క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని | Kshirabdhi Kanyakaku | Garimella Balakrishna Prasad

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన
    గానం: గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్
    రాగము: మధ్యమావతి, ఆది తాళం
    క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
    నీరజాలయమునకు నీరాజనం ॥పల్లవి॥
    జలజాక్షి మోమునకు జక్కవకుచంబులకు
    నెలకొన్న కప్పురపు నీరాజనం
    అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
    నిలువు మాణిక్యముల నీరాజనం ॥క్షీరాబ్ధి॥
    చరణకిసలయములకు సకియరంభోరులకు
    నిరతమగు ముత్తేల నీరాజనం
    అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
    నిరతి నానావర్ణ నీరాజనం ॥క్షీరాబ్ధి॥
    పగటు శ్రీ వేంకటేశు పట్టపు రాణియై
    నెగడు సతి కళలకును నీరాజనం
    జగతి నలమేల్మంగ చక్కదనముల కెల్ల
    నిగుడు నిజ శోభనపు నీరాజనం ॥క్షీరాబ్ధి॥
    ___________________ఓం నమో వేంకటేశాయ_______

Комментарии • 4

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 года назад +2

    అద్భుతం

  • @rojarani2995
    @rojarani2995 2 года назад +1

    చాల బాగుంది మహా అద్భుతం

  • @hari1v8
    @hari1v8 2 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @ravindharravindhar7056
    @ravindharravindhar7056 Месяц назад

    Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda om Jai mata di namha om Sri varahi deviye namha om Jai padmavathi Amma om Jai alavelumelu mangamma namo namha