పెండ్లిమర్రి మండలం లోని నాగాయపల్లి గ్రామం లో సాయినాథ్ శర్మ కు అపూర్వ ఘన స్వాగతం
HTML-код
- Опубликовано: 10 фев 2025
- సాయినాథ్ శర్మ కు అపూర్వ ఘన స్వాగతంకమలాపురం నియోజకవర్గం లోని పెండ్లిమర్రి మండలం లోని నాగాయపల్లి గ్రామం లో వైస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు కమలాపురం నియోజక వర్గం ప్రజానాయకుడు నిరుపేదల సేవకుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ కు సాయినాథ్ శర్మ అభిమానులు ఆత్మీయులు ఆదివారం అపూర్వ ఘన స్వాగతం పలికారు. గ్రామం లో అబ్బిరెడ్డి మాధవరెడ్డి నూతన గృహప్రవేశం కి ఆయన ఆహ్వానం మేరకు నాగయపల్లె గ్రామానికి సాయినాథ్ శర్మ విచ్చేసారు. గ్రామం లోకి సాయినాథ్ శర్మ రాగానే గ్రామ శివార్ల నుంచి ఆయన అభిమానులు భారీ సంఖ్య లో బాజా బజంత్రీలతో మేళ తాళలతో కనీవిని ఎరుగని విధంగా బాణసంచ పేల్చుతూ అత్యంత ఉత్సాహంతో ఊలలు కేరింతలు కొడుతూ ఆహ్వానం పలికారు. ప్రతి ఒక్కరిని సాయినాథ్ శర్మ పేరు పేరున పలకరించడం అందరిని ఆకట్టుకుంది.గ్రామం లో మాధవ రెడ్డి ఆయన బందువులు ఆత్మీయులు చూపిన అభిమానం మరువలేనిదన్నారు. కష్టం కాలం లో వెన్నంటి ఉన్న వారికి తాను ఋణపడి ఉంటానన్నారు.రాళ్ళ పల్లి బాలకృష్ణా రెడ్డి, గ్రామానికి చెందిన పెద్ద పుల్లారెడ్డి నడిపి పుల్లారెడ్డి రామమోహన్ రెడ్డి ఓబుళరెడ్డి తుమ్మలురు హరి సూరి సుబ్బరాయుడు భారీ సంఖ్య లో ప్రజలు నాయకులు సాయినాథ్ శర్మ తో కలిసి మాట్లాడి నియోజకవర్గ పరిస్థితులను చర్చించారు. కష్ట సమయం లో తమకు తోడుగా ఉన్నవారి వెంట తాము నడుస్తామని వారు సాయినాథ్ శర్మ కు భరోసా కల్పించారు