అతి తక్కువ టైంలో శిక్షణ పొంది మొదటి బహుమతి సాదించిన లక్ష్మీ పల్లి భజన బృందం // telugu lyrics patalu

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 8

  • @pathintiramakrishna
    @pathintiramakrishna  22 дня назад +1

    హంసధ్వని రాగం : ఖండగతి తాళం
    శ్లోకం : ఓం...హరహర మహాదేవ శంభో...
    నందీశ్వర ప్రమదనాధ మహేశ్వరా..
    కామేశ్వరీప్రియ మహనందీశ్వరా
    నమో...నమః...ఆ...ఆ...ఆ...ఆ...
    పల్లవి : మహనందీశ్వర మముగన్న తండ్రి
    మా యింటి దైవమా ముక్కంటి దేవ
    బ్రోవర...కావర...భోళా..శంకరా
    జై జై నందీశ్వరా...జై జై పరమేశ్వరా
    సనిసనిప నిపనిపగ పగపగరి గరిస
    గరిసస పగరిరి నిపగగ గపనిసా పనిసా పానిరిగరిసా
    చరణం: నీవున్న మహానంది మా పుణ్యధామం
    సస్యశ్యామలమై ప్రవహించు ఝరులు
    గిరులు ఝరులు విరులు హరుని
    ప్రతిరూపములు ఓం... నందీశ్వరా.... ౹౹మ౹౹
    సాసాస నినిసాస నిసాస గరిసా గపగరి
    నినిరిస గరిసనిప రిసనిపగ సనిపగరి
    పగరిస సరిగాగ సరిగపా గపనీని గరిసా
    గరిసనిప నినిరిస నినిససస నినిరిరిరి
    నినిససస నినిరిరిరి గరిగరిస గపనిస పనిస
    పానీరిగరిస సససస గగగగ పపపప నినినినిరి గరిస
    చరణం: తదిమి తకదిమి దిమిదిమి తైతై
    నాట్యమాడే నందీశుడు వేదవేదమ్ములు
    వెలుగెత్తి వల్లించె నల్లమల శైలంబులు
    భూలోకమందున ముక్తిదాయకమై అలరారె
    ఆ క్షేత్రమూ మహానందీశ్వరుని దర్శనంబే
    ఫలదాయకము సర్వఫలదాయకం. ౹౹మ౹౹
    ____________________________________________
    ____________________________________________
    మాల్కోస్ రాగం : ఆది తాళం
    సాకి :- కరుణారస భరణా - ఘనాఘనా
    సుజన జనావన - సుందర వదనా- 3
    పల్లవి :- కరుణారస భరణా - ఘనాఘనా
    సుజన జనావన - సుందర వదనా.
    చరణం:- సరసిజదళ నయనక్షిరాబ్దిశయనా
    సురగణమునిజన - వందిత చరణా
    నానాజీవన నాటక కారణ
    నతజన పాలన - శౌరిమురారి పాప విదారి.
    చరణం:- యుగ యుగమున నీ జగమొనరించి
    అగణిత మహితో - అవనిజనించి
    నిగమ యాగముల - నియతి రక్షించి
    పగతులు గూల్చిన - శౌరిమురారీ పాప విదారీ.
    ____________________________________________
    ____________________________________________
    హంసానందిని రాగము : ఆది తాళము
    సాకి :- రామ రామేతి రామ శ్రీ రామా
    జయ సార్వ భౌమా...
    పల్లవి :- శీ రామ జయరామ జయసార్వ భౌమ
    ఇహలోక పరంధామ ఇనవంశ సోమ. ౹౹శ్రీ౹౹
    చరణం:- సీతాపతీ నిన్ను మనసార సేవింప
    బహదిరిత బారాలు భహుదూర మోనని
    భవభంధ పాశాలు భాదింప లేవని
    మునుపెందరెందరో పూజించలేద. ౹౹శ్రీ౹౹
    చరణం:- రవి కులాన్వయ సోమ రణరంగ ధీమా
    రాదేల నీ కరుణ వైదేహి రమణ
    భద్రాద్రిపై వెలసి భక్తులను కాచేవు
    భవబంద భయహరణ రాజీవనయన. ౹౹శ్రీ౹౹
    ____________________________________________
    ____________________________________________
    రాగం :- అభేరి రాగము
    తాళం :- తిశ్రగతి తాళము
    గీత రచన :- కవి శ్రీ డి.తిరుపాలు గారు
    స్వరకల్పన :- ( ,, ,, ,, )
    సాకి :- నమౌ శ్రీ పాండు రంగా నమో శ్రీ పుండరికవరద
    నమో...విఠలా...విఠలా...అ
    పల్లవి :- జయతు జయతు రంగనాధా శ్రీ పాండురంగ
    పండరి పుర విఠల పరంధామ
    పాహిమురారి వైకుంఠం ధామా. ౹౹జ౹౹
    చరణం:- చంద్రభాగ తీరాన ఇటుక రాతిపై నీవు
    కదలక నిలిచావయ్య మోక్ష ప్రదాతవై - 2
    నీవన్న ఈ పండరి మా పాలిటి పెన్నిధి అఅఆ -2
    అనిషం నిను వేడేము మొర వినుమో శ్రీ రంగ.౹౹జ౹౹
    చరణం:- తుకారం సక్కుబాయి నీ గానం సల్ప
    పరమపదం నొందిరి పాండురంగ నీ దాసులు - 2
    నీవే దిక్కని నమ్మిన మము బ్రోవుము రంగయ్య అఅఆ-2
    రుక్మిణీ వల్లభ పాండురంగ జయతు శ్రీ పండరి నాద జయతు.౹౹జ౹౹

  • @maheshtangudutv3205
    @maheshtangudutv3205 19 дней назад

    పాటలు చాలా బాగున్నాయి

  • @janardhanp2085
    @janardhanp2085 17 дней назад

    సూపర్ సంగీతం

  • @babureddygaddam8117
    @babureddygaddam8117 22 дня назад +1

    సూపర్ వీడియో రామకృష్ణ❤

  • @VishnuYadav-ci2lx
    @VishnuYadav-ci2lx 22 дня назад +1

    హార్మోనియం తబలా సూపర్ 🙏🙏🙏🙏

  • @hindigangadhar8579
    @hindigangadhar8579 22 дня назад +2

    తబలా సూపర్

  • @hindigangadhar8579
    @hindigangadhar8579 22 дня назад +1

    తబలా సూపర్

  • @kganganna8584
    @kganganna8584 17 дней назад

    తబలా సూపర్