అడవిలో పురాతన పుణ్యక్షేత్రం 'వనేశ్వర కోన' lankala forest | vaneswarakona | siddavatam | kadapa

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • మన కడప జిల్లాలోనే సిద్దవటం ప్రాంతం అతి పురాతనమైనది. ఒకప్పటి సిద్దవట సీమగా రాజ్యపాలన ఇక్కడి నుండి జరిగేది. చాలాకాలం వరకు కడప ప్రాంతానికి జిల్లా కేంద్రంగా సిద్దవటం ఉండేది. ఆధ్యాత్మికంగా ఎంతో ఆవశ్యకతని సంతరించుకున్న ఈ ప్రాంతం, అటు చారిత్రక అంశాలతో పురాతన కోటలు, ఆలయాలు, రాజరికపు ఆనవాళ్లు అణువువలనా మనకు కనిపిస్తాయి. ఎందరో రాజులు, రాజ్యాలు, దండయాత్రలు, యుద్దాల చరిత్రతో నిండి, రాజుల వైభవాన్ని తెలిపే విధంగా నిర్మించబడిన ఆలయాలు ఇక్కడ అనేకం,
    విస్తారంగా విస్తరించిన లంకమల అడవులలో నిర్మించిన పురాతన ఆలయాలు నాడు విశేషమైన పూజలు అందుకుంటున్నాయి.. వాటిలో నిత్య పూజ కోన, కపర్తీస్వర కోన, గోపాలస్వామి కొండ. లంకమల్లెస్వర స్వామి ఆలయాలు ప్రధానమైనవి.
    ఇవే కాకుండా చాలామందికి తెలియని మరెన్నో ఆలయాలు కూడా మనకి దర్శనం ఇస్తాయి. అలాంటి ఆలయాలలో ఎంతో విశిష్టత కలిగి, చారిత్రక నేపధ్యం కలిగిన పురాతన ఆలయం వనేస్వర కోన.
    ఈ వనేస్వర కోన కడప నుండి 34కిలోమీటర్ల దూరంలో సిద్దవటం మండలంలోని జ్యోతి, గొల్లపల్లి, పొన్నవోలు గ్రామాల సమీపంలో జ్యోతి సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి వాయువ్యంగా నిత్యపూజస్వామి కొనకి నైరుతి దిశలో, దట్టమైన లంకమల అరణ్యంలో పచ్చని పొదలు ఎత్తైన వృక్షాల మద్య అద్భుతంగా నిర్మించబడింది. ఇక్కడికి వెళ్ళాలంటే పెద్ద సాహసం చేయాల్సిందే , ఎత్తైన మార్గాలలో చుట్టూ పొదలతో అలుముకుని ఉంటుంది,
    కృతయుగంలో వశిష్ట మహర్షుల వారు ఈ ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాలు ఆ పరమశివుడు కోసం తపస్సు చేశాడని.. ఆ క్రమంలో ఇక్కడి లింగాన్ని ప్రతిష్టించాడని. పచ్చని చెట్లు పండ్ల తోటలు, పూల వనాలతో నిండి వుండటం వలన ఈ ప్రాంతానికి వనేస్వర క్షేత్రం, వనేస్వర కొనగా పేరు వచ్చిందని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తూ ఉంది
    ఆలయ నిర్మాణం విషయానికి వస్తే ఈ ప్రాంతం చోళ సామ్రాజ్యంలో రేనాటి చోల్లుల పరిపాలనలో ఉండేదని, అలాగే కరికాల చోళుడు మన దక్షిణ భారతదేశంలో అనేకమైన ఆలయాలని నిర్మించారని చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చును. అప్పట్లో చోళులు ప్రధానంగా భైరవరాదణ చేస్తూ ఉండేవారు, ఈ ఆలయం కూడా చోళుల కాలంలో నిర్మించబడిందని ఇక్కడున్న కాలభైరవ విగ్రహం ద్వారా మనం తెలుసుకోవచ్చు..
    ఆ తరువాత రాష్ట్ర కూటులు, వైదుంబులు. కాకతీయులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయ అభివృద్దిలో ప్రధాన పాత్ర పోషించారని. చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు
    ఈ ఆలయం కింద1000 స్క్వయర్ యార్డ్ భూభాగం కూడా ఉందని బ్రిటీష్ గెజిట్ రికార్డ్స్ లలో నమోదు చేయబడింది.
    ఈ వనేస్వర ఆలయం దట్టమైన ఈ అడవి చెట్ల మద్య మనకి కనిపిస్తుంది.
    మొదటగా శిదిలమైన మెట్ల మార్గం ద్వారా లోపలి వెళ్తే , శిదిలావ్యస్థలోని పురాతన ఆలయం మనకి కనిపిస్తుంది.
    ఆలయం లోపల చూసినట్లయితే అపరిశుభ్రమైన పరిసరాలతో నిండి ఉంది. అప్పట్లో వశిష్ట మహర్షి ఈ లింగాన్ని ప్రతిష్టించినట్లు. అలాగే సీతారాములు ఈ లింగానికి పూజలు చేసినట్లు పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అక్కడ నుండి కొద్ది గా బయటకి రాగానే గోడకి ఆనుకుని ఉన్న అమ్మవారి విగ్రహం మనం చూడవచ్చు. ఈ విగ్రహం నేడు పూర్తిగా శిథిలమై ఉంది. అక్కడ నుండి బయటకి రాగానే ఆలయానికి ఎడమ వైపు జతలు విప్పుకుని కూరలతో అతి భయంకరంగా ఉండే కాల భైరవ స్వరూపం విగ్రహ రూపంలో ఉంది. కాలభైరవుడికి చీరలు చుట్టి పసుపు కుంకుమలతో పూజలు చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే గుడికి ఇరు వైపులా నిధి నిక్షేపాల వెతుకులాటలో దుండగులు తవ్విన లోతైన గుంతలు ఇక్కడ ఉన్నాయి. జనావాసానికి దూరంలో ఈ ఆలయాన్ని నిర్మించిన అప్పటి రాజుల వైభవాన్ని తెలిపే విధంగా ఆలయ గోపురంపై విగ్రహాలు అందమైన శిల్పాలు శిథిలమై మనకి దర్శనమిస్తున్నాయి.
    ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రహరి గోడ ఉన్నట్లు అది నేడు శిదిలమైనట్లు ఆనవాళ్ళు మనం గుర్తించవచ్చు .
    ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ దట్టమైన చెట్లు అటవీ జంతువుల అలికిడితో నిండి ఉంటుంది.
    ఒకప్పుడు ఇక్కడి దగ్గరి గ్రామాలైన జ్యోతి గొల్లపల్లి, పొన్నవోలు చలమా రెడ్డి కొట్టాల గ్రామ ప్రజలు సోమవారాలు, కార్తీక మాసం, శివరాత్రి వంటి పర్వదినాలలో స్వామివారికి పూజలు చేసేవారిని ప్రస్తుతం స్వామివారికి ఆమాత్రం పూజా కార్యక్రమాలు కూడా కరువయ్యాయని స్థానికులు చెపుతున్నారు. అంతే కాకుండా ఇక్కడి నుండి ముందుకు వెల్తే పెద్ద జలపాతం కూడా మనకి దర్శనమిస్తుంది.
    ఇక్కడ ఈ ఒక్క ఆలయం మాత్రమే కాకుండా అనేకమైన ఆలయాలతో పాటు, అదృశ్య నగరం ఆనవాళ్లు కూడా ఉండే అవకాశం ఉండొచ్చని పరిశోధకులు చెపుతున్నారు.
    అందమైన ఈ వాతావరణం అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడున్న కొలను ఎల్లప్పుడూ కలవ పూలతో నిండి చల్లని నీళ్ళతో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. చుట్టూ ఉండే జంతు జాలానికి ఈ నీరే ఆధారం.
    ఈ కోనేరు చుట్టూ కూడా పెద్ద పెద్ద తెల్ల మద్ది చెట్లు, కొండ మాదిది, నేరేడు, కొండ ఈత వంటి చెట్లున్నాయి. అటవీ శాక అధికారులు ఇక్కడ నిర్మించిన వాచ్ టవర్ ఇక్కడ ఉంది.
    ఆధ్యాత్మికంగా, ఆహ్లాదకరంగా ఆకట్టుకునే ఇలాంటి అందమైన, ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు మన ప్రాచీన సంపద. అలాంటి ఆలయాలు నేడు ఇలా ప్రకృతిలో మమేకమై కనుమరుగవకముందే అధికారులు గుర్తించి సంరక్షించే బాధ్యతని తీసుకుంటారని భావిస్తూ మరొక వేదియో తో మీ ముందుకు వస్తాను..

Комментарии • 9

  • @PogadathotiBanni
    @PogadathotiBanni 3 месяца назад +2

    Super🎉🎉🎉🎉🎉❤❤

  • @madapurumuneiah
    @madapurumuneiah 3 месяца назад +2

    Good information.🎉🎉
    All the best

  • @Jaihindustan17
    @Jaihindustan17 3 месяца назад +3

    AP GOVERNMENT NEED TO INCREASE TOURISM TO THIS SPOT AS IT IS HISTORICAL EVIDENCE

  • @mutyalapandu-b5l
    @mutyalapandu-b5l 3 месяца назад +1

    Sir, how to reach this place from cudapah, any auto facility available from kadapah advise me

    • @Kadapareporter
      @Kadapareporter  3 месяца назад +1

      కడప నుండి సిద్ధవటం చేరుకుని. అక్కడనుండి 9 కిలోమీటర్ల దూరంలో గొల్లపల్లికి ఆటో సౌకర్యం ఉంటుంది. అక్కడనుండి అడవిలో నడక మార్గం ద్వారా ఈ వణేశ్వరం చేరుకోవచ్చు..
      ఈ ప్రదేశం గురించి తెలిసిన వాళ్ళతో పాటు వెళ్ళగలరు. వన్యప్రాణులు, క్రూరజంతువులకు సంచరిస్తూ ఉంటాయి.

    • @mutyalapandu-b5l
      @mutyalapandu-b5l 3 месяца назад +1

      @@Kadapareporter thank you, valuable reply

    • @mutyalapandu-b5l
      @mutyalapandu-b5l 3 месяца назад +1

      ​@@Kadapareporterany arrangements available at mahashivaratri festival

    • @Kadapareporter
      @Kadapareporter  3 месяца назад

      @@mutyalapandu-b5lఒకప్పుడు భక్తులు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరగట్లేదు

    • @mutyalapandu-b5l
      @mutyalapandu-b5l 3 месяца назад +1

      @@Kadapareporter thank you