పిరికి వాడు మాత్రమే.. "తగ్గేదేలే.." అంటూ అహంతో ఉంటాడు!
HTML-код
- Опубликовано: 9 фев 2025
- పిరికి వాడు మాత్రమే.. "తగ్గేదేలే.." అంటూ అహంతో ఉంటాడు..
లోపల ఉండే ఇన్‌సెక్యూరిటీకి పైన పూసే ఆయింట్మెంటే అహం!
అందరూ అనుకునేటట్లు డబ్బు ద్వారా, టాలెంట్ ద్వారా అహం రాదు.. లోపల అభద్రతను కవర్ చేసుకోవడానికి డబ్బు, టాలెంట్‌తో అహం పెంచుకుని పైకి గొప్పగా ప్రదర్శిస్తుంటారు. నేచురల్ గా డబ్బు వచ్చే వాళ్లకి అహం ఉండదు.
విపరీతంగా పరిగెత్తి తపన పడీ, అందరికీ ప్రూవ్ చేసుకోవాలని టాలెంట్ పెంచుకుని కొన్నాళ్లకి సాధించి అహం చూపిస్తే.. అది గొప్పదనం కాదు.. లోపల సరిచెయ్యాల్సిన సైకలాజికల్ యాస్పెక్ట్ ఏదో ఉందని అర్థం చేసుకోవాలి.
టాలెంట్, డబ్బు బై డీఫాల్ట్ నేచురల్ స్థితిలో రావాలి.. సూర్యోదయం అయినంత నేచురల్‌గా, వత్తిడి లేకుండా సృజనాత్మకత బయటకు రావాలి.. ఏదో యాంబిషన్ పెట్టుకుని అది వస్తే, ఆ యాంబిషన్ వెనుక మనస్సులోని అగాధాలు పూడ్చుకుంటున్నట్లు లెక్క!
Unknown aspects about Human Psyche.
నల్లమోతు శ్రీధర్