సివికే మల్టీస్పెషల్టి హాస్పిటల్ అతి తక్కువ ఖర్చుతో పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చింది

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #news #telangana #hyderabad #india #khammam #mulugu #venkatapuram #congress #cpi #bhakti #health #hospital ‪@newsworldtelugu19‬
    ఖమ్మం నగరంలోని ఖానాపురం కరెంట్ ఆఫీస్ ఎదురుగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు సివికే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. సివికే ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అతి తక్కువ ధరలో లభిస్తాయని ఆస్పత్రి చైర్మన్ స్నేహ తెలిపారు. ఖమ్మం నగర ప్రజలు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ విజయవాడ వంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఇప్పుడు అటువంటి మెరుగైన వైద్యం సివికే ఆసుపత్రి నందు లభిస్తుందని సూచించారు. మల్టీ స్పెషాలిటీ అంటే ఖమ్మం నగరంలోని పలు ఆసుపత్రులు దంత వైద్యశాలను మినహాయించే వారని కానీ సివికే ఆసుపత్రి నందు దంత వైద్యశాల కూడా అందుబాటులో ఉందని అన్నారు. ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చేవారు వివిధ ఆరోగ్య పరీక్షల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్ని సౌకర్యాలు సివికే ఆసుపత్రి నందు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ఖమ్మం నగరంలోని ఆసుపత్రులన్నీ కేవలం వైరా రోడ్డుకే పరిమితమయ్యాయని, రఘునాథపాలెం కోయచిలక రేకల చిలక ముచ్చర్ల వంటి ప్రాంతాలకు ఆసుపత్రులు దూరంగా ఉన్నాయని ఉద్దేశంతో సివికే ఆసుపత్రిని ఖానాపురంలో ఏర్పాటు చేశామని వైద్యులు విజయకుమార్ తెలిపారు.

Комментарии • 3