సాంఖ్య యోగం 40-42 శ్లోకాలు|శ్రీ భగవద్గీత|శ్రీ శ్రీరామ్ సద్గురువర్యుల సత్ (తో) సంగం|Chapter 2|

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • కొండప్ప:-ప్రపంచములో అందరును విషయానుభవముచే ఆనందము పొందుచున్నామని నమ్మినారు. దేవుఁడే యానందస్వరూపుఁడైనచో విషయానందము కాఁగూడదు కదా!
    లక్ష్మయ్య:- ఒకఁడొక విషయముఁగోరినాడు. అది లభించువరుకు అతని మనస్సు తొందఱ పడుచుండును. అవ్విషయప్రాప్తియైన వెంటనే యాతని మనస్సుదృప్తినొంది యూఱటచే చలింపక నిలుచును. మనస్సు నిలిచినపుడు | తోఁపికలు అడ్డము లేనందున దేవుఁడు గోచరించును. బ్రహ్మానందప్రాప్తియే దైవదర్శనము. విషయప్రాప్తియు ఆనందము ఏక కాలమునఁగలిగినందున విషయముచే ఆనందము లభించినదని భ్రాంతిచే జీవుఁడు విషయసంపాదనకై తనయావచ్ఛక్తి ఉపయో గించును. ఆ ఆనందం ఆ దేవుఁడే. దేవునినుండియే యానందము లభించినది గనుక దేవుఁడే యానందస్వరూపి. స్వతస్సిద్ధముగనే యానందమున్నది. ఇంకొక విషయముపై మనస్సు పరుగిడినచో మరల దుఃఖప్రాప్తియగును. కనుక విషయ మానంద స్వరూపికాదు. విషయము కానట్టి సుషుప్తితురీయ తురీయాతీతములం దానందానుభవమున్నది. దీనిఁబట్టి విషయ మానందస్వరూపికాదు. దేవుఁడే సహజానందస్వరూపి.
    @swarajyabrahmanistaashram
    #bhagavadgita
    #sankyayoga
    #meditation
    #sadguru
    #sriram

Комментарии •