Yereethi Karuninthuvo...

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2022
  • Samavedam Shanmukha. Sarma's
    Siva Sankeerthana m...
    Music Composed and. Sung. by
    G.Bala Krishna Prasad.... In Ragam
    Hindola. Ragam, Khanda Chaapu
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 290

  • @rameshkurnool7232
    @rameshkurnool7232 Год назад +128

    ఏ రీతి కరుణింతువో
    ఏ రీతి కరుణింతువో శివ
    ఏ రీతి కరుణింతువో శివ
    నను ఏ రీతి కరుణింతువో
    తగిన రీతుల సాధనే లేని నన్ను
    ఏ రీతి కరుణింతువో
    ఈ లాటి వానిని తగిన రీతుల సాధనే లేని నన్ను ఏ రీతి కరుణింతువో
    ఈ లాటి వానిని ఏ రీతి కరుణింతువో
    చూపులోపల త్రిప్పి చూచినది లేదు యాగ విధులను నిన్ను అర్చించినది లేదు
    యోగ మార్గములెల్ల ఊనినది లేదు వేద పద్దతులలో వెదకినది లేదు
    ఏ రీతి కరుణింతువో
    ఈ లాటి వానిని ఏ రీతి కరుణింతువో
    బలిమి నింద్రియములను బంధించినది లేదు కుదురుగా మదినిల్పి కూర్చినది లేదు
    చెదరకను నీ మంత్ర సిద్ధి నందగ లేదు శ్రుత్యన్త చింతనల శుద్ధి పొందగ లేదు
    ఏ రీతి కరుణింతువో ఈ లాటి వానిని తగిన రీతుల సాధనే లేని నన్ను ఏ రీతి కరుణింతువో
    తనువు తాపస విధుల తడమినది లేదు మనసు నీ తలపులను మరగినది లేదు
    పలుకు నీ కీర్తనల పండినది లేదు షణ్ముఖ జనకా నిన్ను స్మరియించినది లేదు
    ఏ రీతి కరుణింతువో
    ఈ లాటి వానిని ఏ రీతి కరుణింతువో

  • @ramanigali6137
    @ramanigali6137 6 дней назад

    గురువు గారి కి వందనములు. పూ జ్య గురువులు సామవేదం షణ్ముఖశర్మ గారు రచించిన కీర్తనలు మీ గళం లో ఎంతో మధురంగా,అద్భుతంగా ఉంటాయి.మా లాంటి సామాన్యులు కూడా విని,విని నేర్చుకొని ఆ సాంబ శివునికి సమర్పించు కో గలుగు తున్నాము. చాల, చాలధన్యవాదాలు మీ కు.

  • @susilaranikambhampati1287
    @susilaranikambhampati1287 2 года назад +79

    అయ్యా నాకు సంగీతం తెలియదు కానీ మీ కృతులూ కీర్తనలూ వింటుంటే రాళ్లు కూడా కలుగుతాయి. మీకు శతకోటి నమస్కారాలు.

  • @gopich1975
    @gopich1975 2 года назад +26

    సామవేదం షణ్ముఖ శర్మ గారు అత్యంత తేలిక పదాలతో, ఆర్తితో ఆ పరమ శివుని మీద వ్రాసిన భక్తి, కరుణ రసాత్మక గీతం చాలా బాగుంది. బాలకృష్ణ ప్రసాద్ గారి గానం కూడా చాలా బాగుంది. ఇటువంటి పాటలను కనులు మూసుకుని వింటే మనము తాదాత్మ్యం చెంది ఆనందానుభూతిని పొందే అవకాశాలు ఎక్కువ అని నా అభిప్రాయం. నా లాంటి పామర శివ భక్తుల కోసమే ఈ పాట వ్రాశారు అనిపిస్తోంది. నేనూ అంతే. నాకు ఆ శివయ్య అంటే ఎంతో ఇష్టం, ప్రేమ, అభిమానం. కానీ నేను ఆ శివయ్యకు చేస్తున్నది ఏమీ లేదు. అయినా ఆ శివుయ్య నన్ను కరుణిస్తూనే ఉన్నాడు. 🙏🙏🙏

  • @potharajuhymanand3897
    @potharajuhymanand3897 26 дней назад +1

    అద్భుతమైన రచన చేసిన శ్రీ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, అద్భుతంగా గానం చేసిన శ్రీ శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను..

  • @vasundharajakkala3411
    @vasundharajakkala3411 Год назад +14

    గురువు గారూ సంగీతం గురించి తెలియదు కానీ ఆనందంగా వింటుంటాను 🙏🙏🙏🙏🙏🙏

  • @bhagyalaxmi8162
    @bhagyalaxmi8162 Год назад +53

    ఎంత బాగుందంటే మాటలతో వర్ణించలేను
    సామవేదం షణ్ముఖశర్మ .
    గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గార్లకు
    పాదభివందనలు.

  • @trisulam1859
    @trisulam1859 Год назад +15

    పూజ్యులు సామవేదం షణ్ముఖశర్మ అంతటి మహానుభావులు ఆ దేవదేవుని ఏ రీతి కరునింతువో అని వేడుకునుచుంటే ఇక నా లాంటి పామరుడు ఎలా ఆపరనేశ్వరుని ప్రార్థించాలి సర్వేశ్వరా నమో నమః 🙏,🙏🙏🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 5 месяцев назад +2

    ఓమ్ శ్రీగురుర్బ్రహ్మ గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే
    నమః శివాయ. 🕉️🙏🌺ఓమ్

  • @radhaanji5272
    @radhaanji5272 3 месяца назад +1

    సామవేదం షణ్ముఖ శర్మ గారికి కోటి కోటి వందనాలు ఇంత అద్భుతమైన పాట రచించినందుకు ఈ పాట పాడిన గురువుగారికి కూడా కోటి కోటి పాదాభివందనాలు ఈ పాట అర్థం అందరూ చేసుకోవాలని అందరూ ధ్యానం చేయాలని కోరుతున్నాను ధ్యానం గురించి చాలా అద్భుతంగా చెప్పారు ధ్యానం చేసిన వాళ్ళకి ఈ పాట వింటుంటే ఆత్మతాండవం చేస్తుంది 👏👏 ఎన్నిసార్లు విన్న తనివి తీరడం లేదు

  • @santhuguptha85
    @santhuguptha85 Год назад +8

    గురువు గారు కృతగ్నులము... మరో అమోగమైన శివ కీర్తనతో మమ్మల దన్యుల చేశారు. ఓం నమః శివాయ 🙏🙏

  • @ysubramanyamreddy3560
    @ysubramanyamreddy3560 Год назад +8

    సాక్షాత్తు అన్నమయ్య పాడినారా అంతా అద్భుతంగా ఉంది 🙏🙏🙏

  • @turlapativydehi9804
    @turlapativydehi9804 2 года назад +2

    ఎన్ని కోట్ల సార్లు విన్నా తనివి తీర దు. దైవా0శ , సరస్వతీ పుత్రులు. Vja లో వెంకటేశ్వర దేవాలయంలో మీ కార్యక్రమాలకు నేనుకూడా పాల్గొనే అదృష్టం కలిగింది. మీకు పాదా భివందనములతో వైదేహి టీచర్.

  • @geethalakshmi6299
    @geethalakshmi6299 Месяц назад

    చాలా చాలా బాగుంది పాట వినడానికి చాలా మంచి పాటను అందించారు కృతజ్ఞతలు

  • @narsimhacharymaroju9284
    @narsimhacharymaroju9284 2 года назад +49

    అమోఘం , అద్భుతం, అప్రమేయం ఎంత చక్కని కీర్తన .ఎన్ని సార్లు విన్నా తనివితీరడం లేదు.

  • @RaoBonala
    @RaoBonala 7 месяцев назад +2

    ఎంతో హృద్యంగా ఉంది మన బుద్ధి తోటి మనలను కరుణించ డానికి పరిష్కారం వెతకడానికి స్వామి కి ఎన్ని సమస్యలు కదా😊

  • @gmrau39
    @gmrau39 Год назад +12

    అత్యద్భుతము సామ వేదం గీతము
    గరిమెళ్ళ గానము
    మల్లికార్జునుడి వందనములు

  • @srinivasarao2100
    @srinivasarao2100 2 года назад +10

    సామవేదం షణ్ముఖశర్మ గారి లో
    అన్నమయ్య గారు ప్రవేశించి రచన చేపించి నట్లు ఉంది గరిమెళ్ల బాల కృష్ణ ప్రసాద్ గురువు గారి ద్వారా బాగా పాడించిన
    ఆ శివ పరమాత్మ కృపా కటాక్షములు అందరిపై ఉండాలని కోరుకుంటూ

  • @panduranga2405
    @panduranga2405 Год назад +3

    గురువు గారు నెను ఘంటసాల వేంకటేశ్వర రావు గారి అభిమానిని కాని మీగాత్రం వింటే ఆ మహానుభావుడా మళ్లి మీ రూపం లో వచ్చినట్టు వుంది 🙏🙏🙏

  • @drsreedevisreekanth8457
    @drsreedevisreekanth8457 2 года назад +10

    ఓం నమః శివాయ.
    శివ నామమే మధురం...అదే గా ఇచ్చు మోక్షం...ఈ జన్మ కడతేరు నీ నామ దీక్షలో..అదే గా నాకు మోక్షము...శివా శివా యనగ పలికేవు...

    • @swarnagowri6047
      @swarnagowri6047 2 года назад

      ॐ नमः शिवाय ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ श्री गुरुब्यो नमः
      వేద మూర్తులు మన అన్నమయ్య గారి కి మా హృదయ పూర్వక నమస్కారములు కృతజ్ఞతలు. పాదా భి వందనములు. అందుకోండి,గురువు గారు.గురు బ్రహ్మ , గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః.గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. 🙏🙏🙏🙏🙏.

    • @b.s.nmurthy4723
      @b.s.nmurthy4723 Год назад

      🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 года назад +3

    ఓం నమః శివాయ.
    అనిర్వచనీయమైన అనుభూతి .
    మహాదేవా పరమేశ్వరా మా అన్నమయ్య వారు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు పాడుతుంటే , మాటలే కరువైపోతున్నాయి.తండ్రీ.యిది వారి పూర్వ జన్మ ల పుణ్యమే .కదా మహా దేవా.వింటున్న మాది కూడా పుణ్య ఫలమే కదా ప్రభూ.చదువు అందరికీ అబ్బవచ్చు.కానీ సంగీత కీర్తనలు కొందరి అదృష్టమే కదా తండ్రీ!.
    పూజ్యులైన మా అన్నమయ్య వారికి, మీ చల్లటి దీవెలలు ఎప్పుడూ వుంటాయి కదా అర్థ నారీ స్వర దేవా. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy5812 2 года назад +5

    🌷జై శ్రీమన్నారాయణ🌷 గురువుగారు 🙏 మీ సంకీర్తనలు వింటే మా ఈజన్మ ధన్యం అవుతుంది గురువుగారు మాకు తెలిసింది గురువుగారు 🙏

  • @namilakondajayanth1633
    @namilakondajayanth1633 2 года назад +5

    ఆహా మనసు పులకించి పోయే
    ఎంత గొప్పచక్కని బాణిలో అమర్చిన ఈగీతం సంగీత కూర్పు అమోఘం
    ఆనందమానందమాయే.
    అన్నిటికీ ఇంకా హైలెట్ గా ఉంది గురువుగారు.
    👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 месяцев назад +2

    ఓమ్ నమశ్శివాయ
    🕉️🌙🌺
    ఓమ్ శ్రీ వేంకటేశాయ నమః శివాయ.ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః.
    🕉️🙏🌿

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 Год назад +7

    అధ్బుతమైన రచన, మధురమైన గానం, అమోగమైన అర్థం

  • @nagireddymandli
    @nagireddymandli Год назад +7

    సామవేద ష న్ముకి శర్మ గారికి మరియు బాలకృష్ణ ప్రసాద్ గారికి👏👏

  • @tpssongs3288
    @tpssongs3288 3 месяца назад

    షణ్ముఖ శర్మ గారి రచన,,,,,,,,,గరిమెళ్ల బాలకృష్ణ గారి గాత్రం అధ్భుతం,అమోగం,పాట వింటా ఉంటే ఎదో తెలియని అనుభూతి , ఇంత కన్నా ఏమి రాయలో తెలియడం లేదు

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +1

    ఓమ్ 🕉️ ఓమ్ నమశ్శివాయ .తండ్రీ! మహేశ్వర దేవా! ఎవరి మనసుకు వారు ధర్మ బద్ధంగా ,
    మిమ్మల్ని ద్యానించుకునే అదృష్టం కలిగించండి! యీ కలియుగం లో ఓమ్ నమశ్శివాయ దేవునిగా
    Maaku మీరే రక్ష ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌺🌿

  • @muraliathur6494
    @muraliathur6494 Месяц назад

    Neelanti bakthi keerthanalaku dasulamu thandri

  • @kannurirao5903
    @kannurirao5903 Год назад +4

    మీకు మీ వాయిస్ కు పాదాభివందనం 💐🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 3 месяца назад

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌿
    ఓమ్ శ్రీ గురుభ్యోనమః. 🙏

  • @sajalakrishnama348
    @sajalakrishnama348 7 месяцев назад +2

    మీ గాత్రం అమృతమే స్వామీ.... 🙏

  • @bojjakamaladhar2563
    @bojjakamaladhar2563 2 года назад +6

    Garimella baalakrishna praasad gaaru maro annamayya gaaru

  • @swarnagowri6047
    @swarnagowri6047 4 месяца назад +1

    ఓమ్ నమశ్శివాయ
    ఓమ్ 🕉️🙏🌺ఓమ్ శ్రీ గురుభ్యోనమః.

  • @chandrasekar1660
    @chandrasekar1660 Год назад +3

    గురువుగారు మిమ్మలను చుాచి నేను కొంతపాడగలుగుచున్నాను మీకు 💐💐💐🙏🙏🙏🙏

  • @user-bp9ml1uc7u
    @user-bp9ml1uc7u Месяц назад

    సూపర్ గురువుగారు,రిలీక్సీ పెట్టగలరు

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +2

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ గురుభ్యోనమః.
    🙏🌺☘️

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
    పరమేశ్వరా హృదయం తో నమస్కరిస్తున్న నా నమస్సుల ను స్వీకరించండి. మహా దేవా. గౌరీస్వరా. 🙏❤️🙏,చండీస్వరా ,అర్థ నారీ స్వర దేవా, నందీశ్వరా,మహా కాళీ సహిత మహా కాళేశ్వర దేవా, ఓం మహా మృత్యుంజయ దేవా,సన్మార్గ దాయిని సహిత కేదార నాథ దేవా, మా బిడ్డలను నాగ కృష్ణ స్కంద లను యెల్ల వేళలా కాపాడుతూ వుండాలని కోరుకుంటూ ప్రణామములు అర్పిస్తూ, ఓం కాశీ విశాలాక్షి అన్నపూర్ణ దేవా, విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ తల్లి దేవాయ నమః విష్ణవే శివాయ నమః ఓం ధన్వంతరి దేవాయ నమః విష్ణవే శివాయ నమః ఓం ధన్వంతరి దేవాయ నమః ఓం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ఓం.

  • @yadagirisoppari3091
    @yadagirisoppari3091 5 месяцев назад

    అమృతం నింపారు గురువుగారు 🙏🙏🙏

  • @klnkln7783
    @klnkln7783 Год назад +2

    సామవేదం షణ్ముఖశర్మ మరియు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి ఇరువురికి పాదాభివందనాలు.

  • @hyderabadildarshiv174
    @hyderabadildarshiv174 6 месяцев назад

    Antha madhuranga aalapincharu swamy meeru 🙏🙏🙏😌

  • @G_Gopala_Krishna
    @G_Gopala_Krishna Год назад +1

    ఈలాటి మమ్మలి కరుణించిన శివుడు,మీ గొప్ప పాటలు వినే భాగ్యం కలుగచేశాడు

  • @shantaannamraju4999
    @shantaannamraju4999 10 месяцев назад

    Vina chala bagunthi programs bagunthi.

  • @drsreedevisreekanth8457
    @drsreedevisreekanth8457 2 года назад +14

    పూజ్యులు సామవేదం గారి అధ్భుత కవనానికి
    పూజ్య శ్రీ గరిమెళ్ళ గారి గాత్రం...మనసానికి విందు. శివస్మరణం మోక్ష దాయకం... ఓం నమః శివాయ

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 Год назад +3

    చక్కగా పాడారు ఆర్కెస్ట్రా చక్కగా ఉంది ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు🎻 🙏🙏 సార్ ఈ కీర్తనలు పుస్తకాలరూపంలో దొరుకుతుందా తెలుపగలరు 🙏🙏

  • @naressh4432
    @naressh4432 24 дня назад

    మీ సాంగ్‌స్ సూపర్

  • @Ratnamamba_kandarpa123
    @Ratnamamba_kandarpa123 23 дня назад

    Supersuper Anandhobrahma❤❤

  • @savithrimokiraala9419
    @savithrimokiraala9419 10 месяцев назад

    Annamayya rachananemo annatluga undi,👌👏

  • @chitra9123
    @chitra9123 Год назад

    సామవేదం షణ్ముఖశర్మ గారు శివ భక్తులకు తగిన వాడుక భాష లో ఆ పరమశివుని వేడుకునే పదాలతో పాట ను కుర్చటం....అందుకు గరిమెళ్ల బాలకృష్ణ గురువుగారి సుస్వర గానం మధురం గా మనసుని తాకి అనంత లోకాల్లో తాదాత్మ్యం చెందేలా ఉంది....ఇద్దరికీ వందనములు🌷🙏🙏....ఓం నమః శివాయ 🌼🙏

  • @sriramamurthy2112
    @sriramamurthy2112 Год назад +3

    అద్భుతం 💐🙏😊

  • @ramachandramurthypulumati9524
    @ramachandramurthypulumati9524 Месяц назад

    Like this song 💯 reflects our life’s moves! Superb composing by Brhamasri Samavedam and lyrics by Shri. Balakrishna Prasad 🎶 Enjoy again and again … a great reflection

  • @namburusubbarao4885
    @namburusubbarao4885 3 месяца назад

    బాగా పాడారు కంగ్రాచ్యులేషన్స

  • @v.hanmanthreddy5044
    @v.hanmanthreddy5044 Год назад +1

    బహుశా దీన్నే తన్మాయత్వం అంటారేమో

  • @saitubechannelprasadareddy3397
    @saitubechannelprasadareddy3397 2 года назад +5

    What a song.... divine.... meaningful and about sadaka bhakti...... great sung by Sri Bala Krishna garu
    Great bhavam written by Sri Samavedam garu...... 👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 года назад +2

    ॐ नमः शिवाय।
    ब्रह्म रशुलू मना अन्नमय्य जी को 🙏🙏🙏।

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 месяцев назад +1

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🌙🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +1

    ఓం నమః శివాయ.
    ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.
    ఓం గురుభ్యోనమః.
    మా అన్నమయ్య గురువు గారికి నమస్సుమాంజలి.
    🙏🙏🙏🌺🌺🌺.

  • @ramakrishnakrishna8436
    @ramakrishnakrishna8436 6 месяцев назад

    ఎన్ని జన్మల పుణ్యమో ఈపాట వింటే శత కోటి వందనాలు గురువుగారు

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 года назад +2

    ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ ఓం నమః శివాయ.

  • @gudamahesh9229
    @gudamahesh9229 Год назад

    మా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు undugaka

  • @shuklatandra7598
    @shuklatandra7598 5 месяцев назад

    Feeeeel so oooooo emotional listening to gurus voice.very touching to the heart.

  • @orugantivenkatalakshmirama5917
    @orugantivenkatalakshmirama5917 Месяц назад

    Adbhutam swany

  • @yellurumurali9256
    @yellurumurali9256 5 месяцев назад

    Me ganam vintey antha haega vundho super andi

  • @ramamurtyg2030
    @ramamurtyg2030 2 месяца назад

    జి.రామమూర్తి,హైదరాబార్. చాలాకాలానికి విన్నాను ద్విజావంతి రాగంలో .చాలాబాగుంది

  • @kalpakamjandhyala5574
    @kalpakamjandhyala5574 9 месяцев назад

    మీపాట పరమపావనం.

  • @shyamalabikonda8189
    @shyamalabikonda8189 Год назад

    Saardhaka naamadeyulu Saamavedam vaaru ,Sangeeta saraswati putrulu Garimella vaaru

  • @nagarajakumariinampudi3717
    @nagarajakumariinampudi3717 24 дня назад

    Ayya mee patalu vintunte manasuki anto prasaanthamgaa untundi madi anta adrustamo

  • @sreedharhyderabad5290
    @sreedharhyderabad5290 2 года назад +3

    భక్తి ఒక్కటే ముక్తికి మార్గమని
    చక్కగా దారి చూపారు.
    రచయితకు, మీకు పాదాభివందనాలు
    🙏🏻🙏🏻

  • @lekhanirvana5334
    @lekhanirvana5334 Год назад

    Tandri govinda swamii Siva Naa paristithi edee daivama namo namaha peddslaku pranamamulu

  • @miryalamahesh8570
    @miryalamahesh8570 6 месяцев назад

    నిజంగా యి ఘెయం ఆద్యద్మికం🙏

  • @indira.bharadwajindira1260
    @indira.bharadwajindira1260 Год назад

    Endukante Mee Kanti Saraswati putrukaki memu ivvagala vallamu kamu okka namassulu tappa 🙏🙏🙏🙏🙏

  • @padmachaganti2100
    @padmachaganti2100 Год назад

    నాకు ఆ నంద భాష్యాలు .తప్ప ఇంకేమి రావడం లేదు గురువు గారి పాద పద్మములు కు నా నమస్కారాలు

  • @visweswararaothammu5796
    @visweswararaothammu5796 6 месяцев назад +1

    అద్భుతం గా పాడినరు 🎉

  • @venkatraosirikoti9473
    @venkatraosirikoti9473 Год назад +2

    నిజమైన గంధర్వగానం

  • @gudamahesh9229
    @gudamahesh9229 Год назад

    మీరు స్వామి కొరకై జన్మించారు

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +1

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    ఓమ్ శ్రీ గురుభ్యోనమః.
    🙏

  • @karanamvenkatasubbarao7804
    @karanamvenkatasubbarao7804 Год назад +2

    👌🙏🙏ఓం నమః శివాయ

  • @yadagirisoppari3091
    @yadagirisoppari3091 11 месяцев назад

    Guruvugariki padabivandanam

  • @thulasi8524
    @thulasi8524 9 месяцев назад

    Sir mire bagavanthulu milone devudunnadu

  • @krishnagajula261
    @krishnagajula261 27 дней назад

    ఓం నమశ్శివాయ

  • @vootanagasekhar3425
    @vootanagasekhar3425 9 месяцев назад

    మీ పాట వింటూవుంటే కాసేపు కష్టాలన్నీ మరుపు వస్తుంది.

  • @seenumeruva5737
    @seenumeruva5737 Год назад

    ఓం నమశ్శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @mramachandrareddy1679
    @mramachandrareddy1679 11 месяцев назад

    ఇటువంటి గాయకుడు న భూతో

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 месяцев назад +1

    ఓమ్ నమశ్శివాయ .🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏🌺

  • @vijayaservirala1067
    @vijayaservirala1067 Месяц назад

    Om namah shivaya 🙏

  • @indira.bharadwajindira1260
    @indira.bharadwajindira1260 Год назад

    Guruvugaru 🙏 enta hayiga vundo ee keertana malli malli vinalanipinche la vundi dhanyawadamulu guruvugaru 🙏🙏

  • @indira.bharadwajindira1260
    @indira.bharadwajindira1260 Год назад

    Ee keertana I likhinchina samavedam shannuhka sarmagariki Inka ante adbhutamga padina meeku kuda memu emichhina takkuve Naa pranatulu sir 🙏🙏🙏🙏🙏🙏

  • @kanumurivsnraju3202
    @kanumurivsnraju3202 2 года назад +2

    👌🏽👍🏼👏🏽💐శంభో శివ శివా

  • @ramakrishnaseeni4161
    @ramakrishnaseeni4161 Год назад

    Om.namasivaya..guru.gariki.na.pranamamulu

  • @suryabhagavanulubhattiprol2393
    @suryabhagavanulubhattiprol2393 2 года назад +4

    Excellent sir 🙏

  • @sreepadmavathipemmaraju3458
    @sreepadmavathipemmaraju3458 6 месяцев назад

    Amrutam ee Keertana. Guruvu gari Swaram lo adbhutam ga vundi. Maa janma dhanyam ilanti Paatalu Vintunnanduku.

  • @narukatlamallesham3808
    @narukatlamallesham3808 5 месяцев назад

    మీ చాలా bagunnyi వినడానికి మనస్సుకు శాంతి కల్గుతుంది వందనాలు

  • @lokeshgaming8656
    @lokeshgaming8656 Год назад +1

    Om Namah Shivaya 🙏

  • @thulasi8524
    @thulasi8524 Год назад

    Aiya miru dhaiva samaanulu

  • @durgaprasadraosunkara1256
    @durgaprasadraosunkara1256 11 месяцев назад

    Ex excellent guru garu

  • @user-un4wt1uk9o
    @user-un4wt1uk9o Год назад

    Adbutam a mogam

  • @indirak2305
    @indirak2305 3 месяца назад

    Om namahsivaya

  • @jogaraomailapalli1649
    @jogaraomailapalli1649 Год назад +1

    ఓం నమః శివాయ ఓం హి గౌరీ శంకరయా నమ🙏🙏🙏🙏🙏

  • @durgarani3736
    @durgarani3736 Год назад

    Ee keertana nijamuga andari antarangamulaku saripovunatlu koorchina samavedam guruvulaku padaabhivandanaalu garimella guruvugari gaatramu nandu bhavamunu palikinchu reeti amogham dhanyavadamulu swamy

  • @raamn4920
    @raamn4920 2 года назад +1

    Padabivandanalu sir