శాంతి దీనిపై నిర్దేశిత ధ్యానాలు | Guided Meditation on Peace | Yogoda Satsanga Society of India

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • మీరు మీ లోపల ఉన్న ఆత్మ గురించి అన్వేషణను ప్రారంభించబోతున్నారు మీ ఆత్మలో ఉండే శాంతి మరియు ఆనందాన్ని అనుభవించడానికి ఇది మార్గదర్శక ధ్యానం. ధ్యానం అనేది దైవ-సాక్షాత్కారం గురించిన శాస్త్రం. ఇది ప్రత్యేకమైన ఏకాగ్రతా పద్దతి; దీనిలో ధ్యాస, విక్షేపాల నుండి మరియు చంచలమైన ఆలోచనల నుండి స్వేచ్ఛ పొంది, అంతర్ముఖం చెంది ఏకాగ్రమవుతుంది; ఇది సర్వవ్యాప్త పరబ్రహ్మ - నిత్య స్థిత, నిత్య చైతన్య, నిత్య నూతనానందం - గురించి గాఢమైన అనుభవాన్ని తీసుకువస్తుంది.
    మనము ధ్యానాన్ని ప్రారంభించే ముందు, ధ్యానం చేస్తున్నంతసేపూ మీరు ఏకాంతంగా, అవాంతరాలు లేకుండా ఉండడానికి, నిశ్శబ్దంగా ఉండే ప్రశాంతమైన ప్రదేశాన్నిఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు కూర్చోవడానికి నిటారుగా ఉండే కుర్చీని ఎంచుకోవచ్చు లేదా స్థిరమైన ఉపరితలంపై, నేలపై సుఖాసనంలో కూర్చోవచ్చు. మనం ధ్యానం మొదలుపెట్టినప్పుడు సరైన ధ్యాన భంగిమలో కూర్చోవడం చాలా ముఖ్యం. వెన్నెముక నిటారుగా, గడ్డం నేలకు సమాంతరంగా ఉండాలి, శరీరం నిశ్చలంగా, విశ్రాంతిగా ఉండాలి. కళ్ళు మూసుకుని, శ్రమ లేకుండా మీ దృష్టిని భ్రూమధ్యం (కనుబొమల మధ్య బిందువు) - ఏకాగ్రతకు, ఆధ్యాత్మిక నేత్రం లేదా దివ్య జ్ఞానానికి కేంద్రం - వద్దకు నెమ్మదిగా పైకెత్తండి. ప్రాపంచికమైన ఆలోచనలన్నిటినీ పక్కకు పెట్టండి; ధ్యాసను అంతర్ముఖం చెయ్యండి, మీ దృష్టిని ఆధ్యాత్మిక నేత్రం వద్ద కేంద్రీకరించాలని గుర్తుపెట్టుకోండి. అన్ని రకాల చింతలను, ఆందోళనలను వదిలిపెట్టి, ఆంతరిక ప్రశాంతతను అనుభూతి చెందండి.
    కాపీరైట్ © 2016 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.
    పరమహంస యోగానందగారి బోధనల గురించి మరింత తెలుసుకోవడానికి, లేదా సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పాఠాల కోసం నమోదు చేసుకోవడానికి, మా వెబ్ సైట్ ను సందర్శించండి: www.ysslessons.org
    #నిర్దేశిత ధ్యానాలు
    #ఇన్నర్ పీస్
    #యోగానంద
    #సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్
    #యోగ ధ్యానము
    #ఎస్.ఆర్.ఎఫ్.

Комментарии • 2

  • @balaa8160
    @balaa8160 7 месяцев назад

    🙏🙏🙏

  • @gayathridevi8695
    @gayathridevi8695 Год назад

    చాలా బాగుంది స్వామీజీ, నమస్తే