Thavaasmi - A Journey Towards Completeness || Exclusive Interview With Srirama Chakradhar || తవాస్మి

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Join Shiva Shakthi: / @shivashakthi
    SUPPORT SHIVA SHAKTHI:
    www.shivashakt...
    Phone Pay/Google Pay/Paytm: 7207307408
    AC NO: 5020 0027 6096 46
    IFSC: HDFC0009168
    IF TRANSFER FROM SBI
    IFSC: HDFC0000045
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: sh...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashak...
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: www.instagram....
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

Комментарии • 342

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  2 года назад +34

    *Join Shiva Shakthi: **ruclips.net/channel/UCQBk4YdloSK2XZEGHsctUlgjoin*
    *SUPPORT SHIVA SHAKTHI:*
    *Phone Pay/Google Pay/Paytm: 7207307408*
    *AC NO: 5020 0027 6096 46*
    *IFSC: HDFC0009168*
    *IF TRANSFER FROM SBI*
    *IFSC: HDFC0000045*

  • @sreenuthippabathula1174
    @sreenuthippabathula1174 2 года назад +11

    జై సీతారామ్... 36 సంవత్స‌రాలు క్రైస్తవ్యమనే మురికి కూపంలో కూరుకుపోయిన నాకు విముక్తి ప్రసాదించి, దేశభక్తునిగా తీర్చిదిద్దుతున్న "శివశక్తి" కరుణాకర్ సుగ్గుణ గారికి & వారి బృందానికి శతకోటి ధన్యవాదాలు... భారత్ మాతాకి జై....

  • @pattabhiramayyapasagada6484
    @pattabhiramayyapasagada6484 2 года назад +52

    ఇటు వంటి ప్రోగ్రామ్స్ వలన శివ శక్తి ఇంకా విజయం సాధించడంతో పాటు మరో వైపు అడుగులు వేయడం ద్వారా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని మతాలు గ్రంధాలు కన్న ఎక్కువ మంది చదివిన వారు చాలా బాగుంది అన్నారు

    • @mahanthgeethagiri7830
      @mahanthgeethagiri7830 2 года назад

      ఎప్పుడూ బూతు మత గ్రంధాలు చదవలేక... అందులో ఉన్న అసహ్య కరమైన విషయాలను గొర్రెల ముందు చెప్పలేక ... ..భయం, సిగ్గు, మానసికంగా అబద్ధం ఆడుతున్నాం, నరకానికి పోతామేమో అనే భయం,దుఃఖం తో ఉండే పాస్టర్లు హాయిగా రామచరిత్ర చదువు కుంటూ ఎప్పుడూ సత్యాన్ని, ధర్మాన్నీ గౌరవంగా దైర్యంగా భోదించుకొంటూ సుఖంగా సంతోషం గా బాతకవచ్చు...

  • @siyaraskichidi9202
    @siyaraskichidi9202 2 года назад +74

    మిస్టర్ చక్రధర్ గొప్ప పని చేసారు. నిజంగా చాలా తక్కువ మంది హిందూ సంస్కృతి వైపు పని చేస్తున్నారు. నిజమైన హిందువులు ఈ గొప్ప పనిని ప్రోత్సహించకపోతే, భారతదేశ భవిష్యత్తు నాశనమవుతుంది. ఇది చాలా భాషలలోకి అనువదించబడాలి మరియు రాముని గొప్ప వ్యక్తిత్వం ప్రపంచానికి తెలియాలి.
    *భారతీయుల బలహీనత ఏమిటంటే, మన గొప్ప సంస్కృతిని ప్రపంచం మొత్తానికి మనం ప్రోత్సహించలేము.
    * రాబర్ట్ మెకాలే విద్యా వ్యవస్థను మార్చడానికి ప్రభుత్వానికి ఇది సరైన సమయం.

    • @myatharivijay3311
      @myatharivijay3311 2 года назад +3

      Sare Prapancham antha Chati cheppina e Generation lo evaru pattinchukoru endukante Vere Countries lo Public mana Desham lo public la Guddi Bakthi undadhu....And akkadi walu Educate ayyi unnaru....Mana Desham 95%Public Vedas r Geetha lantivi chadavaru kani Jai sree ram Jai modi🤭Jai bharat matha ani Guddi Bakthi lo kottukuntunaru....1st mana India lo HINDus ni 1st Vedas r Geetha r Ramayanam chadvamanadi....anthe kani Poojalu cheyandi vrathalu cheyandi hoomalu cheyandam manipinchandi 🙏

    • @myatharivijay3311
      @myatharivijay3311 2 года назад +3

      Inka clear ga cheppalante Ramudu krishnudu inka 3000000 mandi devathalu antha Kalpitham🙌... Hinduism antha Bogasss anduke adi Yekkada Pani chesthaledu....
      Christianity r Islam chudandi Deshalu dati ani deshalalo vyapinchindi endukante Christianity and Islam lo unnadi Nijamaina Devudu 🙌.... Christianity and Islam lo God nee manasu sarichesuko , Scriptures chaduvu,God ki Prayer cheyu God Connect avthadu God matladuthadu Life nunchi ani untundi anthe kani Bommalu mundu Pettukoni POOJALU vrathalu hoomalu Dooshalu inka koi ani timepass muchattlu 🤦 undavu....Nv Hindu vi Nijam ga artham avvali ante Nv HINDU SCRIPTURES chadavali kani Mana walu Chadavaru kani Poojalu hoomalu antu Guddi Bakthi chupistharu..... HINDU lo Satruvulani Chammpamantaru kani Bible lo Shatruvulu kuda mana lanti manushule walakosam Prayer cheyu Shatruvulani kshminchu Preminchu ani untadi....Andaru Guddi Bakthi ne Patistharu anukovadam adi mee Guddithanam (Andaru Hindus kaadu-Kontha HINDU Vedas and Geetha lu Chadivi Real wisdom tho unnaru-Migatha Hinus Guddi Bakthi tho unnaru....

    • @myatharivijay3311
      @myatharivijay3311 2 года назад +2

      E srusti ni manushulani Srustinchindi God so God manaki Connect ayi untadu manam adi telusukoni God Chuinchina Daari lo brathakali and God Wisdom andaritho share cheyali teliyani walaki Cheppali kani Mana Hindus Asalu God Gurinchi a okka kukka tho kuda Matladaru God Gurinchi....Chala Hindus ki God ante Gudi lo vigrahame kani Gudi lo nunchi God ni Manasulo pettukoru.....
      Diniki rendu karanali :-
      1.God Ki Manushulani madhyalo undalsina Panthullu r Poonarilu only nee Peru Midha Poojalu hoomalu vrathalu lu doshalu ani Punchi pichi Guddi Poojalu chestharu kani Intiki velli Vedas r Ramayanam r BagavathGeetha r mahabharatham chadavamani chepparu only Neeku dosham undi pooja chestha antaru ,God ni Bakthulaki Andincharu.
      2.Mana Indians ki sakkaga Budhi ledu (Andaru kaadu HINDus lo Correct Gynanamm unna walu vere )

    • @mahanthgeethagiri7830
      @mahanthgeethagiri7830 2 года назад +1

      ఖచ్చితంగా ఇది ప్రపంచంలోని అన్ని భాషలో అనువదించబడాలి.. మానవ జాతికి తల్లీ, తండ్రీ, గురువు, దైవం, ప్రజలు,పాలకులు,మిత్రులు,శత్రువులు, న్యాయం ధర్మం...అన్నీ ఒక్క రామాయణం చాలా మధురంగా భోదించగలదు... ఎప్పుడూ పవిత్రంగా జీవించగలమనిషి కి .. సృష్టి లోని ఆనందాన్ని అనుభవించే హక్కు ఉంటుంది ... అతి చిన్న పాపం కూడా మనిషికి సుఖము, శాంతి... అనుభవానికి రాకుండా అడ్డుకుంటాయి. ప్రజలు రామాయణం ద్వారా దుఃఖాన్ని జయించగలరు

  • @gajjelavinod5814
    @gajjelavinod5814 2 года назад +29

    ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి అని కోరుకుంటున్నా ..🙏🙏
    జై శ్రీరామ్..🚩🚩🚩

  • @dewpoint1637
    @dewpoint1637 2 года назад +13

    రామ రాజ్యం ఇప్పుడే మా కళ్ల ముందు ఉన్న భావన మాలో కలిగింది మీకు శివ శక్తి వారికి సదా రుణపడి ఉంటాo చాలా కృతజ్ఞతలు జై శ్రీరాం

  • @divyakesavaram4489
    @divyakesavaram4489 2 года назад +36

    I have gifted this precious book to my daughter on her birthday
    I personally read this book completely for 2 times
    Very good book which reflects our ownlife

    • @rrreddy3522
      @rrreddy3522 2 года назад +2

      Hello sir, what is it's price and how many volumes.

    • @divyakesavaram4489
      @divyakesavaram4489 2 года назад +1

      @@rrreddy3522 4 volumes , cost is rs.1000/- only

    • @skyqt9468
      @skyqt9468 2 года назад +1

      @@divyakesavaram4489 Please post info on where we can buy these volumes. Couldn't find the telugu books in Amazon or Flipkart.

    • @divyakesavaram4489
      @divyakesavaram4489 2 года назад +1

      @@skyqt9468 sir u can reach out on the no given in description

    • @myatharivijay3311
      @myatharivijay3311 2 года назад +2

      Aithe mee daughter ni Guddithanam lo tosesaru...Mee Daughter maha ante Poojalu vrathalu hoomalu Dooshalu chethabadulu chesukuntu untadi kani God wisdom Pondi God Kotaku brathadu....and Money tho Asthi tho vardillythademo kani Waste God ni real telusukokapothe 🙌

  • @divyakesavaram4489
    @divyakesavaram4489 2 года назад +25

    I'm happy parent planning to send my 4yrs old kid to veda patashala being me and my husband in MNC
    My thought is to let know about our culture to next generation
    I'm proud to say that my 9yr old daughter is learning classical dance and music along with Bagwath Geeta
    We as parents give second place to school education and 1st place to our culture

    •  2 года назад

      Superb 🙏 I am a Telugu from Tamilnadu whose ancestors escaped Islamic persecution in Andhra. There are a lot of telugus in tamilnadu, who all came during Islamic persecution

    • @kartheekvaranasi
      @kartheekvaranasi 2 года назад

      Excellent andi....

  • @karipattisrivenkat4535
    @karipattisrivenkat4535 2 года назад +39

    చాలా సంతోషం జైశ్రీరాం

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 2 года назад +83

    పది మందికి అన్నం పెట్టి పది మందిని చేరదీసి శత్రువులను సైతం అతిథిగా గౌరవించడం..ఇప్పటివరకు భారతదేశం ఏ దేశం మీద దాడి చేసి అక్రమంగా ఆక్రమణలు చేయకుండా ఉండటం నేర్పింది మన పురాణ ఇతిహాసాలే...

    • @siyaraskichidi9202
      @siyaraskichidi9202 2 года назад +10

      ఇది హిందువుల బలహీనత మరియు అది దోపిడీకి గురైంది.

    • @myatharivijay3311
      @myatharivijay3311 2 года назад +2

      Antha scene ledu mana History oka sari check cheyu vere Deshala walu raaka mundu mana Desham lo Rajyala kosam enni Yudhalu ainayo....Mana kanna Balamaina Walu vachi manani Denguthunappudu Vachina matalu Shatruvulani Saitham Athidi ga Gowravinchadam bokka ani matalu....mana india lo appatlo Balahinulu la chesi dalithulani uthata tribes walani Antu Rani thanam ani God lo ki ranivakapovadalu walani Banisalu laga chesina rojulu Gurthosthaleva r marchipoyava!!!
      Inka vere Deshalu vera Deshala vari paina Yudhalu chesaremo kani mana walu mana walane Gudha Dennge waru.....

    • @myatharivijay3311
      @myatharivijay3311 2 года назад +1

      @@siyaraskichidi9202 Adi balahinatha Kaadu bhaya Budhi Gynanamm lekapovadam Guddithanam lo Undipovadam....Mana India ki vere Shatruvu lu avasaram leru mana wale Chalu...Mana wale manallni nashanam chesaru and Vere Religious and vere Countries ni blame chesthunaru.....Diniki Karanam manam Inka God ni Kakunda Poojari lani Nammukuntu Goddi Bakthi tho Kottukovadame

  • @chaitanyakrishnarayalu1952
    @chaitanyakrishnarayalu1952 2 года назад +4

    రామాయణం - అంతరార్థం , రాముడు - జీవుడు , లక్ష్మణుడు - శరీరము , సీతమ్మ - మూలాధారంలో ఉన్న శక్తి , ఆంజనేయుడు - శ్వాస . ఆంజనేయుని సహాయంతో లంకలో ఉన్న సీతమ్మ ని అయోధ్యకి తీసుకువచ్చారు రాముడు - శ్వాస సహాయంతో మనం మూలాధారంలో ఉన్న శక్తి ని సహస్రానికి తీసుకురావడమే మన కర్తవ్యం. అందుకే రామాయణం మత గ్రంథము కాదు మానవ గ్రంథము. జై శ్రీరామ 🙏🙏🙏

  • @ramakrishnamurty5441
    @ramakrishnamurty5441 2 года назад +20

    శ్లో.సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
    అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ర్వతం మమ
    --శ్రీరామాయణము

  • @demullujilam9065
    @demullujilam9065 2 года назад +13

    🙏 జై శ్రీరామ్ రామాయణం గురించి చాలా చక్కగా చెప్తున్నారు సార్ వింటుంటే మనసుకు చాలా హాయిగా ఉంది ఇటువంటి వీడియోలు మన శివశక్తి లో ఇంకా చేయండి సార్ 🙏💐

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 2 года назад +3

    గురువు గారికి నమస్కరిస్తూ..
    లక్ష్మీ గారికి ధన్యవాదాలు.శివశక్తి కి మేము చాలా ఋణపడి వున్నాము.

  • @suryayamala1778
    @suryayamala1778 2 года назад +5

    అద్భుతం , మహాద్భుతం.
    ఈ రామాయణాన్ని స్కూల్స్ లో (విద్యా వ్యవస్థ లొ చేరిస్తే ) నేర్పిస్తే.... ప్రస్తుతం జరుగతున్న.... నేరాలు .. ఘోరాలు ... జరగనే.... జరగవు...!!.

  • @prasadbasava9148
    @prasadbasava9148 2 года назад +19

    రామాయణం యొక్క కాలము చారిత్రాత్మక అంశాలు ఆధారాలతో సహా చెప్పగలరు

  • @karipattisrivenkat4535
    @karipattisrivenkat4535 2 года назад +5

    శ్రీలక్ష్మి గారు మీకు మా ధన్యవాదాలు. మీరు కూడా మన ధర్మం కోసం పని చేయడం.కానీ మీరు మిరుగా గీత.పురాణాలు వినాలి అలానే సందే హాఁఉంటే మన పురాణ పండితులు నించి తెలుసుకోవాలి. జైశ్రీరాం

  • @pattabhiramayyapasagada6484
    @pattabhiramayyapasagada6484 2 года назад +55

    Laxmi గారు ఈ లాంటి ప్రోగ్రామ్స్ ఎవ్వంది చాలా భాగున్నై

  • @premkumar-ci5dv
    @premkumar-ci5dv 2 года назад +2

    ఇలాంటి కార్య్రమాలు ఎఎన్నో రావాలి ప్రజలకు అవగాహన అవసరం మన దేశం సనాతధర్మం గురించి తెలియాలి నమోఃనారాయణ
    జై శ్రీరామ్
    జై శివశక్తి

  • @natureisbeautiful6482
    @natureisbeautiful6482 2 года назад +53

    "Ex christian telegu" praveen kumar is also working for our cause. Do follow and help him spread awareness.

    • @mailasn22
      @mailasn22 2 года назад +3

      Yes san.

    • @natureisbeautiful6482
      @natureisbeautiful6482 2 года назад +3

      @@mailasn22 broo😹😹❤ we find each other wherever we go😆

    • @mailasn22
      @mailasn22 2 года назад +6

      @@natureisbeautiful6482 iam in sivashakti. U find me here anytime. Power of karunakar, the magician.

    • @pericharlasai7242
      @pericharlasai7242 2 года назад

      Yes

  • @satyaravivarmavatsavayi8739
    @satyaravivarmavatsavayi8739 2 года назад +5

    జైహింద్ జైశ్రీరామ్

  • @venkatasairamchintha1097
    @venkatasairamchintha1097 2 года назад +5

    🙏🙏🙏🙏🙏 please bring more such people who talk about Hinduism.
    Such pandits voices should reach Hindus.
    Shiva Shakti should be the platform for such pandits.
    Let us restrict weekends for wars on Christian atrocities🙏🙏🙏🙏

  • @powerofgreen1051
    @powerofgreen1051 2 года назад +10

    అద్బుతం ,మహఅద్భుతం

  • @ramrk6995
    @ramrk6995 2 года назад +21

    Hi from karnataka love shiva shakti❤🌹

    • @natureisbeautiful6482
      @natureisbeautiful6482 2 года назад +5

      Karnataka is going in andra direction bro, help spread these videos and aware kannadigas.

    • @ramrk6995
      @ramrk6995 2 года назад +2

      Ok bro 👍❤

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 года назад +30

    ☀️ రామాయణం అంటే రామ , ఆయనము అనే రెండు పదాలు కలిసి రామాయణం అయింది.
    ఆయనము అంటే మార్గము అనగా రాముని యొక్క మార్గము లేదా నడవడిక అని అర్థము రామాయణంలో రాముడు ధర్మాన్ని తాను ఆచరించి ధర్మ మార్గంలో తాను నడిచి ఆ దారిని మనకు చూపించాడు అదే రామాయణం యొక్క గొప్పతనం.
    ☀️ వాల్మీకి మహర్షి దేవర్షి నారదుడిని ఇలా అడిగాడు.
    ఓ నారదమహర్షి ! ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు , పరాక్రమవంతుడు , ధర్మాత్ముడు , ఎదుటివారి ఎడల ఆదరభావం కలవాడు , చేసిన మేలు మరువనివాడు , ఎప్పుడు సత్యమునే పలుకువాడు , గొప్ప సంకల్పము కలవాడు , అనుకున్నపని నెరవేర్చే గుణము కలవాడు ఈ గుణములు అన్నీ కలిగినవారు ఎవరైనా ఉన్నారా అంతేకాదు మంచి నడవడిక కలవాడు సర్వ భూతములయందు ప్రీతి కలవాడు అన్ని విద్యలు నేర్చిన వాడు తనకు అసాధ్యమంటూ లేదు అని నిరూపించినవాడు ఎల్లప్పుడు ఆనందంతో తొణికిసలాడేవాడు , మహాధైర్యం కలవాడు , కోపం అంటే ఎరుగనివాడు , మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు , అసూయ- ద్వేషములను దగ్గరకు రానివ్వనివాడు , యుద్ధ రంగంలో దిగితే దేవతలకు కూడా భయపడని వాడు ఇటువంటి సద్గుణములు కల నరుడిని (మానవుని) గురించి వినవలెనని నాకు చాలా కుతూహలంగా ఉంది దయచేసి నాకు వివరించండి ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు అందువలన నీకు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి లోకోత్తమ పురుషుడిని గురించి నాకు తెలియజేయండి అని వాల్మీకి మహర్షి నారదుడిని అడిగాడు.
    ☀️ అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు.
    ఓ మహర్షి నీవు చెప్పిన ఈ సద్గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు ఎందుకంటే అవి అసాధారణములైన దుర్లభమైన గుణములు కానీ అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నారు.
    ఆయన గురించి చెబుతాను విను.
    ☀️ ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది.
    ఆ వంశంలో " రాముడు " అనే పేరు గల ఒక మహాపురుషుడు దశరథ మహారాజు , కౌసల్యలకు జన్మించాడు . ఆ రాముడు అందరి చేత కీర్తించబడినాడు. ఆ రాముడు స్థిర బుద్ధి కలవాడు , మహావీరుడు , మంచి ప్రకాశము కలవాడు , అసాధారణమైన ధైర్యం కలవాడు అంతేకాదు రాముడు బుద్ధిమంతుడు , నీతిమంతుడు , సకలశాస్త్ర పారంగతుడు , శ్రీమంతుడు , శత్రు భయంకరుడు , ఆజానుబాహుడు , స్పురద్రూపి , అందగాడు , విశాలమైన వక్షస్థలం కలవాడు.
    ☀️ రాముడి ధనుస్సు చాలా గొప్పది శత్రువులను నాశనం చేస్తుంది. రాముడు అంత పొట్టి కాదు అలా అని మరీ పొడుగు కాదు. రామునికి అన్ని అవయవాలు సమపాళ్ళలో ఉన్నాయి.
    సకల శుభలక్షణ సమన్వితుడు రాముడు.
    రాముడు సకల ధర్మాలు తెలిసిన వాడు , సత్యమునే పలికేవాడు , ఎల్లప్పుడూ ప్రజల హితం కోరేవాడు , మంచి యశస్వి , జ్ఞాన సంపన్నుడు , ఎల్లప్పుడు శుచిగా ఉంటాడు.
    ☀️ శరణు కోరినవారిని రక్షించేవాడు ఆ రాముడు.
    ప్రజాపతితో సమానమైన వాడు , దుష్ట శిక్షణ - శిష్టరక్షణ పట్ల ఆసక్తి కలిగిన వాడు , ధర్మాన్ని ఎల్లప్పుడు పరిరక్షించేవాడు , తనను తాను రక్షించుకుంటూ తనవారిని కూడా రక్షించేవాడు ఆ రాముడు.
    ☀️ రాముడు వేదములు , వేదాంగములు చదివినవాడు. ధనుర్వేదంలో దిట్ట.
    రాముడు సకల శాస్త్రముల అర్థములు తెలిసినవాడు , మంచి జ్ఞాపకశక్తి కలవాడు , మంచి ప్రతిభావంతుడు , సర్వలోక ప్రియుడు , సాధుజనుల యందు - దీనుల యందు దయగలవాడు.
    ☀️ నదులన్నీ సముద్రాన్ని చేరినట్టే సత్పురుషులు అందరూ రాముని వద్దకు చేరుతారు.
    రాముడు అందరిని సమానంగా ఆదరిస్తాడు.
    రాముడు సముద్రం వలె గంభీరంగా ఉంటాడు , హిమాచలం వలె శాంతంగా ఉంటాడు.
    ☀️ ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్య పుత్రుడుగా జన్మించాడు. ఆ రాముడు పరాక్రమములో విష్ణువుతో సమానుడు. చంద్రుడిని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముడిని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది అయితే రాముడు కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపుడు , ఇంకా ఓర్పులో భూదేవిని, దానములలో కుబేరుని, సత్యము పలుకుటలో ధర్మ దేవతని మించినవాడు.
    శివార్పణమ్ 🕉️🕉️🙏🕉️🕉️
    సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏🙏
    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్...🚩🚩🚩🚩🚩

    • @garresagarika8854
      @garresagarika8854 2 года назад

      🙏🙏 🙏🙏🙏🙏

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 2 года назад

      ధన్యవాదాలు మీకు...🙏🙏🙏
      జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్...🚩🚩🚩

  • @thelearner5265
    @thelearner5265 2 года назад +19

    జై శ్రీ రామ్!

  • @gomubalagy369
    @gomubalagy369 2 года назад +6

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 года назад +3

    కరుణాకర్ గారికి శ్రీరామ చక్రధర్ గారికి
    పాదనమస్కారములు. సోదరి శ్రీలక్ష్మి గారికి
    అభినందనలు. తవాస్మి గ్రంథాన్ని ప్రతి మనిషీ చదవాలి చదివించాలి , జైశ్రీరాం.

  • @komalkumarpavuluri7399
    @komalkumarpavuluri7399 2 года назад +21

    Wow 🥰🙏🕉️🔱
    Jai Shiva Shakti 🤗

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 года назад +2

    Lakshmi Garu Thavaasmi gurinchi vivarana ichchina aa Mahanubhavuniki 💯 koti 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 cheppindi eelanti programs chala ravalani korukontunnanu 💯

  • @ritantareprises7967
    @ritantareprises7967 2 года назад +7

    జై శ్రీరామ

  • @natureisbeautiful6482
    @natureisbeautiful6482 2 года назад +34

    Follow "Mission kali tamil" to protect TN.

  • @nirmalaboddepalli7340
    @nirmalaboddepalli7340 2 года назад +8

    It’s a good effort .. great book...every mother should take responsibility to teach her kids ,.being first Guru/teacher.

  • @anuradhab4386
    @anuradhab4386 2 года назад +5

    అద్భుతం🙏🙏

  • @kbhagyalakshmi536
    @kbhagyalakshmi536 2 года назад +19

    జై శ్రీరామ్

  • @srinivasdurgam6910
    @srinivasdurgam6910 2 года назад +8

    🙏 జై శ్రీరాం 🙏

  • @jayakishorep9551
    @jayakishorep9551 2 года назад +6

    Jai Shriram.

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 2 года назад +8

    Jai Shri ram

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 2 года назад +3

    చాలా బావుంది

  • @b.krishnatelugub.krishnate9658
    @b.krishnatelugub.krishnate9658 2 года назад +3

    JAISRIRAMA 👨‍👨‍👦👨‍👨‍👦👨‍👨‍👦🙏🙏🙏🚩🙏 Shri SIVASAKTHI 🙏🚩🙏 Brotherki and Lakshmi Ghar ki dhanyvadmulu 🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🙏🚩🚩🚩

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 2 года назад +5

    Wonderful explanation

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 2 года назад +3

    Ja ho shiva shakthi we support

  • @Durgabakthinews
    @Durgabakthinews 2 года назад +8

    శ్రీ రామచంద్ర మూర్తి కి జై

  • @SrinuPSPK
    @SrinuPSPK 2 года назад +6

    జై శ్రీరామ్
    జై హనుమాన్

  • @504venu
    @504venu 2 года назад +3

    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩

  • @krishnag4185
    @krishnag4185 2 года назад +5

    Jai sriram

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 2 года назад

    ఉన్నతోన్నతమైన వాల్మీకి రామాయణాన్ని చాలా మంది రచయితలు చాలా రకాలుగా వ్రాసి ప్రజలను తికమక పెట్టేలా చేసారు.కాని పవిత్ర గ్రంథం అయిన వాల్మీకి రామాయణంలోని పాత్రలు వారి లోతైన భావనలు సమాజానికి సరైన మార్గ నిర్దేశకంగా మలిచి అందిస్తున్న శ్రీ రామచక్రధర్ గారికి ధన్యవాదములు.

  • @Naagu5668
    @Naagu5668 2 года назад +18

    పుస్తకం ఎలా ఉందో, మీ మాటల్లోనే అధ్బుతం అని అర్ధమవుతుంది, గత కొన్ని దశాబ్దాలుగా అసలు వాల్మికి రామాయణం మరుగున పడిపోయి, సొంత అభిప్రాయ రామాయణాలు వ్రాయబట్టి ప్రతీ వాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.లోపం వాల్మీకి రామాయణ/వ్యాస భారతం ఒరిజినల్స్ ని కల్తీ చేయలేరు, బట్ డూప్లికేట్స్ వ్రాసి కన్ఫ్యూజ్ చేయవచ్చు అనే ఫార్ములా బాగా వాడుకున్నారు.

  • @chandupabbathi8662
    @chandupabbathi8662 2 года назад +7

    Thank you so much annaya giving for valuable book thavvasmi

  • @laxmivilas3515
    @laxmivilas3515 2 года назад +5

    Jai shiva shakthi, jai karunakar sugguna 🙏🙏

  • @BDSN81
    @BDSN81 2 года назад +8

    Excellent please discuss more about the books he as great knowledge....
    Waiting for part-2.

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 2 года назад

    అద్భుతమైన ప్రోగ్రాం ఇలాంటి ఎన్నో చేయాలనీ కోరుకుంటున్నాను 💐💐💐🙏🙏🙏👌👌👌❤️

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 2 года назад +8

    Hats off Chakradhar Garu 🙏🙏.

  • @padmavathird1533
    @padmavathird1533 2 года назад +2

    Excellent interview.Jai Sri Ram

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 года назад +10

    1, క్రైస్తవులుగా మారిన OC/BC/SC,ST లకు ఎట్రాసిటీ కేసు ఫిర్యాదు చేయడానికి అర్హత లేదు..*
    క్రైస్తవులుగా మారిన OC/BC/SC,ST లు రిజర్వేషన్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వ పథకాలకు అర్హులు కారు..
    క్రైస్తవులుగా మారి BC/SC,ST గా చెలామణి అవుతున్న వారిపై ఫిర్యాదు చేయడానికి క్రింద తెలిపిన ఆధారాలు సేకరించి జిల్లా కలెక్టర్ కు లేదా నేరుగా కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు.
    BC/SC/ST లు క్రైస్తవులుగా మారినట్లు రుజువు చేయడానికి క్రింది ఆధారాలు సేకరించి ఫిర్యాదు చేసి ప్రభుత్వ ధనం వృధా కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైన వుంది.
    1) ఇంటిలో పెట్టుకున్న క్రైస్తవ ఫోటోలు,
    2) బైబిల్ పట్టుకొని చర్చిలోనికి వెళ్తున్న లేదా బయటకు వస్తున్న ఫోటోలు,
    3) వీడియోలు,
    4) క్రైస్తవ వాక్యాలు ముద్రించిన వివాహ శుభలేఖలు,
    5) గృహప్రవేశ, పదవీ విరమణ, మరణ మొదలగు శుభ, అశుభ కార్యముల ఆహ్వాన పత్రాలు (ఇన్విటేషన్లు)
    6) వాహనాలపై క్రైస్తవ మత ప్రచార బొమ్మలు, ఫోటోలు, మొదలగు వివరాలు సేకరించి సెక్షన్ 420 కింద పోలీస్ కేసు పెట్టి, ఉద్యోగి అయితే సంబంధిత శాఖ పై అదికారులకు, విధ్యార్థి అయితే విద్యాశాఖ /యూనివర్శిటీ/ కళాశాల యాజమాన్యానికి, మరియు MRO గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఎకనాలెడ్జిమెంట్ ఉండేలా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. మతం మారినట్లైతే BC-A, B, D గ్రూపులవారు ఏ మతంలోకి మారితే ఆ రిజర్వేషన్లు వారిస్తాయి. క్రిస్టియన్ అయితే బీసీ -సి లుగా పరిగణించబడతారు. ముస్లిం మతంలోకి మారితే బీసీ-ఇ పరిగణింపబడుతారు. ఇలా మారితే పుట్టబోయే పిల్లలకు మాత్రమే రిజర్వేషన్లు కింద పరిగణింపబడుతారు. ఇదే విదంగా మతం మారిన SC లు BC-C లు గాను పరిగణించబడతారు. ముస్లిం మతం పుచ్చుకున్న SC లుST లు గాని, BC-E లుగా పరిగణించబడతారు. అలాగే క్రైస్తవ లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న ST లు BC -C మరియు BC-E లుగా పరిగణింపబడతారు. G.O.M.S.No. 1973 ( Education Depot. Dt.23-09-1970(ఈ go పాతది కొత్తగా వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిమ్ కు bc-ఇ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ).
    7.మతం మార్చుకొని కూడా అబద్ధాలు చెప్పి BC, SC, ST, రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వాళ్ళపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసులు పెట్టి శిక్షించుట ద్వారా ప్రభుత్వ ధనాన్ని కాపాడవచ్చు.
    8. SC,ST, కోటాలో ఉద్యోగం సంపాదించిన తరువాత మతం మారి చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తే BC-C (మతం మారిన తరువాత పిల్లలు పుడితే వారు బీసీ-సిలుగా పరిగణింపబడతారు. వారు మతం మారిన తరువాత కూడా SC రిజర్వేషన్ సౌకర్యం పొందుతూ ఉంటే వారిపై ఎవరైనా తగిన ఆదారాలతో చీటింగ్ కేసు పెట్టవచ్చు, తద్వారా అతను లేదా ఆమే నియామకమును రద్దు పరచి ఆ కోటాలో అర్హులైన ఇంకొకరిని నియమిస్తారు. మరియు వారు ప్రభుత్వం ద్వారా జీతం రూపంలో అప్పటిదాకా పొందిన నగదు కూడా జప్తు చేయబడుతుంది. కావున ఇటువంటి సమాచారం మీ వద్ద ఉంటే పోలీసు వారికి ఫిర్యాదు పంపి తగుచర్యలు కొరకు ఒత్తిడి తీసుకురండి.

    • @kartheekvaranasi
      @kartheekvaranasi 2 года назад +1

      Chala mandiki teliani manchi vishyalau chepparu...

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 2 года назад

      @@kartheekvaranasi
      ధన్యవాదాలు సోదరా...🙏🙏🙏
      జై శ్రీరామ్...🚩🚩🚩

  • @indian5546
    @indian5546 2 года назад +35

    ఈ దరిద్రపు ఎడారి మతాలు రాక ముందు ప్రపంచమంతా మన సనాతన ధర్మమే వివిధ రూపాలలో ఉండేది EX ఉత్తర అమెరికాలోని కొలంబియా దేశం లో ఐదువేల సంవత్సరాల పూర్వపు నాటి మన హిందూ దేవతల విగ్రహాలు అనేక వేల సంఖ్యలో అక్కడ మ్యూజియంలలో ఉన్నవి

    • @myatharivijay3311
      @myatharivijay3311 2 года назад +2

      Needi rendu litre la paalu taagina Nasha anukunta....
      Nuv antuna yedari Mathalu vachake mana India e roju e sthayi lo undi....
      Lekapothe Antu Rani thanam ani sathisahagamanam ani Dalithulani Temple lo ki ranivakunda walaki Gynanam ivvakunda inequality tho Guddi Bakthi tho undedi.....

  • @dinakary3878
    @dinakary3878 2 года назад +4

    Excellent explanation. Thank you.

  • @peyyalaanil2835
    @peyyalaanil2835 Год назад

    జై శ్రీరాం 🙏శ్రీ రామ చక్రధర్ గారికి పాదాభివందనాలు

  • @srilathasb498
    @srilathasb498 2 года назад +15

    But in Hyderabad most schools do not agree for this great mission to be implemented bcoz managements will never agree or they will not appoint right persons who can teach Ramayana correctly. By giving less salary will appoint unqualified person's who may mislead the children.

  • @srikrishnathatavarthi1844
    @srikrishnathatavarthi1844 2 года назад +2

    ధన్యవాదాలు జై శ్రీరామ్ చాలా చక్కగా వివరించారు.

  • @rachannak9099
    @rachannak9099 2 года назад +6

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @gautamkv8707
    @gautamkv8707 2 года назад +4

    #WeWantIndiaAsBharath
    #congressmuktBharath
    #ChirstfreeBharath
    #SaveTemplesInAP

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 2 года назад +9

    జై శ్రీరామ్ 🙏🏻

  • @vijayachandra7789
    @vijayachandra7789 2 года назад +2

    chaala santhosham- thanks to shiv shakthi🙏🙏🙏

  • @kavacham384
    @kavacham384 2 года назад +4

    🌿🌿🌿🌿🌿🌿 jai sree ram
    🌿🌿🌿🌿🌿 jai Shiva shakthi

  • @rameshj4925
    @rameshj4925 2 года назад +2

    Jai sri ram 🌷🌷👏👏🌹🌹

  • @suryakiran5048
    @suryakiran5048 2 года назад +4

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @sirangivenkateswarlu8974
    @sirangivenkateswarlu8974 2 года назад +6

    తావాస్మి తెలుగులో లభిస్తుందా ఎక్కడ దొరుకుతుంది తెలియచేయండి

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 2 года назад +2

    Jai Sriram 🙏🙏 Jaihind 🙏🙏

  • @rvreddyandassociates
    @rvreddyandassociates 2 года назад

    Great video
    Wonderful service

  • @baburaotrack4894
    @baburaotrack4894 2 года назад +7

    jai hind jai srirama

  • @sparklingstars8522
    @sparklingstars8522 2 года назад +3

    Jai sri ram

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 2 года назад +3

    Jaisri.ramjiki

  • @vamsykishore6316
    @vamsykishore6316 2 года назад +2

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @rrreddy3522
    @rrreddy3522 2 года назад +2

    జై శివశక్తి , జైజై శివశక్తి. ఇలాంటి వ్యక్తులు లేదా గురువులతో ఆధ్యాత్మిక విశ్లేషణ కార్యక్రమాలు ఒక భాగంగా రూపొందిస్తే బాగుంటుంది. ఆలోచించగలరు.

  • @pushparaj5656
    @pushparaj5656 2 года назад +1

    వినోద్ అన్న ఇంటర్వ్యూ చూసి వచ్చిన వాళ్ళు ఇక్కడ🤩🤩🤩
    👇👇👇

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 2 года назад +2

    🙏🙏🙏🙏

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 года назад +4

    జై కాళీ మాత...🚩🚩🚩

  • @tataraoyeripilli2507
    @tataraoyeripilli2507 2 года назад +2

    srirama Rama raameti rame raame mano rame

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 2 года назад +2

    జై శివశక్తి🙏💐

  • @suryakiran5048
    @suryakiran5048 2 года назад +2

    Once Again Namo 2024

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 года назад +1

    Wowsuper

  • @vijaykumaryellapureddy4634
    @vijaykumaryellapureddy4634 2 года назад

    Great effort sir
    thank you

  • @seetharamaharikathamandali55
    @seetharamaharikathamandali55 2 года назад

    ప్రోగ్రామ్ చాలా బాగుంది అందరికీ ధన్యవాదములు 💐💐 బైబిల్ తరగతులు లాగ తవస్మి తరగతులు పెడితే ఎక్కువ మందికి చేరుతుంది, ధన్యవాదములు💐💐💐

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy 2 года назад

    Very good post ...Thank you

  • @kmn1247
    @kmn1247 2 года назад

    Good service akka.jai hindh

  • @abhinaysawant
    @abhinaysawant 2 года назад +11

    Thanks for sharing 🙏👍

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 2 года назад

    చాలా మంచి విషయాలను మాకు అందించినందుకు మీకు మా హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూయున్నాము.

  • @bharatheeyudujvnk4092
    @bharatheeyudujvnk4092 2 года назад +1

    Super good Lakshmi garu..
    Hindu vaibhavam gurinchi aasakti penche ilaanti interviews cheyandi .🙏🙏🙏.

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 2 года назад +1

    తవాస్మి ను మాకు ఇచ్చినందుకు సర్వదా కృతగ్ను ల ము.

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 года назад

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హనుమాన్ ఓం నమః శివాయ

  • @user-zs7du5px6p
    @user-zs7du5px6p 2 года назад +1

    🕉️ jai, Sheeram jai Shiva Shakthi🎤🎤👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪🚩⚔️

  • @bhagavatulavenkatanarayana3713
    @bhagavatulavenkatanarayana3713 2 года назад +1

    Super interview

  • @gundepallisatyam1758
    @gundepallisatyam1758 2 года назад +1

    Jai sri raam jai shiva shakti jai sri lakshmi sister.....

  • @vishnumurthy1273
    @vishnumurthy1273 2 года назад +1

    This debet is nice &wel,sanathana tharmam always welcom to in india.

  • @ganeshdigital4768
    @ganeshdigital4768 2 года назад

    తెలుగులో త్వరగా చేయాండి ఇప్పటికే చాలా లేటైంది,తావశ్మి రాబోయే తరానికి చాలా ఇంపార్టెంట్, నేను తావశ్మి ఇంటర్వ్యూ పూర్తిగా విన్నాను

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 2 года назад +3

    అందుకే ప్రకృతి సంస్కృతి సంస్కృతం

  • @prowill5725
    @prowill5725 2 года назад +1

    జై శ్రీ రామ్... జై శ్రీకృష్ణ

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 2 года назад +1

    శ్రీ లక్ష్మీ గారు నాకు మీరు చేసిన ఇష్టాగోష్టి నచ్చింది. అయితే ఇంకొంచం ప్రశ్నల స్థాయి పెంచగల్గితే. ఇంకొంచం రామాయణానికి దగ్గర కావచ్చు.

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 2 года назад

    Jai shree ram 😍👏👏👍🙏🌹🌷👍👌🙏🙏🙏🙏