ఆండాళ్ తిరుప్పావై పాశురం 24 | Andal Thiruppavai Pasuram 24 || HG Pranavananda Prabhu

Поделиться
HTML-код
  • Опубликовано: 3 ноя 2024

Комментарии • 54

  • @PranavanandaDas
    @PranavanandaDas  10 месяцев назад +4

    1. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి భగవంతుడి యొక్క ఏ ఏ లీలలను గుర్తుచేస్తుంది?
    2. "విశేష ధర్మం" అంటే ఏమిటి?
    3. బండి రూపంలో ఉన్న అసురుడి పేరు ఏమిటి?
    4. శకటము యొక్క రెండు చక్రాలను దేనితో పోల్చారు?
    5. కపిత్తాసురుడు మరియు వత్సాసురుడు దేన్ని సూచిస్తున్నారు?
    1. In this pasuram, Andal reminds of which all pastimes of Lord?
    2. What is "Vishesha dharmam"?
    3. What is the name of the Asura, who is in the form of a chariot?
    4. To what are the two cycles of shakatam compared?
    5. Kapittasura and Vatsasura refer to whom?

    • @savithrib9550
      @savithrib9550 10 месяцев назад

      Shakatamu yokka rendu chakralu sanchithamu ,aagami anedi manakharmalu

    • @satayavathikatakam7670
      @satayavathikatakam7670 10 месяцев назад

      హరే కృష్ణ ప్రభూజీ 1).వామన,శ్రీరామ్,శ్రీకృష్ణుడుయెక్క లీలలను.
      2).ధర్మాన్ని పాటించి భగవంతుని చేరుకోవటం.
      3).శకటాసురుడు .
      4).పుణ్య,పాపాలతో పోల్చారు.
      5).వాసన,రుచి.

    • @pandurangarao3510
      @pandurangarao3510 9 месяцев назад

      1.Vamana Leela, RamaLeela, Krishna Leelalu.
      2. Dharmanni kuda vadili Krishnudanu ashrayincham Vishesha Dharmam.
      3. Shakatasurudu.
      4. Papa punyalato polcharu.

    • @pandurangarao3510
      @pandurangarao3510 9 месяцев назад

      5. Vasana , ruchi.
      Hare krishna prabhuji pranamalu

  • @vsh.vijayalakhsmi1961
    @vsh.vijayalakhsmi1961 10 месяцев назад

    Harekrishna prabhu pranamalu 🙏🙏🙏🌹

  • @SivaPoojithaRadha369
    @SivaPoojithaRadha369 10 месяцев назад

    Hare Krishna Prabhuji Dandvath Pranam 🙇‍♀️ 🙏

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 10 месяцев назад

    Hare Krishna prabhu ji. Nenu. Chala. Vishayalu nerchukunttunnanu 🙏🙏

  • @induamarreddy3216
    @induamarreddy3216 10 месяцев назад

    1.వామన అవతార లీల,రావణాసుర వధ లీల,శకటాసుర భంజన లీల,వత్సాసుర సంహారలీల,కాళీయ మర్దన లీల
    2.మనకు ధర్మానికి వ్యతిరేక మైన వాళ్ళు ఉన్న సరే మనం ధర్మం గురించి తెలుసుకొని నిజమైన ధర్మాన్ని ఆచరించాలి.
    3.శకటాసురుడు
    4.పుణ్యం,పాపం
    5.వాసన,రుచిని సూచిస్తున్నారు.
    ఎంత బాగా చెప్పారు ప్రభూజి 🙏🙏🙏🌺🌺🙇🙇🙇

  • @lavanyakothapally8502
    @lavanyakothapally8502 10 месяцев назад

    Hare Krishna prabhuji 🙏🙏
    Dandavat pranam🙇‍♀️
    1.vamana avataram, Rama avataram, shakatasura bhanjana Leela, vatsasura & kapittasura vadha,goverdhana Leela.
    2.pedhalu dharmam vyatirekamaina alochanalu manapai rasinapudu Bhagavanthuni margam lo nadavatam.
    3.shakatasura
    4.punyam,papam
    5.smell and taste
    Hare Krishna 🙏 🙏

  • @SivaPoojithaRadha369
    @SivaPoojithaRadha369 10 месяцев назад

    Thank You So Much Prabhuji For Detail Explination Of Lord Sri Krishna Bagavan Divine Lotus Feet 🌹🪔👣👣🪔🌹Lots Of Dandvath Pranams To U Prabhuji 🙇‍♀️🙇‍♀️🙇‍♀️All Glories To Srila Prabhupada And Our Beloved Spiritual Gurudev 🙇‍♀️🪔👣👣🪔🙏🚩❤️

  • @ksrsudha7698
    @ksrsudha7698 9 месяцев назад

    hare Krishna pranamalu prabhuji garu
    1a.shatakasura banjana,vathchasura,kappithasura lila,bramha vimochana lila, govardhana lila
    2a.dharma margamulo nadushth bhagavanthuni cherukovadam veshesha dharmamu
    3a.shatakasurudu
    4a.punyam,papam
    5a.vashana,ruchi

  • @chshirisha1890
    @chshirisha1890 10 месяцев назад

    Hare Krishna prabhuji 🙏
    1. Shakatasura,Vruthhasura, Govardhana Leela
    2. Dharamaniki viruddhanga evvaru cheppina (parents, teachers) cheyyakunda undatame vishesha dharman
    3. Shakatasurudu
    4 Punyam,Papam
    5. Ruchi,Vasana(Smell) 🙏🙏🙏

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 10 месяцев назад

    1.vamana,sri Rama,Govardhan,sakatasura,kapithasura,vastasuru leelalu
    2.dharmamu vythirekamina ppudu vishesa darmamu patinchali
    3.sakatasurudu
    4.sakatamu ante oka Bandi
    Punyamu,papamu
    5.ruchi,vasana
    Hare Krishna prabhuji🙏🙏

  • @alivelusharath7706
    @alivelusharath7706 10 месяцев назад

    here Krishna hare Krishna prabuji

  • @Chanda.Sandhya
    @Chanda.Sandhya 10 месяцев назад

    Hare Krishna Prabhuji 🙏
    Pranamalu 🙏🙏
    1.Vamana, Ramachandra,
    Sakatasura, vathsasura,
    Kapithasura, Govardhana
    leelalu
    2. Samanya dharmanni vidichi
    petty bhagavanthudi yokka
    saranagathiloki ravadanni
    vishesha dharmam antaru.
    3. Sakatasura
    4. Papam punyam
    5. Vasana ruchi.🙏🙏🙏

  • @tkalpana6897
    @tkalpana6897 10 месяцев назад

    Hare Krishna

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 10 месяцев назад

    Hare Krishna Prabhuji
    1. Vamana deva lila, Rama lila, sakatasura lila,vasthasura lila kapithasura lila, Govardhan lila.
    2. Bhagavanthudu ni sharanam vedadam me vishesha dharmam.
    3. Sakatasurudu.
    4. Punyam, papam.
    5. Vasana, ruci.

  • @sivach4048
    @sivach4048 10 месяцев назад

    హరేకృష్ణ గురుజీ 🙏
    1.వామన,కృష్ణ, రాములు వారి యొక్క లీలలు
    2.భగవంతుడు చేరటం మే విశేషధర్మం
    3. శకటాసురుడు
    4.పుణ్యం, పాపం
    5.వాసన,రుచి
    హరేకృష్ణ గురుజీ 🙏

  • @suryako152
    @suryako152 9 месяцев назад

    Omnamashivaya

  • @Swarna963
    @Swarna963 10 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 10 месяцев назад

    Hare Krishna prabhuji 👣 🌹 🙏 nenu roju e pasuram chadavacha

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 10 месяцев назад

    1. ఈ శ్లోకం ఎంతో అద్భుతమైన పాశురం. ఈ పాశురం లో ఒక్కొక్క పాదంలో ఆండాళ్ తల్లి స్వామి శ్రీ చరణాలకు మంగళం కలుగుగాక అని కీర్తిస్తుంది. నిన్నటి రోజున అయ్యా సింహంలా లేచి
    మా దగ్గరకు రా అంటే కృష్ణుడు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. " అసతీ
    పుష్ప సంకాసం హార నూపుర శోభితం రత్న కంకణ ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం". పువ్వుల కోమలమైన శరీరం
    కలిగిన వాడివి ప్రేమతో మా దగ్గరకు రా అని ఆండాళ్ తల్లి పిలుస్తుంది. ఆ సుకుమార మైన పాదాలతో భగవంతుడు అలా అలా నడుచుకుంటూ వస్తుంటే ఎర్రగా ఉన్న స్వామి పాదాలను చూసి అయ్యో మా కోసం కమిలిపోయాయా నీ
    పాదాలు అని. భక్తుల కోసం భగవంతుడు పిలవగానే పరుగెడతాడు. ఎక్కడ ఎవరు భక్తుడు పిలిచిన భగవంతుడు పరిగెడుతూ ఉంటాడు. అందుకే నీ శ్రీ పాదాలు మొత్తం కమిలిపోయాయి. కమిలిపోయిన పాదాలు
    అని వీళ్ళ యొక్కభావన. భగవంతుడికి
    అటువంటి వేమి ఉండవు. భగవద్ భక్తుల భావన అలా ఉంటుంది. ఆండాళ్ తల్లి గోష్టి అనుకుంటున్నారు. చక్కగా మంగళహారతి ఇచ్చి మంగళం పాడుదాం
    అని ఎవరికీ అంటే శ్రీ క్రిష్ణుడు కి.ఎటువంటి శ్రీ క్రిష్ణుడు కి ఆరోజు మొత్తం ఈ లోకాన్ని అంతా కూడా నీ శ్రీ పాదముల చేత కొలిచిన వాడివి అయ్యా ఇప్పుడు మేము ఆ పాదాలకు మంగళం పాడుతున్నాము.
    1ఆరోజు అన్ని లోకములూ కూడా ఆ శ్రీ పాదాన్ని జాపి కొలిచిన పాదానికి మంగళం పాడుదాం. రెండవ పాదంలో రామచంద్రుడి గా అరణ్యం అంతా నడిచి వచ్చి
    రావణాసురుని అణచిన పాదాలకు మంగళం పాడుదాం. 3 పాదం లో శకటాసురుడు అనే రాక్షసుడు ని భగవంతుడి యొక్క శ్రీ పాదంతో తన్ని
    సంహరించిన పాదానికి మనం మంగళం పాడుదాం. 4 వ పాదం లో వత్సాసురుడిని చుట్టూరా తిప్పడానికి తన కాలుని వంచి
    సంహరిచాడు. అటువంటి వంచిన పాదానికి మంగళం పాడుదాం . 5 వ పాదంలో గోవర్ధనగిరిని చిటికెన వేలు తో ఎత్తినప్పుడు భూమిపైన గట్టిగా ఆంచిన పాదానికి మంగళం పాడుదాం. 1జాపిన
    పాదానికి 2. అణిచిన పాదం 3 తన్నిన పాదం 4 వంచిన పాదానికి 5. ఆంచిన పాదానికి మంగళం. అని ఎంతో సుందరమైన శ్లోకంలో ఎంతో భక్తి పూర్వకమైన ప్రేమ కలిగిన వాళ్ళు ఎలా భగవంతుడిని స్మరిస్తారు అనే విషయాన్ని
    ఆండాళ్ తల్లి మనకు ఈరోజు ఉపదేశం చేస్తుంది. మొదటిగా ఏమంటుంది అంటే
    దేవతల్ని కాపాడటానికి ఆ పాదాన్ని అలా పెంచినప్పుడు నీ పాదం ఎంతో కమిలి
    పోయింది. తర్వాత గోలోకాలన్నీ కూడా
    కొలిచారు. ఆతర్వాత పై లోకాలన్నీ కొలిచారు. ఆ తర్వాత బలి శిరస్సు పైన తన పాదాన్ని మోపారు. బ్రహ్మ కడిగిన పాదము బలి తల మోపిన పాదము అటువంటి పాదానికి మంగళం పాడుదాం అంటుంది. బలి అంటే బలం కలిగిన వాడు
    గుణి అంటే గుణాలు కలిగిన వాడు చక్రి అంటే చక్రాన్ని కలిగిన వాడు. శంఖీ అంటే శంఖం కలిగిన వాడు. బలి అంటే బలం కలిగిన వాడు అహంకారం కలిగిన వాడు.
    ఏమిటి అహంకారం అంటే నేను ఇవ్వని వస్తువు అంటూ లేదు. నేను ఎవరు ఏది అడిగినా సరే అది ఇచ్చేస్తాను అనే అహంకారం ఉంది ట. మనం కూడా నేను ఏదైనా చేయగలను నన్ను మించిన వాడు ఈ లోకంలో లేడు అంటూంటారు కదా కొంత మంది. బలి తల మోపిన పాదము అంటే బలి యొక్క అహంకారాన్ని అంతా అణిచి వేస్తాడు. ఆయన యొక్క శ్రీ పాదాన్ని మన శిరస్సు పైన దాల్చడానికి అవకాశం ఇచ్చినప్పుడు. వైష్ణవులు భగవంతుడి యొక్క శ్రీ పాదాలను మోము పైన తిలకం రూపం లో ధరిస్తారు.ఆ తిలకానికి కింద ఉండేది భగవంతుడి యొక్క తులసి. ఆండాళ్ తల్లి చెబుతుంది కదా కృష్ణుడు ఉన్నాడు అంటే గుర్తు ఏమిటి అంటే తులసి వాసన వస్తుంది.
    కృష్ణుడు ఎక్కడ ఎక్కడ అయితే ఉంటాడో అక్కడ తులసి వాసన వస్తుంది.

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 Год назад

    Bhagavantuni sri padhalanu ashraisthe thapakunda bhagavantuni cherutamu🙏
    Hare krishna haribol prabhuji pranamalu🙏🙏

  • @lalithachitta9414
    @lalithachitta9414 9 месяцев назад

    1. వామనుడు, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు లీలలను
    2.విశేష ధర్మన్ని పాటించి భగవంతుడు ని చేరుకోవాలి
    3.శకటసురుడు
    4.పుణ్యము, పాపము
    5.రుచి, వాసన 🙏

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 10 месяцев назад

    హరే కృష్ణ🙏🙏
    1. జ) వామన లీల, రామచంద్రుని లీల,
    శటకాసుర లీల, వృత్తాసుర లీల,
    గోవర్ధన లీల, కపితా సుర లీల.
    ఈ పాశురంలో ఆండాళ్ తల్లి
    భగవంతుని యొక్క ఈ లీలలను
    గుర్తు చేస్తుంది.
    2. జ) ధర్మానికి వ్యతిరేకమైన ఆలోచనలను
    చెబుతుంటే దాన్ని వదిలి వేసి
    భగవంతుడి సన్నిధి లో అంటే
    భగవంతుడి శరణాగతి లో ఉండడం.
    ఇంకా చెప్పాలంటే ధర్మానికి తగ్గట్టుగా
    ఉండడం. ఇదే విశేష ధర్మం.
    3.జ) బండి రూపంలో ఉన్న అసురుడి
    పేరు శకటాసురుడు.
    4. జ) శకటము యొక్క రెండు చక్రాలను
    పుణ్యము, పాపము తో పోల్చారు.
    5. జ )వత్సాసురుడు- రుచికి ప్రతీక.
    కపిత్తాసురుడు- వాసనకు ప్రతీక.
    హరే కృష్ణ🙏🙏

  • @prasunagodesi6185
    @prasunagodesi6185 Год назад +1

    Challa chakaga cheparru,challa chinna age lo

  • @sarojaiv6596
    @sarojaiv6596 10 месяцев назад

    🙏🙏🙏🙏

  • @sreelatha4660
    @sreelatha4660 Год назад

    Hare Krishna prabhuji 🙏 krithagnathatho vundali bagavvanthudiki ani thelipinandhuku dandavat pranamam prabhuji. Hare Krishna 🙏

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi 10 месяцев назад

    హరే కృష్ణ ప్రభూజీ 🙏 1,వామన, శ్రీ రామ, శ్రీ కృష్ణ, లీలలను 2, ధర్మాన్ని పాటించి భగవంతుని చేరుకోవటం 3,శకటాసురుడు 4, పుణ్యము, పాపము 5, వాసన, రుచి

  • @pavitramani6076
    @pavitramani6076 10 месяцев назад

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏

  • @sireeshabollina1196
    @sireeshabollina1196 10 месяцев назад

    హరే కృష్ణ ప్రభుజీ🙇‍♀️🙏🙏

  • @bargavi_bagi1434
    @bargavi_bagi1434 10 месяцев назад +1

    శుభోదయం ప్రభుజి. 🙏🙏🙏

  • @SJYadav44
    @SJYadav44 10 месяцев назад

    Hare Krishna prabhuji 🙏

  • @SatyavathiK-wf5hx
    @SatyavathiK-wf5hx 10 месяцев назад

    Harekrishna Dandavathpranamam Prabhuji 🙏🙇🏼‍♀️

  • @lakshmibhavani8182
    @lakshmibhavani8182 Год назад

    Bhagavantudu chala ichharu vatini gurtinchalekapothunna

  • @arunagandla2015
    @arunagandla2015 Год назад

    Hare Krishna prabhuji dandavath pranaamam🙏🙏🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 10 месяцев назад

    2. కాబట్టి ఇది భగవంతుడి యొక్క శ్రీ పాదం దాని కింద తులసి. ఎప్పుడైతే భగవంతుడి యొక్కశ్రీ పాదాన్ని భక్తి చేసి భగవంతుడు ఎంత పరాత్పరుడు అని
    తెలుసుకుంటామో అప్పుడు మనకు ఉన్న అహంకారం మొత్తం తొలగిపోతుంది. అటువంటి అద్భుతమైన అహంకారాన్ని తీసే పాదానికి మనందరం కూడా మంగళం పాడుదాం అంటుంది ఆండాళ్ తల్లి. మనం భగవంతుడికి మంగళం చెప్పేంత వాళ్ళ మా అంటే భగవద్భక్తి ఎవరికైతే కలుగుతుందో వారికి మొత్తం జ్ఞానం కలుగుతుంది. భగవంతుడు పరాత్పరుడు భగవంతుడి పైన ప్రేమ పెట్టుకుంటే నేను భగవంతుడికి ఎలా సేవ చేయకలుగుతాను
    నేను భగవంతుడిని ఎలా కాపాడ గలుగుతాను నేను భగవంతుడిని ఎలా మంగళం పాడుతాను అనే ఆలోచన కేవలం భగవత్ ప్రేమికుల లో మాత్రమే ఉంటుంది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు మనం భగవంతుడి దగ్గరకు వెళ్లి నాకు ఇది కావాలి అది కావాలి అని అడకకూడదు.
    భగవంతుడికి మనం మూడు పూటలా నైవేద్యం పెట్టే వాళ్ళం. గొప్ప గా భగవంతుడికి సేవ చేసే తత్వం వైష్ణవుల
    సిద్దాంతం. అటువంటి వామనమూర్తి పాదాలకు మంగళం కలుగుగాక అని పాడుతుంది. వామనమూర్తి ఉన్న చోటనే ఉండి కాలుని పైకి జాపి ముల్లోకాలను కొలిచారు. కానీ రామచంద్రుడు మాత్రం అయోధ్య నగరాన్ని వీడి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి అడవి ప్రాంతం మొత్తం కూడా దాటి మునులు యోగులులందరికీ కూడా ఒక అద్భుతమైన సాంగత్యాన్ని కలిగిస్తూ రావణాసురుని లంకను చేరి అక్కడ రావణాసురుని తొలగించి విభీషణుడిని రాజ్య పట్టాభిషేకం చేయించారు. ఇలా రామచంద్రుడు అడవిని మొత్తం నడవాల్సి వచ్చింది. ఎన్నో ముళ్ళు గుచ్చుకున్నాయిట ఆరోజు
    రామచంద్ర మూర్తికి అడవిలో నడుస్తూ ఉంటే. రామచంద్ర మూర్తి పడుకుని ఉంటే లక్ష్మణస్వామి కాళ్లు నొక్కుతూ పాదాలు చూసేసరికి ఎన్నో ముళ్ళు గుచ్చుకొని ఉన్నాయి ట. లక్ష్మణ స్వామి కాలిలో ఒక ముల్లునైనా తీద్దాం అని తియ్యబోతుంటే
    రామచంద్రుడు హూ అని అనగానే లక్ష్మణ స్వామి ఆగిపోయాడు. వెళ్లి సీతమ్మకు చెబుతాడు. రామచంద్రుని పాదాలలో ఎన్నో ముళ్ళు గుచ్చుకొన్నాయి అని. రామచంద్రుని శ్రీ పాదాలకి అంత నవనీత మైన కోమలమైన పాదాలకు అన్ని ముళ్ళు గుచ్చుకున్నాయి నువ్వైనా తీయమ్మా అంటే సీతమ్మ తల్లి ఎంతో సుకుమారంగా మెల్లగా రామచంద్రునికి స్పృహ కలగకుండా ఆ ముళ్ళు లను తొలగిద్దాం అని సీతమ్మ తల్లి చేయి పెట్టగానే హూ అని లేచారుట‌. అయితే సీతమ్మ లక్ష్మణస్వామి ఇద్దరు అడుగుతున్నారు ట
    అడవిలో నడుస్తూ వెళ్తున్నారు కాళ్ళకు
    పాదుకలు ధరించలేదు అన్ని ముళ్ళు గుచ్చుకున్నాయి రక్తం వస్తోంది. అయినా సరే ఎందుకు ముల్లులు తీయించుకోవడం లేదు అంటుంది. అప్పుడు రామచంద్రుడు
    నేను అభయాన్ని ఇచ్చాను ఎవరైనా నా శ్రీ పాదాలను ఆశ్రయిస్తే వాళ్లను ఎప్పుడు కూడా దూరంగా పెట్టను అని కాబట్టి ఈ ముల్లులు నా శ్రీ పాదాన్ని ఆశ్రయించాయి
    వాటిని నేను ఎలా తొలగించను అని రామచంద్రుడు సీతమ్మ తల్లితో అన్నారు.
    అదే భగవంతుడి యొక్క కృప. మనం కూడా ముల్లు లాంటి వాళ్ళమే. భగవంతుడిని ఆశ్రయించిన పేరుతో మనం ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాము. భగవంతుడు మాత్రం మనల్ని ఎప్పుడు వదలడు. మనం భగవంతుడు ఏం చేస్తాడులే అని అనుకుంటావేమో కానీ
    భగవంతుడు అలా అనుకోడు. భగవంతుడికి మనం దూరంగా వెళ్లాలనుకున్న భగవంతుడు మాత్రం మనం ఎలాంటి వాళ్ళమైనా సరే మనం ఆశ్రయిస్తే చాలు. " సక్రృతైవ ప్రపన్నోయం
    తవాస్మేయితి ఆచయతే అభయం సర్వ భూతేబ్యో దధామి యేతత్ప్రతంమమ".
    మనం వ్రతాలు చేస్తూ ఉంటాము కదా ఇది
    కావాలి అది కావాలి అని భగవంతుడు కూడా ఒక వ్రతాన్ని చేస్తున్నారు ట. ఏమీ వ్రతము అంటే నా దగ్గరకివచ్చిన వాళ్ళ నీ నా శ్రీ పాదాలను శరణువేడిన వారినీ నేను ఎప్పుడూ కూడా వదలను. ఇది భగవంతుడి పూనిన వ్రతం ట. అటువంటి
    గొప్ప శ్రీ పాదాలకు మనం మంగళం పాడుదాం అంటుంది ఆండాళ్ తల్లి. శ్రీరామచంద్రుని పాదాలు చూస్తే ఎంతో సుకుమారంగా ఉంటాయి.ఇది మన రామచంద్రుడు. ఇది కూడా లంకా నగరమే. ఇక్కడ రావణ కుంభకర్ణ విభీషణులు ఉన్నారు. మన మానవ దేహంలో రజో గుణ తమో గుణ సత్వ గుణ ప్రవృత్తితో కూడుకుని ఒక మానవుడు ఉంటాడు. రజోగుణం రావణాసురునికి ప్రతీక .తమోగుణం కుంభకర్ణుడికి ప్రతీక.
    సత్వగుణం విభీషణుడికి ప్రతీక. అందుకే విభీషణుడు ఏం చేశాడు సామాన్య ధర్మం విశేష ధర్మం రెండు ధర్మాలు ఉంటాయి.
    తల్లిదండ్రులకు కట్టుబడి ఉండాలి. భార్యాభర్తలకు కట్టుబడి ఉండాలి. అలాగే పెద్దవాళ్లకు కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండాలి అంటే ఎప్పటి వరకు అంటే వాళ్లు భగవంతుడి గురించి చెప్పి భగవంతుడి యొక్క మార్గంలో నడుస్తారో అప్పుడు కట్టుబడి ఉండాలి.

  • @jyothichandupatla6633
    @jyothichandupatla6633 Год назад

    Adbutham ga vivaristunnaru

  • @LaxmiChitti-m5n
    @LaxmiChitti-m5n 10 месяцев назад

    1.vaamana, krishna,rama avatharalalo swami thana bhakthula kosam varini kapadadaniki enno leelalanu chesaru.
    2.bhaghavanthuni sri charanalanu cherukovatame .
    3.shakataasurudu.
    4.papamu punyamulatho.
    5.ruchi,vaasanalatho.

  • @sireeshabollina1196
    @sireeshabollina1196 10 месяцев назад

    1.వామన మూర్తి రూపంలో లోకాలనన్నింటినీ తన పాదాలతో కొలచిన లీల,శ్రీరామచంద్రమూర్తి రూపంలో అడవుల దాటి రావణ సంహారం చేసిన లీల,శకటాసుర భంజన లీల,కపిత్తాసుర,వత్సాసుర సంహార లీల,గోవర్ధన లీల
    2.భగవంతుని చేరే ధర్మ పధములో ఆటంకంగా ఉన్న సామాన్యధర్మంను విడిచిపెట్టడమే విశేషధర్మం.
    3.శకటాసురుడు
    4.శకటం యెక్క రెండు చక్రాలను పుణ్యం,పాపంతో పోల్చారు.
    5.విడిచిపెట్టవలసిన వాసన,రుచిని సూచిస్తాయి.

  • @varshith9470
    @varshith9470 Год назад

    🙏🙏🙏🌺🌹👌👌

  • @varshith9470
    @varshith9470 Год назад

    🙏🙏🙏🌺🌹💐👌👌👌

  • @SivaPoojithaRadha369
    @SivaPoojithaRadha369 10 месяцев назад

    1.A)Vamana lila(Annie lokamulanu tana yokka sri padamulatho chapie kolichinawada padaniki mangalam) ,Rama lila(Rama chandruniga aranyam mottam nadachie ochie ravanudine samharinchina padalaku mangalam) ,Sri Krishna Bagavanudu lila(sakatasurudu ane rakshasudu ni sri padam tho tannie na padalaku mangalam),Vatsasurdu ni tippadam kosam tana padannie onchina sri Krishna bagavanunie ki mangalam,Giri govardhana parvatham yethadam kosam anachina padam ki mangalam,
    .chapina padaniki mangalam
    ..tannina padaniki mangalam
    ...anichina padaniki mangalam
    ....vanchina padaniki mangalam
    .....aachina padaniki mangalam
    2.)Dharmam ni yeppudaithey manam telusukune avalambisthamo vishesha
    dharmam antaru
    3.)shakatasurudu
    4.)punyamu,papamu
    5.)vasana mareyu ruchie ni suchistunnaru

  • @saiprakashchinta
    @saiprakashchinta 10 месяцев назад

    1) శ్రీ కృష్ణ లీలలు,వామన, శ్రీ రామ
    2)ధర్మం పాటించి భగవంతుని చేరటం
    3)శకటాసురుడు
    4)మానవ శరీరం తో పోల్చారు,పుణ్యం చేస్తే స్వర్గం కి వెళ్ళాం,పాపం చేస్తే నరకం కి వెళ్ళతాం,మానవ శరీరం అనే యంత్రం ని చక్కగా భక్తి మార్గంలో వెళ్ళడం ద్వారా గోలోక బృందావనం చేరుకుంటారు
    5)వత్ససురుడు-పశువు కి రుచి ఎక్కువ , వాసన

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 10 месяцев назад

    3. ఎప్పుడైతే రావణాసురుడు విభీషణుడికి రాముడికి వ్యతిరేకంగా చెప్పాడో రాముడి మంచితనాన్ని అర్థం చేసుకుని రావణాసురుడు ఎప్పుడైతే అర్థం చేసుకోలేదో అన్న మాట వినలేదు. లంకా నగరం వదిలిపెట్టి రాముడి దగ్గరకు వచ్చేసాడు. అదే కుంభకర్ణుడు అన్నా ఇది తప్పు ఇలా చెయ్యకూడదు అని చెప్పాడు కానీ రావణాసురుడు వినలేదు. సరే అన్న కదా అని అన్న మాట విని రాముడు తో యుద్ధం చేశాడు. అన్న పట్ల తల్లిదండ్రుల పట్ల స్నేహితుల పట్ల గురువుల పట్ల గౌరవంగా ఉండాలి కానీ ఎప్పటి వరకు అంటే మనకు ధర్మానికి వ్యతిరేకమైన ఆలోచనలను చెబుతూ ఉంటే అప్పుడు మనం విశేష ధర్మాన్ని ఆచరించాలి. విశేష ధర్మం మనం ఎప్పుడైతే ఆచరిస్తామో దోషం ఏమి వుండదు. విభీషణుడికి ఏమీ దోషం రాలేదు కదా. ఎందుకంటే రామచంద్రుడి దగ్గర ఉన్నాడు. మంచి చేసినంతకాలం మనం భయపడవలసిన అవసరం లేదు.
    బాధ పడవలసిన అవసరం కూడా లేదు.
    తల్లితండ్రులను వద్దని తప్పు చేస్తే భయపడాలి కానీ మంచి చేస్తే భయపడవలసిన అవసరం లేదు. బాధపడవలసిన అవసరం కూడా లేదు. అందుకోసమే ఇప్పటికీ విభీషణుడిని కీర్తిస్తున్నాము. రామచంద్రుడు అయోధ్య నగరం నుండి మన దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు. రావణాసురుడి రజోగుణాన్ని తీసివేస్తారు. కుంభకర్ణుడి తమో గుణాన్ని తీసేస్తారు. సత్వ గుణమైన విభీషణుడిని ప్రతిష్టాపన చేస్తారు. ఎప్పుడు మనం భక్తి చేసినప్పుడు భగవంతుడు అటువంటి రామచంద్రుడికి మనం మంగళం పాడుదాం
    అంటుంది ఆండాళ్ తల్లి. శ్రీకృష్ణుడి లీలలు గురించి గోదాదేవి స్మరణ చేస్తుంది. 1. శకటాసుర భంజన హరిః. శకటాసురుడు అనే ఒక అసురుడు ఒక బండి కింద యశోదమ్మ ఒక చీర కట్టి ఉయ్యాలలా చేసి పడుకోపెడుతుంది. వీళ్ళందరూ బృందావనం నుండి విహారానికి వెళతారు. శకటాసురుడు బండి లో పూనుతాడు.
    ఇందులో అసురుడు ఉన్నాడేమో
    శ్రీకృష్ణుడికి ఆపద చేస్తాడేమో అని భావించి
    ఆ శ్రీ పాదమే వెళ్లి శకటాసురుని తన్నింది ట
    అక్కడ ఉండే మొత్తం బండి చక్రాలు అన్నీ కూడా ఊడి పడిపోయాయిట. శకటాసురుడు చెల్లాచెదురైపోయాడుట.
    ఇలా భగవంతుడికే రక్షణ కల్పించిన ఆ శ్రీపాదానికి మనం మంగళం పాడుదాం. శకటాసురుని తన్నిన పాదానికి మనందరం మంగళం పాడుదాం అంటుంది ఆండాళ్ తల్లి. శకటము అంటే ఒక బండి. ఆ బండికి మన మానవ శరీరం కూడా ఒక బండి లాంటిదే. ఎడ్లబండి రెండు చక్రాల పైన నడుస్తుంది. మన మానవ శరీరము కూడా
    రెండు చక్రాల మీద నడుస్తుంది. అది పుణ్యము పాపము అనే రెండు చక్రాల పైన
    పాపం చేస్తే నరకానికి వెళతాము పుణ్యం చేస్తే స్వర్గానికి వెళతాము. కానీ ఎవరైతే భగవంతుని యొక్క శ్రీ పాదాలను ఆశ్రయిస్తారో భగవంతుడి యొక్క భక్తి చేస్తారో అప్పుడు భగవంతుడు పుణ్యాన్ని పాపాన్ని రెండిటిని తొలగించి భక్తి పుణ్యాన్ని ఇవ్వదు. భక్తి భగవంతుడి పట్ల ప్రేమని ఇస్తుంది. పుణ్యాన్ని చేస్తే స్వర్గానికి పాపాన్ని చేస్తే నరకానికి భక్తి చేసిన వాడు భగవంతుడి యొక్క శ్రీ పాదాలను ఆశ్రయించిన వాడు స్వర్గానికి వెళ్ళడం నరకానికి వెళ్ళడు. వాళ్లు భగవంతుని యొక్క దివ్య లోకానికి చేరుతారు. గోలోక బృందావన ప్రాప్తి మనకు కలుగుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మనం చక్కగా వాడుకుని ఆ భగవంతుడి యొక్క భక్తిని మనం చేయగలిగితే మనకు వచ్చే అద్భుతమైన ఫలితం ఏమిటి పుణ్యాన్ని పాపాన్ని రెండు తీసేసి మనల్ని భగవంతుడి యొక్క " యగ్దత్వా ననివర్ధంతే తధ్ధామ పరమం మమ" అటువంటి పరమ ధామానికి మనల్ని తీసుకువెళతాడు. అటువంటి శ్రీకృష్ణుడు యొక్క పాదానికి మనం మంగళం పాడుదాం అంటుంది ఆండాళ్ తల్లి.
    2. భత్సాసురుడు అనే అసురుడు దూడ రూపంలో వస్తాడు. ఒకసారి ఒక చెట్టు రూపంలో కపిధ్ధాసురుడు అనే అసురుడు వచ్చాడు. ఇద్దరు వచ్చినప్పుడు ఏమి జరిగింది అంటే ఒకవైపు ఏమో వత్సాసురుడు ఇంకోవైపేమో కపిద్దాసురుడు మధ్యలో శ్రీ క్రిష్ణుడు. వత్సాసురుడి యొక్క తోకను కాళ్ళ ను పట్టుకొని గట్టిగా కాళ్ళను నొక్కిపెట్టి కపిధ్ధా సురుడు కేసి వెలగ చెట్టు రూపంలో ఉన్నాడు కదా దానికి వేసి కొడతాడు. వెంటనే ఇద్దరు కూడా మరణిస్తారు. వత్సము అంటే పశువు. పశువుకి రుచి ఎక్కువ. ఏది చూసినా తింటూనే ఉంటాయి అలా. ఏదో ఒకటి నములుతూనే వుంటాయి. వెలగపండు చాలా రుచిగా ఉంటుంది. వాసన చాలా బాగుంటుంది. పశువు రుచికి ప్రతీక. మన మానవ జన్మ లోకూడా రెండింటిని బట్టిమానవుడు పరిగెడుతూ ఉంటాడు ట. " జీవేర లాలసహోయ్ ఇత్ వుత్ జాయ్". ఒక నాలుక ఇచ్చిన ప్రవ్రుత్తి తో అటూ ఇటూ పరిగెడుతూ ఉంటాడు ట. ఇక్కడ కపిత్తాసురుడు వ్రత్తాసురుడు వాసన రుచి పట్టుకుని పరుగెడతాము. మనం భగవద్భక్తి మార్గాన్ని తెలుసుకుని మంచిగా మారాలి అంటే నాలుకను మంచిగా పెట్టుకోవాలి.

    • @manikyalakshmi4186
      @manikyalakshmi4186 10 месяцев назад

      4 మనం మాంసాహారాన్ని తీసుకోకూడదు.
      మాంసాహారాన్ని మానేస్తే ఎలా అంటే మరి మందులు వేసుకునే పరిస్థితి వస్తే. భగవంతుడి యొక్క రుచిని అలవాటు చేసుకోవాలి. ఒక జీవిని చనిపోతే శవం అంటాం. ఆ శవాన్ని తీసుకుని వెళ్లే స్థలం స్మశానం అంటాం. అలా ఒక ప్రాణం లేని జీవిని ఈ శరీరంలోకి పంపిస్తే ఇది కూడా నడిచే స్మశానం అవుతుంది. మనం స్మశానం అవ్వద్దు. ఇది ఆలయం. "దేవో దేవాలయః ప్రోక్తః". ఇది ఎందుకు ఆలయం అంటే మన హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు కాబట్టి. ఇది భగవంతుడి యొక్క ఆలయం. ఈ ఆలయాన్ని ఒక పూజ గదిని ఎంత పవిత్రంగా ఉంచుకుంటాము. కాబట్టి మనం ఆలోచించాలి. వైష్ణవ సాంప్రదాయంలో ఉల్లి వెల్లుల్లి తినకూడదని చెబుతారు. డాక్టర్ చెబుతుంటే మనం మానేస్తున్నాం కదా
      షుగర్ వచ్చింది అంటే చక్కెర తినొద్దు అన్నం తినొద్దు చపాతి తినమంటారు.
      మనం అలాగే చేస్తూ ఉంటాము కదా. ఈ శరీరాన్ని ఏమవుతుందో ఏమిటో అని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాము కదా.
      శరీర పోషణ కోసం అన్ని వదిలేస్తున్నాం కదా. ఒక వైష్ణవ సాంప్రదాయంలో గురువు చెబితే మనకు వదిలేయలేమా. వాసన రుచి ఈ రెండింటినీ గమనిస్తూ మనం ముందుకు వెళ్లాలి. చాలా ప్రమాదకరమైనవి ఈ మనుష్య జన్మలో ఏమిటి అంటే ఈ వాసన రుచి. ఇది మనల్ని వదిలిపెట్టవు వెంట పడుతూ ఉంటాయి. కానీ మనం ఒక సంకల్పం చేసుకుని మనం ఏమి పొంద పోతున్నాము అని ఆలోచించి చేస్తే ఇమేమి మనకు లెక్కలోకి రావు. కపిత్తాసురుడుని వత్సాసురుడిని వంగి బంతిలా వేసి సంహరించిన అటువంటి శ్రీకృష్ణుడిని మనం మంగళం పాడుదాం అంటుంది.
      భగవంతునికి మనం ఏమి చేసినా సహనం చాలా ఎక్కువ ట. భగవంతుడు ఎన్నో సార్లు తనని ఆశ్రయించిన వారికి సహనంతో వాళ్లకి మంచి చేసి వాళ్ళ ప్రవర్తనలో మార్పు అనేది తీసుకు వస్తాడు.
      ఇది మనం బృందావనంలో గోవర్ధనగిరి ఎత్తిన లీలలో చూస్తాము. ఇంద్రుడు ఒక రోజు అహంకరించి బృందావనంలో వ్రజ వాసుల పట్ల వాన కురిపించాడు. ఏడు రోజులు భగవంతుడు గోవర్ధనగిరిని చిటికెన వేలు మీద ఉంచి నిలబడతాడు. "నిజ పతి భుజ దండం చక్ర ఛాధం ప్రపద్య"
      అని ఆ గోవర్ధనగిరిని చత్రం పై కప్పులా చేసి నిజ పతి భుజ దండం ఆయన యొక్క భుజాన్ని దండం గా చేసుకుని ఏడు రోజులు ఏడు పగళ్ళు అలా నుంచున్నారు.
      భగవంతుడు . మనం ఏదైనా ఒక బరువుని ఎత్తేటప్పుడు భూమిపై కాళ్లను నొక్కి పెడతాము కదా. అలా నొక్కిన పాదానికి మనం మంగళం పాడుదాం అంటుంది ఆండాళ్ తల్లి. ఎన్ని కష్టాలు పడ్డా వయ్యా నువ్వు అంటే ఎందుకోసం అంటే 1.బృందావన వ్రజ వాసులను అందరినీ కాపాడడానికి. రెండవ కారణం ఇంద్రుడికి ఉండే అనర్ధములను సంస్కరించడానికి భగవంతుడు ఈ విధమైన లీలలను చేశారు. దేవాసుర సంపత్ విభాగ యోగము భగవద్గీతలో చదువుతూ వుంటాం మనం. ఎప్పుడైతే ఆసురీ ప్రవృత్తుల గురించి చెబుతారో అర్జునుడికి అనిపించిందట నాలో అన్ని వున్నాయా అని. మనకు శాస్త్రం చెబుతుంటే మనకే చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే శాస్త్రం మనకోసమే మాట్లాడుతుంది కాబట్టి. అర్జునుడు చాలా బాధపడ్డాడుట అయ్యో నేను ఆసురీ ప్రవృత్తి కలిగిన వాడిలా కనిపిస్తున్నాను అని ఈ అధ్యయనాన్ని వింటుంటే. అని అంటే కృష్ణుడు అంటాడు
      ఎవరైనా సరే ఎటువంటి వ్యక్తిత్వం ఉన్న వారైనా సరే నన్ను ఆశ్రయిస్తే చాలు వాళ్ల యొక్క ఆసురీ ప్రవృత్తులన్నీ పక్కన పెట్టి
      దైవి ప్రకృతిలోకి వాళ్లు ప్రవేశింపబడతారు.
      కాబట్టి మనం ఎటువంటి వాళ్ళ మైన కామ క్రోధ లోభ మద మాశ్చర్యములు ఎన్ని ఉన్నా సరే భగవంతుడి యొక్క ఆశ్రయం లోకి శరణు లోకి ఎప్పుడైతే వస్తామో భగవంతుడు మన దగ్గర ఉన్న లోటుపాట్లన్నీ తీర్చిదిద్ది మనల్ని ఒక మంచి మనిషిగా తీర్చి దిద్దుతారు ఒక మంచి భక్తుడిగా తీర్చి దిద్దుతారు. ఎప్పుడు అంటే భగవంతుడి యొక్క శరణు లోకి వచ్చినప్పుడు. కాబట్టి ఇంద్రుడి యొక్క అహాన్ని అణచి ఒక మంచి భక్తుడిగా తీర్చిదిద్దడానికి భగవంతుడు చేసిన ప్రయత్నంలో " బ్రహ్మ విమోహన లీల" లేదా
      గోవర్ధన లీల ఇందులో భగవంతుడి యొక్క సహనం. బృందావనాన్ని నాశనం చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు
      ఇంద్రుడు. భగవంతుడు ఎంతో సహనంతో ఓర్చి ఆయనకు బుద్ధి చెప్పాడు. ఇంద్రుడు ఆ రోజు భగవంతుడికి క్షమాపణ చెప్పి గోవింద నామంతో పట్టాభిషేకం చేశారు. అనే విషయాన్ని మనం అందరం శ్రవణం చేద్దాము. అద్భుతమైన ఆ పాదానికి మనందరం కూడా మంగళం పాడుదాం అని ఆండాళ్ తల్లి అంటుంది. ఎందుకు ఆండాళ్ తల్లి మంగళం పాడుదాం అంటుంది. భగవంతుడు ఇవన్నీ చేసినందుకు దిష్టి తగిలింది అని కదా మంగళం పాడుదాం అంటుంది.

  • @jayalakshmikommineni3796
    @jayalakshmikommineni3796 10 месяцев назад

    Hare krishna 🙏

  • @suryako152
    @suryako152 9 месяцев назад

    Omnamashivaya

  • @manjular7093
    @manjular7093 10 месяцев назад

    🙏🙏🙏

  • @jyothichandupatla6633
    @jyothichandupatla6633 Год назад

    Hare Krishna Prabhu ji pranamalu

  • @soumyanalajarla6366
    @soumyanalajarla6366 10 месяцев назад

    Hare Krishna Prabhuji 🙏

  • @krishnavenisoothi7092
    @krishnavenisoothi7092 10 месяцев назад

    Hare Krishna 🙏🙏🙏 prabhuge

  • @kalpanajidigam5437
    @kalpanajidigam5437 Год назад

    🙏🙏