గురుదేవుళ్ళు... పాట
HTML-код
- Опубликовано: 10 фев 2025
- 🌹గురుదేవుళ్ళు🌹
----------------------------
విద్యాలయ దేవుళ్ళకు
అభినందన చందనాలు!
జ్ఞానమిచ్చు గురువులకు
కృతజ్ఞతా వందనాలు!!
//విద్యాలయ...//
పిల్లలనే మొక్కలను
ప్రేమ పంచి పెంచుతారు!
అజ్ఞానపు చీకట్లను
అవని నుండి తరుముతారు!!
//విద్యాలయ...//
చదువుసంధ్యలే గాదు
సంస్కారము నేర్పుతారు!
నీతిరీతి బోధిస్తూ
జీవితాలె దిద్దుతారు!!
//విద్యాలయ...//
క్రమశిక్షణ విషయంలో
కఠినత్వం చూపుతారు!
విద్యార్థుల బ్రతుకులలో
వెలుగులనే నింపుతారు!!
//విద్యాలయ...//
విద్యార్థుల భవిష్యత్తే
ధ్యేయంగా సాగుతారు!
దానవతను మరిపిస్తూ
మానవతను పెంచుతారు!!
//విద్యాలయ...//
నియంతృత్వ ధోరణులను
ఆదిలోనె త్రుంచుతారు!
ఐకమత్య విలువలను
పిల్లల్లో నిలుపుతారు!!
//విద్యాలయ...//
✍️ డాక్టర్ వెలుదండ వేంకటేశ్వరరావు.
Sorry....మ్యూజిక్ కు పాడే విధానానికి సింక్ కాలేదు. సాహిత్యం బాగుంది. సింగర్ గొంతు బాగుంది. కాని మ్యూజిక్ ట్రాక్ బాగాలేదు