సుప్రసిద్ధ తెలుగు సినీ గేయరచయిత, అక్షర బ్రహ్మ శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారి అద్భుత సాహిత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.! రామాయణంలో సుందరకాండ లాగ తెలుగు సినీ గేయ సాహిత్యంలో సుందరరామకాండ అని అన్నారంటే అతిశయోక్తి కాదు. వేటూరి గారి పాటలు రాశి లోనే కాక ప్రాచుర్యంలో కూడా చాలా ఎక్కువే. వీణ వేణువైన సరిగమ విన్నావా, నవమి నాటి వెన్నెల నీవు ,, చినుకులారాలి, అలివేణి ఆణిముత్యమా, మల్లి మల్లి నా నాగమల్లి.. లాంటి ఎన్నో రస గుళికల వంటి ప్రేమగీతాలైనా; శంకరా నద శరీరా పర, రా దిగిరా దివి నుండి భువికి దిగిరా వంటి భక్తి పాటలైనా; కొమ్మ కొమ్మకో సన్నాయి, జాబిలితో చెప్పనా , ఈ మధుమాసంలో వంటి ప్రకృతి గీతాలైనా; ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ కులము నీదంటే వంటి తాత్విక గీతాలైన; ఈ దుర్యోధన దుశ్శాసన, ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగె వారెవ్వరొ వంటి సంఘ సంస్కరణ గీతలైనా; ఆరేసుకోబోయి పారేసుకున్నాను, ఓలమ్మి తిక్క రేగిందా, చిలకకోట్టుడు కొడితే వంటి మసాలా పాటలైనా ; వాన వాన వందనం, స్వాతి ముత్యపు జల్లులో వంటి వాన పాటలైనా; మానస వీణ మధుగీతం, ఝుమ్మంది నాదం సై అంది పాదం వంటి సంగీత నృత్య ప్రధాన గీతాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద వ్యాసం రాయొచ్చు....ఇలా అన్ని రకాల వేలాది పాటలు మన సంగీత ప్రియుల మనసుల్లొ ఎప్పటికీ ఉంటాయి. "కాళింది మడుగున కాళియుని పడగల ఆబాల గోపాల మా బాల గోపాలుని అచ్చెఱువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ", "గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను ఘడియైన నీవు లేక గడప లేక ఉన్నను", "చుక్క నవ్వవే వేగుల చుక్క నవ్వవే చుక్కానవ్వవే నావకు చుక్కానవ్వవే", వంటి శబ్ద అలంకారాల గురించి చెప్పాలంటే ఇంక అంతే ఉండదు. వేటూరి గారి గీతాల్లో ఒక పాట షేర్ చెయ్యడమంటే కష్టమే..!
పదకవితా పితామహుడు అని అన్నమయ్య ను స్మరించుకుంటాము. తెలుగు సినిమా సాహిత్యం విషయానికి వస్తే, పాటల తోటలో సుమధుర పదాల పంట ను టన్నుల లెఖ్కన పండించిన సాహిత్య సేద్యగాడు వేటూరి సుందరరామ్మూర్తి అనడం లో ఏమాత్రం అతిశయోక్తి కాదు.
తెలుగు పాటల పూతోటను సుసంపన్నం చేసి" అక్షర లక్షలు" అద్దిన సిసలైన " అక్షర బ్రహ్మ"🌺🌹🌻🪷🌙🙏
Naa favorite writer Guruvugaru Veeturi Sundararamamurthy gaaru
Veturi -- ManiRatnam A Beautiful Combination
Thanq.. Madem
సుప్రసిద్ధ తెలుగు సినీ గేయరచయిత, అక్షర బ్రహ్మ శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారి అద్భుత సాహిత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!
రామాయణంలో సుందరకాండ లాగ తెలుగు సినీ గేయ సాహిత్యంలో సుందరరామకాండ అని అన్నారంటే అతిశయోక్తి కాదు. వేటూరి గారి పాటలు రాశి లోనే కాక ప్రాచుర్యంలో కూడా చాలా ఎక్కువే. వీణ వేణువైన సరిగమ విన్నావా, నవమి నాటి వెన్నెల నీవు ,, చినుకులారాలి, అలివేణి ఆణిముత్యమా, మల్లి మల్లి నా నాగమల్లి.. లాంటి ఎన్నో రస గుళికల వంటి ప్రేమగీతాలైనా; శంకరా నద శరీరా పర, రా దిగిరా దివి నుండి భువికి దిగిరా వంటి భక్తి పాటలైనా; కొమ్మ కొమ్మకో సన్నాయి, జాబిలితో చెప్పనా , ఈ మధుమాసంలో వంటి ప్రకృతి గీతాలైనా; ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ కులము నీదంటే వంటి తాత్విక గీతాలైన; ఈ దుర్యోధన దుశ్శాసన, ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగె వారెవ్వరొ వంటి సంఘ సంస్కరణ గీతలైనా; ఆరేసుకోబోయి పారేసుకున్నాను, ఓలమ్మి తిక్క రేగిందా, చిలకకోట్టుడు కొడితే వంటి మసాలా పాటలైనా ; వాన వాన వందనం, స్వాతి ముత్యపు జల్లులో వంటి వాన పాటలైనా; మానస వీణ మధుగీతం, ఝుమ్మంది నాదం సై అంది పాదం వంటి సంగీత నృత్య ప్రధాన గీతాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద వ్యాసం రాయొచ్చు....ఇలా అన్ని రకాల వేలాది పాటలు మన సంగీత ప్రియుల మనసుల్లొ ఎప్పటికీ ఉంటాయి. "కాళింది మడుగున కాళియుని పడగల ఆబాల గోపాల మా బాల గోపాలుని అచ్చెఱువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ", "గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను ఘడియైన నీవు లేక గడప లేక ఉన్నను", "చుక్క నవ్వవే వేగుల చుక్క నవ్వవే చుక్కానవ్వవే నావకు చుక్కానవ్వవే", వంటి శబ్ద అలంకారాల గురించి చెప్పాలంటే ఇంక అంతే ఉండదు.
వేటూరి గారి గీతాల్లో ఒక పాట షేర్ చెయ్యడమంటే కష్టమే..!
పదకవితా పితామహుడు అని అన్నమయ్య ను స్మరించుకుంటాము. తెలుగు సినిమా సాహిత్యం విషయానికి వస్తే, పాటల తోటలో సుమధుర పదాల పంట ను టన్నుల లెఖ్కన పండించిన సాహిత్య సేద్యగాడు వేటూరి సుందరరామ్మూర్తి అనడం లో ఏమాత్రం అతిశయోక్తి కాదు.
🙏
Sri.Veturi's Grandson: ruclips.net/video/GeH2X3grMRU/видео.html