Ep: 08 - Kalyani Raaga (కళ్యాణి, మేచ కళ్యాణి రాగం) Vishleshana | Raaga Vaani | Learn Raagas |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Kalyani (mecha Kalyani) - కళ్యాణి (మేచ కళ్యాణి)
    భక్తి గీతాంజలి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న సంగీత అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనములు.
    హార్మోనియం మరియు కీ బోర్డు పై సంగీత శిక్షణలో భాగంగా రెండవ దశ అయిన “రాగవాణి" లో ఈనాటి రాగం “కళ్యాణి."
    కళ్యాణి అంటే కళ్యాణమైనది, శుభమైనది అని అర్ధము.
    కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్తా రాగాలలో 65 వ రాగం. ఈ రాగాన్ని కటపయాది సంఖ్య కోసం మేచ కళ్యాణిగా చెప్పారు. హిందుస్థానీ సంగీతంలో ఈ రాగాన్ని కళ్యాణ్ లేదా యమన్ అంటారు. (యమన్ కళ్యాణ్ వేరు). మనోధర్మ సంగీతానికి విస్తృత అవకాశం ఉన్న రాగం. పౌరాణిక నాటకాలలో ప్రతి నటుడూ కళ్యాణి రాగంలోనే తమ ప్రారంభ పద్యం ఆలపిస్తారంటే రాగ విశిష్టత కోసం వేరే చెప్పనవసరం లేదు. అన్ని రకాల సంగీత ప్రక్రియలలో కూడా ప్రముఖంగా వాడబడుతున్న రాగం.
    కళ్యాణి, యమునా కళ్యాణి, హమీర్ కళ్యాణి, మోహన కళ్యాణి, పూర్వ కళ్యాణి(53 గమనశ్రమ) , శ్యామ కళ్యాణి, (12 & 65 రూపవతి), ఉషా కళ్యాణి, (54 విశ్వంబరి)చిన్న చిన్న తేడాలతో కళ్యాణి ఉంది. తేడాలను గమనించి కళ్యాణి ని మనం తెలుసుకోవాలి.
    ప్రాచీన చలన చిత్ర సంగీత దర్శకులు చాలా మంది ఈ రాగంలో పాటలను చేసారు.
    ఆరోహణము, అవరోహణ లు చూద్దాం.
    ఆ: స రి2 గ3 మ2 ప ద2 ని3 స
    అ: స ని3 ద2 ప మ2 గ3 రి2 స
    రాగఛ్ఛాయ కోసం స్వర ప్రయోగం:
    నిరిగమదపా, గమదనిరిసా
    నిరిసనిదప మదపమగరిగా
    నిరిని రిగరి గమగ మదమ దనిద నిరిని గరిసా
    గరిసా నిదపా మగరిసనిరిసా
    నిరిగమదనిగరిసా, నిగరిస నిరిసనిదపా, మనిదప మదపమగరీ, నిగరిస నిరిసనిదపా దనిగరిసా.
    జంటలు:
    సస రిరి గగ మమ పప దద నిని సస
    సస నిని దద పప మమ గగ రిరి సస
    దాటులు:
    నిగరినిసా మనిదమపా నిగరినిసా
    పద్యం: స్వీయ రచన.
    తేటగీతి:-
    తలతు నీరాక నూహించి తనివి దీర,
    వలతు నీ రూపు వర్ణింప వాంఛ దీర,
    కొలుతు నీపాద పద్మముల్ కోర్కె దీర,
    మలతు నీభజన గణనాథ! మనసు దీర.
    ఈ రాగంలోని కొన్ని కీర్తనలు, పాటలు:
    1 దొరకునా ఇటువంటి సేవ - శంకరాభరణం
    2 సురమోదము - ఆదిత్య 369
    3 పాడనా వాణి కళ్యాణిగా - మేఘ సందేశం
    4 సాయీ శరణం బాబా - షిరిడీ సాయి మహాత్మ్యము
    5 శ్రీరామ నామాలు శతకోటి - మీనా
    6 పూచే పూలలోనా - గీత
    7 చెలికాడు నిన్నే రమ్మని - కులగౌరవాలు
    8 విరిసే చల్లనీ వెన్నెల - లవకుశ
    9 నారద తుంబుర - స్వీయ రచన కీర్తన
    10 మది శారదా దేవి - జయభేరి
    11 రారా నా సామి రారా - విప్రనారాయణ
    12 తోటలో నారాజు - ఏకవీర
    13 మనసే కోవెలగా - మాతృ దేవత
    14 నీ పలు గాచి పనులకు పాండురంగ మహాత్యము
    15 రావే నా చెలియా - మంచి మనసులు
    16 సలలిత రాగసుధారస సారం - నర్తన శాల
    17 స్వర్గీయ శ్రీ యమ్ యస్ రామారావు గారు ఆలపించిన సుందర కాండ గానంలో కోట గోడ అవలీలగ
    18 స్వర్గీయ శ్రీ ఘంటసాల గారి భగవద్గీత గానంలో తేజః క్షమా, దంభోదర్పోభిమానస్య శ్లోకాలు.
    కళ్యాణి రాగంలో ఇంకా చాలా పాటలున్నాయి. ఒకసారి రాగము యొక్క ఛాయలు తెలిస్తే ఆ రాగంలోని పాటలను సులభంగానే తెలుసుకోవచ్చు.
    చాలా పాటలు కళ్యాణి రాగంలా అనిపించినా అవి యమునా కళ్యాణి, మోహన కళ్యాణి లో ఉంటాయి. రాబోయే వీడియో లలో ఆరాగాలకోసం తెలుసుకుందాము.
    ఈ వీడియో మీకు నచ్చితే, మీ సంగీత మిత్రులకు ఉపయోగపడతుందని భావిస్తే లైక్ చేసి, షేర్ చేయండి. మా వీడియోలు తప్పనిసరిగా మీకు అందాలంటే, మన “భక్తి గీతాంజలి" ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
    మీ రమేష్ బాబు సీపాన
    +91 9949124221
    Support Us:
    Link to Donate: bit.ly/36bKvLH
    Connect With Us:
    Telegram: t.me/Bhakthige...
    Twitter: / bhakthigeethanj
    Facebook: / bhakthigeeth. .
    Instagram: / bhakthigeet. .
    E-Mail: Bhakthigeethanjali.srb@gmail.com
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 201

  • @rameshbabuseepana2939
    @rameshbabuseepana2939 3 года назад +9

    తోటలో నారాజు పాట శృతి 2 లో అనుకోకుండా వాయించడం జరిగింది. మన్నించ గలరు.
    అలాగే పాడనా వాణి కళ్యాణి గా పాటలో “నా పూజకు" బదులు “నా పాటకు" అని పొరపాటున పాడడం జరిగింది.
    మన్నించ గలరు.

  • @immanenirajasekhar1967
    @immanenirajasekhar1967 6 месяцев назад +2

    Voice chala bhagundi super

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  4 месяца назад

      ధన్యవాదములు రాజశేఖర్ గారు🙏

  • @haribabuk7630
    @haribabuk7630 Год назад +1

    Super nice bagundi vasudeva

  • @kintaliramakrishna5303
    @kintaliramakrishna5303 3 года назад +5

    చాలా బాగుంది సార్ ఎంతగానో ఉపయోగపడతాయి నేర్చుకునే వారికి🙏🙏🙏🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      సంతోషం రామకృష్ణ గారు.
      ధన్యవాదములు.

  • @ldpgroupsongs4271
    @ldpgroupsongs4271 3 года назад +6

    కళ్యాణి రాగాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఎంతో చక్కగా, అందరూ నేర్చుకునేందుకు వీలుగా వివరించారు మీకు ధన్యవాదములు సార్

  • @bharatiratnala2086
    @bharatiratnala2086 3 года назад +3

    Kalyani Ragam kosamu chakkni vivrana echhi Jonny songs thyliya jesaru 👍

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు భారతి గారు.

  • @vikramreddyvikram7027
    @vikramreddyvikram7027 Год назад +1

    Prannamamulu gurgvu garu 🙏🏿🌹🍎

  • @user-en8mw7wn3h
    @user-en8mw7wn3h Год назад +1

    మీరు చక్కగా పాడటమే కాకుండా మీరు ఏదైతే పాడుతున్నారో ఆ పాట యొక్క notation రవ్వంత కూడా తప్పకుండా గమకాలతో సహా
    హార్మోనియం వాయిస్తూ పాడటం అనేది చాలా
    గొప్ప విషయం. మీ గొంతు కూడా చాలా మధురమైనది.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      చాలా చాలా ధన్యవాదములు సర్🙏
      మీలాంటి పెద్దల ఆశీర్వాద బలమది.

  • @seshutv4112
    @seshutv4112 2 года назад +1

    Good explanation sir, Saraswathi putrulu,

  • @aanchannel2174
    @aanchannel2174 3 года назад +3

    సంగీత నేర్చుకోవాలనుకునే ఎటువంటి వారికి చాలా ఉపయోగపడే వీడియో. రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు

    • @rameshbabuseepana2939
      @rameshbabuseepana2939 3 года назад

      మీలాంటి పెద్దల ఆశీర్వాదముతో మరింత శక్తి వస్తుంది.
      ధన్యవాదములు ఆర్యా! 🙏

  • @krishnavenidornadula-xk2fs
    @krishnavenidornadula-xk2fs 9 месяцев назад +1

    Great sir🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  8 месяцев назад

      ధన్యవాదములు కృష్ణ వేణి గారు🙏

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 Год назад +1

    Excellent

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      ధన్యవాదములు వరహాలు గారు.
      నమస్కారం

  • @prakashveeduluri980
    @prakashveeduluri980 Год назад +1

    Veri fine narration రమేష్ గారూ

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      ధన్యవాదములు ప్రకాశ్ గారు🙏

  • @rameswarengworks8835
    @rameswarengworks8835 3 года назад +3

    చేల అద్భుతం గురూజీ ధన్యవాదాలు మాలాంటి వలకి ఉపయోగ పడుతుంది ధన్యవాదాలు గురూజీ🙏🙏🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      సంతోషం బాబూ! మీకు ఉపయోగపడితేనే నా లక్ష్యము నెరవేరునట్లు.

  • @vennapusaramasubbareddy1186
    @vennapusaramasubbareddy1186 2 года назад +1

    Super

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు రామసుబ్బారెడ్డి గారు

  • @koteswararaop.v.7171
    @koteswararaop.v.7171 3 года назад +2

    చాలా బాగుంది, చిరంజీవి రమేష్,
    భగవంతుడు చక్కని గాత్రాన్ని మీకు ప్రసాదించాడు. గణపతి మీద గీతి, తరువాతి రాగం అద్భుతమైనవి.
    భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా లభించుగాక!

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад +1

      చాలా చాలా ధన్యవాదములు కోటేశ్వరరావు గారు. మీ చల్లని దీవెనలే మాకు శ్రీరామ రక్ష.
      🙏🙏🙏

    • @chidusarvardhapu5705
      @chidusarvardhapu5705 2 года назад

      Yes agreed, his voice is a gods gift.. I frequently listen and also feel his own composition was too better to me to listen. thanks for your blessings to him.🙏

  • @Srisrinivasabhaktigeethanjali
    @Srisrinivasabhaktigeethanjali 3 года назад +2

    జై శ్రీమన్నారాయణ మా లాంటి నేర్చుకునే వారికి చాలా బాగా పడుతుంది గురువు గారు ,

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      సంతోషం వేంకటేశ్ గారు

  • @vanteddujagadeeswararao1738
    @vanteddujagadeeswararao1738 2 года назад +1

    Good teacher

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      జగదీశ్వర రావు గారు ధన్యవాదములు

  • @venkataramanapalleti3858
    @venkataramanapalleti3858 3 года назад +2

    కళ్యాణి రాగం గూర్చి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు రమేష్ బాబు గారు.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు రమణ గారు.
      🙏

  • @mangarajugeddam-bo8dj
    @mangarajugeddam-bo8dj Год назад +2

    Namaste
    Meeru cheppuna Hamsadhvani ragam chala baga cheppar Ramesh babu
    garu
    G Mangaraju rtd locopilot/ singar💅💅💅

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      ధన్యవాదములు మంగ రాజు గారు🙏🙏🙏

    • @JagadeshS-jy8bc
      @JagadeshS-jy8bc 3 месяца назад

      18:41 ​@@BhakthiGeethanjali

  • @dr.chandrashekar6326
    @dr.chandrashekar6326 3 года назад +2

    Adbhutham master 🙏💐🌺

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు డాక్టర్ గారూ
      🙏

  • @kaiwarasriharisriharisharm9457
    @kaiwarasriharisriharisharm9457 Месяц назад

    Chaala baaga teach chesaru ❤

  • @kattojuhari5555
    @kattojuhari5555 3 года назад +2

    అందరికి అర్ధమైయేలా చాలా అద్భుతంగా వివరించారు రమేష్ బాబు గారు!ధన్యవాదములు 👏👏👏👍👍👍🙏🙏🙏🌻🌻🌻🌷🌷🌷

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు హరిగారు

    • @gglggl137
      @gglggl137 3 года назад +1

      DhanyavaadamuluchaalabaagaaalapincharuA. Sivanna

    • @rameshbabuseepana2939
      @rameshbabuseepana2939 2 года назад

      @@gglggl137 ధన్యవాదములు సర్🙏

  • @pichikadurgarao
    @pichikadurgarao 3 года назад +3

    Excellent concept Sri Rameshbabu garu keep it up👌👌👌👌👌

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు దుర్గారావు గారూ!
      మీ లాంటి సంగీతజ్ఞుల కామెంట్స్ నాకు మరింత బలం.
      🙏

  • @prakashamarlapudi2694
    @prakashamarlapudi2694 2 года назад +2

    చాలా చక్కగా వివరించారు👌👌💐💐💐

  • @vangalasatyanarayana1439
    @vangalasatyanarayana1439 3 года назад +2

    కళ్యాణి రాగంలోని పాటలు వినిపించి నందూకు సంతోషం ప్రతిమద్యమంలో భాగపాడారు

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు సత్యనారాయణ గారు.

  • @kdkeys12
    @kdkeys12 3 года назад +2

    Super guruji....very useful videos for those who are interested to learn classical music..🙏🙏

  • @ramaraometta8887
    @ramaraometta8887 2 года назад +1

    Sir kalyaniragam Baga వివరించారు. మీకు మా హృదయపూర్వక నమస్కారములు

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      సంతోషం మెట్ట వారు.
      మీరు ఎక్కడ నుండి?

  • @omsairamomsairam7888
    @omsairamomsairam7888 2 года назад +2

    Super.sar.🙏🙏🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు.
      సాయిరాం.
      🙏🙏🙏

  • @bhaskarrao5846
    @bhaskarrao5846 3 года назад +2

    Excellent Concept Ramesh babu

    • @rameshbabuseepana2939
      @rameshbabuseepana2939 3 года назад

      ధన్యవాదములు భాస్కర్ గారు.

  • @Visbanu
    @Visbanu 3 года назад +3

    చాలా చక్కగా వివరించారు సోదరా,,,

  • @akkenapelliravinder997
    @akkenapelliravinder997 8 месяцев назад +1

    Kala abhi vadamulu master garu

  • @venkataraobagadi1161
    @venkataraobagadi1161 3 года назад +1

    గురువుగారూ నమస్సులు.చాలాబాగావివరించారు.ఒకటిశృతిలోలాలిత్యంగా ఆలపించివినిపించారు.ధన్యవాదాలు

  • @ramchander.chintha.6880
    @ramchander.chintha.6880 3 года назад +1

    Master garu kalyani raga visleshana chela chakkaga Abhimanulaku andicharu meeku dhanyvadamulu

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు రామచందర్ గారు.

  • @ssnreddy8547
    @ssnreddy8547 Год назад +1

    గురువు గారు మీకు మీరే సాటి
    ఓం నమః శివాయ

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు నమస్కారములు

  • @satyailla3624
    @satyailla3624 2 года назад +1

    నమస్కారం గురువు గారు చాలా బాగా పాడుతూ వాయిస్తున్నారు ఇది చాలా మంది నేర్చుకోవడానికి ఉపయోగపడతుంది

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      చాలా సంతోషం. ధన్యవాదములు

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 2 года назад +1

    సార్ చక్కగా పాడారు కీబోర్డ్ చక్కగా వాయించుచున్నారు నమస్కారములుమీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు🙏🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      ధన్యవాదములు రామ్నాథ్ గారు
      🙏🙏🙏

    • @ramnathraodkp8219
      @ramnathraodkp8219 Год назад

      @@BhakthiGeethanjali 🙏🙏🤝🤝

  • @palurisuryachandrarao4884
    @palurisuryachandrarao4884 3 года назад +2

    Excellent naration sir. 🎉🎉🎉🎉

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు సూర్యచంద్ర రావు గారు.

  • @irmurtyirm3806
    @irmurtyirm3806 Год назад +1

    రమేష్ బాబుగారు!మీ రాగవాణి కార్యక్రమాలు బాగున్నాయి.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      ధన్యవాదములు ఐ ఆర్ మూర్తి గారు🙏

  • @damininaidu6059
    @damininaidu6059 2 года назад +1

    Very simplified, useful for learners "Guruvugaru'... G D Naidu

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు దామినీ నాయుడు గారు.

  • @baburaokolakani3707
    @baburaokolakani3707 2 года назад +1

    చాల బాగుంది గంగాధర్ garu

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      నమస్కారములు సర్.
      నా పేరు రమేష్ బాబు శీపాన.

  • @naninani1532
    @naninani1532 3 года назад +2

    👏👏👏👏👏👏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు నాని గారు.

  • @gurubodhasadguruadisivasad7927
    @gurubodhasadguruadisivasad7927 2 года назад +1

    మహఅద్బుతం మాష్టార్ నీ కళ

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు సద్గురు ఆదిశివ గారు.

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 3 года назад +2

    NAMASKARAM SIR

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад +1

      ధన్యవాదములు మునగంటి చెంచయ్యాచారి గారు.

  • @nbrmurthy2606
    @nbrmurthy2606 Год назад +1

    చాలా అద్భుతంగా ఉన్నాయి

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      ధన్యవాదములు యన్ బి ఆర్ మూర్తి గారు🙏

  • @duryodhanaraokaviti5473
    @duryodhanaraokaviti5473 3 года назад +2

    Excellent 🙏

  • @krishnaraosevva638
    @krishnaraosevva638 2 года назад +1

    Sir,Very happy to hear.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు కృష్ణారావు గారు.

  • @hanumanthaiahv3419
    @hanumanthaiahv3419 2 года назад +1

    Beautiful explanation. Thank you Sir.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు హనుమంతయ్య గారు.
      🙏🙏🙏

  • @GreenGSRao
    @GreenGSRao 2 года назад +1

    చాలా బాగుంది మీ కంఠం.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు శ్రీనివాస్ గారు.

  • @balaiahega8203
    @balaiahega8203 2 года назад +1

    Wonderful sir thank you

  • @basaveswararaoyarasu5883
    @basaveswararaoyarasu5883 3 года назад +1

    చాలా బాగుంది గురువుగారు

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు బసవేశ్వరరావు గారు.

  • @SVRembroiderysolutions1414
    @SVRembroiderysolutions1414 3 года назад +1

    మీ గాత్రం చాలా బాగున్నది గురువుగారు

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు రాజేశ్వరాచార్యులు గారు.
      🙏🙏🙏

  • @ssnreddy8547
    @ssnreddy8547 2 года назад +1

    జైశ్రీమన్నారాయణ

  • @naveenk2598
    @naveenk2598 3 года назад +2

    👏👏👏

  • @Prradeep_vidapanakal
    @Prradeep_vidapanakal 2 года назад +1

    EXCELLENT SIR ! GREAT EFFORT ! VERY VERY USEFUL ! TYSM !

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు ప్రదీప్ చంద్ర గారు🙏

  • @mylifetowardsmusic1769
    @mylifetowardsmusic1769 3 года назад +2

    Thank you sir. 🙏🙏🙏. Very useful work👌👌👌

  • @sarmadevarakonda9099
    @sarmadevarakonda9099 3 года назад +1

    నమస్కారమండీ. ధన్యవాదాలు సర్.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      దేవరకొండ శర్మ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు.
      🙏🙏🙏

  • @godavarinaidukarri9439
    @godavarinaidukarri9439 2 года назад +1

    So nice 🙏

  • @trinadhudu
    @trinadhudu 3 года назад +1

    ధన్యవాదాలు..

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      సంతోషం త్రినాథుడు గారు.

  • @ramamunnireddynagireddy2700
    @ramamunnireddynagireddy2700 2 года назад +1

    Supper sir

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు రామమునిరెడ్డి గారు.
      🙏🙏🙏

  • @akalyan4674
    @akalyan4674 3 года назад +1

    మివాయిస్ చాల బాగుంది సార్

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      చాలా సంతోషం కళ్యాణ్ గారు.

  • @gazettedlibrarian4589
    @gazettedlibrarian4589 3 года назад +1

    Very good explanation

  • @deshapatisrinivas6206
    @deshapatisrinivas6206 3 года назад +1

    చాలా మధురం గా వివరించారు... పాడారు...నమస్సులు

  • @VenkataRamana-rv7kj
    @VenkataRamana-rv7kj 3 года назад +1

    🙏🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు వెంకట రమణ గారు. 🙏

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 3 года назад +1

    Nice lesson,Thanks Sir.

  • @bhasakararao5459
    @bhasakararao5459 2 года назад +1

    14,17,18, ఈపాటలకు ,గానంచేస్తూ వాయించడం చాలా గోప్పతనం గురువుగారు ధన్యవాదములు🙏🏼🙏🏼🙏🏼

  • @jyothipastula3385
    @jyothipastula3385 2 года назад +1

    🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад +1

      ధన్యవాదములమ్మా జ్యోతి గారు 🙏

  • @gvramachandraiah9762
    @gvramachandraiah9762 2 года назад +2

    Excellent sir please send songs with notation and I have to be a good friend of my friends for a good news of your life always be happy to deliver it

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు రామచంద్రయ్య గారు. 🙏

  • @mangalinaganna9623
    @mangalinaganna9623 2 года назад +1

    మధ్యమావతి, రేవతి, రాగలపై మంచి వీడియోస్ చేయగలరు అని మనవి చేస్తున్నాం

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      త్వరలో చేద్దాం నాగన్న గారు

  • @srinnuvasreddy7873
    @srinnuvasreddy7873 8 месяцев назад +1

    Sudhasavery Ragam gurinchi Video cheyagalarani Request

  • @saliramulu1296
    @saliramulu1296 3 года назад +1

    🌷🌷👏👏👌👌🙏🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు రాములు గారు

  • @gopalarao2279
    @gopalarao2279 2 года назад +1

    Master జీ కల్యాణి రాగం లో మంచి medley songs upload చేయగలరు అని మా కోరిక

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      థాంక్యూ అలాగే గోపాల రావు గారు

  • @k.srinivasamurthy6713
    @k.srinivasamurthy6713 3 года назад +1

    Vandanrgslu masterji kallani rag this is alldram and picture first rag

  • @palurisuryachandrarao4884
    @palurisuryachandrarao4884 3 года назад +2

    Sir,
    raaga chchaya, janta swaralu, songs nu print teesukovadaaniki pdf umte upload cheyamdi sir

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад +1

      Description లో ఉంది. చూసుకొని కాపీ చేసుకోండి.

  • @chandrasekhar5721
    @chandrasekhar5721 3 года назад +2

    Kanada ragam swara chaya cheppandi sir

  • @SVRembroiderysolutions1414
    @SVRembroiderysolutions1414 3 года назад +2

    గురువు గారు నాలుగు వేళ్లతో నేర్చుకుంటే మంచిదా లేక ఐదు వేళ్ళ తో నేర్చుకుంటే మంచిదా దయచేసి చెప్పగలరు

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад +1

      నాకైతే మా గుపువు గారు నాలుగు వ్రేళ్లు తోనే నేర్పారు. అలాగైతే సరిపోతుందని నా అభిప్రాయం.

    • @SVRembroiderysolutions1414
      @SVRembroiderysolutions1414 3 года назад

      ధన్యవాదములు గురువుగారు

  • @duggiralavijaya4283
    @duggiralavijaya4283 Год назад +2

    గ్రూప్ గానెర్పించండి లాప్ టాప్లో నెర్చుకుంటాము

  • @sudhakarkasipeta9622
    @sudhakarkasipeta9622 3 года назад +1

    Sri gananatham bhajamyaham swaralu leeboard pyna cheppandi guru garu

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ఫోన్ చేయండి సుధాకర్ గారు🙏

  • @kbrao7174
    @kbrao7174 3 года назад +1

    Class entho bagundi.....

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు భాగీరథి రావు గారు.

  • @svrb2005
    @svrb2005 2 года назад +1

    Namaskaram Guruvu Garu. Really excellent presentation sir. Talaninda Poodhanda Daalchina Raani expect chesaanu. Meeru ekkada untaaru sir. I would like to learn keyboard from you sir. Please help me sir. I already play little Flute, Keyboard, Harmonium for Satya Sai Bhajans) sir. But I lack Raagaalaaapana, bits etc. sir. I need your guidance sir, if possible.
    🙏🙏🙏🙏🙏

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు సర్.
      విశాఖ పట్నం లో ఉంటున్నాను.
      ఫోన్ 9949124221

  • @gollarangadas2219
    @gollarangadas2219 Год назад +1

    Sir srutimaku 2/1/2 lo cheppandi. Sir

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      ఏ శృతిలో నుంచైనా షడ్యమాన్ని తీసుకొని అక్కడి నుండి మెట్లు లెక్కపెట్టుకొని ప్రాక్టీస్ చేయవచ్చమ్మా

  • @duggiralavijaya4283
    @duggiralavijaya4283 Год назад +2

    గురువుగారు హర్మనుయం నెర్పించండి

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      సమయం కుదరటం లేదమ్మా, చూద్దాం.

  • @mylifetowardsmusic1769
    @mylifetowardsmusic1769 3 года назад +1

    Please post yamuna kalyaan raagam.

  • @490yogeeswar2
    @490yogeeswar2 3 года назад +1

    Paniki raani vedios ki millions lo like but ilanti vediolaki kaneesam velalo kooda ravu

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      మీ మనసును ఆనందపరిచే వీడియోను అందించినందుకు సంతోషిస్తూ మీకు ధన్యవాదములు యోగీశ్వర్ గారు.

  • @srinivasaraovuyyala8693
    @srinivasaraovuyyala8693 Год назад +1

    మేచ కళ్యాణి రాగం పెట్టగలరు

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  Год назад

      కళ్యాణి రాగాన్నే కటపయాది సంఖ్య 65 రావడం కోసం ముందున మేచ తగిలించి మేచ కళ్యాణి గా వ్యవహరిస్తారు. కళ్యాణి అన్నా మేచ కళ్యాణి అన్నా ఒకటే శ్రీనివాస్ గారు.

  • @besivenkatrao1587
    @besivenkatrao1587 2 года назад +1

    గురువు గారు నేను పాటను వాయించ గలను.కాని పాట వాయించే ముందు ఆ రాగం రాగఛ్ఛాయ చూపించ లేకపోతున్నాను. బిట్ వర్క్ గూర్చి చెబుతారని ఆశిస్తున్నాను.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ఫోన్ చేయండి వెంకటరావు గారు

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 Год назад +1

    Excellent

  • @ramanamurthychinthada2778
    @ramanamurthychinthada2778 3 года назад +2

    Super

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు బావ గారు
      🙏🙏🙏

  • @hanumanthaiahv3419
    @hanumanthaiahv3419 2 года назад +1

    Beautiful explanation. Thank you Sir.

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు హనుమంతయ్య గారు.
      🙏🙏🙏

  • @eswararao5133
    @eswararao5133 2 года назад +1

    Excellent sir

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  2 года назад

      ధన్యవాదములు ఈశ్వర రావు గారు.

  • @VidyanandaChary
    @VidyanandaChary 2 года назад +1

    Super Sir

  • @chidusarvardhapu5705
    @chidusarvardhapu5705 2 года назад +1

    🙏🙏🙏🙏

  • @SantoshKumar-zo9fj
    @SantoshKumar-zo9fj 3 года назад +2

    Super

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు సంతోష్ గారు

  • @badadatirupathi8798
    @badadatirupathi8798 3 года назад +1

    Super

    • @BhakthiGeethanjali
      @BhakthiGeethanjali  3 года назад

      ధన్యవాదములు తిరుపతి రావు గారు
      🙏🙏🙏