మూడవ బహుమతి కడిమెట్ల భజన బృందం // pandipadu bajana potilu (telugu lyrics) pathinti ramakrishna

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 2

  • @pathintiramakrishna
    @pathintiramakrishna  16 дней назад +2

    సాంగ్ :- హర హర శంభోశంకర
    రాగం :- రేవతి రాగము
    తాళం :- ఆది తాళము
    గీతరచన్న :- కవి శ్రీ డి.తిరుపాలు.గారు (కర్నూలు జిల్లా)
    స్వరకల్పన:-( ,, ,, ,, ,, ,, )
    గాయకుడు:- చిన్న కేషన్న
    భజన బృందం :- శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి భజన బృందం బనవనూరు భజన పోటీలు : 1 వ భహుమతి 20 తులాల వెండి
    కడిమెట్ల భజన బృందం యమ్మిగనూరు మం(కర్నూలు జిల్లా)
    సాకి : తస్త్మె నమః పరమకారణ కారణాయ
    దీపోజ్వలిత పింగళ లోచనాయ
    నాగేంద్రహారా కృతకుండల భూషణాయ
    బ్రహ్మేంద్ర విష్ణు వరదాయ నమఃశివాయ
    పల్లవి : హర హర శంభోశంకర శివశివశంభో జఠాధర
    భుజగభూషణ ఫాలనేత్ర శూలధారి మమ శరణం - 2 ౹౹హర౹౹
    చరణం: పరమ శివాయని పాడేను నా గళం
    ముక్కంటి దేవర మహేశ్వర - 2
    సృష్టి స్థితిలయ కారక ఈశా - 2
    వేడెదరనిను గంగాధర భవ - 2
    చంద్రశేఖర చర్మాంబరుడా
    పార్వతినాథ కదలిరావయ. ౹౹హర౹౹
    చరణం: నీ పాదం సోకి పులకించే ఈ పుడమి
    భస్మాంబరధారి జగదీశ్వర - 2
    కైలాసగిరివాసా పరమేశ్వర శివా - 2
    నమోః నమోః నమః శివాయ - 2
    నీలకంఠుడా నిరంజనుడా
    లింగస్వరూపుడా మముబ్రోవరా. ౹౹హర౹౹
    ___________________________________________
    ___________________________________________
    రాగం :- భాగేశ్వరి రాగము
    తాళం :- రూపకం తాళము
    సాకి :- శ్రీ రామ రామ రమేతి రమే రమే మనోరమే
    సహస్రై నామ తత్తళ్యం రామనామ వరాననే - 2
    ---------------------------
    పల్లవి :- మధుర సుధా భరితము రామనామ గాణము
    సదాధ్యాన సాగరమున స్నానమాడవే మనసా.౹౹మధు౹౹
    చరణం:- నీసస నీసససా.సామమ గామమమా.గాదద మాదదదా.
    మానిని దానినిసా.సానినీని దాద మామ.నీని దద మామ గాగ.
    దాద మామ గాగ గస.సగమ.గమద మదని.సనిదమ గమదనిసా.
    వేదాహరణము రామనామ గాణము
    సదానంద దాయకము శ్రీ రాముడి శుభ నామము.౹౹మధు౹౹
    చరణం:- నీసస నీసససా.సామమ గామమమా.గాదద మాదదదా.
    మానిని దానినిసా.సానినీని దాద మామ.నీని దదమామ గాగ.
    దాద మామ గాగ గస.సగమ.గమద మదని.సనిదమ గమదనిసా.
    ఇంతింతని పొగడలేని ఘనమైనది నీ నామము - 2
    ఎంతపాడిన మధురమే రఘరాముని శుభనామము.౹౹మధు౹౹
    ___________________________________________
    ___________________________________________
    సాంగ్ :- కేషవుడే పలికించె నా చేత
    రాగం :- శ్యామ రాగం
    తాళం :- ఆట తాళం
    రచన :- కవి శ్రీ రామావధూత
    స్వరకల్పన:- ( ,, ,, )
    తేది :- 15 - 5 - 2019
    సాకి :- నిజభక్తులను యేలు నిజదైవం నీవని నిరాకారరూప శ్రీ లక్ష్మీ పతి
    నన్నేలు దైవమని నీపాదముల పడి మొరపెట్టేనురా శ్రీ చెన్నకేశవ
    ఆది మధ్యాంతరహిత స్తుతియింతు గతినీవె శేషశాయి - 2
    పల్లవి :- కేషవుడే పలికించె నా చేత ఈ పరమ గీతం
    పరమదసోపానం కేశవుని ధ్యానం - 2
    హరినారాయణ శ్రీ చెన్నకేశవ పాహి పాహి - 2
    చరణం:- యోగులకు భోగులకు పరమౌషధం కేశవుని నామం
    పలుమారు వల్లించితే తొలగేనులే మదిని తాపం
    సర్వాభీష్టప్రదాయుడు శ్రీ చెన్నకేశవుడు మా ఇష్ట దైవం - 2
    మనసారగా కీర్తింతు మహనీయుని సంకీర్తన - 2 ౹౹కే౹౹
    చరణం:- త్రివిక్రమ త్రిజగన్నుత వైకుంఠమున వున్న శ్రీ నరహరి
    నయనానందకరం నీ దివ్య విగ్రహం తిలకించివి తిరునామధారి - 2
    జయనినాదం పాడగా నీకు జయ జయా శ్రీ చెన్నకేశవ శ్రీ హరి హరి - 2
    శ్రీ మధు సూధనా వామనాభృగురామ రామదూతల బ్రోవరా ఓ శ్రీధరా.౹౹కే౹౹
    ___________________________________________
    ___________________________________________
    సాంగ్ :- భారతావనిలో జనియించిన శ్రీ రామా
    రాగం :- తోడి రాగము
    తాళం :- తిశ్రగతి తాళము
    స్వరకల్పన్న :- కవి శ్రీ రామావధూత
    సాకి :- భారతావనిలో జనియించిన శ్రీ రామా
    సాటేవరయ్య నీకు అయోధ్య రామా రామా రామా
    పల్లవి :- రామా రామా అనరా ఓనరుడా
    రామా స్మరణ చేయుము పామరుడా
    రామా శ్రీ రామా రామా జయరామా - 2 . (రామా)
    చరణం:- నరుడై వెలిసెను శ్రీ మన్నారాయణుడే
    కష్టా సుఖాలనుభవించే శ్రీ రామచంద్రుడే - 2
    భద్రాద్రి రాముడే భవబంధవిమోచకుడే - 2
    పావనుడై వెలిసెను పరంధాముడే
    రామా శ్రీ రామా రామా జయ రామా. (రామా)
    చరణం:- హనుమయ్య భక్తితో కొలిచే ఈ నామం
    త్యాగయ్య పరవశించి కీర్తించే ఈ నామం - 2
    పతిత పావన నామం బహు పుణ్య మీ నామం - 2
    పాడవోయి నరుడా కౌసల్య రామ నామం
    రామా శ్రీ రామా రామా జయ రామ. (రామా)

  • @BargavAachari-kl8cp
    @BargavAachari-kl8cp 11 дней назад

    పత్తింటి రామకృష్ణ గారు హార్మోనిస్ట్ గారి పెరు తబలిస్ట్ గారి పెరు టైటిల్ హార్మోనిస్ట్ తపాలిస్ట్ పేర్లు రాయండి