సంచలనాత్మక త్రైతసిద్ధాంత శత(100) ౧౦౦ గ్రంథముల గీతము Song 6

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025
  • భారతదేశ చరిత్రలో సనాతన ధర్మంలో మిగతా ఎవ్వరికీ సాధ్యపడని 100 గ్రంథాలను రచించి ఆధ్యాత్మిక మార్గంలో హిందూ ధర్మమందు భగవద్గీతలోని క్షర . అక్షర, పురుషోత్తములనబడే ( జీవాత్మ , ఆత్మ , పరమాత్మ ) మూడు ఆత్మలను మొట్ట మొదటిసారిగా గుర్తించి, ఇప్పటిదాకా ఆత్మలను గురించి అర్థము కాని ఎందరో ఆద్యాత్మికులకు దిశానిర్దేశం చేసి, ఆ మూడు ఆత్మలా వివరమే మిగతా గ్రంథాలైన బైబిల్ , ఖురాన్ లోనూ ఉందని వివరిస్తూ వాటిని రచనల రూపంతో గ్రంథస్తము చేసి. సృస్టికంతటికీ దేవుడు “ఒక్కడే” అంటూ సర్వమనవాళిని ఒకే దైవ మార్గాన నడిపిస్తూ, ఇప్పటిదాకా 100 సంచలనాత్మకమైన “ త్రైతసిద్దాంత ” ఆధ్యాత్మిక గ్రంథాలను నిర్విరామంగా అందించిన అలుపెరుగని ఆద్యాత్మిక చక్రవర్తి త్రిమత ఏకైక గురువు, శతాధిక గ్రంథకర్త , సంచలనాత్మక రచయిత, త్రైతసిద్దాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల శత (100) గ్రంథముల పేర్లను సాహిత్య దృశ్యంగా మలచిన గీతం ఇది. త్రైత సిద్దాంత సంచలనాత్మక 100 గ్రంథములను వివరిస్తూ సాగిన గీతాన్ని...
    ఈ వీడియో పాట ద్వారా జ్ఞానులు వీక్షించ గలరు.
    L I K E | S H A R E | S U B S C R I B E
    Lyricist - Siva Krishna Kogili
    Singer - Raghunandan Kanna
    Editing - Varanasi Krishna Kiran
    Production - Gnanavaahini Team
    Presented By - Gnanavaahini Channel
    పల్లవికి ముందు:
    త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి
    శతాధిక గ్రంథ కర్త ఇందూ జ్ఞాన ధర్మ ప్రదాత
    సంచలనాత్మక రచయిత త్రైతసిద్ధాంత ఆదికర్త
    జయహో గురుదేవ జయజయహో గురుదేవ
    శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర
    శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర
    నీ రాతే సత్యమయ్యా నీజ్యోతే నిత్యమయ్యా
    నీరీతే సమరమయ్యా నీ ఖ్యాతే అమరమయ్య
    జయహో గురుదేవ జయజయహో గురుదేవ
    పల్లవి:
    త్రైతసిద్ధాంత ఆరంభం ధర్మచక్రముతో ప్రారంభం త్రైతబోధకే కలిగిన పునర్జన్మం
    ధర్మాధర్మ రణరంగం గీటురాయియే ప్రతిబింబం సత్యాసత్య విచక్షణతో సాధ్యం
    జననమరణమొక సిద్ధాంతం మరణరహస్యము ఆసాంతం ప్రబోధించిగా వెలిసినదీ త్రైతమ్
    కర్మపత్రముకు ఇది అంతం దైవ తీర్పుతో అది సాధ్యం మతమాయను దాటించే దివ్య పథం
    కథలూ పొడుపుకథలు సామెతలూ తిట్లు దీవెనలు
    నాటికలు మనపండుగలు యజ్ఞములు సాంప్రదాయములు
    మతాతీత దేవుని మార్గముగా బోధించెను గురువై
    జయహో గురు దేవా జయ జయహో గురుదేవ
    చరణం1:
    ప్రథమ గ్రంథమౌ త్రైత గీతనే పరిచయమే చేసి
    ద్వితీయ గ్రంథమునందలి రత్నాలెన్నో చూపించి
    అంతిమ గ్రంథమునందలి జ్ఞానము అందరికీ చాటి
    వజ్రములంటి వాక్యములకు వివరమునే బోధించి
    ----------- జయహో గురుదేవ జయజయహో గురుదేవ
    త్రైతారాధన నేర్పిన గురువై తత్వములను చూపి
    గుత్తాలోని నిగూఢ తత్వము ప్రసిద్ధి గావించి
    స్వర్గం నరకం లేవని సత్యాన్వేషణ కలిగించి
    సమాధిలోని సుబోధతో తలితండ్రిని చూపించి
    ద్రావిడ బ్రాహ్మణ రావణ బ్రహ్మను త్రైతాకార రహస్యముజేసి
    దేవుడు భగవంతుడు వేరంటూ శ్రీ కృష్ణుని నిజ చరితను తెలిపి
    ఆత్మలింగముకు అర్థము చాటి గురువై వెలిసెనులే
    జయహో గురుదేవ జయజయహో గురుదేవ
    పల్లవికి tune lo
    కలియుగానికే వార్తకుడై ప్రబోధతరంగ వ్యాపకుడై తెలిపినట్టిదీ ప్రాథమిక జ్ఞానం
    విశ్వవిద్యకే స్థాపకుడై దేవునిరాకకు సూచకుడై బోధించినదీ సత్యవాద జ్ఞానం
    చరణం2:
    దేవుని జ్ఞానము కబ్జా కాగా నిజ జ్ఞానము తెలిపి
    జీహాద్ యుద్ధము కాదని ఉగ్రవాదం తొలగించి
    తెలుగులో ఆదిత్యునికే అర్థము ఘంటుగ మ్రోగించి
    ధ్యానము ప్రార్థన నమాజు భావము భాషలో రచియించి
    -------------జయహో గురుదేవ జయజయహో గురుదేవ
    దేవుని చిహ్నము గుర్తు ముద్రలు మూసగా పోయించి
    ఇందువు క్రైస్తవుడాయని ఇందుత్వమునే కాపాడి
    జ్యోతిష్యముతో నాస్తిక ఆస్తిక బేధము తొలగించి
    మంత్రమహిమతో హేతువాద ప్రతివాదము గావించి
    వేదములవసరమే లేదంటూ ఉపనిషత్తులో లోపము చాటి
    హిందూరక్షణ ఎందుకుఅంటూ కులవివక్షలో కక్షను తెలిపి
    ఏది సత్యమో ఏదసత్యమో ప్రజలకు చుపెనులే
    జయహో గురుదేవ జయజయహో గురుదేవ
    పల్లవి tune:
    ధర్మశాస్త్రముకు దీపకుడై ప్రవక్తలకు పరిపాలకుడై మతమార్పిడినే ఆపునట్టి జ్ఞానం
    ఇందూ పథ సిద్ధాంతకుడై ఆధ్యాత్మిక మధ్యాత్మకుడై మతద్వేషమునే మాపునట్టి జ్ఞానం
    చరణం3:
    దేవాలయములో దాగిన గుట్టును రట్టుగ ప్రకటించి
    ప్రతిమ విగ్రహా దెయ్యం భూతం సంఘటనలు తేల్చి
    సిలువదేవుడే కాదని యేసుని మరణము వివరించి
    హదీసు ముఖ్యము కాదని ఖురాను లేఖనమందించి
    ------------జయహో గురుదేవ జయజయహో గురుదేవ
    సాయిదేవుడా కాదా అను ఆలోచన కలిగించి
    సంసారముగా భక్తిని కలిగే విత్తనమందించి
    ఒకే వ్యక్తిలో రెండు కోణములు ఒకడే ఇద్దరిగా
    ఒకే మాటలో మూడు గ్రంథములు ఇద్దరు గురువులుగా
    మరణము పిదప జీవితమేదో గీతాగీతములో చూపించి
    మూడు గ్రంధముల ప్రథవాక్యమే బోధించిన ప్రప్రథమ గురువుగా
    సుప్రసిద్ధిగా శతగ్రంథాలకు కర్తగ నిలిచెనులే

Комментарии •