చైతన్యాన్ని విస్తరించడం దీనిపై నిర్దేశిత ధ్యానం | Expansion of Consciousness | YSS

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • "చైతన్యాన్ని విస్తరించడం" పై ఈ నిర్దేశిత ధ్యానం పరమహంస యోగానందగారి పుస్తకం "మెటాఫిజికల్ మెడిటేషన్స్" నుండి ఒక దివ్యసంకల్పాన్ని ఉపయోగిస్తుంది. ధ్యానం మరియు దివ్యసంకల్పం యొక్క సరళమైన శాస్త్రీయ పద్ధతుల ద్వారా, మీరు మీ ఆత్మలో ఉండే అంతులేని ఆనందాన్ని అనుభవించడానికి అన్ని శారీరక మరియు మానసిక పరిమితులను అధిగమించి, పదార్థం మరియు మనస్సుకు అతీతంగా మీ చైతన్యాన్ని విస్తరించే మార్గాన్ని నేర్చుకోవచ్చు.
    మనము ధ్యానాన్ని ప్రారంభించే ముందు, ధ్యానం చేస్తున్నంతసేపూ మీరు ఏకాంతంగా, అవాంతరాలు లేకుండా ఉండడానికి, నిశ్శబ్దంగా ఉండే ప్రశాంతమైన ప్రదేశాన్నిఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు కూర్చోవడానికి నిటారుగా ఉండే కుర్చీని ఎంచుకోవచ్చు లేదా స్థిరమైన ఉపరితలంపై, నేలపై సుఖాసనంలో కూర్చోవచ్చు. మనం ధ్యానం మొదలుపెట్టినప్పుడు సరైన ధ్యాన భంగిమలో కూర్చోవడం చాలా ముఖ్యం. వెన్నెముక నిటారుగా, గడ్డం నేలకు సమాంతరంగా ఉండాలి, శరీరం నిశ్చలంగా, విశ్రాంతిగా ఉండాలి. కళ్ళు మూసుకుని, శ్రమ లేకుండా మీ దృష్టిని భ్రూమధ్యం (కనుబొమల మధ్య బిందువు) - ఏకాగ్రతకు, ఆధ్యాత్మిక నేత్రం లేదా దివ్య జ్ఞానానికి కేంద్రం - వద్దకు నెమ్మదిగా పైకెత్తండి. ప్రాపంచికమైన ఆలోచనలన్నిటినీ పక్కకు పెట్టండి; ధ్యాసను అంతర్ముఖం చెయ్యండి, మీ దృష్టిని ఆధ్యాత్మిక నేత్రం వద్ద కేంద్రీకరించాలని గుర్తుపెట్టుకోండి. అన్ని రకాల చింతలను, ఆందోళనలను వదిలిపెట్టి, ఆంతరిక ప్రశాంతతను అనుభూతి చెందండి.
    పరమహంస యోగానందగారి బోధనల గురించి మరింత తెలుసుకోవడానికి, మా వెబ్ సైట్ ను సందర్శించండి: www.yssofindia.org
    శాస్త్రీయమైన ధ్యానం గురించి పరమహంస యోగానందగారి గృహ అధ్యయన పాఠ్యక్రమం - సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పాఠాల కోసం - నమోదు చేసుకోవడానికి, సందర్శించండి: www.ysslessons.org
    దివ్యసంకల్పాల ద్వారా శరీరం మరియు మనస్సుకు స్వస్థత కలుగజేసే శాస్త్రం గురించి మరింత తెలుసుకోవడానికి, పరమహంస యోగానందగారి “మెటాఫిజికల్ మెడిటేషన్స్” లేదా ఆయన “సైంటిఫిక్ హీలింగ్ ఎఫర్మేషన్స్” చదవమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇవి మా బుక్ స్టోర్ నుండి లభిస్తాయి: www.yssbooks.org
    #నిర్దేశిత ధ్యానాలు
    #చైతన్యాన్ని విస్తరించడం
    #యోగానంద
    #సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్
    #యోగ ధ్యానము
    #ఎస్.ఆర్.ఎఫ్.

Комментарии • 10