బాబా అంబెడ్కరా ....మన భారత భాస్కరా Saichand songs ||Ambedkar jayanthi || Ambedkar latest songs ||
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Saichand songs ||Ambedkar jayanthi || Ambedkar latest songs ||Saichand Ambedkar songs|Baba ambedkara song
#ambedkar #ambedkarjayanti #ambedkarjayanti2022 #ambedkarsong
మీ తెలివి …..మీ త్యాగం ….మీ సహనం ….మీ సాహసం
లేకుంటే ……..మేము ఏనాడో
బుగ్గయ్ పోతుంటిమో
ఈ భరత భూమిలొనే మసి బొగ్గయ్ పోతుంటిమో
ఏమిస్తే తీరునయ్య నీ రుణము
మేము ఎం చేస్తే తీరునయ్య నీ ఋణమూ
మీ బొమ్మ పెడితే తీరునా
మీకు దండలేస్తే తీరునా
నీ జెండాలెగరేస్తే తీరునా...
మీరు రాసిన రాజ్యాంగమనుసరించి
ఆ పార్లమెంట్ నుండి....పంచాయితీ ఆఫీసు దాకా
కుర్చీల కూసుంటే తీరునా...
రాజ్యపు పగ్గాలను చేపడితే తీరునా
బాబా అంబెడ్కరా ....మా బడుగులకు భాస
బాబా అంబెడ్కరా ....మన భారత భాస్కరా
మీరే లేకుంటే మేమై పోతుంటిమో...?
మీరే రాకుంటే మెమెట్ల బతుకుతుంటిమో?
భీమభాయ్ కడుపున మీరు పుట్టకపోయుంటే
మీ తండ్రి రాంజీ మిమ్ము బడికి పంపకుంటే
బడి నిను వెలివేసిందని కృంగిపోయిఉంటే
అవమానంతో భారంతో ఆగిపోయిఉంటే
జ్ఞాన శిఖరమోలే మీరు ఎదగక పోయుంటే
భారత మాత పుత్రుల బతుకులు మారాలని
భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే
బాబా అంబెడ్కరా మా బడుగులకు భాస్కరా
మీరే లేకుంటే మేమై పోతుంటిమో
మీరే రాకుంటే మెమెట్ల బతుకుతుంటిమో
మనుస్మృతి ని మంటల్లో కాల్చకపోయుంటే
మనువాదపు మకిలి మీరు కడగక పోయుంటే
కుల రక్కసి పై యుద్ధం మొదలు పెట్టకుంటే
ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే
సమానత ను కోరి మీరు ముందడుగే వేయకుంటే
జ్యోతిరావు పూలే అడుగుజాడ నడవకుంటే
వెలివాడల కొరకు మీరు వెలుగై రాకుంటే
బాబా అంబెడ్కరా మా బడుగులకు భాస్కరా
మీరే లేకుంటే మేమై పోతుంటిమో
మీరే రాకుంటే మెమెట్ల బతుకుతుంటిమో
ఈ భరత అవనిపై మీరు జనించక పోయుంటే
మన దేశానికి మీ బతుకు ధారపోయకుంటే
ఆ చెరువు నీళ్లు మీరు గనక ముట్టకపోయుంటే
కులం అహంకారులకు సవాల్ ఇసరకుంటే..
వజ్రాయుధమంటి ఓటు హక్కునివ్వకుంటే
మనుషులంత ఒక్కటనే మార్గ మేయకుంటే
బాబా అంబెడ్కరా మా బడుగులకు భాస్కరా
మీరే లేకుంటే మేమై పోతుంటిమో
మీరే రాకుంటే మెమెట్ల బతుకుతుంటిమో
Writen by - SAICHAND (9550778717)