నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు || Song No: 114 || Songs of Zion || Hebron Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025
  • నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు || Song No: 114 || Songs of Zion || Seeyonu Geethamulu || Hebron Songs
    "(సువర్ణ) దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని" ప్రకటన 1:13
    పల్లవి : నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు
    1. అల్ఫాయు ఓమేగ వర్తమాన - భూత భవిష్యత్తులో నున్నవాడా
    నా సర్వము నిర్వహించువాడా - సర్వాధికారి నిన్నే స్తుతించి
    అర్పింతు నీకే నా ఆరాధన
    || నేనే ||
    2. ఏడు సువర్ణ దీపస్తంభముల - మధ్య సంచరించుచున్నవాడా
    శుద్దీకరించితివి నన్ను - మేలిమిగ మార్చి సంఘమున
    చేర్చితివి నిన్నే ఆరాధింతు
    || నేనే ||
    3. తెల్లని ఉన్నిని పోలియున్న - వెంట్రుకలు కలిగి యున్నవాడా
    ఆలోచనకర్త నీవే నాకు - జ్ఞానమైతివి అసమానుండ
    అర్పింతు నీకే నా ఆరాధన
    || నేనే ||
    4. సూర్యుని వంటి ముఖము కలిగి - అగ్నిజ్వాలల నేత్రముల్ కలిగి
    దృష్టించితివి నా హృదయమున్ - దహించితివి దుష్టత్వము
    ప్రేమగల ప్రభూ నిన్నారాధింతు
    || నేనే ||
    5. అపరంజిని పోలిన పాదములు - కలవాడా తీర్పు తీర్చితివి
    పాపము లోకములనిల - దుష్ట సాతానున్ సిలువలో గెలిచి
    విజయ మిచ్చినందుల కారాధింతున్
    || నేనే ||
    6. నీ నోటినుండి బయలువెడలె - రెండంచులు గల వాడి ఖడ్గము
    అదియే పాత ఆదామును చంపె - నశింప చేసె నా శత్రుబలమున్
    అర్పింతు నీకే నా ఆరాధన
    || నేనే ||
    7. ఏడు నక్షత్రములు పట్టుకొనిన - మొదటివాడా కడపటివాడా
    సర్వ సంపూర్ణత నాకిచ్చితివి - అపాయములలో ఆదుకొనుచున్న
    ఆమేన్ అనువాడా హల్లెలూయ
    || నేనే ||

Комментарии •