Exploring the Hidden Treasures of Siddavatam Fort"

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • సిద్ధవటం కోట సిద్ధవటం కేంద్రంగా పరిపాలించిన రాజులు నిర్మించిన కోట. దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది.
    సిద్ధవటం కోటను విజయనగర చక్రవర్తిగా వీర నరసింహరాయలు పరిపాలిస్తున్న కాలంలో సంబెట గురవరాజు పరిపాలించేవారు. ఆయన పరిపాలనలో స్త్రీలను అత్యంత ఘోరంగా అవమానించి మరీ ప్రజల నుంచి ధనం తీసుకుంటూండడంతో ఆ విషయాన్ని కూచిపూడి భాగవతుల ప్రదర్శన ద్వారా తెలిసిన వీరనరసింహరాయలు అతనికి మరణశిక్ష విధిస్తూ సైన్యాన్ని పంపారు. ఆ సైన్యం కోటను వశపరుచుకునేందుకు యుద్ధాన్ని చేసి కోట వశమయ్యాకా సంబెట గురవరాజును చంపారు.
    శ్రీ కృష్ణదేవరాయల అల్లుడు వరదరాజు ఈ కోటను పాలించాడు. అంతకు ముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది. రెండవ వెంకటపతిరాయలకు మట్లి ఎల్లమరాజు యుద్ధాల్లో బాగా సహకరించాడు. అందుకు గుర్తుగా ఎల్లమరాజుకు అమరనాయంకరంగా సిద్ధవటాన్ని ఇచ్చాడు. మరికొన్ని ప్రాంతాలను సిద్ధవటానికి చేర్చాడు. మట్లి అనంతరాజు మట్టికోటను శతృదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. ఈయన తన తండ్రి పేర ఎల్లమరాజు చెరువును, తన పేర అనంతరాజు చెరువును త్రవ్వించాడు. అనంతరాజు 'కాకుత్థ్స విజయము ' అనే కావ్యాన్ని రచించాడు. ఈయన ఆస్థానంలో ఉప్పుగుండూరు వెంకటకవి, కవి చౌడప్ప ఉండేవారు.
    మట్లి రాజుల పతనం తర్వాత ఔరంగజేబు సేనాని మీర్ జుమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించి పాలించాడు. ఆ తర్వాత ఆర్కాటు నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీఖాన్ 1714లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు. మయానా నవాబులు సిద్ధవటాన్ని పాలించారు. 1799లో సిద్ధవటం ఈస్టిండియా కంపెనీ వశమయింది.
    #siddavatam #siddavatamfort #cuddapah #kadapa #trending

Комментарии • 1