ఎంతో హాయినిచ్చే కమ్మటి దాల్ ఖిచిడీను ఇలా చేస్తే మైమరచిపోతారు | Dal Khichdi

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • ఎంతో హాయినిచ్చే కమ్మటి దాల్ ఖిచిడీను ఇలా చేస్తే మైమరచిపోతారు | Dal Khichdi ‎@HomeCookingTelugu
    ఎప్పుడైనా ఒంట్లో బాగోనప్పుడు, కమ్మగా హాయిగా ఉండే ఆహారం తినాలని అనిపించడం చాలా సహజం. అలాంటి ఒక వంటకమే దాల్ ఖిచిడీ. ఇది ఎంతో రుచిగా ఉంటుంది, అలాగే ఇది చేయడం కూడా చాలా తేలిక. ఈ రెసిపీను ఎలా చేయాలో చూసి, తప్పకుండా ట్రై చేయండి.
    #kichidirecipe #khichdi #kichdi
    Here's the link to this recipe in English: bit.ly/3ucmeDG
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 30 నిమిషాలు
    సెర్వింగులు: 3-4
    కావలసిన పదార్థాలు:
    బాస్మతీ బియ్యం - 1 / 2 కప్పు
    నీళ్ళు
    పెసరపప్పు - 1 / 2 కప్పు
    ఉప్పు - 1 టీస్పూన్
    పసుపు - 1 / 2 టీస్పూన్
    నూనె - 1 టేబుల్స్పూన్
    నెయ్యి - 1 టేబుల్స్పూన్
    జీలకర్ర - 1 టీస్పూన్
    బిర్యానీ ఆకు
    దాల్చిన చెక్క
    తరిగిన అల్లం
    తరిగిన వెల్లుల్లి
    పచ్చిమిరపకాయ - 1 (చిన్నగా తరిగినది)
    ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
    టొమాటో - 1 (చిన్నగా తరిగినది)
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    కారం - 1 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 / 2 టీస్పూన్
    ధనియాల పొడి - 1 / 2 టీస్పూన్
    ఇంగువ - 1 / 4 టీస్పూన్
    గరం మసాలా పొడి - 1 / 2 టీస్పూన్
    నెయ్యి - 1 టీస్పూన్
    తరిగిన కొత్తిమీర
    తయారుచేసే విధానం:
    వేరువేరు బౌల్స్లో కడిగిన బియ్యం, కడిగిన పెసరపప్పు వేసి, వాటిల్లో సరిపడా నీళ్ళు పోసి, రెండిటినీ కనీసం ముప్పై నిమిషాలు నానపెట్టాలి
    ఆ తరువాత వీటిని ఒక ప్రెషర్ కుక్కరులో వేసి, సరిపడా నీళ్ళు పోసి, ఉప్పు, పసుపు కూడా వేసిన తరువాత, మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ మీడియం ఫ్లేములో ఉడికించి, కాస్త మెదిపి, పక్కన పెట్టాలి
    ఒక ప్యాన్లో నూనె, నెయ్యి వేసి వేడి చేసిన తరువాత జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి వేయించాలి
    ఇందులో, చిన్నగా తరిగిన అల్లం, చిన్నగా తరిగిన వెల్లుల్లి, చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, అవి కాస్త రంగు మారేంత వరకూ వేయించాలి
    ఇప్పుడు చిన్నగా తరిగిన టొమాటోలు వేసి ఇంకాస్త వేయించాలి
    ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఇంగువ వేసి అంతా బాగా కలపాలి
    టొమాటోలు కాస్త మగ్గిన తరువాత ఇందులో ఉడికించిన పప్పు, అన్నం మిశ్రమం వేసి కలపాలి
    చివరగా ఇందులో నెయ్యి, చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి మొత్తం కలపాలి
    అంతే, కమ్మగా, రుచిగా ఉండే దాల్ ఖిచిడీ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా అప్పడాలతో, ఏదైనా పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
    Hey guys,
    I am gonna show you all a lovely recipe today. It's Dal Khichdi. It's a soul comforting food for many because it is mild, subtle yet tasty and flavourful. This is basically a one pot dish that you can make quickly whenever you're not in a mood to cook or whenever you feel low and still have to cook and eat something. This is extremely soothing for your taste buds and you can have it as it is or with any pickle of your choice or papads by the side. Do try this yummy recipe and enjoy!
    Our Other Recipes:
    Jonna Ravva Khichdi: bit.ly/3gWqsfr
    Oats Khichdi: bit.ly/3P4duck
    Saggubiyyam Khichdi: bit.ly/3gUQwHM
    Rava Khichdi: bit.ly/3W56CxJ
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    RUclips: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

Комментарии • 33