives pleasant feelings with heart touch.

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 3 года назад

    Aha emi mohana raagam swargamlo vunnatlu vundi ghantasaala meeku joharlu

  • @venkataramanapalisetty34
    @venkataramanapalisetty34 5 лет назад +7

    Thanking you sir. What a beautiful and melodius song. Definitely it takes to heaven when listen in isolated place.

  • @tkbalasubramanian8510
    @tkbalasubramanian8510 2 года назад +2

    Legendary singers. Have heard this countless times still not satisfied

  • @bhuvaneswarchickentraders8716
    @bhuvaneswarchickentraders8716 4 года назад +2

    నా మోహన రాగమయంలో ఎన్నో కవితా కళా రూ పాలు ప్రేయసి నీవే కదా.

  • @neelamramesh5474
    @neelamramesh5474 7 лет назад +2

    Very goog song.Ghatasala P.Susheela Exellent presentation.

  • @satyanarayanapuvvada4311
    @satyanarayanapuvvada4311 3 года назад +11

    No words to express.wonderful song.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 3 года назад +5

    It's joyous romantic melody with pleasing tune with sweet voice Ghantasala imposing on listeners

  • @jessy6603
    @jessy6603 8 лет назад +16

    So melodious and romantic . It takes you to a different world . Love is portrayed as so pure in those days .

  • @yathirajuprabhakar6169
    @yathirajuprabhakar6169 4 года назад +16

    This song is a Sanjeevani for our relieve stress and get piece of mind. Ghantasala master and susheelamma evergreen singers no words to proud of them

  • @n.krishnarao2128
    @n.krishnarao2128 5 лет назад +5

    Mohana ragaa song. Superb.🙏

  • @melkoteanandalwarshanthi6136
    @melkoteanandalwarshanthi6136 6 месяцев назад

    Suseela garu voice Devika stunning beauty... Mix.. devamrutha❤❤m

  • @yogaahkommalapati3442
    @yogaahkommalapati3442 5 лет назад +12

    Beautiful memorable Sweet song.hatsp to all legendars..Two eyes are not Sufficient to see the beauty of Dr.NTR...Devika.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 года назад +1

    So melodious. NTR,DEVIKA GARLAKU 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀🍀10-2-2022

  • @vijayasarathipamidiparthi2181
    @vijayasarathipamidiparthi2181 7 лет назад +21

    Long live Ghantasala Garu.
    Inexplicable happiness and ecstasy we feel...

  • @eemalatatarao7634
    @eemalatatarao7634 5 лет назад +11

    శ్రీ కృష్ణ దేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లేష అని ఎందుకు అన్నారో ఈ పాట విన్న వాళ్ళ కి తెలుస్తుంది. పింగళి గారికి వందనాలు

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 Год назад

      తెలుగు** లెస్స** అన్నారు. ఇప్పుడు దానిని** లెస్సు** చేస్తున్నారు.😭