ANJALI GHATIYINCHINAMU 8K|A Carnatic Classical Fusion | Pranam Kamlakhar | K Yohan Babu | Haricharan

Поделиться
HTML-код

Комментарии • 1,5 тыс.

  • @orangekamal
    @orangekamal  2 года назад +1094

    అంజలి ఘటియించినాము
    అందరి మనసులలోని చీకటుల
    హరియించి తరియింప చేయగా
    నీ సుందర పదములముందర మేమందరము యేసు...
    అంజలి ఘటియించినాము...
    వాడుకగా వాక్యమును చదివితిమి గాని
    వాస్తవముగ దాని భావమే మరచితిమి
    ఆచారముగా ఆలయమేగితిమి గాని
    ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి
    తుదకు వాక్యము నీవని ఎరిగితిమి
    నీ ఆలయముగా మేము మారితిమి ... యేసు
    అంజలి ఘటియించినాము...
    వేదనలో నీ వేదమునే తలచి
    వేడుకలో నీ నామమే మరచి
    స్వార్ధ చింతనతో స్వామి నిను విడచి
    విలపించి తలవంచి
    అంజలి ఘటియించినాము...
    పాపాప పద పాపాప పద పాపాప
    పమపమగరిసరిగమ పాపామపదపా
    పమపదనీనీనినిసని మపదనిసాసానిసారిసా
    సరిగమపమగరిసానిదపమా
    గమని గమనీనీ గమని గమనీని సగప సగపాప సగప సగపాప
    సరిగ సరి గమపమ
    సరిగ సరి గమపమ
    రిగమరి గమపదని
    రిగమరి గమపదని
    తధీమ్ త తకిట
    తఝo త తఝణు
    తక తకిట తకధిమిత తక ఝణుత
    సరిగమ పమగరి గమపద నిదపమ
    పదనిసరిగమపమగరిసనిదపమ
    మాపదనిస గామపదని రీగామపద
    సారిగమదప మగరి
    సగరి గమ గమప గమపదని
    గరిసనిదపదనిసాసా గరిసనిదపదనిసాసా
    మపదనిసా మపదనిసా మపదనిసా

    • @chinnaperumali4347
      @chinnaperumali4347 2 года назад +17

      Nice songs

    • @sirivellagrace
      @sirivellagrace 2 года назад +20

      Beautiful Kamlakar sir
      God bless you more Abundantly. Amen Blessed Beloved

    • @shanthiraju9107
      @shanthiraju9107 2 года назад +17

      Nee sundhara padhamula mundu memandharam Yesuuu...what a beautiful meaning
      Thank you so much Pranam garu..once again reminded the importance of Word of God

    • @jayasuryacherukuri2485
      @jayasuryacherukuri2485 2 года назад +10

      Song vinnantha sepu teliyani santhosam edo bayatiki alaa vachesthundi, antha adbuthanga vundi annaya song♥️♥️♥️♥️🥰

    • @vijjukannaofficial9920
      @vijjukannaofficial9920 2 года назад +7

      ❤️❤️❤️❤️❤️🙌🙌🙌🙌🙌❤️❤️❤️❤️❤️

  • @karunakar121
    @karunakar121 10 месяцев назад +82

    నిజంగా ఈ పాటను స్వర పరచుట యందు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @immakadhanunjayarao3000
    @immakadhanunjayarao3000 2 года назад +72

    నా జీవితంలో క్రైస్తవ గీతాలలో ఇలాంటి శాస్త్రీయ సంగీతంలో ఒక పాట రావటం దేవునికే మహిమ
    గానం సంగీతం రచన అద్భుతం.. దేవుడు మీ బృందానికంతటికీ దీవించును గాక..

  • @samuelkolli468
    @samuelkolli468 2 года назад +196

    సంగీతమంటే ఒక కంప్యూటర్ కి పరిమితమైపోయిన ఈ రోజుల్లో ఇంత మంది సంగీత కళాకారులతో నిజమైన దేవుని కొరకు ఎంతో గొప్పగా చేశారన్న మరియు క్రైస్తవ పాటలకి ఎప్పటి నుంచో కొన్ని వాయిద్యాలు తోటే పరిమితమైపోయిన ఈ రోజుల్లో అలనాడు గొప్ప సంగీతకారుడు దావీదు మహారాజు గారు కీర్తనలలో చెప్పినటువంటి తంబుర సితార వాద్యములతో ఆరాధించిన పరలోక సంగీతం క్రైస్తవ లోకంలో ఈ తరానికి మళ్లీ చూపిస్తున్నారు ఈ పాటకి ప్లే చేసిన వాయిద్య కళాకారులు అందరూ నిజమైన దేవుని తెలుసుకుని వారందరూ మారుమనస్సు పొందాలని ప్రార్థిస్తాము అన్న సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తు కే ఆమెన్✝️🕎🙏

    • @balusadu
      @balusadu 2 года назад +4

      Well said brother I strongly agree with you,
      Christian sangeetham Ante Keyboard, Rhythms pad eh anukune generation loki maripothunnam
      Definitely we have to awake

    • @prameelakolli3607
      @prameelakolli3607 2 года назад

      @@balusadu yes

    • @mvenkatesh3815
      @mvenkatesh3815 Год назад

      Kamalakar sir garu rabovu tharalaku miru ekaka divenakaramuga vadabadalani miyoka sangitam dvara enka anekulu yesuni telusukovalani korika amen

    • @sarahgeorge3914
      @sarahgeorge3914 9 месяцев назад

      Haleluya

    • @Vinshil_fenny_official
      @Vinshil_fenny_official Месяц назад

      You said true bro

  • @ambalasandhya3962
    @ambalasandhya3962 2 года назад +115

    ఈ సంగీతం ఈ స్వరాలు మీవి ఎంతమాత్రం కావు... ఇది కేవలం దేవుని దయ మాత్రమే ఈ మహిమ దేవునికి మాత్రమె మహిమ కలుగును గాక🙏🙏🙏 💐💐👏👏👏🌹👌👌👌

    • @manikumartigireddy4794
      @manikumartigireddy4794 Год назад +5

      అసలు సంగీతం... సప్తస్వరాలు.... వాటి అన్వేషణ...గ్రహింపు.... వినే చెవులు.... పరవశం అయ్యే శరీరం... దేవునిలో లీనం అయ్యే ఆత్మ... ఇవన్నీ సర్వోన్నతుడయిన దేవుని సృష్టి... కాబట్టి నీటి ఆవిరి వంటి మనిషి కాదు దేవుడే ఘనత మహిమ పొందాలి..అమెన్

    • @Sapthaswaras7330
      @Sapthaswaras7330 9 месяцев назад +1

      కరెక్ట్ చెప్పావు bro

  • @kotipolice1924
    @kotipolice1924 2 года назад +85

    వామ్మో ఇదేం సంగీతం సార్, దేవుడు మిమ్మల్ని ఇంత బాగా వాడుకుంటున్నారా!!! GOD bless you sir KARUNAKAR garu🙏🙏🙏🙏q👌👌👌👌

  • @pastorravikumarchintada2649
    @pastorravikumarchintada2649 10 месяцев назад +8

    ఇంత గొప్ప సాహిత్యాన్ని వ్రాసిన మీ తండ్రిగారిని బట్టి ఆ దేవదేవుని స్తుతిస్తున్నా అన్న

  • @maheshkota7956
    @maheshkota7956 2 года назад +108

    భావం
    భాష ప్రయోగం
    పదమూల అల్లికల మధురం
    దైవాన్ని చూడవలసిన వాస్తవ సత్యం
    మన చెవిలో పోసిన అమృతకలశం
    ఈ గానం ఈ గేయం.
    ప్రాణం కమలాకర్ గారి ప్రాణం ఏదో క్షణాన ఆగిన ఈ పాట అమరం.
    -/Mahesh Kota ✍️

    • @grabs7984
      @grabs7984 Год назад

      God bless you ABUNDENTLY.

  • @vincentisidor9087
    @vincentisidor9087 3 месяца назад +19

    కొలొస్సయులకు 3:16
    సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.

  • @eshcolgaanadhyaanaalu4518
    @eshcolgaanadhyaanaalu4518 Год назад +9

    వందనాలు బ్రదర్ ఈ పాట వింటే నాకు ఈ వాక్యం గుర్తుకొచ్చింది.
    కీర్తనలు 33:1
    నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. #స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.#
    సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి.
    ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి.
    మీరు చాలా చాలా అంటే చాలా బాగా పాడారు అసలు వాయిస్ మ్యూజిక్ అద్భుతంగా వాయించారు మా గురించి ఇంకా మరెన్నోమంచి సాంగ్స్ పాడాలని ఆ దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక చాలా ధన్యవాదాలు అన్న❤ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

  • @venkataraosondi4078
    @venkataraosondi4078 11 месяцев назад +10

    Deva yesayya yenta baga ninnu stutintchinaru ha kutumbam nu yellappudu aservadintchandi Jesus

  • @calvarymission245
    @calvarymission245 2 года назад +58

    పాటలోనే ఒకగోప్ప సందేశమును అందించినందుకు సిరస్సువంచి నమస్కరిస్తున్నాను,ఇంతగొప్ప పాండిత్యమును మీకనుగ్రహించిన నాదేవాదిదేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక ఆమేన్ హల్లెలూయ.

  • @nameiskrupa2073
    @nameiskrupa2073 Год назад +2

    Asalu edi ela sadyamaindi .... thank you lord,...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @motapothula7
    @motapothula7 2 года назад +134

    నామకార్త క్రైస్తవులు నులివెచ్చని స్థితిలో వున్న ఆత్మల భారం మీ పాటలో... అద్భుతం రచన రాగం సంగీతం సమాకూర్పు హోసన్నా కమలాకర్ అన్న 😍 దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించునుగాక 🙌🙌 హల్లెలూయ

    • @hopeindia4294
      @hopeindia4294 11 месяцев назад

      ruclips.net/video/xaTHbqjFHXo/видео.htmlsi=QD03DqNBt4UZcLc_
      నరకం దాని సంప్రదాయం

  • @SivarajkumarTalabattula
    @SivarajkumarTalabattula 4 месяца назад +14

    అందరి దేవుళ్ళు ఒక్కటే అని నమ్మే నేను...ఈ పాట విని నన్ను నేనే మైమరచి పోయా..

  • @pabbathidevadanam4441
    @pabbathidevadanam4441 2 года назад +57

    ప్రాణం కమలాకర్ గారు మా ప్రాణాలు తెప్పరిళ్లేలా సంగీతం అద్భుతమైన గాత్రం దేవుడు మేకిచ్చిన గొప్ప ధన్యత సార్ 🙏 మీ ప్రతి పాట ఒక అద్భుతం మీ బృందమంతటికి నా యొక్క హృదయ పూర్వక వందనాలు 👏👏👏👏👏👏

  • @rajkumarvocalofficial2929
    @rajkumarvocalofficial2929 2 года назад +340

    షణ్ముఖప్రియ రాగంలో చాలా అద్భుతంగా చేసారు Sir. కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ విధానంలో క్రైస్తవ గీతాలు పాడటాన్ని ఈ వీడియో ద్వారా మరింత బలపరిచారు. సంగీతాన్ని నేర్చుకోవలసిన ఆవశ్యకతను ఈ పాట ద్వారా పరోక్షంగా తెలియచేసారు. హృదయపూర్వక ధన్యవాదములు Kamalakar Sir. ✝️🎼🎶🙏🏼

    • @sudheermiriyala9741
      @sudheermiriyala9741 2 года назад +7

      Anna mi nundi nenu idhi aasisthunna anna

    • @gospelvideos5336
      @gospelvideos5336 2 года назад +1

      Praic tha lord anna

    • @rameshultra607
      @rameshultra607 2 года назад

      Hi brother I am Ramesh CGM church Suraram

    • @harryanthony9299
      @harryanthony9299 2 года назад +3

      Pranam kamalakar Sir is a inspiration to all the musicians who still use the electronic gadgets and are destroying the sweetness of Indian percussion. Lots to learn from you Sir. God bless you abundantly for a beautiful song

    • @harryanthony9299
      @harryanthony9299 2 года назад +4

      You always give life to Tabla, Mridangam, violin, Harmonium,Veena, Sitar, Santoor, specially the sweetest instruments Indian classical music. Hats off to you Guruji for 🙏🙏🙏🙏

  • @JonnalagaddaChinnababu
    @JonnalagaddaChinnababu Месяц назад +2

    మన క్రిస్టియన్ పాటలు శంకరా భరణి సంగీతం తో కమలాకర్ చాలా అద్భుతం గా పాడించి పాటకు వన్నె తెచ్చారు పాడిన టీం కు pranam కమలాకర్ వందనాలు ప్రభు కృపా తోడై ఉండాలి

  • @rajannakalakoti9551
    @rajannakalakoti9551 2 года назад +41

    అధ్బుతం ఇది కేవలం కమలాకర్ అన్న గారికే సాధ్యం . దేవుని నామానికి మహిమ కలిగినది.

  • @shalemraj96
    @shalemraj96 2 года назад +28

    దావీదు రాజు కీర్తనలు వింటున్నట్టు పాట ఉంది.. ఆ కాలం నాటి సంగీతం వింటున్నట్టు ఉంది... దేవునికి గొప్ప కీర్తి, మహిమ, స్తుతులు కలుగును గాక... ఆమేన్

    • @KanguvaMovieSuriya
      @KanguvaMovieSuriya Год назад

      ఏ కాలం రా గొర్రె భారతీయ సంస్కృతి సంగీతము సాహిత్యము ను copy paste చేస్కొని అన్యజనులు పోలి ఉండరాదు అని ఏందిరా ఈ దుర్మప్లర్గపు సిగ్గులేని బేవార్స్ వేషాలు

  • @devarangulaanilkumar2607
    @devarangulaanilkumar2607 Год назад +23

    చాల అద్భుతమైన మరియు అర్థవంతమైన పాట. దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻🙇

  • @tulasigunupudi8452
    @tulasigunupudi8452 2 года назад +19

    All Glory to Lord....
    నిజముగా పాట చాలా బాగా రాసారు బ్రదర్
    ఒక్కో మాట నిజమే... స్వార్థంతో దేవుణ్ణి పూజిస్తున్నాము
    నామమాత్రముగా దేవుణ్ణి పూజిస్తున్నాము
    నిజముగా వీటన్నిటిని బట్టి ప్రతి క్రిస్టియన్ అంజలి ఘటించాలి... శ్రేష్ఠముగా యేసుని పూజించాలి
    భయభక్తులతో యేసుని చేరాలి....

  • @evangelistmadhuchanti296
    @evangelistmadhuchanti296 2 года назад +16

    ఆ స్వరం కోసం ఆ సంగీతం కోసం ఏమని చెప్పాలి ఎంత చెప్పినా ఇంకెంతో మిగిలి వుంటది... ఎంత చక్కని ఆత్మీయ గీతం. ఇలాంటివి రావాలి క్రైస్తవ్యంలో కొన్ని పాటలుంటాయి అవి ఎందుకు పడుతున్నారో వాటి అర్ధం ఏమిటో ఎవ్వరికీ తెలియదు కనీసం పాడేవారికి కూడా తెలియదు

    • @Mohankorapati
      @Mohankorapati 2 месяца назад

      Pichi janalu....
      Sangeetaniki padipoyi, manishiki jai jai lu kodataaru....😢.... Devuniki kottu jai jai lu....
      Ganam,gatram,sruthi,gamakalu... ivi kadu devuniki kaavalsindi hrudaya purvakamga aatmatho, satymutho palike bonguru gonthu ayina ......anandam ga sweekaristaaru JESUS.

  • @gracytv7712
    @gracytv7712 10 месяцев назад +7

    ఈ పాట ద్వారా దేవుడే మహిమ పొందిన గాక

  • @pg_7080
    @pg_7080 2 года назад +72

    Great song and greatly composed. What a presentation!
    Hats off Kamalakar garu🙏
    నాన్న గారికి గొప్ప నివాళినిచ్చారు.

  • @venkataraosondi4078
    @venkataraosondi4078 11 месяцев назад +1

    Aha yenta bga padarandi deva ha kutumabani ne hastalato challaga devintchadi ayya

  • @velpulashoan7778
    @velpulashoan7778 Год назад +3

    Got tears while listening this song,....too immotional and heart touching words , I can remember king David how talented he is . He wrote many songs by his own . But now we can say that god have given you and blessed you like David with such a beautiful thoughtful compossings and singing . We can't express with words.may the almighty bless you abundantly and showers his blessings upon you for ever.....❤ .

  • @srinubadugu6447
    @srinubadugu6447 Год назад +1

    chala rojulu aeindi elantave veeni challa bagundi

  • @rajaratnam2900
    @rajaratnam2900 2 года назад +8

    దేవుని కొరకు మీరు చేసిన ఈ గొప్ప పనికి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక
    క్రైస్తవముసంగీతములో, శాస్త్రీయ సంగీతములో చేసిన అద్భుతం ఈ పాట
    ఇటువంటి వెన్నో మీరు చేయాలని కోరుకుంటున్నాము

  • @jangamprasad8413
    @jangamprasad8413 25 дней назад +1

    అన్న మీకు మీ పాటకు వందనాలు

  • @paparao5634
    @paparao5634 2 года назад +18

    వందనాలు కమలాకర్ అన్న గారు 🙏
    అద్భుతం సంగీతం అమోగం మీ తపనకు కృషి కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు
    మీరంటే నాకు చాలా గౌరవం అభిమానం మిమ్మల్ని మీ కుటుంబాని దేవుడు బహుగా దీవించును గాక
    దేవుని వాక్యం సెలవిస్తుంది
    నన్ను ఘనపరుచువారిని నేను ఘనపర చేదను

  • @NANI-nw9do
    @NANI-nw9do Год назад +10

    పాట వింటుంటే మమ్మల్ని మేమే మై మరిచిపోతున్నాం సార్ మీకు నా హృదయపూర్వక మైన వందనాలు

  • @chintarameshbabu5577
    @chintarameshbabu5577 2 года назад +31

    సర్...ఈ పాట వింటుంటే గూస్ బమ్స్ తో పాట ...ఎంతో ఆనందంగా ఉంది...చరిత్ర లో చిరస్థాయిగా నిలిపోయే కీర్తన ఇది...ప్రాణం కమలాకర్ సర్ తనదైన మార్క్ తో..క్రైస్తవ సంగీత పురందర దాస్ లా కనిపిస్తున్నారు...
    ఈ పాట కొరకు పని చేసిన గాయకులు హరిచరణ్ గారు అద్భుతంగా పాడి నారు...వాయిద్య సహకారం అద్భుతం...మీ అందరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను🙏🙏🙏

  • @ibmmission3794
    @ibmmission3794 2 года назад +7

    ఇలాంటి పాటలు అనేకం చేయుటకు దేవుడు మీకు బలము, శక్తి , అభిషేకం, ఆర్థిక సహాయం దయచేయును గాక ఆమేన్!!

  • @rev.dr.kiranpps1162
    @rev.dr.kiranpps1162 2 года назад +21

    మహా అద్భుతమైన భావం, రాగాల కలయిక ఎంతటి వారినైనా నివ్వరపోయేలా చేస్తుంది. మీరు ఓ అద్భుతమైన సంగీత పరిపూర్ణ. దేవుడు మీకు దేవుడు సకల ఆశీర్వాదలతో దీవించును గాక.

  • @nameiskrupa2073
    @nameiskrupa2073 Год назад +1

    Exalent sir ... very nice...i really wonder...🙏🙏🙏🙏

  • @alienartstech
    @alienartstech 2 года назад +6

    కీరవాణి గారిని , ఏ ఆర్ రెహ్మాన్ గారిని కలిపి మిక్స్ చేస్తే బయటకి వచ్చే వ్యక్తి కమలాకర్ గారు ..... అద్భుతం మీ సంగీత జ్ఞానం.

  • @NeethaYochana
    @NeethaYochana Год назад +1

    Enta wonderful song idi..1 year late ga chusa nenu

  • @sunnyjoshuakeysofficial6628
    @sunnyjoshuakeysofficial6628 2 года назад +17

    పాట వినిన తరువాత కూడా ఆ రాగం భావం మదిలో మెదులుతూనే ఉంది అన్నా! ప్రణామం 🙏❤️

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 2 года назад +21

    వాక్యము నీవని ఏరిగితిమి . నీ
    ఆలయముగా మేము మారితిమి యేసు....... 🛐
    🙏🙏🙏

  • @jogirushisailaja
    @jogirushisailaja 2 года назад +17

    మమ్మల్ని ఆనందింప చేసిన మీ అందరికీ వందనములు 👏
    దేవుడు మిమ్మల్ని దీవించు గాక!

  • @sumalatha6694
    @sumalatha6694 11 месяцев назад +1

    Wonderful Bro👏👏👏🤝🤝

  • @stephensrikanth8866
    @stephensrikanth8866 2 года назад +11

    వాక్యమైన దేవుడు నా హృదిలో నివసించగా నేనేగా ఆయన ఆలయం. Amazing lyrics and wonderful composition Anna. Truly blessed. Very rare combination of Carnatic classical touch with fine Telugu literature. Thank you Kamalakar anna! May God bless your ministry!

  • @musicvibes7954
    @musicvibes7954 2 года назад +10

    మహా అద్భుతం ఈ పాట ! కమలాకర్ మహాశయా మీకు వందనం ! గాత్ర శిఖరo హరిచరణ్ వారికి వందనం ! ఉత్తమోత్తమ విద్వాంసుల కలయిక బహు శ్రేష్టమైనది ! వయోలిన్స్ హార్మనీ ఊహకందని అందం, విషయం. వీరందరిని ఒక తాటి పైకి తెచ్చి ఒక గొప్ప సంగీత సృష్టి ని చేసి అర్ధవంతమైన రచన తోకూడిన పాటను సంగీతకారులకు, భక్తులకూ ప్రేమతో అందించిన మీకు కృతజ్ఞతలు! ఇలాంటివెన్నో మధుర గీతాలు ఇంకా అందించుటకు ప్రభువు మిమ్మును బలపరచి ఇప్పటి వరకు అందించిన మధుర గీతాలన్నిటికి ప్రుభువైన యేసు క్రీస్తు మిమ్మును ఎంతో దీవించునుగాక !

  • @rajasekhar-oy9qu
    @rajasekhar-oy9qu 2 года назад +13

    ఈ రోజే విన్నాను నేను ఇప్పటి వరకు ఎన్ని సార్లు విన్నానో చాలా సంతోషంగా ఉంది చాలా కాలం తర్వాత గొప్ప పాట విన్న భావం కలుగుతుంది హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

    • @TheSrinuvasu143
      @TheSrinuvasu143 3 месяца назад

      నాకు అదే ఫీలింగ్ బ్రదర్

  • @Ashasekhar726
    @Ashasekhar726 10 месяцев назад +1

    Excellent 👌 nice singing

  • @sureshmiriyala210
    @sureshmiriyala210 2 года назад +8

    క్రైస్తవ సంగీత పరిచర్యలో మీరు ఒక విలువైన "ఆణిముత్యం" సార్ 💐💐💐

  • @Cholan-s7z
    @Cholan-s7z 10 месяцев назад +1

    God bless you bless you dear ❤❤❤❤❤

  • @NarendraKumar-jm3hm
    @NarendraKumar-jm3hm 2 года назад +11

    నేటి క్రైస్తవుల జీవిన విధానం వివరిస్తూ అందరికోసం ప్రార్థించిన విధానం గొప్పగా వుంది

  • @craistthekingjesusseavior
    @craistthekingjesusseavior Месяц назад +1

    యేసు క్రీస్తు నామములో చక్కటి పాటను పాడిన కళ బృంధానికి వందనాలు 🙏 🙏🙏

  • @daivaprasadpittala2157
    @daivaprasadpittala2157 2 года назад +8

    కమలాకర్ గారూ.. మీ తోటలో ఇలాంటి అద్భుతమైన సంగీత సాహిత్య సౌరభాలు మరిన్ని విరబూయాలని, వాటిని ఆస్వాదిస్తూ ఆనందించాలని, నా ప్రగాఢ వాంఛ..🤩👏

  • @dmadhavi7093
    @dmadhavi7093 Год назад

    Jesus mee andarilo undi e song enthabaga vachela chesaru ....devunike mahima .......Mee andarini devudu bahuga deevinchunugaka

    • @cvinod8912
      @cvinod8912 Год назад

      🎉🎉🎉🎉🎉🎉🎉

  • @TheVeid
    @TheVeid 2 года назад +15

    Praise the Lord కమలాకర్ అన్న అద్భుతమైన పాట చెప్పటానికి మాటలు లేవు సమస్త మహిమ దేవునికే కలుగును గాక మిమ్మల్ని దేవుడు ఇంకా తన మహిమ నిమిత్తం బహుగా వాడుకొనును గాక ఆమేన్...may God bless you more and more annai... really fentastic song composition awesome 🙌🙏🙏🙏🙏😍😍😍

  • @marybagyammasurangala7419
    @marybagyammasurangala7419 10 месяцев назад +2

    హల్లెలూయ యేసయ్య.

  • @kumar.chowtapalli9180
    @kumar.chowtapalli9180 2 года назад +6

    ఎన్నిసార్లూ విన్నా తనివితీరాదే మీ పాట కమలాకర్ అన్న మీకు వందనాలు ప్రసన్నకుమార్ సత్తెనపల్లి

  • @srinubadugu6447
    @srinubadugu6447 11 месяцев назад +1

    Chala antey chala bagundi music

  • @m.shyambabu2077
    @m.shyambabu2077 2 года назад +13

    అద్బుతమైన సంగీతం పాట దగ్గర
    మీ సంగీతానికి దేవుడు ఇచ్చిన గిప్ట్

  • @soujim8240
    @soujim8240 2 года назад +1

    Ela cheppalo kuda thelidhu vintunte chala ghanamgaa undhi dheuniki ee reethilo evaru ghanaparusthara ani edhuruchusanu. But meru dheuni patla kaligina prema samarpana abhinandaneeyam.

  • @drathnam8441
    @drathnam8441 2 года назад +11

    సరికోత్త అద్భుతం సూపర్ గా ఉంది పాట దేవునికే మహిమ కలుగును గాక

  • @SudhaRani-l3o
    @SudhaRani-l3o 10 месяцев назад +1

    Super super super

  • @AmbatiSyamBabu-bf2ko
    @AmbatiSyamBabu-bf2ko Год назад +7

    ఈ శ్రేష్ట ఆత్మీయ గీతమునకై దేవా నీకు స్తోత్రం... Thankyou anna garu..🙏

    • @Horebministries2019
      @Horebministries2019 10 месяцев назад

      Pririitititt8turiruuttittigittitigigjgjcjgjgigigttiri

  • @sureshbabudevarapalli8188
    @sureshbabudevarapalli8188 Год назад

    Ahhhaaa abbaabbbaa. Yemi song padaru anna miku vandanalu

  • @m.shyambabu2077
    @m.shyambabu2077 2 года назад +168

    సినిమా మ్యూజిక్ నే మించిపోయింది ఆ పాట ఏంటి, న్యూస్ ఏంటి కమలాకర్ అన్న ఎన్ని జేజేలు కొట్టిన తక్కువే, ఎందుకంటే మ్యూజికే కాదు ఁకైస్తవ జీవితానికి కావాలసిన పదాలు కూడ వున్నందుకు, మీకు దేవుని పై వున్న సంగీత అరాధనకు, స్తుతికి నా యెక్క నిండువందనాలు సార్

    • @divyagalla780
      @divyagalla780 6 месяцев назад +13

      అన్నకు కాదు అన్నకి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి జేజేలు చెప్పాలి ❤❤

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 6 месяцев назад +3

      @@divyagalla780 యస్ బ్రో

    • @SarojaPaturi
      @SarojaPaturi 2 месяца назад +1

      Praise the lord 🙏hallelujah Amen 🙏🙏🙏

    • @daravenkataravindrababu9179
      @daravenkataravindrababu9179 Месяц назад +3

      సంగీతాన్ని సృజయించినది దేవుడే కదా, సినిమామ్యూజిక్ గొప్పగా ఎంచబాకు

    • @IndrakumarInapnuri
      @IndrakumarInapnuri 20 дней назад +1

      దేవి శ్రీదేవి సాంగ్ కాపీ ఇది . ఎందుకు సోదరులారా స్వసక్తి మీద కాక దేవుని మీద ఆధారపడి పని చెయ్యండి అప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు రావు . సొంతగా సంగీతం చెయ్యగలిగే సామర్ధ్యం ఉన్న కమలాకర్ గారు ఇలా చెయ్యటం నమ్మ లేక పోతున్న

  • @stepheen4608
    @stepheen4608 Год назад +1

    Kamalakar anna mi peru lo ne undi pranam ani prathi pata ki mi pranam peti chestharu prabu echina ho gopha varam🙏🙏hats off kamalakar anna enthaga mimalani vadukunna ha devuni ki leka leni 1000000000000000000danayavadall♥️love u anna 🙏praise the lord anna

  • @nature_cooking-vlogs
    @nature_cooking-vlogs 2 года назад +3

    ఈ పాట నన్ను దేవునికి మరింత దగ్గరకి నడిపించింది నేను రోజూ ఈ పాట విని దేవుని స్తుతి ఆరాధన చేస్తున్నాను. kamalakar garu మీకు చాలా వందనాలు ఇటువంటి అద్భుతమైన సంగీతం అందించిననందుకు Praise the Lord 🙏 . దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

  • @m.sundarraj4517
    @m.sundarraj4517 3 месяца назад +2

    దేవుడైనా యెహోవా ఆయన కృపలో నిన్ను ఇంకా బలముగా (అత్యధికముగా) వాడుకొనునుగాక.....
    .... చాలా బాగా పడినారు బ్రదర్ సాంగ్....

  • @dadalaraju4773
    @dadalaraju4773 3 месяца назад +2

    దేవుని ప్రేమ చేతనే గొప్ప గొప్ప పాటలు వచ్చాయని చెప్పడానికి ఈ పాట చాలు. సంగీతంలో ప్రతీ ఇన్స్ట్రుమెంట్ దేవుని ప్రేమను తెలియ చెప్పేయేంతగా సంగీతాన్ని అందించారు కమలాకర్ గారు. హరి చరణ్ గారి గాత్రం తో ఇంకా బాగుంది.కమలాకర్ గారు మరిన్ని పాటలు అందించి దేవుని ప్రేమను మరింత మందికి చెరవేయాలని కోరుకొంటున్నాను. వందనాలు

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 Год назад +2

    Prise the lord 🙏🙏🙏 Sir. మీకు దేవుని నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మీ బృందానికి ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ,ఘనత, ప్రభావములు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ✝️🌹❤🌹❤️🌹❤️🌹❤️🌹🌹❤️🌹❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍✝️.

  • @ratnastudio7157
    @ratnastudio7157 Год назад +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ రోజుకి రెండు సార్లైనా పాట కచ్చితంగా వింటున్న చాలా అంటే చాలా అద్భుతంగా పాడారు దానికి తగినట్టుగా సంగీతం అద్భుతం దేవుడు మీ అందరిని దీవించును గాక ఆమెన్

  • @dharanisekhar8070
    @dharanisekhar8070 11 месяцев назад +1

    God bless you sir karunakaran garu

  • @gopibaske9848
    @gopibaske9848 2 года назад +4

    ఈ పాటను వింటుంటే... హృదయానికి చాలా దగ్గరా మనసుకు నెమ్మదిగా ఉంది ...టీిం అంతటికీ దేవుని దీవెనలు మెండుగా కలుగును గాక పాటకు ప్రాణం పోసారు... పాట పాడిన సహోదరునికి ప్రేమతో వందనాలు దేవునికే మహిమ కలుగును గాక
    ప్రాణం కమలాకర్ సార్
    మాకు చక్కని క్రైస్తవ గీతాలు అందిస్తున్నందుకు మీకు దేవుడి ఆశీర్వాదాలు మెండుగా... దండిగా కలుగును గాక ఆమెన్
    ప్రేమతో వందనాలు🥰

  • @Sukumar.....5-abs
    @Sukumar.....5-abs Месяц назад

    దేవుని నామనికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏
    ఈ పాట వింటుంటే ప్రాణం తెప్పరిల్లి, హృదయాన్ని హత్తుకునేలా వుంది, వర్ణనాతీతం గా వుంది పాట.. 25 times విన్నాను, ఇంక వినాలనే వుంది, అద్భుతం గా దేవుడు మిమ్మల్ని వాడుకున్నారు, ఇలాంటి మరికొన్ని పాటలు మి ద్వారా వినాలని ఆశపడుతున్నం

  • @pravallikanavya2954
    @pravallikanavya2954 2 года назад +5

    ఇంకో ఇళయరాజా గారి మ్యూజిక్ band live chustunattu అనిపించింది సార్.
    Excellent 👏👏👏👏👏👏.
    No words 🙏🙏🙏

  • @singersatya
    @singersatya 2 месяца назад

    సార్... మీ స్వర కల్పన లో వచ్చిన ప్రతీ పాట ఒక ఆణిముత్యమే... ఇది ఒక వజ్రం లా అనిపించింది... హరిచరణ్ గారు మహాద్భుతం గా పాడారు... మిమ్మల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే ఇంత గొప్ప పాటలు మీరు చెయ్య గలుగుతున్నారు.

  • @aaronsingaraju5101
    @aaronsingaraju5101 Год назад +3

    కమలాకర్ గారు చాలా అద్భుతమైన రాగంలో ఎంతో అద్భుతమైన సాహిత్యానికి, అద్భుతమైన స్వరకల్పన చేశారు అంతే అద్భుతమైన సంగీతం అందించారు దేవుడు మిమ్మల్ని ఘనంగా తన పరిచర్యలో వాడుకోవాలి....మాదొక చిన్న మనవి మీరు సంఘం అంత కలిసి పాడుకొనే విధంగా కొన్ని సులభమైన స్వరకల్పనలు కూడా చేయండి please🙏

  • @vamcrazz9582
    @vamcrazz9582 3 месяца назад +1

    ఎంత సుందరము నా తెలుగు దేవునికే మహిమ కలుగును గాక🙏🥰🥰

  • @pawankasala4123
    @pawankasala4123 2 года назад +26

    అద్భుతము..!
    అమోఘం...!
    నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసి ఆధ్యాత్మిక దైనందిన జీవితాన్ని శాస్త్రీయ సంగీతముతో చూపించారు.
    ప్రతి ఒక్కరూ ఈ పాట విని, మారు మనస్సు పొంది, వారి బ్రతుకులు సరిచేసుకోవాలని నా హృదయ వాంఛ మరియు నా ప్రార్థన 🙏

    • @lazaruspaulalawala8010
      @lazaruspaulalawala8010 2 года назад

      మాటలు చాలని వర్ణణ ఈ పాట. ఎంత విన్న
      తనివి కారణం లేదు. దేవుడు ఈ పాట కి జీవమనుగఁహించాడు. పరమామఁతముగా పరవసింపజేసైుంది.

  • @sivasatyanandam5799
    @sivasatyanandam5799 Год назад +1

    Yesuka mahima kalugunu gaka.............

  • @dadalapraveenkumar8
    @dadalapraveenkumar8 2 года назад +5

    ఇంత అద్భుతమైన పాటలో అద్భుతమైన భావంతో
    అలరించినదు 🙏

  • @suniljannu9797
    @suniljannu9797 2 года назад +1

    Annayya vandhanaalu

  • @bhanuboui311
    @bhanuboui311 2 года назад +5

    మాటలలో చెప్పలేని అనుభూతి పొందాము, ఈ పాట చాలా అర్థవంతముగా ఉంది నేటి క్రైస్తవానికి ఇది ఒక మేల్కొలుపు

    • @bhanuboui311
      @bhanuboui311 2 года назад

      Sir song track link send చెయ్యండి plz

  • @Ratna..sailu56
    @Ratna..sailu56 6 месяцев назад +1

    అయ్య మీకు మా వందనములు దేవుని ఇంతా గొప్పగా మహిమ పరుస్తున్నారు మిమ్మలని మీ కుటుంబమును దేవుడు ఎప్పుడు దీవించును గాకా నాకు కాళ్ళ వెంటా నీళ్ళు నాకు తెలియకుండానే వచ్చేస్తున్నాయ్ మీ అందరికీ మా వందనాలు

  • @chaitusatsangi3681
    @chaitusatsangi3681 2 года назад +11

    It's absolutely tremendous Sir. U can only create magic like this.

  • @futureenergysystemsofindia475
    @futureenergysystemsofindia475 6 дней назад

    తండ్రి కి చెందాల్సిన ఘనతను గనపరుస్తున్నారు అన్నా🙏🙏🙏💐

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 2 года назад +12

    Very Good Song 👌
    Very nice Song 👍
    Super Song 👏👏👏
    PRAISE THE LORD ANNA 🙏💞✝️
    JESUS CHRIST LOVES YOU AMEN 🙌🕊️

  • @KarishmaSk-i5t
    @KarishmaSk-i5t 24 дня назад

    ఇదంతా దేవుని కృప మిమల్ని దేవుడు దర్శించాడు అందుకే ఇంత మధురంగా దవుని పాటలు పాడి దవుని కృప మీ మీద ఉంది 🙏🙏🙏

  • @jayarajupendem3129
    @jayarajupendem3129 2 года назад +5

    అద్భుతం
    భావ యుక్తమైన భాష
    చరణాలు చాలా బావున్నాయి sir
    వీనులు విందైన సంగీతం
    చక్కని స్వరకల్పన

  • @soniyasoniya6246
    @soniyasoniya6246 9 месяцев назад +1

    చాలా అద్భుతంగా పాడి వినిపించిన సీమ అందరికీ నా హృదయపూర్వక వందనాలు గాడ్ బ్లెస్స్ యు

  • @deepikagrace2659
    @deepikagrace2659 2 года назад +5

    Wow.. సంగీతంతో ఇంత అద్భుతంగా పడొచ్చు అని ఈ పాట ద్వారా చూపించారు.. super 😍😍 చరణం అర్థాలు చాలా బాగున్నాయి.. sir

  • @KarishmaSk-i5t
    @KarishmaSk-i5t 20 дней назад

    ఈ పాట ఒక మహా సముద్రం,అంతా లోతు సంగీతం ఉంది ఈ పాటలో దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @sujathaypvlogs
    @sujathaypvlogs 2 года назад +5

    Praise the lord
    Jesus song ni classical lo chala chala bagundi manchi swaralatho

  • @RANIRANI-db5qr
    @RANIRANI-db5qr 10 месяцев назад +1

    Super song

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 2 года назад +5

    అద్భుతం, మాటల్లో చెప్పలేనంత అద్భుతం! దేవుడు కమలాకర్ గారిని ఇంత అద్భుతమైన సంగీతకారునిగా మలచిన విధానం ఇంకా అద్భుతం. ఈపాట వింటుంటే దేవా.... దేవా.... దేవునికే మహిమ 🙏🙏🙏🙏

  • @kvr6533
    @kvr6533 9 дней назад

    2025 లో వింటున్నాము బ్రో, గుస్సాబామ్స్ అంతే

  • @msrinu3365
    @msrinu3365 2 года назад +4

    అలనాటి "అద్భుతమైన" పాటను
    "అద్భుతమైన "సంగీతముతో పాటపడిన
    ప్రాణం కమలాకర్ గారి "సంగీత బృందానికి "
    వందనాలు...... 🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @ananthakumarmarumoodi8400
    @ananthakumarmarumoodi8400 Год назад +1

    శాస్త్రీయ సంగీత లో దేవుని స్తుతించి న మీకు ధన్యవాదములు 🙏🏻
    మరిన్ని గీతము లు పాడాలని కోరుకుంటూ 💐

  • @Rajesh-id5vz
    @Rajesh-id5vz 2 года назад +5

    Kamalakar Brother great.... wonderful no wards .....Glory to God .... దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించునుగాక 🙌🙌 హల్లెలూయ

  • @varunchinthamalla5941
    @varunchinthamalla5941 Месяц назад

    క్రైస్తవ సంగీతానికి ఒక నిర్వచనం మీరు సూపర్ సాంగ్ సార్ దేవునికే మహిమ ❤❤❤

  • @sanjanasarika7076
    @sanjanasarika7076 2 года назад +7

    Wounder full singing sir&excellent music very very good song & చాలా చాలా బాగా పాడారు...💐💐👌👌🙇‍♀️praise the Lord...

  • @rajugorla4334
    @rajugorla4334 2 месяца назад +1

    చాలా రోజులు నుంచి ఇలాంటి పాట కోసం ఎదురు చూస్తున్న చాలా బాగా పడేరు గాడ్ బ్లేస్ యు