Rama Kanavemira Song Lyrical Video I SwatiMuthyam Movie Songs
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Thank you for watching the video….. If you like the video then click on like button share in your contacts and subscribe to my channel.
#swatimuthyamsongs#swathimuthyammoviesongs#kamalhasansongs#kvishwanathmoviesongs#ramakanavemiramoviesongs#ramakanavemiralyricalsongs#ramakanavemirasonglyricsintelugu#ramakanavemirasongdownload#bussyuhisongs#spbalusongs
రామా కనవేమిరా... రామా కనవేమిరా...
శ్రీ రఘురామ కనవేమిరా... రామా కనవేమిరా...
రమణీల లామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమగాత్రి
ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా..
రామా కనవేమిరా...
సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట
జనకుని కొలువులో ప్రవేశించే జానకిని
సభాసదులందరు పదే పదే చూడగా
శ్రీరా..మ చంద్రమూర్తి
కన్నెత్తి సూడడేమని అనుకుంటున్నారట తమలో
సీతమ్మ అనుంగు చెలికత్తెలు
రామా కనవేమిరా... రామా కనవేమిరా...
శ్రీ రఘురామ కనవేమిరా... రామా కనవేమిరా...
రమణీల లామ నవ లావణ్య సీమా... ఆ......
రమణీల లామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమగాత్రి
ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా..
రామా కనవేమిరా...
ముసిముసి నగవుల రసిక శిఖామణులు
సా.. నిదమ పమ గరిస
ఒసపరి చూపుల అసదృశ విక్రములు
సగరిగ మనిద మనిని
ముసిముసి నగవుల రసిక శిఖామణులు
తా తకిట తకజను
ఒసపరి చూపుల అసదృశ విక్రములు
తకజను తకదిమి తక
మీసం మీటే రోష పరాయణులు
నీ.. దమ పమాగరిమ
సరి ఎవరను మత్తగునోల్వణులూ.. ఆహా
క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివధనువు వంక
తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా... కనవేమిరా
ముందుకేగి విల్లందబోయి
ముచ్చెమటలు పట్టిన దొరలు ఓ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని
గుండెలు జారిన విభులు
ముందుకేగి విల్లందబోయి
ముచ్చెమటలు పట్టిన దొరలు ఓ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని
గుండెలు జారిన విభులు
ఆ.. గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక
సిగ్గేసిన నర పుంగవులు
తమ ఒళ్ళూ ఒరిగి రెండు కళ్ళూ తిరిగి
ఒగ్గేసిన పురుషాఘనులు
ఎత్తే వారు లేరా ఆ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఎత్తే వారు లేరా ఆ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అరెరరరె ఎత్తే వారు లేరా ఆ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా ఆ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
తక తయ్యకు తా దిమి తా
రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమహా
అంతలో రామయ్య లేచినాడు
ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
అంతలో రామయ్య లేచినాడు
ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
పెళపెళ పెళపెళ పెళపెళ పెళపెళ
పెళ పెళ విరిగెను శివధనువు
కళలొలికెను సీతా నవ వధువు
జయ జయ రామ రఘుకుల సోమ
జయ జయ రామ రఘుకుల సోమ
దశరథ రామ దైత్యవిరామ
దశరథ రామ దైత్యవిరామ
జయ జయ రామ రఘుకుల సోమ
జయ జయ రామ రఘుకుల సోమ
దశరథ రామ దైత్యవిరామ
దశరథ రామ దైత్యవిరామ
సీతా కల్యాణ వైభోగమే శ్రీరామ కల్యాణ వైభోగమే
సీతా కల్యాణ వైభోగమే శ్రీరామ కల్యాణ వైభోగమే
కనగ కనగ కమనీయమే అనగ అనగ రమణీయమే
కనగ కనగ కమనీయమే అనగ అనగ రమణీయమే
సీతా కల్యాణ వైభోగమే శ్రీరామ కల్యాణ వైభోగమే
రామయ్యా అదుగోనయ్యా
రమణీల లామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా..
రామా కనవేమిరా...
శ్రీ రఘురామ కనవేమిరా...
రామా కనవేమిరా...
You are doing very good job sir
Thank you🙏💕 for uploaded this video
Thank you
Beautiful song sung by SP balu sir thank you for remembering him🙏🙏👍😂😂😭
బాగా వ్రాసారు కానీ తప్పులున్నాయి సరి చేసుకోండి