చాలా చక్కగా చెప్పారు .భాష విషయం లో ఇనాళ్ళకు సమాజం ఒక మంచి ఆలోచన చేస్తున్నందుకు సంతోషం. న్యాయం కోసం న్యాయ స్థానానికి వెళ్తే న్యాయం కోసం వెళ్ళిన వాళ్ళకి అర్ధం కానీ ఇంగ్లిష్ లో వాదోపవాదాలు చేసి ఎవరికి న్యాయం చేద్దాం అని ఇంగ్లిష్ ని నెత్తిన వేసుకున్నారు స్వాతంత్ర్యం వొచ్చాక అర్ధం కాలేదు ? ఉన్నత విద్య , సాంకేతిక విద్య కూడా మాతృ భాషల లో ఉండే లాగా కృషి జరగాలి. జర్మని లో చదువు కోవటానికి జర్మని నేర్చుకుని మరి అక్కడకి వెళ్ళి పై చదువులు చదువుతునప్పుడు. ఆ చదువు ని మన భాష లో నే ఎందుకు అందివ్వకూడదు? పాలకులు ఈ దృష్టి కోణం లో ఆలోచన చేయాల్సిన సమయం వొచ్చింది.
అన్నమయ్య/ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి తెలుగు భాషకు ఎవ్వరూ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సులభమైన తెలుగు భాషకు మరియు మాండలిక భాషకు ఆద్యుడు. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. వారికి,వారి తెలుగుకు ఏమాత్రం ప్రాధాన్యతల నివ్వకుండా ఏదో నాలుగు పాటలకు వచ్చీరాని సంగీతాన్ని జోడించి స్టేజీలమీద పాడి ప్రశంసలను అందుకొంటున్నారు. అన్నమయ్య ది నూటికి 95 శాతం చక్కటి సందేశాత్మక భాష. తెలుగు భాష. మన దౌర్భాగ్యం ఏంటంటే..తెలుగువారి పెద్దబాలశిక్షయే అసంఖ్యాకంగా యున్న 32,000 పైగా యున్న అన్నమయ్య తెలుగుభాషా కీర్తనలు.యతిప్రాస నియమాలతో చక్కని ఉపమలతో ఈ నాటికీ దాదాపు 8 కోట్ల తెలుగు ప్రజలకు వారి నడవడికి మార్గదర్శకాలుగా యున్నాయి. కాలగర్భంలో కొన్ని కలిసి పోయినప్పటికీ ఇంకా అన్నమయ్య మహానుభావుని తెలుగుభాషా సాహిత్యం లో 16525 పదాలు/ పద్యాలు/ కీర్తనలను టి.టి.డి వారు మాత్రమే పరిరక్షించడం ముదావహం. "ఇందులో మొదలికర్త ఎవ్వరూ లేరు కాబోలు కరివరదుడే ముఖ్యుడు గాబోలు"..అన్నమయ్య ..భాగవతంలోని గజేంద్ర మోక్షము నకు ఉదాహరణ. 2. శరణని బ్రదుకరో జనులారా గరిమ మెరసెనిదె కనక సింహము.. మొత్తం ప్రహ్లాద చరిత్ర అంతా ఈ కీర్తనలోని 11 పద్యాలలో అన్నమయ్య నవరసాలను మేళవించి చక్కటి తెలుగు భాషలో దైవాంకితంగా వ్రాశారు ❤. "కుడిచి వేసిన పుల్లె కుడువగా గాదు ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యము గాదు ".అని అన్నమయ్య అనుకరణ కుకవులకు చురక లంటించారు. తెలుగు నాట నలుగురు పదకవులలో త్యాగరాజుగారు,అన్నమయ్య, క్షేత్రయ్య, సారంగపాణి వారు ముఖ్యులు ❤❤ అయితే వీరిలో త్యాగయ్య గారు కేవలం విష్ణుదేవుని దశావతారునిగా శ్రీ రామచంద్రుని ఒక్కరినే 750 కీర్తనలు వ్రాసి పాడిన వారు. ఇంక అన్నమయ్య తాళ్ళపాక కవులలో 32000పైగా భక్తి,శృంగారకీర్తనలు విష్ణుదేవుని పరంగా వ్రాశారు ❤. క్షేత్యయ్యగారు మువ్వగోపాల పదాలతో పాటు శృంగార నాయిక నాయకుల వర్ణనను చక్కని తెలుగు పదాలలో సువర్ణాక్షరాలతో లిఖించారు. సారంగపాణిగారు కార్వేటినగరం లో శ్రీ రామ రాఘవుని కంకితంగా తెలుగు భాషా పదాలను రచించారు. ఇప్పటికీ దురదృష్టం ఏంటంటే తెలుగు అన్నమయ్య సాహిత్యం వద్దంట.కేవలం గుడి గోపురాలలో మాత్రమే అరకొర సంగీతాన్నిజోడించి సన్మనాలందే వారికి మాత్రమే సభలలో గౌరవాలిస్తున్నారు. ఏమైనా మా తెలుగు తల్లికి మల్లెపూదండ.మంగళారతులు❤ మంగళము గోవిందునకు మంగళము గరుడధ్వజునకు మంగళము ధర్మస్వరూపునకు జయ జయ మంగళము ❤❤❤
చాలా చక్కగా చెప్పారు .భాష విషయం లో ఇనాళ్ళకు సమాజం ఒక మంచి ఆలోచన చేస్తున్నందుకు సంతోషం. న్యాయం కోసం న్యాయ స్థానానికి వెళ్తే న్యాయం కోసం వెళ్ళిన వాళ్ళకి అర్ధం కానీ ఇంగ్లిష్ లో వాదోపవాదాలు చేసి ఎవరికి న్యాయం చేద్దాం అని ఇంగ్లిష్ ని నెత్తిన వేసుకున్నారు స్వాతంత్ర్యం వొచ్చాక అర్ధం కాలేదు ? ఉన్నత విద్య , సాంకేతిక విద్య కూడా మాతృ భాషల లో ఉండే లాగా కృషి జరగాలి. జర్మని లో చదువు కోవటానికి జర్మని నేర్చుకుని మరి అక్కడకి వెళ్ళి పై చదువులు చదువుతునప్పుడు. ఆ చదువు ని మన భాష లో నే ఎందుకు అందివ్వకూడదు? పాలకులు ఈ దృష్టి కోణం లో ఆలోచన చేయాల్సిన సమయం వొచ్చింది.
అన్నమయ్య/ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి తెలుగు భాషకు ఎవ్వరూ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సులభమైన తెలుగు భాషకు మరియు మాండలిక భాషకు ఆద్యుడు. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. వారికి,వారి తెలుగుకు ఏమాత్రం ప్రాధాన్యతల నివ్వకుండా ఏదో నాలుగు పాటలకు వచ్చీరాని సంగీతాన్ని జోడించి స్టేజీలమీద పాడి ప్రశంసలను అందుకొంటున్నారు.
అన్నమయ్య ది నూటికి 95 శాతం చక్కటి సందేశాత్మక భాష. తెలుగు భాష. మన దౌర్భాగ్యం ఏంటంటే..తెలుగువారి పెద్దబాలశిక్షయే అసంఖ్యాకంగా యున్న 32,000 పైగా యున్న అన్నమయ్య తెలుగుభాషా కీర్తనలు.యతిప్రాస నియమాలతో చక్కని ఉపమలతో ఈ నాటికీ దాదాపు 8 కోట్ల తెలుగు ప్రజలకు వారి నడవడికి మార్గదర్శకాలుగా యున్నాయి.
కాలగర్భంలో కొన్ని కలిసి పోయినప్పటికీ ఇంకా అన్నమయ్య మహానుభావుని తెలుగుభాషా సాహిత్యం లో 16525 పదాలు/ పద్యాలు/ కీర్తనలను టి.టి.డి వారు మాత్రమే పరిరక్షించడం ముదావహం.
"ఇందులో మొదలికర్త ఎవ్వరూ లేరు కాబోలు
కరివరదుడే ముఖ్యుడు గాబోలు"..అన్నమయ్య ..భాగవతంలోని గజేంద్ర మోక్షము నకు ఉదాహరణ.
2. శరణని బ్రదుకరో జనులారా
గరిమ మెరసెనిదె కనక సింహము.. మొత్తం ప్రహ్లాద చరిత్ర అంతా ఈ కీర్తనలోని 11 పద్యాలలో అన్నమయ్య నవరసాలను మేళవించి చక్కటి తెలుగు భాషలో దైవాంకితంగా వ్రాశారు ❤.
"కుడిచి వేసిన పుల్లె కుడువగా గాదు
ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యము గాదు ".అని అన్నమయ్య అనుకరణ కుకవులకు చురక లంటించారు.
తెలుగు నాట నలుగురు పదకవులలో త్యాగరాజుగారు,అన్నమయ్య, క్షేత్రయ్య, సారంగపాణి వారు ముఖ్యులు ❤❤
అయితే వీరిలో త్యాగయ్య గారు కేవలం విష్ణుదేవుని దశావతారునిగా శ్రీ రామచంద్రుని ఒక్కరినే 750 కీర్తనలు వ్రాసి పాడిన వారు. ఇంక అన్నమయ్య తాళ్ళపాక కవులలో 32000పైగా భక్తి,శృంగారకీర్తనలు విష్ణుదేవుని పరంగా వ్రాశారు ❤. క్షేత్యయ్యగారు మువ్వగోపాల పదాలతో పాటు శృంగార నాయిక నాయకుల వర్ణనను చక్కని తెలుగు పదాలలో సువర్ణాక్షరాలతో లిఖించారు. సారంగపాణిగారు కార్వేటినగరం లో శ్రీ రామ రాఘవుని కంకితంగా తెలుగు భాషా పదాలను రచించారు.
ఇప్పటికీ దురదృష్టం ఏంటంటే తెలుగు అన్నమయ్య సాహిత్యం వద్దంట.కేవలం గుడి గోపురాలలో మాత్రమే అరకొర సంగీతాన్నిజోడించి సన్మనాలందే వారికి మాత్రమే సభలలో గౌరవాలిస్తున్నారు.
ఏమైనా మా తెలుగు తల్లికి మల్లెపూదండ.మంగళారతులు❤
మంగళము గోవిందునకు మంగళము గరుడధ్వజునకు
మంగళము ధర్మస్వరూపునకు జయ జయ మంగళము ❤❤❤
❤❤❤
దేశభాషలందు తెలుగు లెస్స