శివ దీక్ష ఎలా చేయాలి ? | How to do Shiva Diksha | Bhakthi Margam
HTML-код
- Опубликовано: 9 фев 2025
- శివ దీక్ష ఎలా చేయాలి How to do Shiva Diksha #BhakthiMargam
శివదీక్ష మోక్షప్రదాయకము
ఈ ప్రపంచములో సృష్టిస్థితిలయములకు సకలచరాచర జీవకోటిని సంరక్షించుటకు కైలాసములో పార్వతీ పరమేశ్వరులుగా, శ్రీశైలములో భ్రమరాంబ మల్లిఖార్జునులుగా, కాశీలో విశాలాక్షి విశ్వనాధలింగేశ్వరులుగా, సోమేశ్వర, మల్లిఖార్జున, మహాకాళేశ్వర, అమరేశ్వర, వైద్యనాథేశ్వర, భీమేశ్వర, రామేశ్వర, నాగేశ్వర, విశ్వేశ్వర, త్రయంబకేశ్వర, కేదరేశ్వర, ఘృశ్వేశ్వర అను ద్వాదశ జ్యోతిర్లింగములుగా వివిధ పుణ్యక్షేత్రములలో ప్రసిద్ధి చెందినారు. ఆ జగద్రక్షకుడైన జగదీశ్వరుని ఎంత పొగిడినా తనివితీరదు. ఓం నమః శ్శివాయ అను పంచాక్షరి మంత్రమును నియమ నిష్ఠలతో పఠించిన శివకోటి భక్త జనులకు సర్వపాపములు పటాపంచలు అయి ముక్తి మోక్షఫల ప్రదంబుల నొసంగి జన్మ తరింపజేయును.
శివదీక్షను, నిష్ఠ నియమాలతో ఆచరించిన, దేహపీడలు అకస్మాత్ కలహములు తొలగి ఆయురారోగ్యములు, అష్ట్యైశ్వర్యములతో శుభ ప్రదముగా జీవించునట్లు ఆశీర్వదించును. దేవతలందరిలో శివుడు దయారస హృదయుడు. భక్తుల మొరలాలించి వరాలిచ్చే బోళాశంకరుడు. శివ అంటే శుభము అని అర్థము. ఇతర దేవతలవలె శివుడు అవతారము లెత్తుటకై మహా శివుడు ఎవరి గర్భమున జన్మింపలేదు. అవతారము, అవతార సమాప్తి, అన్నియు లీలలే, శివుడు నిర్మలుడు, నిర్గుణుడు, నిష్కలంకుడు, నిటాలాక్షుడు, నిరంజనుడు. అట్టి ఆదిదేవుడు శివుని ఆలంబనముగా జేసుకొని ఆచరించబడేదే శివదీక్ష జగన్మాతయైన పార్వతీదేవి కఠోరమైన శివదీక్ష చేసి, ఆ పరమశివుని అనుగ్రహము వలన నిజమైన అర్థాంగియైనది. శివుని శరీర మందు అర్థభాగము స్వీకరించుటచే పరమేశ్వరుడు కూడా అర్థనారీశ్వరుడైనాడు.
శ్రీరామచంద్రుడు శ్రీరామలింగేశ్వరుని, శ్రీకృష్ణుడు శివదీక్షను, అర్జునుడు పాశువత దివ్య దీక్షను స్వీకరించి తరించునట్లు చెప్పబడుచున్నది. మనకు తెలిసినంత వరకు శివదీక్ష పట్టిన వారిలో మొట్టమొదటి భక్తురాలు పార్వతీదేవి. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భక్త కన్నప్ప నుండీ, పర్వతుడు, భక్త సిరియాలుడు మొదలైనవారు శివదీక్షను పాటించినట్లు విక్రమాదిత్యుని తామ్రశాసనం వలన తెలుస్తుంది. కార్తికేయుడు కూడా శివదీక్షను పూని దేవతాసిన్యాలకు అధిపతి అయినాడు. ఇంతటి దివ్య మహిమగల శివదీక్ష ఎంతో ప్రాచీనమైనది.
మాఘమాసంలోని మహాశివరాత్రితో మండలకాలం అనగా 40 రోజుల్లో ముగియునట్లుగా ఆచరించుట మంచిది.
40 రోజులు పూర్తయి 41వ రోజున దీక్ష విరమించవలెను. మాఘమాసములోని మహాశివరాత్రితో గాని, కార్తీక మాసములోని మహాశివరాత్రితో గాని, కార్తీక మాసములోని మాస శివరాత్రితోకాని దీక్ష పూర్తి అయ్యే విధముగా ఆచరించవచ్చును.
మండలకాలం పూర్తి అయిన తరువాత జ్యోతిర్ముడితో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి మల్లిఖార్జున స్వామికి నమస్కరించి శ్రీశైల మహాక్షేత్రము నందు గల త్రిఫల వృక్షము క్రింద ఈ దీక్షా విరమణ చేయుట మిక్కిలి శ్రేష్ఠము. ఇది చేయలేని వారు అర్థ మండలం అనగా 20 రోజులు శివ దీక్షవహించిన 21 వ రోజులో దీక్షావిరమణ చేయవలెను. ఈ శివదీక్షను స్థానిక శివాలయములోని శివార్చకునితో కాని ఇంతకు పూర్వము శివదీక్షను స్వీకరించిన వారితోకాని మూలాధారణను చేయించుకొనవలెను.
ఇట్టి మహత్తరమైన శివదీక్షను నియమానుసారము ఆచరించిన వారికి భూత, ప్రేత, పిశాచ, శత్రు బాధలు, గ్రహారిష్టములు తొలగిపోవును. సర్వ సంపదలు కలిగి ఐహికాముషిక సుఖబీమమీలు పొందెదరు.
శంకరాచార్యుల వారు తన శివానందలూ ఓ పరమేశ్వరా ! ఈ జగత్తులో సహస్రార్థిలో దేవతలు ఉన్ననూ శాశ్వత మోక్ష ఫలమును ప్రసాదించువాడవు నీవే సుమా ! కనుక నీ పాదద్మములే నాకు శరణ్యము.
శివదీక్ష - మాలాధారణ మంత్రం
108 రుద్రాక్షలు, దానికి చివర పరమేశ్వరుని ముద్రగల మాలను తీసుకొనవలెను. ఈ శ్లోకములను చెప్పుచూ మాలను శివ ముద్రకు నమస్కారం చేయవలెను.
శ్లో!! ఓంకార శక్తి సంయుక్తాం సచ్చిదానంద రూపిణీం !
శ్రీశైలేశ దయాపూర్ణాం శివముద్రాం నమామ్యహం !!
అంటూ రుద్రాక్షమాలకు గల స్వామి వారి ముద్రకు, నమస్కారం చేయాలి.
@BhakthiMargamTeluguOfficial
🚩ఓం నమః శివాయ🚩🙏🙏🙏
Om నమ శివాయ 🙏
Thandri thalli mi padalaku sathakoti vandanalu thandri thalli 🙏🙏🙏🙏🙏
🕉️హర హర మహాదేవ 🔱 శంభో శంకర✨ 🪔🙏
Om namah sivayya🙏🕉️🙇♂️🕉️🙏
Omm Namaha Shivaya 🙏🙏🙏🙏🙏🌺🌺🌹🌹🍎🍎🍏🍒🍓🍓🍒🌻🌻🌼🌼
హర హర మహాదేవ సెంభోసెంకారాహ
🕉️నమః శివాయ🙏🏻 🕉️☪️✝️🙏🏻
🙏🌿சிவ சிவ🌻🌺திருச்சிற்றம்பலம் 🍋🙏🌷
OM namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya 🙏🏻🙏🏻🙏🏻💐🙏🏻💐🙏🏻💐💐💐🙏🏻🙏🏻
Ii
Ii
Ii ii ii I ii
Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namah shivaya 🔱💐
om namah shivaya🕉🕉🕉
Swamy ammailu shiva deeksha tesukovachaaa ....teliyacheyandi
Tesukovachu ....deeksha start chesinde parvathi Devi...
Om namah shivaya
ఓం నమఃశివాయ
🙏🙏🙏🙏🙏
స్వామి,మాల లో ఉండగా తిరుపతి, ఇంకా పుణ్యక్షేత్రాలకు వెళ్లవచ్చా.ఇంకా అలా వెళ్ళినపుడు, స్నానం,చద్ది,భిక్ష ఎలా చేసుకోవాలి,ఆ సమయం లో ఇంటి దగ్గర ఉన్న పీటం వద్ద ఎలాంటి నియమాలు పాటించాలి.
Ayya nenu mala veddam anukuntunna
Epdu karthika masam 30 days veste baguntunda. Leda sivaratri ki 41 roju unte baguntunda plz suggest
శివరాత్రి కి వేయండి స్వామి 🙏
శైవాగమ సదస్సులో
తత్వ ప్రకాశం వీడియో పెట్టగలరు
అమ్మాయిలు దీక్ష తీసుకోవచ్చా
Soap vadocha diksha lo
దీక్షలో ఉన్నప్పుడు సబ్బులతో స్నానం చేయొచ్చా
Cheyakudadu antaru, sunnipindi vadochu
No swamy raya kudadu
Pasupu leda sunnipindi use cheyochu swamy
స్వామి. ఏమి అర్థం కాలేదు..
00000000
ఓం నమఃశివాయ 🙏🙏
Om namah shivaya
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ నమః