శ్రీ రేణుక ఎల్లమ్మ నాటక ప్రదర్శన- కరక్ వాడి Part I
HTML-код
- Опубликовано: 7 фев 2025
- కరక్ వాడి నాటక బృందం వారి ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ నాటక ప్రదర్శన
శ్రీ రేణుక ఎల్లమ్మ నాటక ప్రదర్శన- కరక్ వాడి Part I
ఎల్లమ్మ అనే పదం "ఎల్ల", "అమ్మ" అనే పదాల కలయికతో ఏర్పడింది. ఇందులో ఎల్ల అనగా సరిహద్దు. దానిని 'పొలిమేర' అని కూడా అంటారు. అంటే సరిహద్దు దగ్గర ఉండే దేవర అని అర్థం. "ఎల్ల" ' అనగా అందరు, అందరికి 'అమ్మ' అని చెప్పటమే సమంజసం. కన్నడంలో ఈమెను “ఎల్లరిగె అమ్మ” అని అంటారు. అనగా ఎల్లరకు దేవత ఎల్లమ్మ అన్నపుడు తెలుగులో కూడా (ఎల్ల + అమ్మ) అందరి అమ్మ అనే అర్థమే వస్తుంది. తెలుగులో కూడా కొందరీమెను ఎల్లారమ్మ (ఎల్లరి + అమ్మ) అని కూడా అంటుంటారు
తండ్రి ఆజ్ఞపై పరశురాముడు తల్లి రేణుక తలను ఖండిస్తే, తల మాదిగ వాడలో పడింది. అప్పటి నుంటి రేణుక వారు ఆమెను తమ కులదేవతగా కొలుస్తున్నారు.. ఎల్ల అనగా పొలిమేర కనుక కొందరీమెను గ్రామ సరిహద్దు దగ్గర ఉండే దేవత అన్నారు. కాని ఎల్లమ్మ గుడి ఏ గ్రామంలో కూడా పొలిమేరలో లేదు, ఊరిలోనే ఉంది. ఎల్లమ్మ దగ్గర జలకడవ కూడా ఉంటుంది. జలకడవ అంటే నీరు తెచ్చే కుండ.
ఎల్లమ్మ దేవాలయం లేని గ్రామంలోని వారు ఊరి వెలుపలికి వెళ్ళి "ఎదురుండి" చేస్తారు. అనగా ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఎల్లమ్మ ఉండే దిశకు తిరిగి నైవేద్యం పెట్టడం అన్నమాట. ఈ దేవతకు మ్రొక్కుకున్నవారు వెండితో కంళ్ళు, పాదాలు చేయిస్తారు. ఆర్థిక స్థితి బాగు లేనివారు :కట్టె పాదాలు చేయిస్తారు. పాకోళ్ళు సమర్పిస్తారు. కల్లు పోస్తారు. ఎల్లమ్మ మహారాష్ట్ర, దక్షిణ భారత రాష్ట్రాలలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు పోషకదేవత. ఆమె భక్తులు ఆమెను "విశ్వమాత"గా లేదా "జగదాంబ"గా భావిస్తారు.
“పూర్వ గాథాలహరి"లో ఉన్న రేణుకాదేవి గాథనే ఎల్లమ్మ దేవర కథగా ప్రతి గ్రామంలో చెపుతారు. రేణుకాదేవి పతివ్రతయే అయినా భర్త కోపానికి గురయింది. నీటికని వెళ్ళిన ఆమె స్నానం చేస్తున్న చిత్రరథుని చూస్తూ ఉండినందుకు కొద్దిగా ఆలస్యమయింది. అలా ఆలస్యంగా రావటంతో, కోపంతో జమదగ్ని ఋషీశ్వరుడు అపార్థం చేసుకొని, తల్లి శిరచ్ఛేదం చేయమని కొడుకులను ఆజ్ఞాపించినాడు. కానీ వారిలో కొందరు తిరస్కరించినారు. పరశురాముడు మాత్రం పితృవాక్య పరిపాలనం గావించినాడు. మళ్ళీ వెంటనే తల్లిని బ్రతికించమని తండ్రిని వేడుకొన్నాడు. పరశురాముడు శిరచ్ఛేదం చేసినప్పుడామె తల వెళ్ళి అంటరాని వారి వీధిలో పడినందున ఆమె గ్రామ దేవతయిందని అంటారు. అయితే గ్రామస్థులు ఈమెను పీడించే దేవతగా కాక, ఒక పతివ్రతామ తల్లిగా, వరాలిచ్చే దేవతగానే కొలుస్తారు. కొన్ని ప్రాంతాలలో చర్మ వ్యాధులేర్పడినప్పుడు ఈమెనారాధించే ఆచారం ఉంది.
We can do wedding photography, fashion photography, photoshoots and portrait photography.
#babyshoots
#preweddingshoots
#candidvideo
Album Designing
4k Video Editing
Follow me
► / solanki.baburao
► / smart_photography.offi...
Super 👌👌👌👌👌💐💐🙏🙏🙏🏽
Background Cora's 👌👌👏👏👍👍
Shivuni voice haaa👍
Papa chala quet ga undi
శ్రీ రేణుక ఎల్లమ్మ నాటకం
సుాపర్🙏🙏👌👍
🙏🙏🙏🙏super
2part pettandi anna
Already pettinanu anna
Shivani voice good 👍
అందరి ప్రదర్శన అత్యద్భతము...👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏
కళాకారులు అందరికి కలభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అభినయం బాగుంది ...
కొంచెము డాన్స్ కూడా ఉంటే...ఇంకా చాలా బాగుంటుంది👍👍👍👍
Thank you Latha reddy garu
Second part pettandi Anna garu