నాలో ఏమి చూచి నీవు - ఇంత ప్రేమ చూపినావు (2) మర్త్యమైన లోకమందు - నిత్యమైన కృపను చూపి (2) నేటివరకు తోడుండినావు యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా(2) నాలో ఏమి చూచి నీవు - ఇంత ప్రేమ చూపినావు (2) నా తల్లి గర్భమునే - నను కోరితివి విశ్వాస గృహములో - నను చేర్చితివి (2) అమృత జలమైన - నీ నోటి మాటలతో నిఖిల జగతికి - నను పంపినావు ప్రకటింప నీ చరితం - నా జన్మ నిజ ఫలితం (2) || నాలో ఏమి చూచి నీవు || ఘనులైన వారే - నీ యెదుటనున్నను బలమైన వారే - ఎందరో ఉన్నను (2) కన్నీళ్ళ కడలిలో - శ్రమల సుడులలో నా స్థితి చూసి - నను చేరదీసి మార్చితివి నీ పత్రికగా - కడవరకు నీ సాక్షిగా (2) || నాలో ఏమి చూచి నీవు || ప్రేమానురాగము - నీ సంస్కృతియే కరుణ కటాక్షము - నీ గుణ సంపదయే(2) నలిగిన రెల్లును - విరువని వాడా చితికిన బ్రతుకును - విడువని వాడా నా పైన నీకెందుకో - ఈ తగని వాత్సల్యము (2) || నాలో ఏమి చూచి నీవు || దవళ వర్ణుడవు - రత్న వర్ణుడవు వర్ణనకందని - అతి సుందరుడవు (2) ఇరువది నలుగురు - పెద్దల మధ్యలో మహిమ ప్రభావముతో - సింహాసనముపై ఆసీనుడా యేసయ్యా - నా స్తుతి నీకేనయ్యా (2) || నాలో ఏమి చూచి నీవు ||
నాలో ఏమి చూచి నీవు -
ఇంత ప్రేమ చూపినావు (2)
మర్త్యమైన లోకమందు -
నిత్యమైన కృపను చూపి (2)
నేటివరకు తోడుండినావు
యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా(2)
నాలో ఏమి చూచి నీవు -
ఇంత ప్రేమ చూపినావు (2)
నా తల్లి గర్భమునే - నను కోరితివి
విశ్వాస గృహములో - నను చేర్చితివి (2)
అమృత జలమైన - నీ నోటి మాటలతో
నిఖిల జగతికి - నను పంపినావు
ప్రకటింప నీ చరితం - నా జన్మ నిజ ఫలితం (2)
|| నాలో ఏమి చూచి నీవు ||
ఘనులైన వారే - నీ యెదుటనున్నను
బలమైన వారే - ఎందరో ఉన్నను (2)
కన్నీళ్ళ కడలిలో - శ్రమల సుడులలో
నా స్థితి చూసి - నను చేరదీసి
మార్చితివి నీ పత్రికగా - కడవరకు నీ సాక్షిగా (2)
|| నాలో ఏమి చూచి నీవు ||
ప్రేమానురాగము - నీ సంస్కృతియే
కరుణ కటాక్షము - నీ గుణ సంపదయే(2)
నలిగిన రెల్లును - విరువని వాడా
చితికిన బ్రతుకును - విడువని వాడా
నా పైన నీకెందుకో - ఈ తగని వాత్సల్యము (2)
|| నాలో ఏమి చూచి నీవు ||
దవళ వర్ణుడవు - రత్న వర్ణుడవు
వర్ణనకందని - అతి సుందరుడవు (2)
ఇరువది నలుగురు - పెద్దల మధ్యలో
మహిమ ప్రభావముతో - సింహాసనముపై
ఆసీనుడా యేసయ్యా - నా స్తుతి నీకేనయ్యా (2)
|| నాలో ఏమి చూచి నీవు ||
Thq soo much for this track 🙏