Telugu Bible : ఆదికాండం మొదటి అధ్యాయం నుండి...👍 Good stream | Playing Solo |

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 1

  • @TruthFinderNow
    @TruthFinderNow 14 дней назад +2

    పాత నిబంధన : క్రీస్తుపూర్వం కాలమునందు పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీయులను ఉద్దేశించి వారి కొరకు వ్రాయబడినది. భవిష్యత్తులో జరగబోయే ప్రవచన వాక్యాలు కూడా ప్రవక్తల ద్వారా ముందుగానే వ్రాయబడ్డాయి.
    భూమి ఆకాశములను యెహోవాయే సృజించెను. సర్వశరీరులకు యెహోవాయే దేవుడు. కానీ తన మాట వినే ప్రజలను 'తన ప్రజలుగా' దేవుడు పిలిచాడు.
    తన మాట విని నటువంటి అబ్రహాము ద్వారా 'ప్రపంచ జనాంగములను ఆశీర్వదిస్తానని' ముందుగానే వాగ్దానం చేశాడు.
    అబ్రహాము మనుమడైన యాకోబును 'ఇశ్రాయేలు'గా పేరు పెట్టాడు. ఆ ఇశ్రాయేలు జనంగము 'తన సొంత జనాంగమని' దేవుడు అన్నాడు.
    ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు రాజుగా ఉంటూ, వారి మధ్య నివసించి, వారిని నడిపించాడు. కానీ ఆ ప్రజలు ఒక మనిషిని రాజుగా పెట్టుమని సమూయేలు ప్రవక్తను అడిగారు.
    'దేవుని సొంత జనంగమైన ఇశ్రాయేలు' మీద రాజుగా ఉన్న మనుషులు దేవునికి వ్యతిరేకంగా పాపములు చేస్తూ ఆయన ప్రజల మీద దేవుని కోపం రగిలేలా చేశారు.
    ఇశ్రాయేలు ప్రజలు, రాజులు పాపములు చేసినప్పుడు వారిని దేవుడు శత్రువులకు అప్పగించాడు. మరియు వారు మారుమనస్సు పొంది ప్రభువును మొరపెట్టి వేడుకొనగా, ఆయన వారి శత్రువుల నుండి విడిపించాడు.
    కొత్త నిబంధన : క్రీస్తు శకం కాలమునందు, కొత్త నిబంధన కాలములో ప్రపంచ క్రైస్తవులందరినీ ఉద్దేశించి వారి కొరకు వ్రాయబడినది. భవిష్యత్తులో జరగబోయే ప్రవచన వాక్యాలు శిష్యుల ద్వారా ముందుగానే వ్రాయబడ్డాయి.