దళిత బంధు రెండో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో వారం రోజుల్లో

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • దళిత బంధు రెండో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో వారం రోజుల్లో జమ చేస్తాము అని తెలిపిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోకిల మహేష్. దళిత బంధు నిధులు వారి అకౌంట్లో జమ చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రులు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో దళిత బంధు సాధన సమితి రాష్ట్రస్థాయి సమావేశం నియోజకవర్గ ఇన్చార్జి ఏకు కార్తీక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోకిల మహేష్ మాట్లాడుతూ దళితుల జీవితాలలో వెలుగులు నింపేలా గత బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిధులు ఫ్రిజ్ చేశారని, ఎన్నికల కోడ్ ముగిసిన కూడా నిధుల విడుదలలో జాప్యం జరిగిన నేపథ్యంలో ఎన్నో పోరాటాలు, ధర్నాలు చేస్తూ గౌరవ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, మంత్రివర్యులు సీతక్క గారిని, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని కలిసి వినతి పత్రాలు ఇచ్చి తమ సమస్యలను తెలియజేశామని అన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రెండో విడత దళిత బంధు నిధులను లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తామని తెలుపడం హర్షించదగిన విషయమని ఈ సందర్భంగా తెలియజేశారు. యావత్ తెలంగాణ రాష్ట్ర దళిత బంధు లబ్ధిదారుల అందరి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్యులు సీతక్క గారికి, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు కోకిల మహేష్, కోఆర్డినేటర్ మడికొండ రమేష్, ఉపాధ్యక్షులు భువనగిరి శ్రీనివాస్, ఎరుకల దేవయ్య, మతంగి శంకర్, ములుగు జిల్లా నాయకులు రాంబాబు, కవ్వంపల్లి బాబు, ములుగు వెంకటాపురం, మంగపేట, తాడువాయి, ఏటూరు నాగారం, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, వాజేడు వెంకటాపురం, పాకాల కొత్తగూడా, గంగారం మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Комментарии •