వివేకచూడామణి||శ్రీ శ్రీ శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల ఆత్మ విచారణ||శ్రీ స్వారాజ్య బ్రహ్మనిష్ఠాశ్రమం||

Поделиться
HTML-код
  • Опубликовано: 7 июн 2024
  • పాలలో గలిసిన వెన్నను వేఱుచేయుటకెట్లు తోడంటు వేయుదుమో అట్లే యనాత్మలోఁ గలిసియున్న యాత్మను వేఱుచేయుటకు సో2హం, తత్వమసి, అహంబ్రహ్మాస్మి, సర్వంఖల్విదంబ్రహ్మ యనెడు నాలుగు కీలకములున్నవి. శ్వాసపై నిగా సో2హం ప్రత్యగాత్మపై నిగా తత్త్వమసి, బ్రహ్మముపైనిగా అహంబ్రహ్మాస్మి, అంతా దేవుఁ డే యనెడు దృష్టి సర్వం ఖల్విదం బ్రహ్మ, ఈ నాల్గుకీలకములలోఁ తనయోగ్యత కనుకూలమైన యే కీలకములో నై నను యేమఱుపాటు లేక నిలుచుటే చేమిరి. చేమిరి=తోడంటు, పాలు పెరుగైనట్లు కీలు సరిగాఁ గుదురు టేయగును. మధించఁ గా వెన్నవేరైనట్లు కీలులో శ్రద్ధఁగా నోర్పుగలిగియుంటిమేని యనాత్మయూడిపోయి యాత్మ వేరై స్పష్టముగా నంతర్ముఖవృత్తికి గోచరించును. ఇట్టి స్థితిగల పరమహంస ఇది యనాత్మ ఇది యాత్మ యని ప్రత్యేకముగా స్పష్టముగా విభజించి తెలిసికొనగలఁడు, ఇట్టి పరమహంసయే వివేకి. ఆత్మానాత్మల స్పష్టముగా నెఱుఁ గుటే వివేకము. అనాత్మ జడము ఆత్మచైతన్యము, అనాత్మ యసద్గుఃఖ ఖండస్వరూపి, ఆత్మసదానందపరిపూర్ణమని వివేకి గ్రహించును ఆత్మ యందలి విహారము వలనఁ గలిగెడు గొప్పఁదనమును, అనాత్మ విహారమున లభించెడు హీనస్థితిని దెలిసికొని బ్రహ్మాను సంధానమార్గమున నడచుచు బ్రహ్మమే తానగుటకే వివేకి తన జీవితము నుపయోగించుకొనును.‪@swarajyabrahmanistaashram‬
    #meditation
    #sadguru
    #vivekachudamani
    #sriram
    #spiritual

Комментарии • 10