Mayami Pothunnadamma Song Performance By Andesri | Padutha Theeyaga | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024

Комментарии • 909

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 14 дней назад +3

    నేటి వాస్తవ పరిస్థితి లకు దర్పణం. నేటి సమాజం గురించి అంత చక్కగా వ్రాసి ,పాడిన అందెశ్రీ గారి కి పాదాభి వందనములు🙏🙏

  • @yakaiahgaddala9991
    @yakaiahgaddala9991 6 месяцев назад +251

    నీకు సాటి లేదు ఈ సమాజం నువ్వు నూటికో కోటికో ఒక్కరే నీలాంటి ఒక్కరే మీలాంటివారు నీకు లాల్ సలాం 👏👏

  • @sudhakarbabu3608
    @sudhakarbabu3608 6 месяцев назад +89

    సార్ మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న నిజంగా సార్ మీరు చెప్పింది నిజం.....

  • @darshanvinay4471
    @darshanvinay4471 6 месяцев назад +100

    అందెశ్రీ గారి పాట భావము మానవునిపై ఎంతో లోతైనది

  • @pmanikyam1450
    @pmanikyam1450 6 месяцев назад +148

    100% మానవ సంబంధాలు లేకుండా పోతున్నాయి !!! గొప్ప ఆధర్శ ప్రాయుడు అందేశ్రీ గారు ..

  • @ramireddy9788
    @ramireddy9788 6 месяцев назад +70

    ఎంత చక్కని పాట పాడినవారికి పాదాభివందనం.

  • @mohanrao7775
    @mohanrao7775 6 месяцев назад +396

    అందేశ్రీ గారు ఏమీ చదువుకోలేదని ఎందరికితెలుసో. ఆయనజీవితంకడుపేదరికంనుంఢివచ్చింది. ఆయనమానవసంబంధాలనుఅన్నికోణాలనుండితడిమిచూశారు. ఆయనరచనలూ,పాటలూ అన్నీసమాజశ్రేయస్సుకేరాశారు. కవిస్వేచ్ఛగారాయగలగాలంటాడు. ఎవరికీఅమ్ముడుపోవద్దంటాడు. అందేశ్రీజీవితాన్నిచదివితేఆయనెంతమహోన్నతవ్యక్తోఅర్ధమౌతుంది. అందేశ్రీకిఇదేమా సెల్యూట్.

    • @charanmvg6433
      @charanmvg6433 6 месяцев назад +4

      SUPER SIR

    • @RajuGogul
      @RajuGogul 6 месяцев назад +6

      అందుకే ఇంత హృద్యంగా నేటి మానవ జీవితాన్ని సృజించగలిగారు, అత్యంత సహజంగా.

    • @neelakantamnaidukottagulli7041
      @neelakantamnaidukottagulli7041 6 месяцев назад +2

      Kalaniki anugna karanajanma kavi sir meeru samajaniki kanuvipu kaliginche meelanti varu chala avasaram entaina unnadi bagavantudu meeku mee kutumbani chalaga chudali

    • @nareshneealla3783
      @nareshneealla3783 6 месяцев назад +1

      Suppar sir

    • @anjaiahdairyfrom1753
      @anjaiahdairyfrom1753 6 месяцев назад

      Uyy yu yy😢uuuu This is also from uuuuu.Unë ha, ha dhe ha dhe pi😮​@@charanmvg6433

  • @madhavarao7026
    @madhavarao7026 6 месяцев назад +137

    పవిత్రత పలుకులతో, భావోద్వేగం బానీతో, గాలికి వదిలేసిన వ్యక్తిత్వాల ధోరణి గురించి తన గాత్రంతో మైమరమించిన....
    నా హృదయ పూర్వక అభినందనలు.

    • @vemulagouri105
      @vemulagouri105 6 месяцев назад

      Super song super Liryks super voice

    • @bashumohd712
      @bashumohd712 4 месяца назад +1

      Swardamto mayamai potunnado sar

    • @allem.appaiah844
      @allem.appaiah844 4 месяца назад

      మనం తప్పు చేస్తున్నామని తెలిసినప్పుడు ఈ పాట విని మానవుడిగా మారాలని ఈ పాట యొక్క తాత్పర్యం నా ఆశ కూడా

  • @DSubbaiah-lm3mv
    @DSubbaiah-lm3mv 6 месяцев назад +50

    ఈ రోజుల్లో జరిగే దే పాట రూపంలో బాగా పాడారు వారికి మా హృదయపూర్వక అభినందనలు

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 6 месяцев назад +61

    Sir e పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది...

  • @prajitag8806
    @prajitag8806 6 месяцев назад +204

    అందెశ్రీ కి ప్రణామములు . ఈ పాట ను ఏ పాటగాడు పాడినా న్యాయం చేయలేడు . పాటకు ఆవేదన కావాలి . అప్పుడు గొంతు ఎవరికైనా జీర పోవడం సహజం . దాన్ని పాండిత్యానికి జోడించి రసానుభూతి అందించిన అందెశ్రీ అభినన్దీయుడు

  • @AutoJani403
    @AutoJani403 6 месяцев назад +101

    అందెశ్రీ గారికి మానవ జీవితంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వివరించి చక్కగా గాత్రాన్ని అందించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీరస్తు శుభమస్తు సకల జనుల శుభమస్తు

  • @Murthy_sr
    @Murthy_sr 6 месяцев назад +54

    అందెశ్రీ గారూ!....... కన్నీళ్లు రప్పించారు. మీరు సూపర్ సార్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @VENKATRAJAMMUNJA
      @VENKATRAJAMMUNJA 5 месяцев назад +2

      అందెశ్రీ గారు పాడిన పాట బావి తరాలకు స్ఫూర్తి

  • @SSvloges29
    @SSvloges29 6 месяцев назад +115

    మాయమై పోతున్నాడాఅమ్మ మనిషిఅన్న వాడు.... నా మనసు చలించి పోయింది..... 🙏

  • @mattapally.kranthikumar7062
    @mattapally.kranthikumar7062 6 месяцев назад +29

    అందె శ్రీ గారు ఏమి చదువు కోలేదు అని కామెంట్ పెట్టారుకానీ, తెలుగు లో MA Phd చేసిన జ్ఞానం ఉంది ఆ సాహిత్యం లో పాటలో

  • @VenkateshElkaVlogs-hc4fv
    @VenkateshElkaVlogs-hc4fv 6 месяцев назад +43

    Super sir manishi జీవితంలో జరిగే సంఘటనలు క్లియర్ గా కనబడుతోంది

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv6213 6 месяцев назад +37

    అక్షర సత్యాలు అందేశ్రీ గారు, చక్కటి సందేశం 🙏

  • @DJHH2779
    @DJHH2779 6 месяцев назад +30

    అందేశ్రీ గారి గానంలో జ్ఞానం అనే వెలుగులు సమాజంలో ఎగసి పడేవి గా ఉంటాయి 👌👌👌🙏🙏🙏🙏🙏

  • @devishettysrinivas8718
    @devishettysrinivas8718 4 месяца назад +10

    అదుతమైన పాట... ఎప్పటికీ సజీవం.. ఎలాంటి వాయిద్య పరికరాలు అయన స్వరానికి సాటి రావు... 🙏

  • @skreddy3842
    @skreddy3842 6 месяцев назад +20

    100% ఇప్పుడున్న మానవ సంబంధాలకు నిజమైన గేయ రూపం🎉🎉🎉🎉🎉

  • @shakunthalanalimela
    @shakunthalanalimela 6 месяцев назад +9

    మీ పదాల రచన, ఆ పొందిక ఎంత అద్భుతం సార్. ఈ పాట వినే ప్రతి ఒక్కరూ కంట తడి పెట్టాల్సిందే

  • @williamcarey1360
    @williamcarey1360 6 месяцев назад +540

    సారూ ! ఇక్కడ గమంచ వలసింది కంఠం కాదు అద్భుత మైన ఆలోచింప దగిన సందేశం " మాయ మై పోతుండమ్మ్మా మనిషి " ఈ మహోత్కృష్ట మానవ జీవి ఇతరుల ప్రభావానికి లోనై వ్వ్యక్తిత్వాన్ని పోగొట్టు కుంటున్నాడు. పీటీ !!!

    • @ramaiahare4155
      @ramaiahare4155 6 месяцев назад +16

      Precious meaning song

    • @bhanu0024
      @bhanu0024 6 месяцев назад +11

      Song writer he

    • @GuruswamyGadamsetty
      @GuruswamyGadamsetty 6 месяцев назад +6

      🙏ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమంటే మానవుడు, మానవత్వం మరచి, స్వార్ధమే పరమావదిగా మసలుతున్నాడానేది అక్షర సత్యం 🙏

    • @nareddyramreddy6787
      @nareddyramreddy6787 6 месяцев назад +2

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @narsimhareddy5595
      @narsimhareddy5595 6 месяцев назад +10

      కంఠానికి ఏమైంది సారు, సూపర్ కంఠం. చక్కటి మెసేజ్ తో కూడిన పాట

  • @narsimlumyakala3104
    @narsimlumyakala3104 Месяц назад +4

    చదువుకున్న స్వార్థ, మూర్ఖ మేధావులకు, చదువురాని అపరమేధావి అందెశ్రీ గారు,మీలాంటి కవులు ఉన్నన్ని రోజులు ఈ సమాజము బ్రతికితుంటది.మీ లాంటి మహా మానవతా అభ్యుదయ కవిత్వం ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు బ్రతికి ఉంటది.మీకు హృదయపూర్వక అభినందల మాల❤❤❤

  • @srilaxmibalaji125
    @srilaxmibalaji125 6 месяцев назад +40

    ఈ పాట విని కొంత మందైనా మానవత్వంతో మారాలని కోరుకుంటూ మీకు పాదాబివందనాలు.❤

  • @kongariramesh2783
    @kongariramesh2783 6 месяцев назад +29

    🔥🔥మీరు ఒక్క నిప్పుకనిక, మీకు సాటి yevvaru లేరు sir

  • @marrapumurlaikrishna8025
    @marrapumurlaikrishna8025 5 месяцев назад +48

    పాడుతా తీయగా ప్రోగ్రాం ఏ నాడు ఇంత గంభీరంగా సాగలేదు.

  • @undetirambabu
    @undetirambabu 6 месяцев назад +28

    ఈ పాటకు ఏ అవార్డ్ ఇచ్చిన తక్కువ అవుతుంది🙏🙏🙏🙏🙏

  • @kondareddyk.s.kondareddy5898
    @kondareddyk.s.kondareddy5898 6 месяцев назад +28

    ఇది మహా అద్భుతమైన పాట మనుషులకు ఉపయోగపడే పాట సూపర్ పాట హ్యాండ్సప్ పాట

  • @b.veerunaidu4098
    @b.veerunaidu4098 6 месяцев назад +12

    మేము ఎంతచదువుకున్నా మీ రచనలకు జోహార్లు...మాలంటి వాళ్లకి మీరు ఒక మేలుకొలుపు

  • @venkatapuramjoythijoythi1996
    @venkatapuramjoythijoythi1996 6 месяцев назад +51

    ఒకప్పుడు పశువుల కాడి పోరడు ఇప్పుడుఅందెశ్రీ అరుదైన జ్ఞానం గలవాడు

  • @artistandcreater
    @artistandcreater 6 месяцев назад +14

    గురు సమానులు అంజి శ్రీ గారికి మీ కంఠం మీ కవిత్వం మీ అభినయ గీతం మన సమాజానికి కనువిప్పు చేస్తాయని మా అభిమతం

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 6 месяцев назад +67

    గద్దర్ ప్రభావం అందెశ్రీ గారి మీద చాలా ఉంది పాట పాడే విధానం లో

  • @ramanjaneyuluramu4133
    @ramanjaneyuluramu4133 6 месяцев назад +10

    పాట ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది🙏🏻🙏🏻

  • @kiranjangam5311
    @kiranjangam5311 6 месяцев назад +97

    విప్లవం , ఉద్యమం , రగిలే , నిప్పు , ఉప్పొంగే సముద్రం !! కళ కు కళా కారులు లకు చావులేదు !!

  • @srilaxmibalaji125
    @srilaxmibalaji125 5 месяцев назад +24

    గౌరవ అందె శ్రీ గారి ఈ పాట చిన్న, పెద్ద అనే తేడా లేకుండ ప్రతి శుభ అశుభ కార్యక్రమాల లో వినిపించాలని ప్రతి ఒక్కరికి నా ప్రార్ధన.

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 5 месяцев назад +24

    హృదయం లో నుంచి వచ్చిన గీతం.హత్తుకు పోతుంది. ప్రస్తుత కాలానికి అద్దం పట్టింది.

  • @malleshjala1900
    @malleshjala1900 6 месяцев назад +86

    మనిషి ని ఆలోచింపచేసే దే అందే శ్రీ గారి పాట...

  • @balasubrahmanyam3047
    @balasubrahmanyam3047 4 месяца назад +6

    అందేశ్రీ గారికి పాదాభి వందనములు. 100% మానవ సంబంధాలు లేవు.

  • @bhk9995
    @bhk9995 3 месяца назад +9

    నేనెప్పుడూ ఈ పాట correct గా వినలేదు, అసలు ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారు ఈ సాంగ్ లో 🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 3 месяца назад +10

    మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు,
    మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు,
    నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు,
    యాడవున్నడో కాని, కంటికి కానరాడు!
    నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే
    చెడిపోక ఏమైతడమ్మా..?
    ఆత్మీయ బంధాల, ప్రేమ సంబంధాల
    దిగజారుతున్నడోయమ్మా
    అవినీతి, పెను ఆశ, అంధకారములోన,
    చిక్కిపోయి రోజూ శిధిలమవుతున్నాడు.
    ఇనుపరెక్కల డేగ విసిరిన పంజాకు
    కోడిపిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు.
    ఉట్టికి స్వర్గానికి అందకుండా తుదకు
    అస్థిపంజరమై అగుపించనున్నారు.
    కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ
    కనుబొమ్మలెగరేసి కాలగమనములోన
    మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు,
    మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు,
    ఇరవైఐదు పైసల అగరొత్తులు కాల్చి
    అరవైఐదు కోట్ల వరములడుగుతాడు
    దైవాల పేరుతో చందాల దందా
    భక్తి ముసుగు తొడిగి భలే పోజుపెడతాడు
    ముక్తిపేర నరుడు రక్తిలో రాజయ్యి
    రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు.
    మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు,
    మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు,
    రచన : అందెశ్రీ

    • @ModelNaveen143
      @ModelNaveen143 Месяц назад +1

      ❤❤❤ super beautiful 🌹 song sir

  • @koteshgandu
    @koteshgandu 4 месяца назад +4

    ఇది ఒక అద్భుతం.. ఈ తరం మనుషులు తప్పకుండా వినవలసి పదాలు ఇవి...❤❤❤❤❤

  • @chinnaiahbattolla5362
    @chinnaiahbattolla5362 6 месяцев назад +21

    ఈ పాట రాసిన అందెశ్రీ అన్నగారికి పాదాభివందనాలు

  • @AarepalliMallikarjuna
    @AarepalliMallikarjuna 6 месяцев назад +27

    అందెశ్రీ పాదాభివందనం🎉❤❤❤

  • @kethagangadhararao348
    @kethagangadhararao348 6 месяцев назад +13

    ఈ పాట లో ఇచ్చిన సందేశం, నీతి కి సహస్ర ప్రణామాలు ❤

  • @shaikshaneshareef8464
    @shaikshaneshareef8464 6 месяцев назад +28

    అందెశ్రీ గారికి శుభాభినందనలు🙏

  • @chenchaiahkonda4796
    @chenchaiahkonda4796 6 месяцев назад +21

    అందెశ్రీ గారి మాటలు అక్షర సత్యాలు

  • @Dasiramulu
    @Dasiramulu 6 месяцев назад +222

    మచ్చలేని మనిషి
    మహనీయుడు అందేశ్రీ

  • @Anand-g5i1q
    @Anand-g5i1q 6 месяцев назад +9

    ఒక మంచి అర్థవంతమైన పాట వినిపించారు అందెశ్రీ గారు. ఈ రోజు సమాజానికి మంచి సందేశము. మోసము, అన్యాయము చేయకపోతె బ్రతకలేమేమో అని మనిషి అనుకుంటున్నాడు. మార్పు కోసము దీనికి సంభందించి ఒక పాట రాయండి.

  • @apparaonanduri816
    @apparaonanduri816 6 месяцев назад +15

    Thanks to Sri Andesri garu . You have told to the human relations. Exactly correct poem.

  • @ambipash
    @ambipash 6 месяцев назад +56

    స్వార్థం 100% మనిషి 0%

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 4 месяца назад +3

    🙏🙏🙏🙏🙏
    అద్బుత సంఘటన ను
    వినసొంపుగా స్వర రచయిత కు
    వందనాలు...
    ‌‌👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @satyanarayanakambala5695
    @satyanarayanakambala5695 3 дня назад

    ఎంతో లోతు ఉన్న భావం ఉన్న గొప్ప సందేశం 🙏🙏🙏

  • @chittipalavamshi2768
    @chittipalavamshi2768 7 месяцев назад +26

    Hats off to the Andesri 🙆🏻🙏🏻🙌🏻

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 3 месяца назад +1

    ఈ పాటలో పదము పదము ఎంతో అర్థంతో కూడుకున్న పాట ఇది అందెశ్రీ గారికి సాధ్యం

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 2 месяца назад +5

    ఈ గీతం అందెశ్రీ పాడితేనే దానికి న్యాయం జరిగింది.

  • @rajugajje3867
    @rajugajje3867 6 месяцев назад +30

    ఇప్పుడున్న గాయకులు మరియు రచయితలు అందరు అందె శ్రీ. గారి కాళు కి అంటిన దుమ్ము తో సమానం.ఆయన కాలు గోటికి కూడా సరి కారు.

  • @porandlaraju4942
    @porandlaraju4942 6 месяцев назад +13

    Andesri sp basubramanyam manaku devuduichina varalu ❤❤❤

  • @SunkanapallyAnjaiah
    @SunkanapallyAnjaiah 3 месяца назад +2

    అందెశ్రీ కవి గారికి నమస్కారములు. మీ రచన అమోఘం అద్భుతం

  • @Bichireddy-v9n
    @Bichireddy-v9n 6 месяцев назад +7

    అలా స్థిరంగా వింటూ ఉండి పోయా ను అందెశ్రీ గారు మీ లాంటి మహనీయులకి వందనాలు .

  • @gopiathrampochampally1474
    @gopiathrampochampally1474 2 дня назад

    ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది చాలా బాగా పాడారు సర్🎉🎉

  • @ShaikSardar-ci9ju
    @ShaikSardar-ci9ju 5 месяцев назад +3

    అందేశ్రీ గారి గేయం సుపర్ . మనసు పెట్టి వింటే చాలు సమాజం లోమనిషి ఆలోచనలను సూచిస్తుంది.

  • @ramupothukuchi6459
    @ramupothukuchi6459 3 месяца назад +2

    మీ పాటలు విన్న ఎవరూ మారారు మంచి పనికి రాదు. 🎉🎉 మీరు చెప్పింది నిజమే నీతి నిజాయితీ చచ్చి పోయింది. కాలమే సమాధానం చెప్పాలని దేవున్ని కోరుతున్నారు

  • @pashashaik3719
    @pashashaik3719 6 месяцев назад +4

    మయమై పొతున్నడమ్మ,,మనిషన్న వడు.. ఇలా ఉంది ఈయన గారి గానం,

  • @Thefilmmaker27
    @Thefilmmaker27 4 месяца назад +2

    తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం 🙏🙏🙏🙏🙏

  • @shakunthalanalimela
    @shakunthalanalimela 6 месяцев назад +3

    మీరు నిజంగా మా తెలంగాణా ఆణిముత్యం సార్🙏🙏🙏🙏

  • @menthanavasanatharao1597
    @menthanavasanatharao1597 2 месяца назад +1

    మీ పాటకు పాదాభివందనం సార్ మాదిగ జాతికి గర్వ కారణము

  • @BhikshapathiYadasu
    @BhikshapathiYadasu 6 месяцев назад +4

    Andesri gariki elanti patalu inka chla patalu ravali mi kavitvsm nundi supar anna garu

  • @venkateshamchikka889
    @venkateshamchikka889 4 месяца назад +1

    అందెశ్రీ గారు మీ యొక్క పాట నేటి సమాజానికి హత్తుకునే విధంగా ఉంది నేటి తరానికి కనువిప్పు కలిగించే ఇలాంటి పాట చిరస్థాయిగా మనిషి లోన మానవత్వం ఉన్నంతవరకు మీ పాట చిరస్థాయిగా మదిలో నిలుస్తూ ఉంటుంది

  • @apparaonanduri816
    @apparaonanduri816 6 месяцев назад +7

    A good message to the public relations..

  • @harshavasireddy8986
    @harshavasireddy8986 4 месяца назад +6

    మాయమైపోతున్నదమ్మ ..మనిషన్నవాడూ.
    మచ్చుకైనలేదు చూడు మానవత్వము ఉన్నవాడూ
    నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఏడ ఉన్నదో కాని కంటికీ కానరాడు..... "మా"
    నిలువెత్తు స్వార్ధము నీడలా వెంటుంటే చెడిపోక ఎమవుతడమ్మా...
    ఆత్మీయ భందాలు ప్రేమ సంభందాల దిగజారుతున్నదో యమ్మా
    అవినీతి పెను ఆశ అందకారములోన చిక్కుకొని నరుడు శిదిలమవుతున్నాడు
    రాల్లరప్పల దైవరూపాలుగాకోలచు పంది నంది ని చూసి పది మొక్కుతుంటాడు
    చీమలకు చెక్కెర పాములకు పాలోసి జీవకారున్యమే జీవనము అంటాడు
    సాటి మనిషికి కాస్థాసాయంబు నీయకా కులమంటూ ఇల మీద కలహాలగిరిగీసి
    ఆధ్యాత్మికతకున్న అర్ధమే తెలియకా ఆంధ్దయిపోతున్నడంమా
    హిందూ. మిస్లిము, క్రీస్తు, సిక్కు ,పారసీ లంటూ తనను తా మరిచేనోయమ్మా
    మతము లోకహితము అన్న మాటను మరచి.. మత ఘర్శనలమద్య మనిషి కనుమరుగవుతూ ..."మా"
    ఇరువయీదుపైసల లగారువత్తులు కాల్చి అరువైఇదుకొత్ల వారము లడుగుతాడు
    దైవాలపెరుతో చందాల కై దండా .బక్తి ముసుగుగులో భల ఫోజు కొడతాడు '
    ముక్తి పేరిట నరుడు రక్తి లో రానిల్లి ... రాకాసి రూపాన రంజిల్లు లోకాన ... "మా"
    అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టుతిరుగుతున్నదమ్మా
    రూపాయి కొరకు ఏ పాపానికైతేమి వదిగట్టేనదిగొ చూడమ్మా
    కూటికోరకు కోటివిద్యలన్నది పోయి.. కోట్లకు పడగెత్త కోరికలు సెలరేగి.... "మా"
    కల్లపోరలు కమ్మి కామము తో రేగి వెకిలి చేష్టలతో వేదిస్తువుంటాడు
    పసికండులతో రసికత్వమునుకోరి పచ్చి పాపానికే పాల్పడుతుంటాడు
    కంచే చేనుమేయు చందంబునా నరుడు... ఆమ్మ జన్మకే నేడు ఆపదయి కూకుండు..."మా"
    డాలర్ల మోజుతో డాబుసరి బతుకుకయి... అమెరికా నౌకరీ వెలగబెడుతుంటాడు
    కాలధర్మం అయిన కన్నవారిని నేడు... కంపూటర్లో చూసి ఖర్మకాండలే చేస్తూ..."మా"
    పార్టీల పడగలా గోడుగులనీడలో బతుకు గడుపుతున్నడమ్మా
    ఆదిపత్యపుపోరు అలజడే చిరునామా అంటూ జై కొడుతున్నడమ్మా
    రాజకీయాలలో రాటు తేలీ తుదకు.. మానవా విలువల్ని మంటకలుపూకుంటూ..."మా"
    ఇనుపరేక్కలడేగ విసిరినా పంజాకు కోడిపిల్లయిచిక్కి కొట్టుకోనుచున్నాడు
    వుట్టికీ స్వర్గానికంధకుండా తుదకు అస్తిపంజరమయ్యి అగుపిస్తువున్నాడు
    కదేలే విశ్వము తన కనుసన్నలలో ననీ కనుబోమ్మలేగరేసి కాలగర్భములోన...."మా"

  • @ramamurthydudimetla4957
    @ramamurthydudimetla4957 6 месяцев назад +2

    నేటి యువతకు సమాజానికి అందెశ్రీ గారి సందేశాత్మక సాహిత్యం సంగీతం ఇప్పటి తరానికి అత్యవసరం.. సమాజం అనే దాని మీద పాడిన చాలా బాగుంది సార్.... దూదిమెట్ల శ్రీరామమూర్తి... పెనుగంచిప్రోలు... 👌👌

  • @leebrucelee8361
    @leebrucelee8361 6 месяцев назад +8

    సూపర్ సర్ మంచి పాట

  • @jagannadharao304
    @jagannadharao304 3 месяца назад +1

    ఏమీ కంఠం. అద్భుతం శివుని కంఠం నుండి వస్తున్నట్లు

  • @youthvlogsofficial
    @youthvlogsofficial 6 месяцев назад +4

    అద్భుతం మీ పాట

  • @KJyothil-m1n
    @KJyothil-m1n 7 дней назад +1

    Absolutely 100 right super song 🙏🏻

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 6 месяцев назад +26

    అందెశ్రీ తెలంగాణ ఆణిముత్యం🙏

  • @siddamsatyam2617
    @siddamsatyam2617 3 месяца назад +2

    అందేశ్రీ గారికి శతకోటి వందనాలు ఇంతకంటే ఏమి చెప్పలేను

  • @rameshcheboyana6802
    @rameshcheboyana6802 6 месяцев назад +10

    Ande sri garu meku sethakoti vandanalu

  • @kotapradeep4198
    @kotapradeep4198 6 месяцев назад +1

    Super అందెశ్రీ గారు ఎంతో చక్కటి సందేశం వుంది ❤

  • @praveensalvadi1138
    @praveensalvadi1138 6 месяцев назад +3

    Mayamai pothunnadu manishannavadu.... Really....

  • @jagannadharao304
    @jagannadharao304 3 месяца назад

    నేను రోజూ ఈ పాట వింటూ వున్నాను. ఎంతో అద్భుతం అమోఘం అపూర్వం అనంతం అనిపిస్తునది.

  • @myadarisrihari3720
    @myadarisrihari3720 6 месяцев назад +4

    అన్నగారు మీకు పాదాభివందనాలు

  • @jagadeshwarb439
    @jagadeshwarb439 5 месяцев назад +2

    అందెశ్రీ గారి పాట అద్భుతం జనాభా పెరుగుదల వల్ల అశలుపెరిగి విలువలు తగ్గుతున్నవి

  • @luckystarcharancharan843
    @luckystarcharancharan843 6 месяцев назад +7

    Supper kantam vidhyouth voice

  • @GatlaNamdev
    @GatlaNamdev 3 месяца назад +2

    అన్న మనస్పూర్తిగా లాల్సలాం❤

  • @RangaraoPatibandla
    @RangaraoPatibandla 6 месяцев назад +5

    సూపర్ సాంగ్ అందే శ్రీ గారు

  • @rajasekharsekhar5371
    @rajasekharsekhar5371 26 дней назад

    రోజుకు కనీసం రెండు మూడు సార్లు ఈ పాట వింటాను.🙏🙏🙏🙏

  • @Nagasaiashik
    @Nagasaiashik 6 месяцев назад +10

    Super song sir

  • @kakikarunakararao5307
    @kakikarunakararao5307 Месяц назад +1

    అందే శ్రీ గారికి దన్యవాములు సక్కని పాట వినిపించారు

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 6 месяцев назад +7

    Andesri annaku padabhivandanalu

  • @raghavrao6392
    @raghavrao6392 6 месяцев назад +1

    అందెశ్రీ గారు మీకు కోటి కోటి వందనాలు...
    మానవత్వం వున్నొడు మాయమై పోతున్నాడు ...అద్బుతం ....
    నూటికో కోటికో ఒక్కడే అందెశ్రీ గారు ...

  • @yslyrics458
    @yslyrics458 6 месяцев назад +3

    అందెశ్రీ గ్రేట్ ప్రజల మనసులో ఉన్న కవి.

  • @vrdasari3299
    @vrdasari3299 5 месяцев назад +1

    Meaningful and great rendition of natural poet Andesri Garu. Salute to his poetic skills.

  • @rameshsamba1687
    @rameshsamba1687 6 месяцев назад +4

    Super voice & excellent lyrics ANDHE SRI Sir ❤️

  • @saisarathpatchava9502
    @saisarathpatchava9502 2 месяца назад

    ANDE SRI GARU - I AM FOND OF YOUR LIRICS OF THE BEST EVER AND EVER RETHINK OF OUR PRESENT HUMANS LIFE ♥️ ❤❤❤❤

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 6 месяцев назад +5

    Super song

  • @obannamro4627
    @obannamro4627 Месяц назад +1

    No human being in humans
    Song is very near to present society
    Hat's off sir
    Meaning full song

  • @thootikurlasunil3360
    @thootikurlasunil3360 6 месяцев назад +4

    దండాలు అందే శ్రీ గారికి 💐💐

  • @RajaiahChintakindi
    @RajaiahChintakindi 6 месяцев назад +2

    Mee lanti vaari alochana vidhanam
    patagaa mee vyakthithvam kavirupamlo meeru maatlaade prathi maatanu patanu vinnavaaru chaala adhrustavanthulu.mimmulanu chusina meetho maatlaadina a bagavanthunni chusinatle Andhe sri anna gaaru.❤❤❤❤❤❤❤❤❤❤

  • @ayodhyagadepaka1658
    @ayodhyagadepaka1658 4 месяца назад +3

    అలా ఈ పాట పాడినందుకు మీకు ఈ ప్రభుత్వంలో మంచి గుర్తింపు వస్తుందని నమ్మకంతో ఉన్నా నమ్మకంతో ఉన్నాను