కవిసమ్రాట్ || Kavisamrat Full Movie ||

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • Viswandha Satyanaraya S/O Sobhanadri is a Telugu lecturer in SRR College.He want to full fill his father's dream by renovating Old Sivalayam in his Home town Nandamuru but the Situations and circumstances have planned something for Viswanatha He went through a lot of struggle to reach his goal. He was below poverty line but he used to never say no to any one who wants his help. By his rich literary knowledge and writing skills he used to earn small sums to feed his family eventually because of his skills he was titled "Kavisamrat" and Awarded "Gananpeet" from Indian Government
    #lbsriram
    Cast:
    Ananth Babu,
    Ramajogayya Sastri,
    Raj Kandukuri,
    Chelly Swapna,
    Rakhee,
    TNR and more..
    Directed By: Savith C Chandra
    Producer: LB Sriram
    Production House: Suresh Productions

Комментарии • 166

  • @sureshvarma6990
    @sureshvarma6990 9 дней назад +49

    అయ్యా ఎల్బీ శ్రీరామ్ గారు నిజంగా విశ్వనాధులు వారు మీలో ఆవహించి మీ ద్వారా తన కథని ప్రపంచానికి తెలిసేలా చేశారు అని అనిపిస్తుంది .ఈ తరానికి విశ్వనాథ సత్యనారాయణ గారి గొప్పతనాన్ని వివరించిన మీకు పాదాభివందనములు .

    • @sarmam7775
      @sarmam7775 4 дня назад

      పన్నీరు బాగా ఉంది

  • @SudhakarLanka
    @SudhakarLanka 6 дней назад +20

    గురువుగారు!
    'కవిసమ్రాట్' సినిమా మొత్తం చూశాను. ఆద్యంతం ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. కొన్ని కొన్ని సార్లు కళ్ళు చెమర్చాయి. మీలాంటివాళ్ల వలనే ఇంకా మన మాతృభాష మనగలుగుతోంది. ముఖ్యంగా మీరు కవిసమ్రాట్ 'శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ' పాత్రలో మీదైన శైలిలో ఒదిగిపోవడం ఎంతో బావుంది. సాక్షాత్తు ఆ విశ్వనాధ సత్యన్నారాయణగారే దిగొచ్చారా? అనే అనుమానం కలిగింది. పాశ్చాత్య భాషా సంస్కృతి పడగలు విప్పుతున్న ఈ తరుణంలో మాతృభాష పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ అనిర్వచనీయమైనది! మీ ప్రయత్నం నదిలా నిరంతరం కొనసాగిపోతూనే ఉండాలని కాంక్షిస్తూ...
    ఓ ఏకలవ్య శిష్యుడు!

  • @baluIQ
    @baluIQ 9 дней назад +23

    ఉప్పు ని ఉప్పగా ఉంది అంటాం..
    కారప్పొడి ని కారంగా ఉంది అంటాం..
    కానీ చక్కెర ని మాత్రం తియ్యగా ఉందని అంటాం
    " నిజమేనయ్యా పుల్లారావు"...( మీ డైలాగే సార్)..
    Thank you for Giving legendary Writer story to us Sir..🙏🙏🙏🙏

  • @ramesh7608
    @ramesh7608 9 дней назад +22

    మహానుభావులు శ్రీ శ్రీ లంకా భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారి కి..నా పాదాబి వందనాలు..
    మహాకవి శ్రీ శ్రీ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిని
    ఆవాహనం చేసుకుని ఆయన పాత్ర ని అభినయించారు మీరు.... మీ నటన ని ఆ పాత్ర లో మీరు జీవించిన విధానాన్ని మాటల్లో వర్ణించలేము మీ చిత్రం చూసి అది ఆ ఆనందాన్ని అనుభవించాలి...
    విశ్వనాధ్ వారిని ఈతరం మరేతరం మరచిపోకుండా మీరు చేసిన ఈ చిత్రం ఒక అద్భుతం....
    ఈ చిత్ర దర్శకుడు సవిత సి చంద్ర గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు... దర్శకులు ఒక్కొక్క సన్నివేశం తీసిన విధానం అద్భుతం...
    దొరసాని గట్టంలో విశ్వనాధ్ వారిని యల్ బి శ్రీరామ్ గారిలో చూపించిన విధానం అమోఘం...
    చిట్టిబాబు గారు అక్కడ ఇచ్చిన చిన్న ఎక్సప్రెషన్ అద్భుతం....... ఏమని చెప్పను ఎంతని చెప్పను....
    తెలుగు మీద తెలుగు కవుల మీద వాళ్ళ ఉనికిని వాళ్ళు రాసిన పుస్తకాలని కాపాడాలి అనుకునే మీ సంకల్పం ఈ చిత్రం ద్వారా చిరస్థాయిగా నిలిచిపోతుంది....
    తెలుగుని తెలుగు కవులని తలదన్నే మరే రచయితలు లేరు ఈ జగాన........ జై హో యల్ బి శ్రీరామ్ గారు........
    మిమ్మల్ని అభిమానించే... రామ్

  • @msprasad7164
    @msprasad7164 9 дней назад +18

    I am PART of this film. I ventured to GET it censored with in 24 hours of application. CBFC members applauded this film, as THE BEST since 2011. I, attended to CBFC negotiations on behalf of L.B.SRIRAM SIR

    • @Savarkar819
      @Savarkar819 2 дня назад +1

      నిశ్చయంగా మీ అందరి సమిష్ఠి కృషి. నేను విశ్వనాథవారి వీరాభిమానులలో ఒకడిని. వీరాభిమానం అంటే వీరాభిమానమే. వారిని అనేకసార్లు దర్శించుకొన్నాను. విజయవాడ బీసెంటురోడ్డు సెంటర్లో కౌతావారి బిల్డింగు మూలమీద అనూరుడి కిళ్ళీ షాపులోంచి జర్దా కిళ్ళీలు తెచ్చిన బుడ్డోడిని అప్పుడు. ఇప్పుడు నాకు డెబ్భైయ్యేళ్ళు. వారిపట్ల నా గౌరవభావం అలాగే ఉన్నది.

    • @kvr8137
      @kvr8137 День назад

      చాలా చాలా బాగుంది

  • @amruthalatha
    @amruthalatha 7 дней назад +5

    అద్భుతమైన చిత్రం ...
    ఎల్.బి.శ్రీరాం గారి నటన , సవిత్ సి. చంద్ర డైలాగ్స్ , దర్శకత్వం పరమాద్భుతం!
    చక్కటి బిగువుతో,
    ఎక్కడా వంకపెట్టలేని కథనం !
    తెలుగు కవుల , తెలుగు భాషా గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రాలకు ..
    అందునా ఎల్.బి. శ్రీరాం గారు నటించిన చిత్రాలకు ...
    దర్శకత్వం వహించేంత స్థాయికి స్వయం కృషితో ఎదిగిన సవిత్ సి. చంద్రకి శుభాశీస్సులు !

    • @amruthalatha
      @amruthalatha 7 дней назад

      షార్ట్ ఫిలిమ్స్ విభాగంలో అవార్డు రాదగ్గ చిత్రం !

  • @T.jaipalMudiraj-b3g
    @T.jaipalMudiraj-b3g 9 дней назад +10

    అయ్యా మీరు నా హృదయములో ఎప్పటికి తీయటి జ్ఞాపకం. కానీ మిమ్మల్ని కలవాలని వుంది ఇట్లు మీ అభిమాని జైపాల్ 🙏🙏మీ ఫోన్ నెంబర్ కావాలి ❤️

  • @inugantisatyanandam7538
    @inugantisatyanandam7538 3 дня назад +1

    ఒక గంట పాటు సాక్షాత్తూ ఆ విశ్వనాథ వారినే చూస్తున్నంత సంతోషం కలిగింది. నటన, డైలాగ్, స్క్రీన్ ప్లే , దర్శకత్వం అన్ని చాలా చక్కగా ఉన్నవి. 🎉
    పూర్తి నిడివి కళా చిత్రం చూడాలని ఉంది.

  • @prasadvarmanadimpalli7822
    @prasadvarmanadimpalli7822 8 дней назад +6

    కవి సామ్రాట్ పై సినిమా తీయడం నిజంగా సాహసం,అద్భుతం, అందరికీ ఆమోదం....ఈ ఆలోచన రావడం మన తెలుగు సాహితీ అభిమానుల అదృష్టం.

  • @cvsrao7030
    @cvsrao7030 9 дней назад +6

    అయ్యా,
    చాలా రోజుల తరువాత అధ్భుతమైన ఆత్మాభిమానం మూర్తీభవించిన గొప్ప వ్యక్తిని, అచ్చ తెలుగులో మా ముందు నిలిపారు. కృతజ్ఞతలతో....

  • @hariprasadrayala
    @hariprasadrayala 9 дней назад +7

    తెలుగువారు చూడవలిసిన నిలువెత్తు తెలుగు వృక్షం ఈ చిత్రం. 🖋️🎤

  • @srinivaspallapydi3646
    @srinivaspallapydi3646 8 дней назад +4

    🙏🙏🙏 పెద్దలు పూజ్యులు ఎల్బీ శ్రీరామ్ గారికి పాదాలకు నమస్కారం.. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గారిలా నటించి చూపించినందుకు ధన్యవాదములు........ మిమ్మల్ని అభిమానించే.. మీ అభిమాని పల్ల పైడి శ్రీనివాస్..... విశాఖపట్నం

  • @hindumitram
    @hindumitram 6 дней назад +6

    42:28 నుండి 42:52
    "మన ఆంద్ర దేశ సాంఘిక సాంస్కృతిక వాణిజ్య పరిణామాలు , సనాతన ధర్మానికి ఎదురవుతున్న గట్టు పరిస్థితులు శతాబ్దాల విశ్వాసాలను పటాపంచలు చేస్తూ వెల్లువెత్తుతున్న పాశ్చాత్య సంస్కృతి ప్రభావంవల్ల ప్రక్కదారిపడుతున్న మన మానవసంబంధాలు" వేయిపడగలు నవల రచనకు మూల ఉద్దేశ్యం
    52:50 నుండి 53:09
    "ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది
    కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది
    బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది
    కానీ,
    ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది”

  • @T.jaipalMudiraj-b3g
    @T.jaipalMudiraj-b3g 9 дней назад +5

    ఇప్పటి కాలంలో కూడా మీలాంటి జ్ఞానాశ్వరూపులు వున్నందుకు నాలాంటివాళ్ళ అదృష్టం ❤️🙏🙏

  • @sriramajayam4852
    @sriramajayam4852 4 дня назад +1

    This is called real cinema...we need to encourage our children should watch ..expecting similar movies more...thank you entire lb Sriram garu and unit

  • @DineshAdala
    @DineshAdala 9 дней назад +5

    Chakkera laage madhuram ga undi mee Kavyam..👌 Very well crafted with naturalistic scenes. #AkshayaPatra #Kinnerasaani #PrasannaKavyamTNRgaru #LaxmanaAnanthBabu #VaralaxmiAmma #VeyipadagalaViswanathaSatyaNarayanaKaviSamrat(LBSriram garu)❤

  • @siddhanti42
    @siddhanti42 9 дней назад +4

    అద్భుతం గురువు గారు 🙏🙏. నేటి తరానికి మహానుభావులను గుర్తుచేస్తున్నందుకు మీకు సాష్టాంగ 🙏🙏.

  • @saratchandra774
    @saratchandra774 5 дней назад +1

    అయ్య గారు ఒక గంట వీడియో చూడాలా అని అనుకున్న కానీ చూసిన తరువాత అప్పుడే గంట ఐపోయినద అని అనిపించింది అంతగా లీనం ఐపోయిన చాల అద్భుతంగా వున్నది.

  • @MrGogi1969
    @MrGogi1969 17 часов назад +1

    ఇప్పుడే. సినిమా చూస్తున్నాను delhi lo mobile lo బాహ్య ప్రపంచం తెలియటం లేదు నిమన్నమైపోయాను.నేను కాలేజీ లో ఏలూరు లో చదువుతున్నప్పుడు వారి దర్శన భాగ్యం కలిగింది.కిన్నెర సాని పాటలు వినిపించారు.1958 లో. మా అద్భుతం సినిమా ధన్యవాదాలు..

  • @rajarao7638
    @rajarao7638 12 часов назад

    ఎల్. బి. శ్రీ రామ్ గారికి పాదాభివందనాలు.చక్కటి చిక్కటి మహా కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి చిత్ర కథను మా తరం వారు తిలకించి తరించే భాగ్యాన్ని కల్పించారు. మరోమారు మా వందనాలు.

  • @subbaraoreddy1590
    @subbaraoreddy1590 4 дня назад

    అద్భుతం కథ దర్శకత్వం నటన అన్ని విషయాలు విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చాలా అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు శ్రీరామ్ గారు

  • @hariprasadrayala
    @hariprasadrayala 9 дней назад +6

    ఆహా అద్భుతం, తెలుగు వెలుగై వెలిగిన వెన్నెల నాటి దినములు. 🖋️🎤

  • @maheedharkumarmothukuri2758
    @maheedharkumarmothukuri2758 4 дня назад

    ఆమహనీయుని మళ్ళీ ఆవిష్కరించారుగా శ్రీ రామ్ గారు ధన్యం మీ జీవితం.

  • @koteshn
    @koteshn 3 дня назад

    LB శ్రీరామ్ గారికి అభినందనలు. చక్కటి దృశ్య కావ్యం, చక్కటి సంభాషణలు...మనసుకు హత్తుకు పోయింది

  • @Dadakalandar611
    @Dadakalandar611 9 дней назад +5

    సర్ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి వడ్ల గింజలు కథను పొట్టి సినిమా గా తీయగలరు.
    వారి అనుభవాలు జ్ఞాపకాలు పూర్తి నిడివి చిత్రంగా మలచగలరు

  • @satyakumar7375
    @satyakumar7375 3 дня назад

    చాలా గొప్పగా రాశారు. చాలా గొప్పగా తీశారు. చాలా గొప్పగా నటించారు. అద్భుత దృశ్యకావ్యంగా తీర్చిదిద్దారు... మీ అందరికీ అభినందనలు. ప్రణామాలు..

  • @kasturisatyavani1528
    @kasturisatyavani1528 День назад

    చాలా బాగుంది అండి.ఈ నాటి పిల్లలకి కూడా అర్థం..అయ్యేట్టు చక్కగా చూపించారు.కవిసామ్రాట్ గారి హాహా హూహూ ని ధైర్యం చేసి ఆడియో చేసి నాకు ఆ మహానుభావునిపై వున్న గౌరవాన్ని చాటుకుని ధన్యజీవిని అయ్యాను.😊

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 12 часов назад

    Nothing to describe the feelings after completely watching the video! విశ్వనాధ పవన(పావన) శాస్త్రి గారి తండ్రి మరియు శోభనాద్రి గారి కొడుకు అయిన విశ్వనాధ సత్యనారాయణ గారికి పాదాభివందనం!🙏🙏🙏

  • @T.jaipalMudiraj-b3g
    @T.jaipalMudiraj-b3g 9 дней назад +3

    నేను మీప్రతి కదలను ఇష్టపడతా ఎందుకంటే ప్రతి కదకి చక్కటి అర్థాలుంటాయి 👍👍

  • @shyamkumaranthati7324
    @shyamkumaranthati7324 9 дней назад +5

    at 24:04 ఎంతగొప్పగా అనుభవాల్ని పోగేస్కుంటే...అంత గొప్పగా అక్షరాల్ని పేర్చగలం...

  • @Adityakumar-ls4ms
    @Adityakumar-ls4ms 2 дня назад +1

    సొంతవూరు సినిమా మీ నటనకు గీటురాయి అని అనుకున్నాను.ఈ కవిసామ్రాట్ లఘుచిత్రం ద్వారా మీ నటనకు హద్దులు లేవు అనుటలో సందేహము లేదు.విశ్వనాథ వారి ఔన్నత్యాన్ని తెలియని ఈ తరంవారికి కళ్లకు కట్టినట్లు చూపించారు.మీకు ధన్య వాదములు.ఇది నటన కాదు.మీకు ఆయనమీద ఉన్న అత్యంత భక్తి పూర్వక అభిమానం వల్ల ఆయన పాత్రలో మీరు జీవించ గలిగారు అని నేను భావిస్తున్నాను.🙏🙏🙏

  • @oletiseshaprabhakararao2878
    @oletiseshaprabhakararao2878 9 дней назад +3

    Sri L.B.Sriram gariki padabhi vandanalu.Sri Viswanadha variga Mee Natana Adbhutam.Meeru "Nata Samrat" Sir...Namaskaram Sir.

  • @dvvramanarao7808
    @dvvramanarao7808 9 дней назад +3

    SRI . L.B.Sriram garu lived inthe character of Kavi Samrat Viswanadha varu. No words to express more about boh of them.

  • @psrk5801
    @psrk5801 3 дня назад

    ఎల్బీ శ్రీరామ్ గారికి జోహార్
    కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి బయోపిక్ ని మనముందు అద్భుతంగా
    చిత్ర కథనం రూపంగా ప్రవేశపెట్టి నందుకు, శ్రీరామ్ గారికి మనస్పూర్తి గా శిరసువంచి కృతజ్ఞతలు, తెలుపుకుంటున్నాము.❤

  • @KiranGurugu
    @KiranGurugu 8 дней назад +3

    *Shreeman Bro insta Story Pedthe Emo anukunna But It's Really Worthy Watch For Upcoming Writers🖤🖤🖤*

  • @sakshiprasad200
    @sakshiprasad200 2 дня назад

    తెలుగు వారికి విలువైన కానుక. LB శ్రీరామ్ గారి అద్భుత నటనకు నిలువెత్తు నిదర్శనం.

  • @prathaprao4556
    @prathaprao4556 4 дня назад

    కవిసమ్రాట్' సినిమా మొత్తం చూశాను. ఆద్యంతం ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. కొన్ని కొన్ని సార్లు కళ్ళు చెమర్చాయి. మీలాంటివాళ్ల వలనే ఇంకా మన మాతృభాష మనగలుగుతోంది. ముఖ్యంగా మీరు కవిసమ్రాట్ 'శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ' పాత్రలో మీదైన శైలిలో ఒదిగిపోవడం ఎంతో బావుంది. సాక్షాత్తు ఆ విశ్వనాధ సత్యన్నారాయణగారే దిగొచ్చారా? అనే అనుమానం కలిగింది. పాశ్చాత్య భాషా సంస్కృతి పడగలు విప్పుతున్న ఈ తరుణంలో మాతృభాష పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ అనిర్వచనీయమైనది! మీ ప్రయత్నం నదిలా నిరంతరం కొనసాగిపోతూనే ఉండాలని కాంక్షిస్తూ...
    ఓ ఏకలవ్య శిష్యుడు!
    saraswathi putrulu guruvugaru paadabhi vandanam

  • @varijareddy930
    @varijareddy930 5 дней назад +1

    When I heard word Tavu, really I got my childhood memories back!! Awesome movie 😊

  • @ramanigiri7137
    @ramanigiri7137 7 дней назад +1

    After Watching the film kavi Samrat , I can say that this film has left an incredible and inexpressible feeling in the heart of the spectator . One can see the great talent in director the way he directed the film by creating continuous inquisitiveness and enthusiasm in the hearts of people to know the next scene very egarly . I congratulate the director wholeheartedly and wish him more success for his future endeavors.
    Last but not least it goes without saying that Sri. L B Sriram s action is excellent and speechless .

  • @posanisrinivasarao1974
    @posanisrinivasarao1974 4 дня назад

    నాలో జ్ఞాన దీపం వెలిగించిన కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిని అద్భుతంగా ఆవిష్కరించిన ఎల్బీ శ్రీరామ్ గారికి ధన్యవాదాలు

  • @sudhakarbalireddy9583
    @sudhakarbalireddy9583 5 дней назад

    Excellent excellent Sri LBS garu.SVS garini Chustunñattuga vundi.
    Kallu Chemarchayi Shareeram kampinchindi at mts 24 ,41,54--till end .
    National Award ivvali **Kavi Samart Ani Mutyaniki**
    ❤❤

  • @saibabakambhampati1139
    @saibabakambhampati1139 4 дня назад

    ఈ చిత్రము చాలా హృదయంగా మలిచారు. ఇందు లోని సన్నివేశాలు నిజమానా? కల్పించారా? మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు ఒక విందు భోజనము కల్పించారు. అభినందనలు.

  • @nayinilenin3713
    @nayinilenin3713 9 дней назад +5

    We watch only for sriram garu❤

  • @eswararaopinaparti4350
    @eswararaopinaparti4350 5 дней назад

    Very glad to see such a great movie.viswanadha garu one of the best poets in Telugu literature..

  • @bindaas_bandhewale_sisters
    @bindaas_bandhewale_sisters 7 дней назад

    అద్భుతం....చాలా చాలా బాగా తీశారు...విశ్వనాధం వారి గురించి short and sweet గా చెప్పారు...🙏🙏

  • @prashantharimella9234
    @prashantharimella9234 9 дней назад +3

    Comment raaddaamani modaletti.....alaa voka araganta aalochistuoo vraayakundaa....vundipoyaanu.daddy
    Meevi shart films kaadu...
    Heart films anadaaniki intakanna...rujuvu avasaram ledu..
    Heart films aapeddam anna me aalochana bahushaa
    Meerey velakki teesukuntaaremo...daddy.😂
    Mukyamgaa director:sabith anna ni abhinandinchaali....
    Methoo cheyyadam antey....
    Aashaa maashee kaadu...alaantodi....
    Prabhass tho raajamavly...
    Teesinanttugaa...
    Easy gaa teesaaru....
    Congrats sabith annaaa...
    Supperb supperb LB daddy..
    E cinema lo naaku nacchina
    Vishayaalu.....
    1)rachaita raasina pustakaanni chadiveytapudu...
    Vaadina bandhee chair...
    Chadiveytapudu...manalni manam bandinchukovadam.
    2)pustakam lo ....aksharaalu chadavamani.....meru chavi chuusina aardhika baadani ardham cheskovadam.
    3)me illu
    4)Mee rachanalatho.... villan pai visirina villu...
    5)gukka tippikokundaa vinipinchina padyam......
    6)intiki vacchina aadapadachunu pampinchina taruvaata meru me illuni voka
    Pustakamlaa...voka yangle lo chupinchaaru....supperb...
    Ilaa yenno vishayaalu naaku nacchaai daddy.....chivarigaa vokkamaata
    .....❤❤❤I love you LB daddy❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Ram_prasad_Naidu
    @Ram_prasad_Naidu 9 дней назад +3

    కంటిలో వెచ్చటి కన్నీరు బయటకు రాకుండా బాధ్యతలు అడ్డుకట్ట వేస్తున్నాయి వేగం తగ్గుతున్న గుండె రంగు మారి ఓపిక తగ్గి పెరిగిన వయసు

  • @sundeepgollaprolu4631
    @sundeepgollaprolu4631 3 дня назад

    నా సరిసు వంచి పదాభివందనం చేస్తున్న ఈ సినిమాలోని ప్రతీఒక్కరికి . ఎలాంటి సినిమాని చూసినందుకు నాయిను అంటూ అద్రుష్టం చేస్కోని ఉంటాను .మహాదానంగా వుంది .

  • @padmalatha8286
    @padmalatha8286 4 дня назад

    Emani cheppnu.chaala chaala bavundi.kavisamrat garini entha baga aavishkarincharo cheppalenu👌👌👌👌🙏

  • @BandaGangaraju-q4h
    @BandaGangaraju-q4h 2 дня назад

    At my age 81 I got introduced to Shri Viswanadha. Thank you LB Sriram garu.

  • @VNKBT
    @VNKBT 9 дней назад +3

    తెలుగు తనం కోసం తెలుగు వారు చూడవలసిన సినిమా...

  • @narsimharaomadarapu3600
    @narsimharaomadarapu3600 2 дня назад

    Drushya kavyam ,Sri.L.B.SriRam gariki Dhanyavadamulu.🙏🙏💐💐

  • @howardroark6575
    @howardroark6575 4 дня назад +1

    Can you believe I watched it more than 10 times... ❤❤

  • @koteswararaoyarra2215
    @koteswararaoyarra2215 9 дней назад +1

    Eagerly waiting sir. Thank you

  • @seshuphanign
    @seshuphanign 8 дней назад +1

    యల్ బి శ్రీ రాము గారి నటనా పరమాద్భుతం, నిజంగా విశ్వనాథ సత్యనారాయణ గారి చూడని వారు కూడా ఆయన ఇలానే ఉంటారేమో అనేలా ఉంది వీరి నటన

  • @snemana1
    @snemana1 4 дня назад

    Viswandha Satyanaraya story🙏excellent action dialogues worth watching 👌thx to entire star cast

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo 19 часов назад +1

    Adbhutaha 👌👌👌

  • @k.h.v.chowdary9097
    @k.h.v.chowdary9097 4 дня назад

    నేను 2000 లో పుటాను
    విశ్వవనాదవరి గురించి ఏదో కొంచం వినడమే తప్ప వారి రచనలు చదివినది లేదు
    కానీ వారిమీద నాకు ఉన్న గౌరవాని
    మరింత పెంచారు
    వారిని చూస్తున్నటే ఉంది

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 8 дней назад +1

    ప్రతీ డైలాగ్ .. అద్బుతః

  • @sivakrishna8
    @sivakrishna8 9 дней назад +1

    A Great movie with a great performance of a great writer. Thank you so much sir! ❤️🙏🏻

  • @rahulbanda2577
    @rahulbanda2577 3 дня назад +1

    59:38 లో మాటలు నిజంగా ఇప్పుడు జరుగుతున్నవే.తెలుగు ని ఇంగ్లీష్ లో వ్రాస్తున్నాం, కదా. నాకు మాత్రం చూస్తున్నప్పుడు ఆ నవలను కొనాలనిపించింది మా కాలేజీ లో చూసాను అప్పటికి నాకు కవి విశ్వనాథ సత్యనారాయణ గారు ఇంకా వారి గొప్పతనం గురించి కొన్ని విషయాలు మా తెలుగు బుక్స్ లో చదివాను మా తెలుగు సార్ కూడా చేప్పేవారు, ఇప్పుడు కచ్చితంగా ఆ నవల కొని చదవాలని ఉంది. తెలుగులో కొన్ని పదాలు ఇలాంటి సినిమా లో లేదా 90's లోని సినిమాల వాటినుండి కొన్ని పదాలు మాములుగా మాట్లాడితే ఔట్ డేటెడ్ అంటున్నారు, అలాగని వారితో ఇంగ్లీషు లో మాట్లాడితే వారికి అది కూడా అంతంతమాత్రంగానే వచ్చు పైగా. ఇలా తెలుగు గొప్పతనాన్ని తెలియపరిచే సినిమాలు మరిన్ని రావాలి వాటికి అందరి ఆదరణ ఉండాలి అని నా కోరిక, కాదు సంకల్పం. దేశ భాషలందు తెలుగు లెస్స 🙏.

  • @ramabrahmamdevarakonda7029
    @ramabrahmamdevarakonda7029 День назад

    శ్రీ విశ్వనాధ వారిని టుకిగా సంపూర్తి గ దర్శించాము 🙏 ఇంకా ఇటువంటి వి కావాలి ❤

  • @kasturisatyavani1528
    @kasturisatyavani1528 День назад

    విశ్వనాథ వారి గొప్పదనాన్ని చాటి చెప్పి నందుకు మా పాదాభివందనం

  • @tetaliswathi533
    @tetaliswathi533 3 дня назад

    తెలుగులో ఇప్పటివరకు నాకు తెలియని పదం ' టావు 'ఈ సినిమా చూసి నేర్చుకున్న ధన్యవాదాలు🎉🙏

  • @syamala54
    @syamala54 6 дней назад +2

    బాగుంది కానీ ఇంకో పార్టు ఉంటే బాగుండేది

  • @c.h.k.bnarayana7696
    @c.h.k.bnarayana7696 3 дня назад

    ఎందరో మహానుభావులు అందరికి వందనములు🙏🙏🙏🙏🙏

  • @naresh_creativity
    @naresh_creativity 4 дня назад

    ఇప్పటికి 10 సార్లు చూశా. శ్రీరామ్ గారు మీకు 🙏.అద్భుతం.

  • @Rayaprolu.ViswaPrasad
    @Rayaprolu.ViswaPrasad 3 дня назад

    చాలా బాగా తీశారు శ్రీ రామ్ గారూ. ధాన్యవాదములు.

  • @gowrilanka7338
    @gowrilanka7338 9 дней назад +2

    అద్భుతః

  • @gowrikumar6031
    @gowrikumar6031 4 дня назад

    గొప్ప ఖండకావ్యం...అందించారు ....🎉

  • @sriramamurtikakarla455
    @sriramamurtikakarla455 8 дней назад +1

    లంకా భద్రాద్రి శ్రీ రామ చంద్ర మూర్తి గారి కి !
    మహాకవి గారి గురించిన లఘు చిత్రం దర్శింప చేసినందుకు! శుభాభినందనలు శుభాశీస్సులు !
    తమ లఘు చిత్రాలు చూడ ముచ్చటగా ఉంటాయి.
    *"*"లాభనష్టాలు కి అతీతంగా.. కోటీశ్వరులు ఎవరైనా తెలుగు తల్లి కి నీరాజనం గా.. తమరు- విశ్వనాథ సత్యనారాయణ గారి పాత్ర లో.. పూర్తి నిడివి సినెమ తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
    {నమ్మకం తక్కువే అనుకోండి}
    ******
    శ్రీ శ్రీ గారి ని , కృష్ణ శాస్త్రి గారి నీ కూడా పరిచయం చేయడానికి.. వారి పాటలతో లబ్ధి నొందిన ఆ సినిమా నిర్మాత లు ముందుకు వస్తే ఎంత బాగుంటుంది!?
    ఉంటా మరి
    .. డా.కాకర్ల శ్రీ రామ మూర్తి,
    విశ్రాంత ఆచార్య, భూ భౌతిక విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl 4 дня назад

    Chala Chala bagundi Ayya garu
    Kantataddi vochindi Ayya garu
    Dhanyyavadhamulu Ayya garu 🙏🙏

  • @charannaveen333
    @charannaveen333 5 дней назад +1

    12:14 inspiring 🙏🙏🙏

  • @ksrtalentsearch...6673
    @ksrtalentsearch...6673 5 дней назад

    It remained me my 7 th standard days, in those days I used to read about Viswansdha Satyanarayana, now I saw all lively because of this film. All are performed their roles naturally❤❤❤❤🎉🎉🎉🎉

  • @KRISHNAVENI-ns1kl
    @KRISHNAVENI-ns1kl 3 дня назад

    An excellent FILM.. which touched my heart. The performance of LB garu is simply superb. But Climax must be more good..the film is concluded in a hurried manner. A good effort. Ram Ravipalli

  • @drsurya777
    @drsurya777 6 дней назад +1

    Great movie

  • @Arigelagopalakrishna
    @Arigelagopalakrishna 4 дня назад

    జై శ్రీ రామ్
    గురుభ్యోనమః ఎల్.బి. శ్రీరామ్ గారికి నమస్కారం
    సినిమా చూసినంత సేపు సమయం తెలియలేదు, పదినిమిషాల్లో అయిపోయినట్టుంది. ఇంకో గంట సేపు ఉంటే బాగుండేది. మీకు మీ టీం అందరికీ అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు.
    దళారి చేతిల్లో ధియేటర్లు, వాళ్ళ థియేటర్లో డబ్బులు దోచుకునే డ్రామా సినిమాలు
    ప్రేక్షకులకు, సమాజానికి ఆదర్శవంతమైన చిత్రాలు ప్రపంచంలోనే అతిపెద్దవెండితెర youtube లో , youtube లేకపోతే ఈలాంటి మహానుభావులు చరిత్ర,, మనకు దక్కేది కాదు. ఇలాంటి సినిమా థియేటర్లు వారు ప్రదర్శించక పోవడం వాళ్ళ దురదృష్టకరం. చెత్త జ్ఞానాన్ని డబ్బులు ఇచ్చి కొంటున్నాం. మంచి జ్ఞానాన్ని ఉచితంగా కోరుకోవడం ఎంతవరకు ధర్మం.
    జై శ్రీ రామ్ జై హింద్
    జై భారత్ జై మోడీ

  • @venkirao9975
    @venkirao9975 5 дней назад

    L B SRIRAM GAARU YOU ARE VERY GREAT SIR . JUST I SAW YOUR MOVIE . IT IS VERY GOOD AND EXCELLENT. YOUR PERFORMANCE SOOOOOPER SIR. VERY VERY THANKYOU FOR GIVING GOOD AND NICE WRITER STORY FOR OUR TELUGU PEOPLE . I AM WAITING FOR NEXT MOVIE.

  • @vasudevaraoyanduri5593
    @vasudevaraoyanduri5593 День назад

    Respected Sriram garu,
    Grateful to u pl.

  • @madhusudhanreddykarnati
    @madhusudhanreddykarnati 9 дней назад +2

    చాలా చక్కగా అర్థవంతంగా ఉంది

  • @Veeravenkatarsg
    @Veeravenkatarsg 5 дней назад

    This is a beautiful movie. Thank you, LB Sriram garu.

  • @lakshmir814
    @lakshmir814 3 дня назад

    చాల చాల బాగుంది

  • @sujanasree4761
    @sujanasree4761 3 дня назад

    Excellent sir... Chala bagundhi. Ilantivi inka ekkuvaga regular ga teeyandi .. chala rojula tarvata manchi video chusanu..

  • @B.N.JagruthiPutti-st5te
    @B.N.JagruthiPutti-st5te 3 дня назад

    L.B. శ్రీ శ్రీరామ్ గారు ధన్యవాదములు

  • @thirunagarisrinivas1423
    @thirunagarisrinivas1423 7 дней назад

    అద్భుతం...

  • @jagadeeswararao7627
    @jagadeeswararao7627 4 дня назад

    Yes LB Shree Ram garu Kavi Samrat Vishwanadha Satyanarayana gari patralo Jeevinchaaru

  • @Rayaprolu.ViswaPrasad
    @Rayaprolu.ViswaPrasad 3 дня назад

    నేను పూర్తి వీడియో చూశాను.అద్భుతమైన ప్రదర్శన

  • @SeshuDuvvuri
    @SeshuDuvvuri День назад

    అద్భుతమండీ!🙏

  • @karanamjbrao7889
    @karanamjbrao7889 3 дня назад

    it is great.🙏🙏🙏

  • @goparajujayanth9238
    @goparajujayanth9238 3 дня назад

    Thank you so much sir for this excellent work

  • @sreedevimamillapalii5575
    @sreedevimamillapalii5575 День назад

    అద్భుతం

  • @mswapna5936
    @mswapna5936 9 дней назад +1

    చాల బాగుంది సిర్

  • @markaraghupathigoud6385
    @markaraghupathigoud6385 4 дня назад

    మహాద్భుతం

  • @srinuvasyadlapalli6662
    @srinuvasyadlapalli6662 4 дня назад

    చాలా బాగుంది 🎉

  • @mohankakarla369
    @mohankakarla369 2 дня назад

    తెలుగోడి గర్వం విశ్వనాథం గారు❤

  • @MrDvramanarao
    @MrDvramanarao 4 дня назад

    Good. LB Sriram did well.

  • @mohanmudda2909
    @mohanmudda2909 18 часов назад

    One of the best movie please watch

  • @gopichand6640
    @gopichand6640 3 дня назад

    Adbhutham gaa vundhi sir cinema

  • @ramasaride2738
    @ramasaride2738 5 дней назад

    Awesome sir...lb gari naana adbhutam...enta cheppina takkuve

  • @venugopalk9435
    @venugopalk9435 8 дней назад +1

    Lb garu meeru movies cheyyaka poina parvaledui ilantivi chesaka Nakul anipistondi inka meeru dedepyamanam ga velugutaru