గజాననుడు - రామ్ ప్రసాద్ #74
HTML-код
- Опубликовано: 10 фев 2025
- తమ్ముడు రామ్ ప్రసాద్
విఘ్ననాయకుని గురించి
"అమ్మపోలికా సామీ అయ్యపోలికా"అంటూ
స్వరకల్పనతో రాయగా
చిరంజీవి చెన్నుభొట్ల శ్రీకాంత్
చక్కగా సంగీతం సమకూర్చి
శ్రావ్యంగా పాడిన పాట
అమ్మపోలికా! సావీ అయ్యపోలికా!!
సాకీ :
దయగలసావికి దణ్ణాలెట్టు
గణపతి సావికి గనముగ మొక్కు ||
పల్లవి :
దణ్ణవెట్టుకుంటే సావీ - నువ్వు
అణ్ణవెడుతుండావు సావీ!
కాదు పొమ్మన్నాను సావీ - నువ్వు
ఆదరిస్తుండావు సావీ!
మమ్మేలుకొనేటి దేవర నీవేలే
మా మేలు కోరేటి గుణవేడిదో!!
చరణం 1 :
నువ్వు తప్ప దిక్కు లేదంటేనూ
సల్లని సూపుతో సాకేవు సావీ
మొక్కిన వారిని అక్కున జేరుచు
దయగల ఆ అమ్మ పోలికొచ్చెనా!
మొక్కిన వారిని అక్కున జేరుచు
దయగల జగదంబ పోలికొచ్చెనా!!
చరణం 2 :
పోరుకొచ్చిన ఆ ఎలికకే - నువ్వు
తీరు మార్చి ఏలికయ్యావు సావీ !
తిట్టిన తిన్నడిని ప్రేమతో తిన్నంగ
మార్చిన ఆ అయ్య పోలికొచ్చెనా !
తిట్టిన తిన్నడిని ప్రేమతో తిన్నంగ
మార్చిన శివయ్య పోలికొచ్చెనా !!
అద్భుతః
🙂🙏🙏
❤❤గణపతి మహారాజ్ కి జై 🙏🙏🙏పాటలోని సాహిత్యం పాడిన విధానం అద్భుతం 💐
🙂🙏🙏
❤
🙂🙏🙏
Jai Bolo Ganesh mahraji ki .....jai
🙂🙏🙏
పాటా బావుంది
పాడటం బావుంది
చాలా బావుంది
సువర్ణ
విశాఖ
🙂🙏🙏
పాటా బావుంది
పాడటం బావుంది
చాలా బావుంది
సువర్ణ
విశాఖ
🙂🙏🙏