Foxconn Rejecting Married Women | Labour Ministry Seeks Report From Tamil Nadu Govt

Поделиться
HTML-код
  • Опубликовано: 26 июн 2024
  • తమిళనాడులోని ఫాక్స్ కాన్ కర్మాగారంలో పెళ్లైన మహిళలకు ఉద్యోగాల తిరస్కరణపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం.. స్పష్టంచేసింది. యాపిల్ ఉత్పత్తుల్ని అసెంబుల్ చేసే ఫాక్స్ కాన్ .. వివాహిత స్త్రీలకు ఉద్యోగాలను తిరస్కరిస్తోందని రాయిటర్స్ మీడియా సంస్థ ప్రచురించింది. పెళ్లైన స్త్రీల రిక్రూట్ ను మినహాయించిందనీ కుటుంబవిధులు, గర్భం వంటి కారణాలతో ఎక్కువమంది రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. 2023, 2024ల్లో ఈ వివక్ష విధానాలు జరిగినట్లు పేర్కొంది. దీనిపై స్పందించిన కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ.. స్త్రీ పురుష కార్మికుల నియామకంలో వివక్ష ఉండకూడదని 1976 సమాన వేతన చట్టం నిర్దేశిస్తుందని ప్రకటన విడుదల చేసింది. వెంటనే నివేదిక సమర్పించాలని తమిళనాడు చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ అంశంపై ఫాక్స్ కాన్ స్పందించింది. తమ కొత్త ఉద్యోగులలో 25 శాతం మంది వివాహిత స్త్రీలేనని తెలిపింది. భద్రతా ప్రోటోకాల్ ప్రకారం.. తమ సిబ్బంది ఏ విధమైన లోహ ఆభరణాలు ధరించవద్దని వివరించింది. సంస్థలో ఉద్యోగం దక్కించుకోలేక పోయిన వ్యక్తులే ఈ ఆరోపణలు చేసి ఉండొచ్చని పేర్కొంది. ఇటువంటి మీడియా నివేదికలు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ తయారీ రంగాన్ని దెబ్బతీస్తున్నాయని వివరించింది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 2

  • @gamingff4505
    @gamingff4505 День назад

    Orey evdra etv sound engineer sound chala takkuva vastundi

  • @saranm6
    @saranm6 2 дня назад +1

    1976 ki ipatiki teda Leda 😂